Marie Harf
-
అమెరికా ఎగతాళిని సహించేది లేదు: కమల్‌నాథ్
న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయ దౌత్యవేత్త దేవయానిపై అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కమల్‌నాథ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేవయానిపై నమోదు చేసిన కేసును వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన అమెరికాను డిమాండ్ చేశారు. అలాగే ఆమెను తనిఖీ చేసే క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారు వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. భారతీయులపై తరచుగా అమెరికా తనిఖీల పేరిట నిర్వహిస్తున్న సోదాలను ఖండించారు. అమెరికా చర్యలను ఎంత మాత్రం సహించేది లేదని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. దేవయాని విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రతినిధి మేరీ హార్ఫ్ శుక్రవారం ఉదయం అమెరికాలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో హార్ఫ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని విలేకర్లు కమల్‌నాథ్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయనపై విధంగా స్పందించారు. -
మోడీకి వీసా జారీ నిర్ణయంలో మార్పు లేదు:యూఎస్
భారతీయ జనతాపార్టీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని వచ్చే ఎన్నికల్లో భారత ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసిన వీసా జారీ ప్రక్రియ విధానంలో గతంలో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని అమెరికా శనివారం స్పష్టం చేసింది. అయితే మరో సారి మోడీ యూఎస్ వీసా కోసం దరఖాస్తు చేసుకుంటే మాత్రం సమీక్షిస్తామని తెలిపింది. అది కూడా యూఎస్ చట్టాలకు లోబడే నిర్ణయం తీసుకుంటామని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మారీ హర్ఫ్ వెల్లడించింది. శనివారం వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ... వీసా జారీ ప్రక్రియలో ఎంతోకాలంగా అనుసరిస్తున్న విధాన్నానే ఇప్పుడు కూడా పాటిస్తామన్నారు. అలాగే ప్రస్తుతం భారత రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న మార్పులపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. భారత్ లేదా ఇతరదేశాల్లోని రాజకీయ వ్యవహారాల్లో యూఎస్ ఎప్పుడు తలదూర్చదని మారీ హర్ఫ్ మరో సారి స్ఫష్టం చేశారు. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ హయంలోనే గోద్రాలో అల్లర్లు జరిగాయి. ఆ నేపధ్యాన్ని పురస్కరించుకుని మోడీకి వీసా జారీ చేసేందుకు యూఎస్ నిరాకరించింది. అదికాక నిన్న న్యూఢిల్లీలో జరిగిన కార్యవర్గ సమావేశంలో నరేంద్రమోడీని దేశ ప్రధాని అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ ఎంపిక చేసింది. అందులోభాగంగా విలేకర్లు అడిగిన ప్రశ్నకు మారీ హర్ఫ్ పై విధంగా సమాధానం ఇచ్చారు. -
నిర్భయ నిందితులకు ఉరిశిక్షను స్వాగతించిన యూఎస్
నిర్భయపై సామూహిక అత్యాచారం కేసులో నలుగురు నిందితులకు న్యూఢిల్లీలోని సత్వర న్యాయస్థానం ఉరిశిక్ష విధించడాన్ని అమెరికా స్వాగతించింది. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ అధికార ప్రతినిధి మెరీ హర్ఫ్ శనివారం వాషింగ్టన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కోర్టు తీర్పు మానవ మృగాలకు ఓ చెంపపెట్టులాంటిదని వ్యాఖ్యానించారు. ఆ తీర్పుతో భారత న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం మరింత పెరిగిందని ఆమె అన్నారు. భారత్‌లోనే కాకుండే ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దాడులను ఆరికట్టేందుకు మరింత కఠినమైన చట్టాలు తేవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ జాన్ కెర్రీ కూడా నిర్భయ నిందితులకు విధించిన శిక్షను సమర్థించారు. లింగ ఆధారిత హింస అనేది ప్రస్తుత ప్రపంచంలో అంటుజాడ్యంలా విస్తరించిందని అన్నారు. నిర్భయ మృత్యుముఖంలోకి జారుకునే వరకు మృత్యువుతో పోరాడిన ధీరవనిత అని జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. గతేడాది డిసెంబర్ 16న భారత దేశ రాజధాని న్యూఢిల్లీలో ఫార్మసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం నిర్భయతోపాటు ఆమె స్నేహితుడిపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. ఆ ప్రమాదంలో నిర్భయ తీవ్రంగా గాయపడి, న్యూఢిలీ ఆసుపత్రిలో చికిత్స పొందింది. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడంతో మరింత మెరుగైన వైద్యం కోసం భారత ప్రభుత్వం ప్రత్యేక విమానంలో సింగపూర్ తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ గతేడాది డిసెంబర్ 29న మృత్యు ముఖంలోకి జారుకుంది. ఆ క్రమంలో న్యూఢిల్లీతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు పెల్లుబికాయి. దీంతో భారత ప్రభుత్వం నిర్భయ కేసుపై ప్రత్యేక న్యాయ స్థానం ఏర్పాటు చేసింది. ఆ కేసులో ఆరుగురు నిందితుల్లో నలుగురుకి శుక్రవారం ఉరిశిక్ష ఖరారు చేసింది. మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకుని మరణించగా,మరోకరు బాలనేరస్థుడుని జువైనెల్ కోర్టు మూడేళ్ల కారగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే.