అమెరికా ఎగతాళిని సహించేది లేదు: కమల్నాథ్
న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయ దౌత్యవేత్త దేవయానిపై అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి కమల్నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కమల్నాథ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేవయానిపై నమోదు చేసిన కేసును వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన అమెరికాను డిమాండ్ చేశారు. అలాగే ఆమెను తనిఖీ చేసే క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారు వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు.
భారతీయులపై తరచుగా అమెరికా తనిఖీల పేరిట నిర్వహిస్తున్న సోదాలను ఖండించారు. అమెరికా చర్యలను ఎంత మాత్రం సహించేది లేదని కమల్నాథ్ స్పష్టం చేశారు. దేవయాని విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రతినిధి మేరీ హార్ఫ్ శుక్రవారం ఉదయం అమెరికాలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో హార్ఫ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని విలేకర్లు కమల్నాథ్ను ప్రశ్నించారు. దీంతో ఆయనపై విధంగా స్పందించారు.