mockery
-
కస్తూర్బాలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యాయత్నం
శాయం పేట: సెల్‌ఫోన్ దొంగతనం చేశారని తోటి విద్యార్థినులు అవమానించారని మనస్తాపం చెందిన ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గోవిందాపూర్ శివారులోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో బుధవారం సాయంత్రం జరిగింది. టీచర్లు వారిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. గోవిందాపూర్ కేజీబీవీలో కల్పన, పూర్ణ పదో తరగతి చదువుతున్నారు. ఇందులో హనుమకొండకు చెందిన కల్పన, పూర్ణతో కలిసి మంగళవారం రాత్రి అటెండర్ సెల్ ఫోన్ తీసుకొని తల్లికి ఫోన్ చేసింది. తనకు ఆరోగ్యం బాగా లేదని, ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. అదే సందర్భంగా తోటి విద్యార్థినులు గమనించి ‘దొంగ’‘దొంగ’.. అంటూ అవహేళన చేశారు. దీంతో మనస్తాపం చెందిన ఆ ఇద్దరు విద్యార్థినులు బుధవారం సాయంత్రం తమ వద్ద ఉన్న నెయిల్ పాలిష్‌ను తాగారు. గమనించిన టీచర్స్ వారిని వెంటనే పరకాలలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రిలో వైద్యసిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారి ని వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వారి ఆరోగ్యం మెరుగు పడటంతో గురువారం తల్లిదండ్రులు వారిని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయమై కేజీబీవీ స్పెషలాఫీసర్ మాధవిని వివరణ కోరగా కల్పన, పూర్ణ తమ ఇళ్లకు వెళ్తామని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదని, ఆ బాధతోనే ఆత్మహత్యకు యత్నించారని పేర్కొన్నారు. -
‘చౌకీదార్’ నవ్వులపాలు
సాక్షి, న్యూఢిల్లీ : ‘మై బీ చౌకీదార్’! అవినీతి వ్యతిరేక పార్టీగా బీజేపీపై పడిన ముద్ర చెదరిపోతున్న సమయంలో దాన్ని మెరుగుపర్చుకోవడంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా ఆయన ఆ మరునాడు ఆదివారం తన ట్విటర్ ఖాతాలో పేరుకు ముందట ‘చౌకీదార్’ అనే ట్యాగ్‌ను తగిలించుకున్నారు. ఆయన స్ఫూర్తితో అదే రోజు నుంచి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, నితిన్ గడ్కారీ, సుష్మా స్వరాజ్, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ తదితరులు ‘చౌకీదార్’ ట్యాగ్‌ను తగిలించుకున్నారు. ఈ ప్రహసనంపై ట్విటర్లో సోమవారం నుంచి వ్యంగోక్తులు దుమ్ము రేపుతున్నాయి. ‘అచ్చేదిన్ నహీ లాయాతో అప్నా నామ్ బదల్ దూంగా’ అంటూ మీరు ప్రతిజ్ఞ చేసి విఫలమైనందుకు పేరు మార్చుకున్నారా? అంటూ ఒకరు, మా చౌకీదార్ కనిపించడం లేదు. నేనే చౌకీదార్‌గా ఉంటున్నా, అచ్చేదిన్ను వెతుక్కుంటూ మా చౌకీదార్ వెళ్లాడని తెల్సింది అంటూ మరొకరు, భారత్‌ను బలంగాను, భద్రంగాను మారుస్తానని మీటూ నిందితుడు, మీ మాజీ మంత్రి ఎంజె అక్బర్ ప్రతిజ్ఞ చేస్తారు, మీరేమో చౌకీదార్ డ్యూటీ చేస్తానంటారు అంటూ ఇంకొకరు వ్యంగ్యోక్తులు విసిరారు. కార్టూనిస్టులు కూడా తమదైన శైలిలో వ్యంగ్యం పండించారు. పలు కార్టూన్లను ఆన్లైన్లో పోస్ట్ చేశారు. ఓ ట్వీటరయితే బ్యాంక్ చౌకీదారే తాను పనిచేస్తున్న బ్యాంక్‌కు కన్నం వేస్తున్న దృశ్యంతో కూడిన పాత యాడ్ వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. -
తరాలు కొనసాగే సంపద
ఆ గృహస్థుకు కోపమొచ్చింది. ‘నేను ఇంటికి పిలిచి మీకు మర్యాదలు చేసిందానికి ఇదా ఫలితం? నాతో పరిహాసం ఆడుతున్నారా?’ అన్నాడు. ఒక ఊరికి ఒక సాధువు వచ్చాడు. ఊరి మర్రిచెట్టు కింద కూర్చుని, వచ్చిపోయేవారికి తన బోధనలు చేస్తున్నాడు. సాధువుల పట్ల గౌరవం ఉన్న ఒకాయన ఆయన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. భక్తిశ్రద్ధలతో ఆతిథ్యం ఇచ్చాడు. సాధువు దానికి ఎంతో సంతోషించాడు. ఇంట్లోంచి సెలవు తీసుకునేముందు ఏమైనా కోరుకొమ్మని గృహస్థును అడిగాడు. దానికా గృహస్థు, తరతరాలకు కొనసాగే అసలైన సంపద ఏదైనా ఉంటే అది ప్రసాదించమని అడిగాడు. సాధువు చిరునవ్వి, ‘తండ్రి మరణిస్తాడు, కొడుకు మరణిస్తాడు, మనవడు మరణిస్తాడు’ అని పలికాడు. దాంతో ఆ గృహస్థుకు కోపమొచ్చింది. ‘నేను ఇంటికి పిలిచి మీకు మర్యాదలు చేసిందానికి ఇదా ఫలితం? నాతో పరిహాసం ఆడుతున్నారా?’ అన్నాడు. ‘నాయనా, నా మాటల్లో పరిహాసం ఏమీలేదు. నీవుండగానే నీ కుమారుడు మరణిస్తే నీకు మిగిలేది శోకమే. నీవూ, నీ కుమారుడూ ఉండగానే నీ మనవడు మరణిస్తే మీ ఇద్దరికీ కలిగేది అమితమైన దుఃఖమే. అలా కాకుండా, ముందు నువ్వు వెళ్లిపోయి, తర్వాత నీ కుమారుడు, అటుపై నీ మనవడు నిష్క్రమిస్తే... అది ఒక సహజ క్రమం. మీ తరతరాల్లోనూ ఇలాగే జరిగితే ఇంతకంటే సంపద ఏముంటుంది?’ అని వివరించాడు సాధువు. అందులోని ఆంతర్యం అర్థమైన ఆ గృహస్థు వినమ్రంగా సాధువుకు నమస్కరించాడు. -
అమెరికా ఎగతాళిని సహించేది లేదు: కమల్‌నాథ్
న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయ దౌత్యవేత్త దేవయానిపై అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కమల్‌నాథ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేవయానిపై నమోదు చేసిన కేసును వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన అమెరికాను డిమాండ్ చేశారు. అలాగే ఆమెను తనిఖీ చేసే క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారు వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. భారతీయులపై తరచుగా అమెరికా తనిఖీల పేరిట నిర్వహిస్తున్న సోదాలను ఖండించారు. అమెరికా చర్యలను ఎంత మాత్రం సహించేది లేదని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. దేవయాని విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రతినిధి మేరీ హార్ఫ్ శుక్రవారం ఉదయం అమెరికాలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో హార్ఫ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని విలేకర్లు కమల్‌నాథ్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయనపై విధంగా స్పందించారు.