Devyani Khobragade
-
అమెరికాతో అమీతుమీ తేల్చుకోవాలని
నవ్వును స్టాప్ చేసేవి.. చాలా జరిగాయి దేవయాని జీవితంలో! ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ తను. ఆమెరికాలో పోలీసులు కేసు పెట్టారు. కస్టడీలోకి తీసుకున్నారు. నేరస్థుల మధ్య ఉంచారు. ఇండియాలో మరికొన్ని కేసులు. విచారణలో అన్నీ తేలిపోయాయి. ఇప్పుడు మళ్లీ రాయబారిగా కాంబోడియా వెళ్తున్నారు! కెరియర్లోని ప్రతి కష్టంలోనూ.. ‘నవ్వు నా బెస్ట్ ఫ్రెండ్’ అన్నట్లుగానే.. చిరునవ్వుతో నిలిచారు దేవయాని! దేవయాని ఖోబ్రాగడే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్. ఇండియన్ ఫారిన్ సర్వీసు. 1999 బ్యాచ్. ఏడేళ్ల క్రితం యు.ఎస్.లో ఆమె అరెస్ట్ అయినప్పుడు ఇండియా ఆమె కోసం అమెరికాతో అమీతుమీ తేల్చుకోవాలని ఢిల్లీలో జరిగిన అత్యున్నతస్థాయి ఆకస్మిక సమావేశంలో తీర్మానించింది. దేవయాని ఒక సాధారణ భారతీయ పౌరురాలు అయి వున్నా, ఆమె పట్ల అమెరికా వ్యవహరించిన తీరుకు భారత ప్రభుత్వం తీవ్రంగానే స్పందించి ఉండేది. అంతగా దేవయానిని అమెరికా వేధించింది. పోలీసులు ఆమె చేతులకు బేడీలు వేశారు. ఒంటి మీద వస్త్రాలు తీయించారు. సాధారణ నేరస్థులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఉన్న సెల్లో, వారితోపాటే ఆమెను ఉంచారు. అంతకుముందు ఏడాదే 2012లో న్యూయార్క్‌లోని ‘కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా’కు డిప్యూటీ కాన్సూల్ జనరల్‌గా వెళ్లారు దేవయాని. రెండు దేశాల మధ్య మహిళలు, రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలను చూడటం ఆమె పని. ఒక దేశం తరఫున అంత పెద్దపొజిషన్లో ఉన్న అధికారి అయిన దేవయానిని మహిళ అని కూడా చూడకుండా అమెరికన్ పోలీసులు కస్టడీలో ఉంచారు! వీసా మోసం, తన పనిమనిషికి కనీస వేతనం కూడా ఇవ్వకపోవడం.. ఇవీ ఆమె మీద నేరారోపణలు. 2013 డిసెంబర్ 13న దేవయాని అరెస్ట్ అయితే, 2014 జనవరి కల్లా ఇండియా ఒత్తిడిపై ఆమె బయటపడ్డారు. దౌత్యవేత్తకు ఉండే విశేష మినహాయింపులతో భారత ప్రభుత్వం ఆమె మీద ఉన్న ఆరోపణలను, అమెరికాలో నమోదైన కేసులను పక్కనపడేసి, కొంత విరామం తర్వాత ఢిల్లీలోని ఎం.ఇ.ఎ. (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్)లో జాయింట్ సెక్రెటరీగా ప్రత్యేక స్థానం కల్పించింది. ఇన్నేళ్లుగా దేవయాని అక్కడే పని చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్లీ ఆమెకు తగిన హోదా వచ్చింది. కాంబోడియాకు భారత రాయబారిగా వెళ్తున్నారు! ∙∙∙ దేవయాని చురుకైన ఆఫీసర్. ఎవరు కాదు? ఐ.ఎ.ఎస్.లు, ఐ.ఎఫ్.ఎస్.లు అలాగే కదా ఉంటారు! దేవయాని ఇంకొంచెం ఎక్కువ. ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే రిటైర్డ్ ఐయ్యేఎస్. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. మహారాష్ట్రలోని తారాపూర్ వీళ్ల కుటుంబానిది. ఐఎఫ్ఎస్లోకి రాకముందు దేవయాని మెడిసిన్ చదివారు. యు.ఎస్. నుంచి రాగానే దేవయాని ఢిల్లీలోని ‘డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అడ్మినిస్ట్రేషన్’ (డి.పి.ఎ.) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014 డిసెంబర్లో ఆమెను ‘కంపల్సరీ వెయిట్’లో ఉంచారు. దేవయాని పిల్లలకు రెండు దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయనే ఒక పూర్వపు ఆరోపణపై విచారణ జరిపేందుకే కొద్ది రోజులు ఆమెను విధుల నుంచి దూరంగా ఉంచారు. తనేం తప్పు చేయలేదని నిరూపించుకున్నారు దేవయాని. తిరిగి పోస్టింగ్‌లోకి వచ్చారు. 2015 జూలైలో విదేశీ వ్యవహారాల శాఖ ‘స్టేట్ డివిజన్’ డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యారు. అయితే ప్రమోషన్ లేకుండా! దానిపై దేవయాని క్యాట్‌ని ఆశ్రయించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున ల్. ఏడు నెలల తర్వాత క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో గ్రేడ్–త్రీ ఆఫీసర్ హోదాలో జాయింట్ సెక్రటరీగా నియమించింది. ఇప్పుడు కాంబోడియాకు ఇంకో ప్రమోషన్. దేవయాని భర్త డాక్టర్ ఆకాశ్ సింగ్ రాథోడ్ అమెరికా పౌరుడు. ఉండటం ఇటలీలో. రోమ్‌లోని లూయిస్స్ యూనివర్శిటీలో రిసెర్చ్ ప్రొఫెసర్. ఇద్దరు కూతుళ్లు. తల్లితో ఇండియాలోను ఉంటున్నారు. దేవయాని ఖోబ్రాగడే రచయిత్రి కూడా! ‘ది వైట్ శారీ’అనే పుస్తకం రాశారు. లవ్‌స్టోరీ అది. ఓ కులాంతర ప్రేమ జంట కథ. పిల్లల కోసం మరో పుస్తకం రాశారు. ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ యంగ్ అంబేడ్కర్’ ఆ పుస్తకం. 41 ఏళ్ల దేవయానిలో ప్రత్యేక ఆకర్షణ ఆమె చిరునవ్వు. కెరీర్‌లోని ఆటుపోట్ల సమయంలోనూ ఆ చిరునవ్వు ఆమెను వదిలిపోలేదు. నవ్వు ఆమె బెస్ట్ ఫ్రెండ్. -
ప్రైవేట్ సెక్రటరీగా దేవయాని కోబ్రాగడే
న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయమంత్రి రామ్‌దాస్ అథవాలేకు ప్రైవేట్ సెక్రటరీగా అమెరికాలో భారత మాజీ ఉప దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే నియమితులయ్యారు. దేవయాని న్యూయార్క్‌లో భారత డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా ఉన్న సమయంలో తన ఇంట్లో పనిచేస్తున్న మహిళకు సంబంధించిన వీసా పత్రాల్లో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఆమెను న్యూయార్క్ పోలీసులు 2013లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమె 2.5 లక్షల డాలర్ల పూచీకత్తుపై బయటకొచ్చారు. దేవయానిపై పెట్టిన అభియోగాలను ఉపసంహరించుకునేలా అమెరికా ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. కాగా, దేవయాని ఇద్దరు కూతుళ్లు భారత పౌరులు కాదని కేంద్ర ప్రభుత్వం జనవరిలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా, చట్ట విరుద్ధంగా తమ కుమార్తెలకు సంబంధించిన పాస్‌పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని ఆమె కోర్టును ఆశ్రయించడంతో కేంద్రం ఈమేరకు నివేదించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా, చట్టాన్ని ఉల్లంఘించి దేవయాని కూతుళ్లు అమెరికా, భారత్ పౌరసత్వాలు పొందారని పేర్కొంటూ కేంద్రం వారి పాస్‌పోర్టులను రద్దు చేసింది. -
దేవయాని కూతుళ్లు భారత పౌరులు కాదు
న్యూఢిల్లీ: వివాదాస్పద ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్ఎస్) అధికారి దేవయాని ఖోబ్రగడే ఇద్దరు కూతుళ్లు భారత పౌరులు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించింది. తన ఇద్దరు కూతుళ్ల భారతీయ పాస్‌పోర్టులను పునరుద్ధరించాలంటూ దేవయాని వేసిన పిటిషన్‌ను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మన్మోహన్ విచారించారు. ఎలాంటి నోటీసు జారీ చేయకుండా, చట్ట విరుద్ధంగా తమ కూతుళ్లకు సంబంధించిన పాస్‌పోర్టులను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని కొద్ది నెలల క్రితం ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆమె తరఫు న్యాయవాది అందుబాటులో లేకపోవడం విచారణను మార్చి 30వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖకు తెలియజేయకుండా, చట్టాన్ని ఉల్లంఘించి దేవయాని కూతుళ్లు అమెరికా, భారత్ పౌరసత్వాలు పొందారని పేర్కొంటూ కేంద్రం వారి పాస్‌పోర్టులను రద్దు చేసింది. -
వారికి ద్వంద్వ పౌరసత్వం కుదరదు
న్యూఢిల్లీ: అమెరికా పౌరసత్వమున్న తన కుమార్తెలకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు భారత మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే చేసిన అభ్యర్థనను ఆ శాఖ తిరస్కరించింది. ద్వంద్వ పౌరస్వత్వం తీసుకునేవారికి ఉండాల్సిన నిర్ణీత వయసు వారికి లేదని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. 2013లో అమెరికాలో భారత ఉప దౌత్యాధికారిగా పనిచేసిన కాలంలో వీసా మోసం ఆరోపణలపై అమెరికా పోలీసులు ఆమెపై నేరాభియోగం మోపిన సంగతి తెలిసిందే. విదేశాల్లో జన్మించిన భారతీయసంతతి వారికి మాత్రమే ద్వంద్వ పౌరసత్వం ఇస్తారని, ఆమె పిల్లలు ముంబైలో జన్మించినందున భారత చట్టాలప్రకారం వారికి ద్వంద్వపౌరసత్వం ఇవ్వడంకుదరదని అధికారి చెప్పారు. -
'దేవయాని ఉదంతం ముగిసిన అధ్యాయం కాదు'
న్యూఢిల్లీ: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగదే ఉదంతాన్ని ముగిసిన అధ్యాయంగా పరిగణించడానికి భారత్ అంగీకరించలేదు. ఈ విషయంపై ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలున్నాయని విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్ తెలిపారు.న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ లో దౌత్యవేత్తగా పనిచేస్తున్న దేవయానిపై వీసా మోసం, తప్పుడు సమాచారం కింద అమెరికా ప్రభుత్వం కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలపై ప్రభావం పడింది. అయితే దీన్ని ముగిసిన అధ్యాయంగా అమెరికా ప్రభుత్వం వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా?అన్న ప్రశ్నకు సుజాతా సింగ్ పై విధంగా బదులిచ్చారు. ఆ అభిప్రాయాలతో తాము ఏకీభవించడం లేదని సుజాతా సింగ్ తెలిపారు. -
దేవయాని కేసు కొట్టివేయడంపై అమెరికా ఆశ్చర్యం
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు కొట్టివేయడంపై ఒబామా ప్రభుత్వం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ‘‘భారత మాజీ డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయానిపై అభియోగాలు చెల్లవంటూ న్యాయస్థానం కొట్టివేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది’’ అని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి జెన్ ప్సకి వ్యాఖ్యానించారు. వీసా మోసం కేసు విషయంలో దేవయానిని అమెరికా పోలీసులు నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్టు చేయడం, తర్వాత బట్టలు విప్పి తనిఖీలు చేయడం, క్రూర నేరస్థులతోపాటు జైలులో పెట్టడంతో భారత, అమెరికా మధ్య సంబంధాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును విచారించిన న్యూయార్క్ కోర్టు.. దేవయానికి పూర్తిస్థాయి దౌత్యపరమైన రక్షణ ఉన్నందున ఆమెపై నమోదు చేసిన అభియోగాలు చెల్లవని పేర్కొంటూ బుధవారం తీర్పునిచ్చింది. కాగా, దేవయానిపై నమోదైన కేసును కోర్టు కొట్టివేయడాన్ని ఇండియన్ నేషనల్ ఓవర్సీస్ కాంగ్రెస్(ఐ) యూఎస్ఏ చైర్మన్ జార్జ్ అబ్రహం స్వాగతించారు. -
దేవయానికి ఊరట
-
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేస్తా: దేవయాని తండ్రి
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని దేవయాని ఖోబ్రగడే తండ్రి, సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే స్పష్టం చేశారు. దేవయాని తండ్రి ఉత్తమ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లో వస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇందులో కొత్త విషయమేమీ లేదన్నారు. త్వరలో తన రాజకీయ ఆరంగేట్రం జరుగుతుందన్నారు. తప్పకుండా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంటానన్నారు. కాగా ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారన్న అంశంపై మాత్రం చెప్పడానికి ఆయన నిరాకరించారు. తగిన సమయం చూసుకుని ఏ పార్టీలో చేరతానన్న విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. అమెరికాలో భారత దౌత్త్యవేత్త గా సేవలందించి పని మనిషి వీసా కేసుకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఆమె గత వారం భారత్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తన కూతురు అమెరికాలో ఉన్న పిల్లల్ని భారత్ కు తీసుకు వచ్చే యత్నాల్లో నిమగ్నమైందన్నారు. వారు ఫిబ్రవరి నెలలో భారత్ కు వచ్చే అవకాశం ఉందన్నారు. పిల్లల విద్యకు ఆటంకం కల్గకుండా ఉండేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు. -
మళ్లీ మా దేశం రావద్దు!
దేవయానికి అమెరికా ఆదేశం కోర్టు విచారణకు తప్ప భవిష్యత్‌లో వీసా ఇవ్వం వాషింగ్టన్/న్యూయార్క్: భారతీయ దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడేను శుక్రవారం దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించిన అమెరికా.. తాజాగా శనివారం ఆమెను తిరిగి అమెరికాలోకి రాకూడదంటూ నిషేధం విధించింది. భవిష్యత్‌లో ఆమెకు వీసా జారీ చేయకుండా తమ వీసా, ఇమిగ్రేషన్ వ్యవస్థను అప్రమత్తం చేస్తామని పేర్కొంది. అమెరికా నుంచి వెళ్లినంత మాత్రాన దేవయానిపై నమోదైన అభియోగాల్లో మార్పేమీ ఉండబోదని, ఆమెపై అరెస్ట్ వారంట్ జారీ చేసే అవకాశం కూడా ఉందని ఆ దేశ విదేశాంగ ప్రతినిధి జెన్‌సాకి స్పష్టం చేశారు. అమెరికా నుంచి శుక్రవారం భారత్ చేరుకున్న దేవయానికి ఇకపై దౌత్యరక్షణ కూడా ఉండబోదన్నారు. ‘ఇకపై దేవయాని అమెరికాకు తిరిగి రాకూడదన్న ఆదేశాలను భారత్‌కు బయల్దేరే ముందే ఆమెకు, భారత ప్రభుత్వానికి తెలియజేశాం. కోర్టు విచారణ నిమిత్తం మాత్రమే ఆమెను అమెరికాలో మళ్లీ అడుగుపెట్టేందుకు అనుమతిస్తాం’ అన్నారు. దీన్ని బట్టి దేవయానిని అమెరికా బహిష్కృత వ్యక్తి(పర్సోనా నాన్ గ్రాటా)గా నిర్ధారించినట్టు స్పష్టమవుతోంది. భారత సంతతికి చెందిన అమెరికా పౌరుడిని పెళ్లి చేసుకున్న దేవయానికి ఆరు, మూడేళ్లున్న ఇద్దరు కూతుర్లున్నారు. వారిని కూడా త్వరలో ఆమె భారత్‌కు రప్పించాలనుకుంటున్నారు. ఒప్పందం ఫలితంగానే.. దేవయాని విషయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్న నేపథ్యంలో.. భారత్, అమెరికాలు ఒక ఒప్పందానికి రావడం వల్లనే దేవయాని భారత్‌కు వచ్చేసిందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా రెండు దేశాల అధికారులు, న్యాయవాదుల మధ్య సమస్య సామరస్య పరిష్కారం కోసం చర్చలు జరుగుతున్నాయని.. అయితే, దేవయానిపై చేసిన నేరాభియోగాల తీవ్రతను తగ్గిస్తామని, వాటిని పూర్తిగా వెనక్కు తీసుకోలేమని అమెరికా.. వాటిని బేషరతుగా ఉపసంహరించుకోవాల్సిందే అని భారత్.. భీష్మించుకోవడంతో చర్చల్లో ప్రతిష్టంభన నెలకొందని అధికార వర్గాలు తెలిపాయి. అయితే, గురువారం నాటికి ఇరుదేశాలుఅంగీకారానికి రావడం వల్లనే అమెరికా దేవయానిని భారత్ పంపించిందని వెల్లడించాయి. అయితే, దేవయానిపై నమోదు చేసిన అభియోగాలను ఉపసంహరించుకునేందుకు అమెరికా ససేమిరా అంటోందని, తీవ్ర నేరం స్థాయి నుంచి ‘తప్పుడు నడవడిక’ స్థాయి నేరానికి ఆ అభియోగాలను తగ్గించేందుకే అంగీకరించిందని తెలిపాయి. అయితే దేవయానిపై అభియోగాలను అంగీకరించబోమని భారత్ వాదిస్తోందన్నారు. కాగా, ఐరాస శాశ్వత మిషన్‌కు తన బదిలీని అంగీకరించడం ద్వారా అమెరికా తనకు పూర్తి దౌత్యరక్షణకు ఆమోదం తెలిపిందని, అందువల్ల తనపై కేసు కొట్టేయాలని దేవయాని న్యూయార్క్ కోర్టును కోరారు. విదేశాంగ మంత్రితో దేవయాని భేటీ న్యూఢిల్లీ: శుక్రవారం రాత్రి భారత్ తిరిగివచ్చిన దేవయాని శనివారం విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, ఆ శాఖ కార్యదర్శి సుజాతా సింగ్‌లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. తనకు కొన్ని రోజులు సెలవు కావాలని వారిని కోరారు. -
దేశం విడిచి వెళ్లండి: అమెరికా
వీసా కేసులో దేవయానికి అమెరికా ఆదేశం భారత్ ప్రతిచర్య.. అమెరికా దౌత్యవేత్త ‘బహిష్కరణ’ ఖోబ్రగడేపై నేరాభియోగాలు నమోదు చేసిన అమెరికా కోర్టు యూఎన్ మిషన్‌కు దేవయూని బదిలీకి ఎట్టకేలకు యూఎస్ ఆమోదం న్యూయూర్క్/న్యూఢిల్లీ: భారత్-అమెరికా దౌత్య సంబంధాలకు మరో ఎదురుదెబ్బ తగిలింది. భారత దౌత్యవేత్త దేవయూని ఖోబ్రగడే (39) ‘వీసా కేసు’లో.. తాజాగా చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలతో ఈ పరిస్థితి తలెత్తింది. దేవయూనిని అమెరికా బహిష్కరించడం, ఇందుకు ప్రతిచర్యగా భారత్ సీనియర్ అమెరికా దౌత్యవేత్త ఒకరిని బహిష్కరించడం.. తదితర పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయూరుు. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిం దిగా దేవయూని చేసిన విజ్ఞప్తిని తిరస్కరించిన అమెరికా కోర్టు.. తాజాగా శుక్రవారం ఆమెపై ఈ కేసుకు సంబంధించిన నేరాభియోగాలు నమోదు చేసింది. దీనికిముందు.. అరెస్టు నేపథ్యంలో భారత్ దేవయూనిని ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేయడాన్ని అమెరికా ఎట్టకేలకు ఆమోదించింది. తద్వారా ఆమెకు పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయూల్సిందిగా కోరిన అమెరికా.. భారత్ అందుకు నిరాకరించడంతో ఖోబ్రగడేను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయూని న్యూ యూర్క్ నుంచి భారత్‌కు పయనమయ్యూరు. రాత్రి 9.40 గంటలకు ఢిల్లీ చేరుకున్నారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. వెంటనే ప్రతి చర్య చేపట్టింది. న్యూఢిల్లీలోని పేరు తెలియని డెరైక్టర్ స్థారుు (దేవయూని హోదాతో సమానమైన హోదా) అమెరికా దౌత్యవేత్తను బహిష్కరించింది. 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఆయన పేరు వెల్లడి కానప్పటికీ పనిమనిషి రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి అమెరికాకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించిన దౌత్యవేత్తపైనే బహిష్కరణ వేటు పడినట్లు సమాచారం. అరుుతే ‘బహిష్కరణ’ అనే పదాన్ని ఉపయోగించేందుకు భారత అధికారులు నిరాకరించారు. అమెరికా ఎంబసీలోని ఓ దౌత్యవేత్తను ఉపసంహరించుకోవాల్సిందిగా ఆ కార్యాలయూన్ని కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించారుు. భారత్ ఈ విధంగా ‘దెబ్బకు దెబ్బ’ వంటి చర్య తీసుకోవడం ఇది రెండోసారి. 33 ఏళ్ల క్రితం అమెరికా ప్రభాకర్ మీనన్ అనే భారత దౌత్యవేత్తను బహిష్కరించినప్పుడు.. ఇండియూ కూడా ఢిల్లీలోని అమెరికా పొలిటికల్ కాన్సులర్‌ను బహిష్కరించింది. దేవయూనిపై అమెరికా కోర్టు నేరారోపణలు నమోదు చేయడాన్ని భారత్ ఓటమిగా బీజేపీ అభివర్ణించింది. అమెరికాలో కేసు పెండింగ్‌లోనే ఉంటున్నందున ఇది మన ఓటమేనని, విజయం కాదని బీజేపీ నేత, మాజీ విదేశాంగ మంత్రి యశ్వంత్ సిన్హా పేర్కొన్నారు. అభియోగాలు అలాగే ఉంటారుు: యూఎస్ అటార్నీ పూర్తిస్థారుు దౌత్యరక్షణ ఉన్న నేపథ్యంలో దేవయూని భారత్ తిరిగి వెళ్తున్నప్పటికీ దేవయూనిపై మోపిన అభియోగాలు అలాగే ఉంటాయని అమెరికా కోర్టు విస్తృత ధర్మాసనం (గ్రాండ్ జ్యూరీ) స్పష్టం చేసింది. దౌత్య రక్షణ లేకుండా దే వయూని కనుక అమెరికా తిరిగివచ్చిన పక్షంలో విచారణ ఎదుర్కొనవలసి ఉంటుందని యూఎస్ అటార్నీ ప్రీత్ బరారా చెప్పారు. జిల్లా జడ్జి షీరా షీండ్లిన్కు రాసిన లేఖలో ఆయన ఈ మేరకు వెల్లడించారు. తన పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా దరఖాస్తుకు సంబంధించిన వ్యవహారంలో.. మోసం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి రెండు నేరాలు కోర్టు దేవయూనిపై మోపినట్టు బరారా వివరించారు. దేవయూనికి దౌత్య రక్షణ హోదా ఇటీవలే కల్పించిన విషయం తమకు తెలుసునని చెప్పారు. పనిమనిషి రిచర్డ్ వీసా దరఖాస్తులో తప్పుడు ధ్రువీకరణలు ఇవ్వడంతో పాటు దేవయూని ఆమెకు తగిన వేతనం చెల్లించడం లేదని, ఇతర ఆరోపణలతో మొత్తం 21 పేజీలతో ఖోబ్రగడేపై చార్జిషీట్ దాఖలైంది. తప్పుడు, ఆధారరహిత అభియోగాలు: దేవయూని తనపై మోపిన అభియోగాలు తప్పు, ఆధార రహితమని 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి అరుున ఖోబ్రగడే పేర్కొన్నారు. భారత్‌కు విమానం ఎక్కేముందు ఆమె పీటీఐతో మాట్లాడారు. ఈ పరిణామాలు తన కుటుంబంపై, ముఖ్యంగా ఇప్పటికీ అమెరికాలోనే ఉన్న తన పిల్లలపై ఎలాంటి దుష్ర్పభావాన్నీ చూపబోవని విశ్వాసం వ్యక్తం చేశారు. తనకు సహకరించిన భారత విదేశాంగ శాఖ మంత్రికి, సహచరులకు, రాజకీయ నాయకత్వానికి, మీడియూకు.. ముఖ్యంగా విపత్కర పరిస్థితుల్లో తనకు వెన్నుదన్నుగా నిలిచిన దేశ ప్రజానీకానికి ఆమె కృతజ్ఞత లు తెలిపారు. పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించిన నేపథ్యంలో దేవయూని అమెరికా బయ ట కూడా పర్యటించవచ్చని, ఈ నేపథ్యంలోనే భారత్ వెళుతున్నారని ఆమె తరఫు న్యాయవాది డేనియల్ అర్షాక్ చెప్పారు. మౌనం వీడిన సంగీత దేవయూని ఇటు ఇండియూ విమానమెక్కగానే పనిమనిషి సంగీత రిచర్డ్ మౌనం వీడారు. దౌత్యవేత్త వద్ద పనిచేస్తుండగా తానెన్నో బాధలు పడ్డట్టు చెప్పారు. తనలా బాధలకు గురికాకుండా చూసుకోండంటూ ఇతర పని మనుషులకు సూచించారు. కుటుంబం కోసం కొన్నాళ్లు అమెరికాలో పనిచేసి తిరిగి ఇండియూ వెళ్లిపోవాలనుకున్నట్టు సంగీత ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మనుషుల అక్రమ రవాణా వ్యతిరేక సంస్థ ‘సేఫ్ హారిజాన్’ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. రాజీ నిరాకరించిన దేవయూని దేశ సార్వభౌమాధికారాన్ని సమున్నత స్థారుులో నిలిపేందుకు పోరాటం కొనసాగిస్తున్న తన కుమార్తె.. కేసులో రాజీ పడి అమెరికాలోనే ఉండాల్సిందిగా వచ్చిన ప్రతిపాదనను నిరాకరించినట్లు దేవయూని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శుక్రవారం ఢిల్లీలో తెలిపారు. పనిమనిషికి పరిహారం చెల్లించడం, జరిమానా కట్టడం, దర్యాప్తు చేసిన వ్యక్తికి కూడా చెల్లింపులు చేస్తే ఆరోపణలన్నీ ఉపసంహరించుకుంటామని, తద్వారా అమెరికాలోనే ఉండవచ్చని చెప్పారన్నారు. ఈ రాజీ ప్రతిపాదనను దేవయూని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని చెప్పారు. పరిణామాల క్రమం.. వీసా కేసులో డిసెంబర్ 12న దేవయూనిని అమెరికా పోలీసులు అరెస్టు చేశారు. దుస్తులు విప్పి మరీ ఆమెను సోదా చేశారు. నేరగాళ్లతో కలిపి లాకప్‌లో ఉంచారు. అరెస్టు నేపథ్యంలో ఆమె పాస్‌పోర్టును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సుమారు కోటిన్నర రూపాయల పూచీకత్తుతో ఖోబ్రగడే విడుదలయ్యూరు. దేవయూని అరెస్టు భారత్, అమెరికాల మధ్య వివాదం సృష్టించింది. ఈ నేపథ్యంలోనే భారత్ ఆమెను ఐక్యరాజ్యసమితిలోని తమ శాశ్వత కార్యాలయూనికి బదిలీ చేసింది. తద్వారా ఆమెకు డిప్యూటీ కాన్సులర్ హోదాలో పాక్షిక దౌత్య రక్షణ కాకుండా పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. అరుుతే అమెరికా ఈ విధమైన యూఎన్ గుర్తింపునకు ఆమోదం తెలపకుండా తాత్సారం చేసింది. ఎట్టకేలకు భారత్, అమెరికా ప్రధాన కార్యాలయూల ఒప్పందాన్ని అనుసరించి ఈ నెల 8న దేవయూనికి పూర్తిస్థారుు దౌత్య రక్షణ లభించింది. ఈ నెల 9న ఆ హోదాను రద్దు చేయూల్సిందిగా అమెరికా భారత్‌ను కోరింది. తద్వారా ఖోబ్రగడేను కోర్టులో విచారించేందుకు వీలవుతుందని ఆ దేశం ఆశించింది. -
రాజీ లేదు పోరాటమే.. అమెరికాకో దండం
అమెరికాలో అవమానకర పరిస్థితుల్నిఎదుర్కొన్న భారతీయ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు రాజీచేసుకుని అమెరికాలో ఉండే అవకాశం వచ్చినా నిరాకరించారు. తన పట్ల అనుచితంగా వ్యవహరించిన అధికారులపై న్యాయపరమైన పోరాటం చేయాలని నిర్ణయించుకుని భారత్‌కు తిరిగివస్తున్నారు. దేవయాని తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే ఈ విషయాల్నివెల్లడించారు. ఈ వివాదంపై భారతీయ కోర్టులోనే న్యాయపోరాటం చేయనున్నట్టు తెలిపారు. 1999 బ్యాచ్‌కు చెందిన ఐఎఫ్ఎస్ అధికారి దేవయాని వీసా నిబంధనల్ని అతిక్రమించినట్టు అభియోగాల్ని మోపారు. ఖోబ్రగడేకు సంకెళ్లు వేసి అరెస్ట్ చేయడంతో పాటు పూర్తిగా దుస్తులు విప్పి తనిఖీ చేశారని వెలుగులోకి రావడంతో భారత దేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ''దేవయానీ ఖోబ్రగడేకు 2014 జనవరి 8వ తేదీన పూర్తి దౌత్య రక్షణతో జీ1 వీసా మంజూరైంది. ఆమె భారతదేశానికి విమానంలో బయల్దేరారు" అని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్వీట్ చేశారు. డిసెంబర్ 12న ఆమె న్యూయార్క్‌లో అరెస్టయినప్పుడు భారత్ తరఫున అక్కడున్న ఏకైక డిప్యూటీ కాన్సల్ జనరల్ ఆమే. తర్వాత ఆమెను ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌కు పూర్తి దౌత్య పరమైన రక్షణలతో బదిలీ చేశారు. ఎట్టకేలకు గురువారం నాడు ఖోబ్రగడేపై అమెరికా గ్రాండ్ జ్యూరీ అభియోగాల నమోదు పూర్తిచేసింది. ఖోబ్రగడేకు దౌత్యరక్షణ మంజూరు చేశారని, అమెరికా వదిలి వెళ్లిపోవాల్సిందిగా కోరారని న్యాయవాదులు తెలిపారు. మరోవైపు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓప్రకటన విడుదల చేసింది. ''న్యూయార్క్‌లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో భారతదేశానికి ఉన్న శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్ అయిన ఖోబ్రగడేకు జనవరి 8న పూర్తిస్థాయి దౌత్య రక్షణ కల్పించాం. ఐక్యరాజ్యసమితికి, అమెరికాకు మధ్య ఉన్న హెడ్‌క్వార్టర్స్ ఒప్పందంలోని సెక్షన్ 15 కింద ఇవి మంజూరయ్యాయి. అదే సమయంలో, ఖోబ్రగడేకు ఉన్న దౌత్యపరమైన రక్షణను తొలగించాలని అమెరికా ప్రభుత్వం భారత ప్రభుత్వాన్ని కోరింది'' అని ఆ ప్రకటనలో చెప్పారు. అయితే, భారత ప్రభుత్వం అందుకు నిరాకరించి, ఢిల్లీలోని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఖోబ్రగడేను బదిలీ చేసింది. తనపై మోపిన నేరాల గురించి తనకేమీ తెలియదని దేవయాని విమానాశ్రయంలో తెలిపారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భారత ప్రభుత్వానికి, విదేశీ వ్యవహారాల మంత్రికి, భారతదేశ ప్రజలకు, మీడియాకు కృతజ్ఞతలు చెప్పారు. -
‘దేవయానికి గడువు పొడిగించలేం’
న్యూయార్క్: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీసా కేసులో ప్రాథమిక విచారణ మొదలుపెట్టడానికి ఉన్న గడువును పొడిగించాలంటూ దేవయాని చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్టు తర్వాత నిబంధనల ప్రకారం నెలరోజుల లోపు ప్రభుత్వం అభియోగపత్రం దాఖలు చేయాలని, ఆ వెంటనే ప్రాథమిక విచారణ మొదలవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ గడువును పెంచేందుకు చట్టం అంగీకరించదని పేర్కొంది. వీసాలో అక్రమాల ఆరోపణలపై దేవయానిని పోలీసులు డిసెంబర్ 12న అవమానకర రీతిలో అరె స్టు చేసిన సంగతి తెలిసిందే. చట్టం ప్రకారం నెలరోజుల్లోపు అంటే జనవరి 13కల్లా కేసులో ప్రాథమిక విచారణ మొదలుపెట్టాల్సి ఉంది. -
ఆ వీడియో దేవయానిది కాదు: అమెరికా
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేను అమెరికా పోలీసులు బట్టలు విప్పి తనిఖీ చేస్తున్నట్లుగా వివిధ వెబ్సైట్లలో కనిపించిన, సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న సీసీటీవీ వీడియో సంచలనం రేపుతోంది. ఆమె రెండు చేతులను వెనక్కు విరిచి, నగ్నంగా పాడుకోబెట్టి తనిఖీ చేస్తున్నట్టు వీడియాలో ఉంది. పురుష భద్రతాధికారులు ఆమెను వేధిస్తున్నట్టుగా అందులో చూపారు. అయితే ఈ వీడియో బూటకమైనదని అమెరికా విదేశాంగ శాఖ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ పేర్కొన్నారు. ‘‘ఆ వీడియో ఎంతమాత్రమూ ఖోబ్రగడేది కాదు. ఇది చాలా ప్రమాదకరమైన, రెచ్చగొట్టేటువంటి కల్పితమైన వీడియో’’ అని చెప్పారు. అమెరికా పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక మహిళ ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై విదేశాంగ అధికారులు అమెరికా మార్షల్ సర్వీస్ విభాగంతో మాట్లాడారని, ఆ వీడియో దేవయానిది కాదని వారు నిర్ధారించారని మేరీ హార్ఫ్ చెప్పారు. అసలు ఆ వీడియోలో ఉన్నది అమెరికా మార్షల్స్ కాదని, ఆ వీడియోలో కనిపించిన తనిఖీ పద్ధతి కూడా అమెరికా మార్షల్స్ పాటించే విధానంలో లేదని వారు ధ్రువీకరించినట్లు చెప్పారు. -
రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి:అమెరికా
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టుతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయంతో అమెరికా ఏకీభవించింది. దెబ్బతిన్న సంబంధాలను వీలైనంత త్వరగా మళ్లీ బలోపేతం చేసే అంశంపై తాము దృష్టి పెట్టామని వెల్లడించింది. దేవయాని వ్యవహారంలో విదేశాంగ మంత్రి పశ్చాత్తాప పడ్డట్లు ఆ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘రెండు దేశాలూ కలిసి ముందుకు సాగాల్సిన కీలక అంశాలు చాలా ఉన్నాయి. ఆ దిశగా సంబంధాలను వేగవంతంగా బలోపేతం చేసేందుకు మేం యత్నిస్తున్నాం’’ అని హార్ఫ్ చెప్పారు. దేవయానికి అవసరమైన దౌత్య రక్షణ కల్పించేలా ఐక్యరాజ్యసమితికి ఆమెను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి నుంచి తమకు లేఖ వచ్చిందని తెలిపారు. దేవయాని వీడియో బూటకం: దేవయాని ఖోబ్రగడేను అమెరికా పోలీసులు బట్టలు విప్పి తనిఖీ చేస్తున్నట్లుగా వివిధ వెబ్సైట్లలో కనిపించిన, సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అవుతున్న సీసీటీవీ వీడియో బూటకమైనదని మేరీ హార్ఫ్ చెప్పారు. ‘‘ఆ వీడియో ఎంతమాత్రమూ ఖోబ్రగడేది కాదు. ఇది చాలా ప్రమాదకరమైన, రెచ్చగొట్టేటువంటి కల్పితమైన వీడియో’’ అని చెప్పారు. అమెరికా పోలీసులు తనిఖీ చేస్తుండగా ఒక మహిళ ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. దీనిపై విదేశాంగ అధికారులు అమెరికా మార్షల్ సర్వీస్ విభాగంతో మాట్లాడారని, ఆ వీడియో దేవయానిది కాదని వారు నిర్ధారించారని మేరీ హార్ఫ్ చెప్పారు. అసలు ఆ వీడియోలో ఉన్నది అమెరికా మార్షల్స్ కాదని, ఆ వీడియోలో కనిపించిన తనిఖీ పద్ధతి కూడా అమెరికా మార్షల్స్ పాటించే విధానంలో లేదని వారు ధ్రువీకరించినట్లు చెప్పారు. అమెరికా సెంటర్లో సినిమాలు ప్రదర్శించవద్దు: భారత్ న్యూఢిల్లీ: దేవయాని వ్యవహారంలో అమెరికాపై ఒత్తిడి పెంచే దిశగా భారత్ మరో చర్య తీసుకుంది. ఎలాంటి లెసైన్సు పొందకుండా ‘అమెరికా సెంటర్’లో సినిమాలు ప్రదర్శించవద్దని అమెరికా రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది. ఈ మేరకు ఈ నెల 20 వరకు గడువిచ్చింది. ఢిల్లీలోని ‘అమెరికా సెంటర్’ ఎలాంటి లెసైన్సు లేకుండానే ఇక్కడ సినిమాలు ప్రదర్శిస్తుంటుంది. ఇంతకాలం దీనిపై నోరు మెదపని ప్రభుత్వం తాజాగా.. ఆ ప్రదర్శనలు నిలిపేయాలంటూ నోటీసులు పంపింది. -
మన్మోహన్ చెప్పింది నిజమే:అమెరికా
వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్టుతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అభిప్రాయంతో అమెరికా ఏకీభవించింది. దెబ్బతిన్న సంబంధాలను వీలైనంత త్వరగా మళ్లీ బలోపేతం చేసే అంశంపై తాము దష్టి పెట్టామని వెల్లడించింది. దేవయాని వ్యవహారంలో విదేశాంగ మంత్రి పశ్చాత్తాప పడ్డట్లు ఆ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ చెప్పారు. శుక్రవారమిక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘రెండు దేశాలూ కలిసి ముందుకు సాగాల్సిన కీలక అంశాలు చాలా ఉన్నాయి. ఆ దిశగా సంబంధాలను వేగవంతంగా బలోపేతం చేసేందుకు మేం యత్నిస్తున్నాం’’ అని హార్ఫ్ చెప్పారు. దేవయానికి అవసరమైన దౌత్య రక్షణ కల్పించేలా ఐక్యరాజ్యసమితికి ఆమెను బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఐక్యరాజ్యసమితి నుంచి తమకు లేఖ వచ్చిందని, అవసరమైన ఫైళ్లను అధికారులు సిద్ధం చేస్తున్నారని తెలిపారు. -
సమీక్ష దశలోనే దేవయాని దరఖాస్తు: అమెరికా
వాషింగ్టన్: వీసా మోసం అభియోగాలను ఎదు ర్కొంటున్న భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత కార్యాలయానికి చేసుకున్న బదిలీ దరఖాస్తును ఇంకా సమీక్షిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అలాగే పూర్తి దౌత్య రక్షణకు సంబంధించిన పత్రాలను జారీ చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని పేర్కొంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువేమీ లేదని...సమీక్ష ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి ఒకరు చెప్పారు. డిసెంబర్ 20న దేవయాని దరఖాస్తు అమెరికా విదేశాంగశాఖకు అందగా ఇప్పటివరకూ ఆ శాఖ ఆ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. -
సంబంధాలు దెబ్బతిన్నాయి
దేవయాని అరెస్ట్ వ్యవహారంపై అమెరికా రాయబారి వ్యాఖ్య ఆ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నట్లు ప్రకటన దేవయానిపై కేసు ఉపసంహరణ ప్రసక్తే లేదు: యూఎస్ అధికారవర్గాలు న్యూఢిల్లీ: న్యూయార్క్‌లో భారతీయ దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రగడే అరెస్ట్‌కు వ్యతిరేకంగా భారత్ తీసుకున్న కఠిన వైఖరి వల్ల సజావుగా సాగుతున్న అమెరికా, భారత్‌ల మధ్య సంబంధాలు ఒక్కసారిగా కుదుపునకు గురయ్యాయని భారత్‌లో అమెరికా రాయబారి నాన్సీ పావెల్ వ్యాఖ్యానించారు. అమెరికా తరఫున భారతీయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ.. దేవయాని అరెస్ట్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాల పట్ల నాన్సీ విచారం వ్యక్తం చేశారు. అయితే, ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల పరంగా జరుగుతున్న కృషిని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇదిలాఉండగా, దేవయానిపై అమెరికా కోర్టులో ఉన్న కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలన్న భారత్ డిమాండ్‌ను అమెరికా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కేసును వెనక్కు తీసుకునే ప్రసక్తేలేదని, జనవరి 13న ఆమెపై అభియోగాలను నమోదు చేయనున్నారని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. సంపూర్ణ దౌత్యరక్షణ లభించే ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌కు బదిలీ అయినప్పటికీ.. దేవయానిపై కేసు బలంగా ఉందని, దానిని ఉపసంహరించబోరని, కాకపోతే, వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేకుండా మినహాయిం పు ఇవ్వొచ్చని తెలిపాయి. దౌత్యరక్షణ ఉన్నంతకాలం ఆమెపై ఉన్న కేసును సస్పెన్షన్‌లో ఉంచి, ఆ తరువాత విచారణ ప్రారంభించవచ్చని.. ఆ తరువాత ఎప్పుడు అమెరికాకు వచ్చినా ఆమెను అరెస్ట్ చేసే అవకాశాలున్నాయని వివరించాయి. అయితే, ఈ వార్తలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్యంలో చాలామంది మాట్లాడుతుంటారని.. అయితే అమెరికా విదేశాంగ శాఖ నుంచి వచ్చే స్పందన మాత్రమే అధికారిక ప్రకటనలా భావిస్తామని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మంగళవారం పేర్కొన్నారు. దేవయాని అరెస్ట్‌కు సంబంధించి పూర్తి వివరాలను పరిశీలిస్తున్నామని అమెరికా నుంచి తమకు అధికారికంగా సమాచారం ఉందని తెలిపారు. భారతీయ దౌత్యాధికారిణిపై కేసును తీవ్రంగా తీసుకున్నామని స్పష్టం చేశారు. కాగా, తమ కాన్సులేట్లలో పనిచేస్తున్న భారతీయులకు తక్కువ వేతనాలు ఇస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలను అమెరికా ఖండించింది. ఒక్క భారత్‌లోనే కాదు తమ కాన్సులేట్లు ఉన్న అన్ని దేశాల్లోనూ స్థానిక చట్టాలు, నిబంధనల ప్రకారం వేతనాలు ఇస్తున్నామంది. -
దేవయానికి ఊరట లభించే అవకాశం!
భారతీయ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదేకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు విషయమై సమితి నుంచి వచ్చిన పత్రాలను అమెరికా సమీక్షిస్తోంది. ఐక్యరాజ్యసమితి నుంచి శుక్రవారం రాత్రి తమకు పత్రాలు అందాయని, వాటిని సమీక్షిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే.. అందుకు ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని చెప్పేందుకు మాత్రం ఆయన నిరాకరించారు. పత్రాల సమీక్ష పూర్తయితే ఖోబ్రగాదేకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు కార్డు ఇస్తారు. ఈనెల 12వ తేదీన న్యూయార్క్‌లో అరెస్టు చేసిన దేవయానీ ఖోబ్రగాదేను ఆ తర్వాత 2.50 లక్షల డాలర్ల పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఆమె దౌత్య పాస్‌పోర్టును సమర్పించాలని కూడా ఆదేశించారు. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఖోబ్రగాదేను ఐక్యరాజ్యసమితి శాశ్వత మిషన్‌కు బదిలీ చేసింది. దానివల్ల ఆమెకు దౌత్యపరమైన రక్షణ లభిస్తుంది. ఆమె బదిలీని ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. ఈ మేరకు అవసరమైన పత్రాలను అమెరికా విదేశాంగ శాఖకు పంపింది. -
పరిష్కారం దిశగా దౌత్యవివాదం!
అమెరికా కోర్టులో హాజరు నుంచి దేవయానికి మినహాయింపు ఐరాస శాశ్వత మిషన్‌కు బదిలీతో సమితి అధికారిక గుర్తింపు న్యూఢిల్లీ: భారత దౌత్యాధికారి దేవయాని ఖోబ్రాగడె అరెస్టు విషయమై అమెరికా, భారత్‌ల మధ్య తలెత్తిన దౌత్య వివాదం పరిష్కారం దిశగా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. వీసా అక్రమాల కేసు విచారణ కోసం అమెరికా కోర్టులో వ్యక్తిగతంగా హాజరు కాకుండా దేవయానికి మినహాయింపు లభించింది. మరోవైపు.. దేవయానిని న్యూయార్క్‌లోని భారత దౌత్యకార్యాలయం నుంచి అదే నగరంలో గల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలోని భారత శాశ్వత మిషన్‌కు బదిలీ చేసిన నేపథ్యంలో ఆమెకు సమితి అధికారిక గుర్తింపు లభించింది. దీంతో ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ లభించినట్లయింది. ఇందుకు సంబంధించిన పత్రాలను ఆమెరికా విదేశాంగ శాఖ లాంఛనంగా పూర్తిచేయటమే మిగిలింది. వీసా అక్రమాలు, తన పనిమనిషి సంగీతా రిచర్డ్‌కు తక్కువ వేతనాలు చెల్లించటం ఆరోపణలపై దేవయానిని ఈ నెల 12న నడిరోడ్డుపై సంకెళ్లు వేసి అరెస్ట్ చేయటం, అనంతరం దుస్తులు విప్పి తనిఖీ చేయటం, మాదకద్రవ్యాల నేరస్థులతో పాటు సెల్లో నిర్బంధించటం వంటి అవమానకర చర్యలపై భారత్ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. ప్రతిచర్యల్లో భాగంగా అమెరికా దౌత్యాధికారులు నియమించుకున్న భారత ఉద్యోగులు, పనిమనుషులకు సంబంధించి వేతనాలు, ఇతర కీలక సమాచారాన్ని సోమవారం లోగా అందించాలని గడువు విధంచగా అందుకు మరో రోజు సమయం కావాలని అమెరికా ఎంబసీ కోరింది. సంగీత కుటుంబానికి విమాన చార్జీ చెల్లించిన అమెరికా దేవయాని పనిమనిషి సంగీత భర్త ఫిలిప్, పిల్లలు జెన్నిఫర్, జతిన్లు గత వారం ఢిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఢిల్లీలోని అమెరికా ఎంబసీ విమాన చార్జీలు చెల్లించిన సంగతి ఆలస్యంగా వెలుగు చూసింది. సంగీత ప్రస్తుతం పరారీలో ఉండడం విదితమే. కాగా, అమెరికాలోని భారత దౌత్యవేత్తల పనిమనుషులు(ఇండియా బేస్డ్ డొమెస్టిక్ వర్కర్స్-ఐబీడీఏ) పరారు కావడం కొత్తేమీ కాదని తెలిసింది. గత పదేళ్లలో పన్నెండు మందికిపైగా పరారయ్యారు. వీరిలో పనిమనుషులతోపాటు సెక్యూరిటీ గార్డులూ ఉన్నారు. వీరిలో అమెరికాలో భారత మాజీ రాయబారి మీరా శంకర్ పనిమనిషి కూడా ఉంది. అమెరికా చట్టాల్లోని లొసుగుల వల్ల కొందరు ఐబీడీఏలు ఆ దేశంలోనే ఉండిపోయేందుకు తమ యజమానులపై ఆరోపణలు చేస్తున్నారని పేరు వెల్లడించడానికి ఇష్టపడని దౌత్యవేత్తలు చెప్పారు. ‘దేవయాని అరెస్టు తీరు హేయం’ దేవయాని విషయంలో తమ దేశ తీరు హేయమైందని అమెరికా మాజీ విదేశాంగ అధికారి గోర్డన్జోన్స్ ‘వాషింగ్టన్ పోస్ట్’ పత్రికలో రాసిన వ్యాసంలో విమర్శించారు. ఈ ఉదంతంతో సంబంధమున్న అమెరికా మార్షల్స్‌ను విచారించాలని, వారు ఆమెను అవమానించినట్లు తేలితే కఠిన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం విదేశీ సంబంధాల్లో విజ్ఞతతో వ్యహరించాల్సి ఉంటుందని అమెరికన్ వర్సిటీ కాలేజ్ ఆఫ్ లా ప్రొఫెసర్ స్టీఫెన్వ్లాడెక్ అన్నారు. -
దేవయానికి అండగా నిలుస్తాం
సాక్షి, ముంబై: ఇక్కట్లపాలైన అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) అండగా నిలవనుంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు రాందాస్ అథవాలే శనివారం వెల్లడించారు. జనవరిలో అమెరికా వెళ్లనున్నట్టు చెప్పారు. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుస్తానన్నారు. కాగా వీసా మోసం ఆరోపణలపై దేవయానిని అరెస్టు చేసి బేడీలు వేయడం, ఆ తరువాత విచారణ పేరు తో ఆమెపట్ల దారుణంగా వ్యవహరించడం తెలి సిందే. అమెరికా వైఖరిని వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తం గా వివిధ రంగాల నుంచి తీవ్ర నిరసనలు, ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే శనివారం సాయంత్రం రాందాస్‌ను కలిశారు. అనంతరం రాందాస్ మీడియాతో మాట్లాడుతూ దేవయానికి అండగా నిలిచేందుకే తాను అమెరికా వెళుతున్నానన్నారు. దేవయానిపై నమోదుచేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని, ఆమెపట్ల కఠినంగా వ్యవహరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్టు చెప్పారు. దేవయానికి న్యాయం జరిగేదాకా తమ పార్టీ ఆందోళన ఆగదని రాందాస్ స్పష్టం చేశారు. -
అమెరికా ఎగతాళిని సహించేది లేదు: కమల్‌నాథ్
న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయ దౌత్యవేత్త దేవయానిపై అమెరికా వ్యవహరిస్తున్న తీరు పట్ల కేంద్ర పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి కమల్‌నాథ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం కమల్‌నాథ్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... దేవయానిపై నమోదు చేసిన కేసును వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన అమెరికాను డిమాండ్ చేశారు. అలాగే ఆమెను తనిఖీ చేసే క్రమంలో ఆ దేశ ఉన్నతాధికారు వ్యవహరించిన తీరు పట్ల ఆయన మండిపడ్డారు. భారతీయులపై తరచుగా అమెరికా తనిఖీల పేరిట నిర్వహిస్తున్న సోదాలను ఖండించారు. అమెరికా చర్యలను ఎంత మాత్రం సహించేది లేదని కమల్‌నాథ్ స్పష్టం చేశారు. దేవయాని విషయంలో వెనక్కి తగ్గేది లేదని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారి ప్రతినిధి మేరీ హార్ఫ్ శుక్రవారం ఉదయం అమెరికాలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దాంతో హార్ఫ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏమిటని విలేకర్లు కమల్‌నాథ్‌ను ప్రశ్నించారు. దీంతో ఆయనపై విధంగా స్పందించారు. -
దేవయాని కేసులో వెనక్కి తగ్గేది లేదు: అమెరికా
భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదేపై కేసును ఉపసంహరించే ప్రసక్తే లేదని అమెరికా ఖరాకండిగా చెప్పింది. ఆ విషయంలో క్షమాపణలు కూడా చెప్పబోమని స్పష్టం చేసింది. తమ దేశ దౌత్యవేత్త పట్ల ఆమెరికా వ్యవహరించిన తీరుపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై వెంటనే క్షమాపణలు చెప్పాలని, అలాగే దేవయానిపై నమోదైన కేసును యుద్ధ ప్రాతిపదికన ఉపసంహరించాలని భారత్ చేసిన డిమాండ్‌ను అమెరికా తోసిపుచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మేరీ హర్ఫ్ శుక్రవారం వాషింగ్టన్లో వెల్లడించారు. దేవయానిపై నమోదైనది అషామాషి కేసు కాదని మేరీ అభిప్రాయపడ్డారు. అయితే ఆమెను ప్రాసిక్యూట్ చేస్తారో, లేదో తనకు తెలియదని చెప్పారు. ఈ అంశంపై అమెరికా కోర్టులు ఏమైనా స్పందిస్తే అప్పుడు ఆలోచిస్తామని తెలిపారు. ఖోబ్రగడే 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిణి. న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఇంట్లో సహాయకారిగా ఉండేందుకు భారత్‌లో నుంచి సంగీత రిచర్డ్‌ను నెలకు రూ. 30 వేల జీతంతో పనిమనిషిగా పెట్టుకున్నారు. దేవయాని మూల వేతనమే రూ.26 వేలు కావడం ఇక్కడ గమనార్హం. 2012 నవంబర్ 23న సంగీత న్యూయార్క్ వెళ్లారు. అయితే అక్కడ ఖాళీ సమయంలో తాను వేరే ఉద్యోగం చేసేందుకు అనుమతించాలని దేవయానికి కోరింది. అందుకు యూఎస్ చట్టాలు అనుమతించవని సంగీతకు దేవయాని వివరించింది. ఆ క్రమంలో దేవయాని ఇంటి నుంచి సంగీత పరారైంది. ఆ క్రమంలో దేవయాని మరియు సంగీత దంపతుల మధ్య చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో దేవయానిపై యూఎస్ లో కేసు నమోదు అయింది. అంతేకాకుండా దేవయానిని తనిఖీ చేసే క్రమంలో ఉన్నత అధికారి అనే విషయాన్ని మరిచి యూఎస్ అధికారులు ప్రవర్తించారు. దీంతో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవయానిపై కేసు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై వెంటనే క్షమాపణలు చెప్పాలని యూఎస్ ను భారత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
తప్పెవరిది.. అసలేం జరిగింది..!
న్యూయార్క్/న్యూఢిల్లీ: భారత్, అమెరికాల మధ్య దాదాపు ప్రచ్ఛన్న యుద్ధానికి కారణమైన 39 ఏళ్ల దేవయాని ఖోబ్రగడే 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిణి. న్యూయార్క్‌లోని భారత దౌత్య కార్యాలయంలో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన తరువాత.. ఇంట్లో సహాయకారిగా ఉండేందుకు భారత్‌లో ఉన్న సంగీత రిచర్డ్‌ను నెలకు రూ. 30 వేల జీతంతో పనిమనిషిగా పెట్టుకున్నారు. దేవయాని మూల వేతనమే రూ.26 వేలు కావడం ఇక్కడ గమనార్హం. 2012 నవంబర్ 23న సంగీత న్యూయార్క్ వెళ్లారు. 2013 మార్చి వరకు ఏ సమస్యా రాలేదు. ఆ తరువాత ఖాళీ సమయాల్లో వేరే దగ్గర పనిచేసేందుకు అనుమతించాలని పనిమనిషి దేవయానిపై ఒత్తిడి తేవడం ప్రారంభించింది. అలా చేయడం చట్టవ్యతిరేకమని చెప్పి ఆమె అభ్యర్థనను దేవయాని తిరస్కరించారు. జూన్ 21న దేవయాని న్యూజెర్సీ వెళ్లి వచ్చేసరికి సంగీత ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ విషయాన్ని దేవయాని అమెరికాలోని విదేశీ వ్యవహారాల కార్యాలయానికి (ఓఎఫ్ఎం) తెలియజేయగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారు.కుటుంబసభ్యులు మాత్రమే ఫిర్యాదు చేయాలని చెప్తూ పోలీసులు ఆమె ఫిర్యాదును తీసుకోలేదు. పనిమనిషి భర్త ఫిలిప్ కూడా ఈ విషయంలో దేవయానికి సహకరించలేదు. జూలై 1న ఒక మహిళ దేవయానికి ఫోన్‌చేసి.. సంగీతకు అమెరికా పౌరసత్వం ఇప్పించి భారీ మొత్తంలో పరిహారం ఇస్తే సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని ప్రతిపాదించింది. ఈ విషయాన్ని కూడా దేవయాని విదేశీ వ్యవహారాల కార్యాలయానికి, పోలీసులకు తెలియజేశారు. జూలై 5న వేధింపులు, బ్లాక్మెయిల్, డబ్బులు డిమాండ్ చేయడం తదితర ఆరోపణలతో పనిమనిషిపై దేవయాని న్యూయార్క్ పోలీసులకు మళ్లీ ఫిర్యాదు చేశారు. న్యూఢిల్లీలోనూ పనిమనిషి, ఆమె భర్తపై కేసు పెట్టారు. మూడురోజుల తరువాత న్యూయార్క్‌లోని ఇమ్మిగ్రేషన్ లాయర్ నుంచి తమ ఆఫీస్‌కు రావాల్సిందిగా దేవయానికి ఫోన్ వచ్చింది. అక్కడికి వెళ్లిన తరువాత పనిమనిషికి 10 వేల డాలర్లు ఇచ్చి, ఆమె అధికారిక వీసాను సాధారణ వీసాగా మార్చి, అమెరికాలో నివసించే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ తరువాత పనిమనిషిని కాన్సులేట్ కార్యాలయంలో హాజరు పర్చాల్సిందిగా జూలై 30న కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఓఎఫ్ఎంకు లేఖ రాశారు. అది మీ అంతర్గత సమస్య అంటూ సెప్టెంబర్ 21న అమెరికా ఎంబసీ జవాబిచ్చింది. సెప్టెంబర్ 20న దేవయానిపై విదేశీ కోర్టులకు ఫిర్యాదు చేయవద్దని పనిమనిషి సంగీతను ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నవంబర్ 19న ఢిల్లీ కోర్టు సంగీతపై నాన్ బెయిలబుల్ వారంట్‌ను జారీ చేసింది. తక్షణమే సంగీతను అరెస్ట్ చేయాలంటూ ఆ వారంటును అమెరికా ఎంబసీకి డిసెంబర్ 6న పంపించారు. వింతేమిటంటే, ఆ తరువాత 4 రోజులకు సంగీత భర్త, వారి పిల్లలకు అమెరికా ‘టీ’ వీసా జారీ చేసింది. మనుషుల అక్రమ రవాణా బాధితులు, వారి దగ్గరి బంధువులకు అమెరికాలో కొన్ని రోజులుండి, పనిచేసుకునేలా.. నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలన్న షరతుతో ఆ వీసాలను జారీ చేస్తారు. సంగీత అత్త గతంలో భారత్‌లో విధులు నిర్వహించిన అమెరికా సీనియర్ దౌత్యవేత్త దగ్గర పనిచేశారు. మామ ఇప్పటికీ భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంలో పనిచేస్తున్నారు. డిసెంబర్ 11న వీసా మోసానికి పాల్పడ్డారని, పనిపనిషి వేతనానికి సంబంధించి తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించారని ఆరోపిస్తూ అమెరికాలోని దౌత్యాధికారుల భద్రత వ్యవహారాలశాఖకు చెందిన ప్రత్యేక ప్రతినిధి దేవయానిపై కేసు పెట్టారు. డిసెంబర్ 12న తన ఇద్దరు పిల్లలను స్కూల్ వద్ద దింపడానికి వెళ్తుండగా, నడిరోడ్డుపై యూఎస్ మార్షల్స్ ఆమెను అరెస్ట్ చేసి, చేతులకు బేడీలు వేసి తీసుకెళ్లారు. ఆ తరువాత విచారణ పేరుతో ఆమెతో అతి హేయంగా ప్రవర్తించారు. దుస్తులు విప్పించి, అణువణువూ తడిమి, దారుణంగా తనిఖీ చేశారు. ఆమెకు ఉన్న దౌత్యపరమైన రక్షణనూ పట్టించుకోకుండా.. స్మగ్లర్లు, డ్రగ్స్ వ్యసనపరులు, ఇతర నేరస్తులున్న సెల్లో ఉంచారు. వెట్టిచాకిరీ నిజమేనా? అయితే, పనిమనిషితో వెట్టిచాకిరి చేయించుకున్నారనే విమర్శలు కూడా దేవయానిపై వస్తున్నాయి. ఆమెపై అక్కడ వేసిన కేసులో కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. అమెరికా నిబంధనలకు విరుద్ధంగా రోజుకు 19 గంటలు పనిచేయించుకున్నారని, తక్కువ వేతనం ఇచ్చారని, అమెరికా ప్రభుత్వానికి చూపవద్దనే షరతుతో.. తక్కువ వేతనానికి సంబంధించిన ఒప్పందంపై ఏర్‌పోర్ట్‌కు వెళ్లేముందు సంతకం చేయించుకున్నారని అందులో పేర్కొన్నారు. నెలకు రూ. 30 వేల రూపాయల(అప్పటి ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం 573 డాలర్లు) వేతనం ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్న దేవయాని.. సంగీత వీసా దరఖాస్తుపై మాత్రం అమెరికా నిబంధనలకు అనుగుణంగా నెలకు దాదాపు 4,500 డాలర్లు చెల్లిస్తున్నట్లుగా పేర్కొనడం గమనార్హం. అలాగే, రూ. 30 వేల జీతం గురించి వీసా ఇంటర్వ్యూ సమయంలో ప్రస్తావించవద్దని కూడా సంగీతను ఆమె హెచ్చరించినట్లు ఆరోపణలున్నాయి. -
కేసులను వెనక్కి తీసుకోవాల్సిందే
న్యూఢిల్లీ: అమెరికాలో భారత సీనియర్ దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే అరెస్ట్ వ్యవహరంపై భారత్ వైఖరి మరింత తీవ్రమైంది. ఆమెపై వేసిన కేసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని గురువారం అమెరికాను డిమాండ్ చేసింది. ఆ కేసులు విచారణార్హమైనవే కాదని విదేశాంగమంత్రి సల్మాన్ ఖుర్షీద్ తేల్చిచెప్పారు. ‘రెండు దేశాల మధ్య సంబంధాలను దృష్టిలో పెట్టుకుని సున్నితంగా వ్యవహరించాలి’ అని సూచించారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ కూడా తీవ్రంగా తీసుకున్నారు. సమస్యను పూర్తిగా పరిష్కరించి, దేవయానిపై కేసుల ఉపసంహరణకు కృషి చేయాల్సిందిగా సల్మాన్ ఖుర్షీద్‌ను, జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్‌ను ఆదేశించారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ తనకు ఫోన్‌చేసి ఆ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానికి శివశంకర్‌మీనన్ తెలిపారు. బుధవారం రాత్రి అమెరికా రాజకీయ వ్యవహారాల సహాయ మంత్రి వెండీ షెర్మన్ భారత విదేశాంగ కార్యదర్శి సుజాత సింగ్‌తో దాదాపు 40 నిమిషాలు మాట్లాడారు. సంఘటనకు సంబంధించిన పూర్త వివరాలను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు తెలిపారు. దేవయాని అరెస్ట్ అరుదైన ఘటనగా, దానివల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకూడదని బుధవారం ఒబామా కార్యాలయం ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ అంశం తీవ్రరూపం దాల్చడంతో రెండు దేశాలు సామరస్య పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే దేవయానిని న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి శాశ్వత మిషన్‌కు బదిలీ చేశారని, దానివల్ల కౌన్సెలర్ అధికారిగా ఆమెకు ఇప్పటివరకు లేని పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఇకపై లభిస్తుందని తెలిసింది. దాంతో అక్కడి విచారణ నుంచి కూడా ఆమెకు మినహాయింపు లభిస్తుంది. అయితే, ఇప్పటికే కోర్టు ముందుకు వెళ్లిన వీసా మోసం కేసును ఉపసంహరించుకునే అవకాశంపై స్పష్టత లేదు. ఈ కేసును వాదిస్తున్న భారత సంతతికి చెందిన అమెరికా న్యాయవాది ప్రీత్ భరార కూడా దేవయానిని అరెస్ట్ చేయడం తప్పేం కాదని వ్యాఖ్యానించారు. దేవయాని పనిమనిషి సంగీత కుటుంబం అమెరికా చేరుకున్న విషయాన్ని కూడా ఆయన ధ్రువీకరించారు. సంగీత నోరు మూయించి, ఆమెను భారత్ తీసుకెళ్లేందుకు చట్టపరమైన ప్రక్రియను భారత్‌లో ప్రారంభించారని ఆరోపించారు. భరార వ్యాఖ్యలు వియెన్నా ఒప్పంద స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ విమర్శించింది. భారత కోర్టులో కేసు విచారణలో ఉండగా ఆ కుటుంబానికి వీసాలు మంజూరు చేయడాన్ని ప్రశ్నించింది. మరోవైపు, అమెరికా తీరుకు నిరసనగా భారత్ తీసుకున్న చర్యల్లో భాగంగా.. అమెరికా దౌత్యాధికారులు, వారి కుటుంబాలు గురువారం రాత్రి నుంచి ఇక్కడి విమానాశ్రయాల్లో ప్రత్యేక సౌకర్యాలు పొందడం కుదరదు. డిసెంబర్ 23లోగా తమ దగ్గర పనిచేసే భారతీయుల పూర్తి వివరాలు అందించాలని అమెరికా దౌత్యాధికారులను భారత్ ఆదేశించింది. కాగా, తన కూతురిపై వేసిన కేసులను ఉపసంహరించుకోని పక్షంలో నిరాహారదీక్ష చేస్తానని దేవయాని తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే హెచ్చరించారు. ప్రీత్ భరార వ్యాఖ్యలు భారత న్యాయవ్యవస్థను కించపరిచేలా ఉన్నాయన్నారు. మా అక్కను మోసం చేసింది: దేవయాని సోదరి శర్మిష్ట పనిమనిషి సంగీతను తన అక్క సొంత మనిషిలా చూసుకుందని దౌత్యవేత్త దేవయాని సోదరి శర్మిష్ట ఖోబ్రగడే గురువారం ఫేస్బుక్ పోస్ట్‌లో వెల్లడించింది. దేవయాని శ్రమ దోపిడీకి పాల్పడిందంటూ సామాజిక అనుసంధాన వెబ్సైట్లలో వ్యాఖ్యలు, ఆమెకు అభ్యంతరకర మెయిళ్లు వస్తున్నందుకే ఈ వివరణ ఇస్తున్నట్టు చెప్పింది. నిజానికి ఎలాగైనా అమెరికాలో స్థిరపడాలనే దుర్బుద్ధితో సంగీతే తన అక్కను మోసగించిందని, తన అక్కకు భారతీయులంతా మద్దతుగా నిలవాలని కోరింది. సంగీతకు అక్క ఒక మొబైల్ ఫోన్‌తో పాటు ఐపాడ్ కూడా కొనిపెట్టింది. జీతమే కాకుండా అడిగినప్పుడల్లా డబ్బులిచ్చేది. అక్క పిల్లలిద్దరూ స్కూలు వెళ్తారు కాబట్టి వారిని సంగీత నిత్యం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. వీక్లీ ఆఫ్‌లు, సెలవులు కూడా తీసుకునేది. ఏ లెక్కన చూసినా ఆమె రోజుకు 8 గంటలకు మించి పని చేసిందే లేదు. అన్నీ లెక్కగడితే ఆమెకు అమెరికా చట్టాలు చెబుతున్న గంటకు 9 డాలర్ల కంటే ఎక్కువే ముట్టింది’ అని వివరించింది. అమెరికా క్షమాపణ చెప్పాలి హైదరాబాద్, న్యూస్‌లైన్: అమెరికాలో భారత దౌత్యాధికారి దేవయాని పట్ల అవమానకరంగా ప్రవర్తించిన అమెరికా ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని సీపీఐ డిమాండ్చేసింది. లేకుంటే భారత ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించింది. గురువారం హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించారు. -
దేవయానికి మర్యాద చేశాం.. కాఫీ కూడా ఇచ్చాం!!
అమెరికాలోని భారత దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగాదేను అసలు ఏమాత్రం అవమానించలేదట. పైపెచ్చు ఆమెకు కాఫీ కూడా ఇచ్చారట, సొంత కారులో కాసేపు ఫోన్లు మాట్లాడుకోడానికి అనుమతించారట!! ఇవన్నీ చెబుతున్నది ఎవరో కాదు. అమెరికాలోని భారత సంతతి అటార్నీ ప్రీత్ బరారా. అమెరికాలో అసలు దేవయానికి అవమానమే జరగలేదని, అంతా చట్టప్రకారమే చేశామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ మేరకు వెయ్యి పదాలతో కూడిన ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. అసలు దేవయానికి సంకెళ్లు వేయలేదని, మర్యాద చేశామని అన్నారు. ఆమె ఇంట్లో పనిమనిషి సంగీతా రిచర్డ్ కుటుంబాన్ని భారత్ నుంచి తరిమేశారని, ఆమెను నోరు తెరవకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, బలవంతంగా సంగీతను భారత్ రప్పించాలని చూస్తున్నారని చెప్పుకొచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ ఏజెంట్లు దేవయానిని అరెస్టుచేసిన మాట నిజమే గానీ, ఆమెకు మాత్రం సంకెళ్లు వేయలేదని బరారా చెప్పారు. ఓ మహిళా డిప్యూటీ మార్షల్ ప్రత్యేకమైన గదిలో దేవయానీ ఖోబ్రగాదేను 'పూర్తిగా' గాలించారని, ధనవంతులైనా, పేదలైనా, అమెరికన్లయినా, కాకపోయినా అందరికీ ఆ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. ఆమెకు తాము కాఫీకూడా ఇచ్చామని, తన పిల్లవాడి సంరక్షణ చూసుకోడానికి ఫోన్ కాల్స్ చేసుకోడానికి కూడా అనుమతించామని చాలా గొప్ప పని చేసినట్లు చెప్పారు. బయట బాగా చల్లగా ఉన్నందున కారులో కూర్చునే ఫోన్లు చేసుకోడానికి అనుమతించామన్నారు. పౌరహక్కులు, చట్టాన్ని చూసుకోవాల్సిన బాధ్యత అమెరికా న్యాయవాదులదా లేక భారత ప్రభుత్వం, ఆ దేశ దౌత్యవేత్తలదా అని ఆయన ప్రశ్నించారు. చట్టాన్ని పరిరక్షించడం, బాధితులను కాపాడటం, చట్టాన్ని ఉల్లంఘించినవారు ఎవరైనా సరే వారిని బాధ్యులుగా చేయడం, వాళ్ల సామాజిక హోదా ఏదైనా సరే, వాళ్లు ఎంత ధనవంతులైనా, శక్తిమంతులైనా సరే ఒకే న్యాయాన్ని అమలుచేయడమే తమ బాధ్యత అని ప్రీత్ బరారా గొప్పగా చెప్పుకొన్నారు. సంగీతా రిచర్డ్‌కు పాస్‌పోర్టు కూడా లేనందున ఆమెకు తాత్కాలికంగా చట్టబద్ధమైన హోదా కల్పించి, అమెరికాలోనే ఉండి పనిచేసుకోడానికి అనుమతించినట్లు ఆమె తరఫున వాదిస్తున్న న్యాయవాది డానా సుస్మన్ తెలిపారు. -
అమెరికన్ కాన్సులేట్ వద్ద ఆందోళన
-
అమెరికన్ కాన్సులేట్ వద్ద ఆందోళన
బేగంపేటలోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద వామపక్షాలు, విద్యార్థి సంఘాలు భారీగా ధర్నా చేశాయి. అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయానీ ఖోబ్రగాదేకు జరిగిన అవమానానికి నిరసనగా వీళ్లంతా అక్కడ ధర్నా చేసి, కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే, అలా జరగకుండా ముందుగానే పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాటుచేశారు. కిలోమీటరు దూరం వరకు బారికేడ్లు ఏర్పాటుచేసి చివరకు మీడియాను కూడా అక్కడకు అనుమతించలేదు. పోలీసులను కూడా భారీ సంఖ్యలో మోహరించారు. చుట్టుపక్కల ఉన్న మిగిలిన కార్యాలయాల్లో పనిచేసే సిబ్బందిని కూడా అటువైపు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులు, వామపక్షాల కార్యకర్తలను అరెస్టు చేసి అక్కడినుంచి తీసుకెళ్లిపోయారు. కాన్సులేట్ కార్యాలయం వద్ద ఎవరినీ అనుమతించబోమంటూ బోర్డు కూడా పెట్టారు. అయినా విద్యార్థులు ఎలాగోలా సమీపం వరకు వెళ్లడానికి విశ్వప్రయత్నాలు చేసి, తీవ్ర స్థాయిలో నినదించారు. ఆందోళనకారులకు మొదటి బ్యారికేడ్ దాటి కార్యాలయం వదరకు వెళ్లడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోలీసులు గట్టిగా అడ్డుకున్నారు. -
దేవయానిపై కుట్ర: కేంద్రం
దౌత్యాధికారి ఉదంతంపై పార్లమెంటులో ప్రకటన అమెరికా చర్య వంచనే; పనిమనిషి కుటుంబానికి వీసాపై మండిపాటు దేవయానిని సగౌరవంగా వెనక్కు తీసుకొస్తాం: ఖుర్షీద్ న్యూఢిల్లీ/వాషింగ్టన్/న్యూయార్క్: మహిళా దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాదె (39)పై అమెరికాలో పెద్ద కుట్ర జరిగిందని భారత్ ఆరోపించింది. సరైన వేతనాలివ్వడం లేదంటూ పనిమనిషి చేసిన ఆరోపణల ఆధారంగా ఆమెను గత గురువారం న్యూయార్క్‌లో నడిరోడ్డుపై సంకెళ్లు వేసి మరీ అరెస్టు చేయడం, తనకు దౌత్యపరమైన రక్షణ ఉందని పదేపదే చెబుతున్నా వినకుండా అమానుషంగా బట్టలు విప్పి, ఒళ్లంతా తడిమి సోదా చేయడం, సెక్స్ వర్కర్లు, డ్రగ్ స్మగ్లర్లతో పాటు ఖైదులో ఉంచడం తెలిసిందే. ఆ తరువాత 2.5 లక్షల డాలర్ల పూచికత్తుపై ఆమెను విడుదల చేశారు. అరెస్టు మాటున ఆమెకు జరిగిన ఈ ఘోర అవమానం యాదృచ్ఛికమేమీ కాదని కేంద్రం బుధవారం స్పష్టం చేసింది. ‘అక్రమానికి సహకరించాల్సిందిగా కొందరు ఆమెను బలవంతపెట్టారు. అందుకు నిరాకరించడంతో ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులో ఇరికించారు’ అని పేర్కొంది. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ పార్లమెంటు ఉభయ సభల్లో ఈ మేరకు ప్రకటన చేశారు. దేవయాని పూర్తిగా నిర్దోషి అని స్పష్టం చేశారు. అమెరికా చర్య పూర్తిగా అవాంఛనీయమంటూ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను ఆయన వివరించారు. ఇది దేశ పరువు ప్రతిష్టలకు సంబంధించిన విషయమని, దేవయానిని సగౌరవంగా భారత్ తీసుకొస్తామని ఖుర్షీద్ ప్రకటించారు. లేదంటే తాను తిరిగి పార్లమెంటులో అడుగు పెట్టబోనని ప్రకటించారు. ఈ ఉదంతంపై ప్రధాని మన్మోహన్సింగ్ తొలిసారి స్పందించారు. మహిళా దౌత్యవేత్తకు ఇలా బేడీలు వేయడం, శోధన పేరుతో ఘోరంగా అవమానించడం గర్హనీయమంటూ తప్పుబట్టారు. ‘స్పష్టమైన, ధృడమైన మా సందేశాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నా’ అని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక అమెరికా దాష్టీకానికి ప్రతిచర్యగా భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయానికి భద్రత తగ్గింపు సహా తాము చేపట్టిన చర్యలన్నీ సబబేనని కేంద్రం స్పష్టం చేసింది. మరోవైపు పనిమనిషి సంగీతా రిచర్డ్స్ కుటుంబానికి దేవయానికి అరెస్టుకు సరిగ్గా రెండు రోజుల ముందు డిసెంబర్ 10న అమెరికా వీసా జారీ చేసి మరీ న్యూయార్క్‌కు రప్పించుకోవడాన్ని భారత్ తీవ్రంగా ఆక్షేపించింది. తద్వారా అమెరికా మోసానికి, తీవ్ర వంచనకు పాల్పడిందంటూ ఆరోపణలు చేసింది. దేవయానికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేలా ఒప్పించి అమెరికా వారిని న్యూయార్క్‌కు రప్పించుకుందంటూ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు మండిపడుతున్నారు. దేవయానికి పూర్తిస్థాయి దౌత్యపరమైన రక్షణ కల్పించేందుకు వీలుగా ఆమెను బుధవారమే న్యూయార్క్‌లోని భారత ఐరాస శాశ్వత మిషన్ కార్యాలయానికి బదిలీ చేశారు. విచారం వ్యక్తం చేసిన అమెరికా.. వాషింగ్టన్: భారత దౌత్యవేత్త దేవయానిని దుస్తులు తొలగించి మరీ తనిఖీ చేయడంపై అమెరికా విచారం వ్యక్తం చేసింది. ఆ దేశ విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ భారత జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్‌తో బుధవారం అర్ధరాత్రి ఫోన్లో మాట్లాడారు. జరిగినదానికి విచారం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. ఈ ఘటన ఇరుదేశాల సంబంధాలపై ప్రభావం చూపదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు దేవయాని అంశంలో విచారం వ్యక్తం చేస్తూ.. అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ కూడా ప్రకటన విడుదల చేసింది. ఏడ్చి, మొత్తుకున్నా వినలేదు! ప్రధాన కార్యాలయానికి పంపిన ఈమెయిల్లో దేవయాని న్యూఢిల్లీ: నడివీధిలో బేడీలు వేసి తీసుకువెళ్లడం, విచారణ పేరుతో దారుణమైన చర్యలకు పాల్పడటాన్ని మహిళా దౌత్యవేత్త దేవయాని మర్చిపోలేకపోతోంది. అక్కడి అధికారులు అత్యంత హేయంగా వ్యవహరిస్తున్న సందర్భంలో చాలాసార్లు కన్నీళ్ల పర్యంతమయ్యాయని ఇక్కడి తమ ప్రధాన కార్యాలయానికి పంపిన ఈ మెయిల్లో ఆమె తెలిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆ మెయిల్లో ‘నాకు దౌత్యపరమైన రక్షణ ఉంటుందని వారికి చాలాసార్లు చెప్పాను. గట్టిగా వాదించాను. అయినా, మళ్లీమళ్లీ తనిఖీల పేరుతో వేధించారు. బేడీలు వేయడం, దుస్తులు విప్పించి, ఆసాంతం తడుముతూ తనిఖీ చేయడం దుర్భర వేదనకు గురిచేసింది. ఆ సమయంలో చాలాసార్లు ఏడ్చాను. సాధారణ నేరస్తులు, స్మగ్లర్లు, డ్రగ్స్ వ్యసనపరులతో కలిపి ఖైదు చేయడం భరించలేకపోయాను. నా దౌత్య రక్షణ గురించి ఎంత మొత్తుకున్నా వారు పట్టించుకోలేదు. ఆ తరువాత ధైర్యం కూడదీసుకున్నాను. నా సహచరులను, నా దేశాన్ని గుర్తుచేసుకున్నాను. వారి ప్రతనిధిగా నిర్భయంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నాను. నాకు, నా పిల్లలకు భద్రత కల్పించడంతో పాటు, దేశ దౌత్యవ్యవస్థ గౌరవాన్ని కాపాడాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాను’ అని ఆమె పేర్కొన్నారు.ట -
దేవయాని తప్పేంటి.. పనిమనిషి జీతం 2.80 లక్షలా?
దేవయానీ ఖోబ్రగాదే నిజంగా తప్పు చేశారా? వీసా పత్రాలలో పనిమనిషికి ఒక జీతం ఇస్తున్నట్లు చూపించి వాస్తవంగా ఆమెకు అంతకంటే తక్కువ ఇచ్చారా? సరిగ్గా ఇవే ఆరోపణలతో అమెరికన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. కానీ వాస్తవానికి జరిగిందేంటో తెలుసా? ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయాని అమెరికాలోని భారత కాన్సులేట్‌లో సహాయ అధికారిగా పనిచేస్తున్నారు. ఆమెకు వచ్చే జీతం భారతీయ కరెన్సీలో సుమారు 4 లక్షల రూపాయలు. తన ఇంట్లో పనులు చూసుకోడానికి ఆయాగా నియమించుకున్న మహిళకు ఆమె ఇవ్వాల్సిన జీతం అమెరికన్ నిబంధనల ప్రకారం అయితే అక్షరాలా 2.80 లక్షల రూపాయలు!! అంటే దాదాపు మూడొంతుల జీతాన్ని ఆమె తన పనిమనిషికే ఇచ్చేయాలి. అలా ఇచ్చేస్తే ఇక ఆమె దైనందిన జీవితానికి మిగిలేది ఏమీ ఉండదు. అందుకే దాదాపుగా అమెరికాలో ఉండేవాళ్లు ఎవరైనా సరే పనిమనుషుల విషయంలో అగ్రిమెంటులో చూపించే అంకె ఒకటైతే వాస్తవంగా ఇచ్చేది వేరే ఉంటుంది. ఇది అక్కడ సర్వ సాధారణం కూడా. కానీ, దేవయాని ఇంట్లో పనిమనిషిగా వెళ్లిన మహిళ తనకు డబ్బులు సరిపోవడం లేదని, వారాంతపు సెలవుల్లో వేరే ఉద్యోగం చేసుకుంటానని చెప్పింది. అందుకు వీసా నిబంధనలు అంగీకరించవని, ఇబ్బంది అవుతుందని దేవయాని చెప్పగా, ఆమె చెప్పా పెట్టకుండా ఇంటినుంచి వెళ్లిపోయి, నేరుగా న్యాయవాదులను సంప్రదించి కేసు పెట్టింది. అయితే అప్పటికే ఆమె వ్యవహార శైలితో విసిగిపోయిన దేవయాని, ఢిల్లీలో ఆమెపై కేసు పెట్టగా.. అధికారులు సదరు పనిమనిషిని వెనక్కి వచ్చేయాల్సిందిగా ఆదేశించారు. ఢిల్లీ వెళ్తే తనను అరెస్టు చేస్తారన్న భయంతో ఆమె అమెరికాలోనే ఉండిపోయింది. దాంతో దేవయానికి చిక్కులు వచ్చిపడ్డాయి. అయితే.. భారత దౌత్యవేత్తలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం అగ్ర రాజ్యానికి కొత్తకాదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నప్పటికీ.. నీచంగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటేనని, ఇలాంటి తనిఖీలతో అమెరికా ఉద్దేశపూర్వకంగా భారత్‌పై దాడి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2010లో అమెరికాలో భారత రాయబారిగా ఉన్న మీరా శంకర్ విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దౌత్య పర్యటనకు సంబంధించి ఆమె మిసిస్సిపీ వెళ్లినప్పుడు.. జాక్సన్ ఎవర్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత సిబ్బంది ఆమెను భద్రత గీత దాటి బయటకు రమ్మని సూచించారు. ఆమె వచ్చాక ఓ భద్రత సిబ్బంది ఆమె ఒళ్లంతా తడుముతూ తనిఖీ చేశారు. తనకు దౌత్య హోదా ఉందని చెప్పినప్పటికీ వినకుండా బహిరంగంగా అవమానించారు. మరో ఘటనలో.. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హర్దీప్ పూరీని కూడా ఒళ్లంతా తడుముతూ తనిఖీలు చేశారు. ఆయన్ను ఓ ప్రత్యేక గదిలోనికి తీసుకెళ్లి.. తలపాగాను సైతం తెరవాల్సిందిగా కోరారు. దానికి ఆయన నిరాకరించారని సమాచారం. -
పెద్దన్నకు బుద్ధోచ్చేలా,.
-
పెద్దన్నకు బుద్ధోచ్చేలా,.
దౌత్యాధికారికి అవమానంపై భారత్ ఆగ్రహం ప్రతిచర్యలకు దిగిన కేంద్ర ప్రభుత్వం అమెరికా దౌత్యాధికారుల ‘మర్యాద’ తగ్గింపు.. {పత్యేక గుర్తింపు కార్డుల ఉపసంహరణ ఎయిర్పోర్ట్ పాస్లూ వెనక్కి... ఢిల్లీలో అమెరికా రాయబార కార్యాలయం వద్ద భద్రత కుదింపు.. బారికేడ్లను బుల్డోజర్లతో తొలగించిన పోలీసులు అమెరికా దౌత్యాధికారుల ఇళ్లలో పని మనుషుల వివరాల సేకరణ.. అమెరికా ప్రతినిధి బృందంతో భేటీలు రద్దు చేసుకున్న నేతలు.. న్యూఢిల్లీ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: అమెరికాలో భారత దౌత్యాధికారిణి దేవయాని ఖోబ్రాగాదేకు జరిగిన అవమానం దేశాన్ని కుదిపేసింది. మహిళ.. అందులోనూ దౌత్యవేత్త.. అయినప్పటికీ బహిరంగంగా బేడీలు వేసి అరెస్టు చేయడమే కాక.. దుస్తులు విప్పి తనిఖీలు చేసిన ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. అటు ప్రభుత్వ, ప్రతిపక్షాలు కూడా పార్టీలకతీతంగా ఒక్కతాటిపైకి వచ్చి అగ్రరాజ్యానికి బుద్ధి చెప్పాలని నిర్ణయించాయి. మీ దేశంలో మాకు గౌరవం ఇవ్వకపోతే.. మా దేశంలో మీకూ గౌరవమిచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. భారత్‌లో అమెరికా దౌత్యవేత్తలు, వారి కుటుంబాలకిచ్చే ‘మర్యాద’ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశంలో పర్యటిస్తున్న అమెరికా ప్రతినిధి బృందంతో సమావేశమవడానికి నిరాకరించడం ద్వారా అటు ప్రభుత్వ, ఇటు విపక్ష నాయకులు.. అగ్రరాజ్యానికి తమ అసంతృప్తిని వ్యక్తంచేశారు. అగ్రరాజ్యం కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే.. చూస్తూ ఊరుకోమని గట్టి సందేశం పంపారు. మర్యాద తగ్గించారు.. మన దేశంలో పనిచేస్తున్న అమెరికా దౌత్య కార్యాలయ అధికారులు, సిబ్బందికి, వారి కుటుంబాలకు సాధారణంగా లభించే గౌరవ స్థాయిని తగ్గించాలని, అగ్రరాజ్యంలో వారు మన కాన్సులేట్లలో సిబ్బందికి కల్పించే స్థాయి మాత్రమే వారికి కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని తక్షణం అమలు చేస్తూ మంగళవారం చర్యలు చేపట్టింది. ఈ మేరకు వారికిచ్చిన ప్రత్యేక గుర్తింపు కార్డులను వెనక్కి ఇచ్చేయాలని భారత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. ఫలితంగా దౌత్యకార్యాలయ అధికారులు, వారి కుటుంబ సభ్యులకు దక్కుతున్న ‘దౌత్య మర్యాదలు’ ఇక మీదట పొందడానికి అవకాశం ఉండదు. అలాగే ఎయిర్పోర్ట్పాస్లతోపాటు వారికి కల్పిస్తున్న పలు సదుపాయాలనూ ఒక్కసారిగా ఉపసంహరించుకుంది. అమెరికా రాయబార కార్యలయానికి మద్యంతోపాటు పలు దిగుమతులకు సంబంధించి ఉన్న అనుమతులను కూడా నిలిపివేసింది. ఢిల్లీలోని అమెరికా ఎంబసీ(దౌత్య కార్యాలయం)కి కల్పిస్తున్న భద్రతను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ పోలీసు శాఖకు హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఫలితంగా ఎంబసీ వద్ద ఉన్న బారికేడ్లను పోలీసులు మంగళవారం బుల్డోజర్లు ఉపయోగించి మరీ తొలగించారు. కేవలం అక్కడ ఇప్పుడు పోలీస్ పికెట్ మాత్రమే మిగిల్చారు. రాయబార కార్యాలయం చుట్టుపక్కల ప్రజలు సంచరించకుండా, అటువైపుగా వాహనాలు రాకుండా ఇంతవరకు ఈ బారికేడ్లు అడ్డుగా ఉండేవి. భారత్‌లో పని మనుషుల సంగతేమిటి? దేవయాని ఖోబ్రాగాదే(39) భారత్ నుంచి పని మనిషిని అమెరికా తీసుకెళ్లడానికి వీలుగా తప్పుడు సమాచారం ఇచ్చి వీసా సంపాదించారని ఆరోపిస్తూ ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికాను మరింత ఇరుకున పెట్టేందుకు వీలుగా.. భారత్‌లో పనిచేస్తున్న అమెరికా దౌత్య అధికారుల ఇళ్లలో ఉన్న పని మనుషులకు ఎంత జీతాలు ఇస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం ఆరా తీస్తోంది. కనీస వేతన చట్టానికి లోబడి జీతాలు చెల్లిస్తున్నారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించడానికి వీలుగా అన్ని వివరాలు ఇవ్వాలని దౌత్య అధికారులను కోరింది. ఇక్కడి అమెరికా స్కూళ్లలో పనిచేస్తున్న సిబ్బంది జీత భత్యాల వివరాలనూ సేకరిస్తోంది. వారి బ్యాంకు ఖాతాలనూ పరిశీలించనుంది. జీత భత్యాల చెల్లింపుతో పాటు మరే విషయంలో అయినా నిబంధనలను ఉల్లంఘించారా? అనే విషయాలను కేంద్రం పరిశీలిస్తోంది. నిబంధనలను ఉల్లంఘించారని తేలితే.. బాధ్యుల మీద కేసులు పెట్టాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీలు రద్దు చేసుకున్న నేతలు.. అమెరికా చర్యపై భారత జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్ మండిపడ్డారు. ఇది నీచమైన, అనాగరికమైన చర్య అని విమర్శించారు. ఆ వెంటనే పార్టీలకతీతంగా రాజకీయ ప్రముఖులందరూ అమెరికాపై విమర్శల వర్షం కురిపించారు. మన దౌత్య అధికారిణిని అవమానించినందుకు నిరసనగా.. అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీలను లోక్‌సభ స్పీకర్ మీరా కుమార్, హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ తదితరులు రద్దు చేసుకున్నారు. అమెరికా ప్రతినిధి బృందాలతో భేటీ రద్దు చేసుకున్న వారిలో గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కూడా ఉన్నారు. అమెరికాలో భారత మహిళకు జరిగిన అవమానానికి నిరసనగానే అమెరికా బృందంతో భేటీకి తిరస్కరిస్తున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధి బృందంలో జార్జి హోల్డింగ్(రిపబ్లికన్-నార్త్ కరోలినా), పెటె ఓస్లాన్(రిపబ్లికన్-టెక్సాస్), డేవిడ్ ష్వైకర్ట్(రిపబ్లికన్-అరిజోనా), రాబర్ట్ వూడాల్(రిపబ్లికన్-జార్జియా), మడెలైనా బోర్డాలో(డెమొక్రాట్-గువామ్) ఉన్నారు. విదేశాంగ, హోం మంత్రులతో దేవయాని తండ్రి భేటీ దేవయాని తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే మంగళవారమిక్కడ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, హోం మత్రి సుశీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. దేవయాని అరెస్టును ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుందని, తగిన విధంగా చర్యలు తీసుకుంటోందని ఖుర్షీద్.. ఉత్తమ్‌కు తెలిపారు. ‘‘సంఘటనకు సంబంధించిన వివరాలన్నీ ఆయన నాకు తెలిపారు. వెంటనే నేను సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలకు ఆదేశించాను. ఆమెకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తాం’’ అని సుశీల్ కుమార్ షిండే విలేకరులతో అన్నారు. అనంతరం ఉత్తమ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘నా కూతురుపై మోపిన అభియోగాలను తొలగించేలా చూస్తామని హోం మంత్రి హామీ ఇచ్చారు. తను ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నందున తనకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని చెప్పారు’’ అని వెల్లడించారు. అంతకుముందు ఆయన మరోచోట విలేకరులతో మాట్లాడుతూ.. అరెస్టు చేసినా దేవయానిని గౌరవంగా చూడాల్సి ఉందని, కానీ రెండు దేశాల మధ్య యుద్ధంలో తన బిడ్డను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయంలో యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కలుగజేసుకుని తన కుమార్తెను వెనక్కు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దీనికిముందు విదేశాంగ కార్యదర్శి సుజాతా సింగ్.. అమెరికా రాయబారి నాన్సీ పావెల్‌ను పిలిచి మాట్లాడారు. ఈ విషయంలో భారత ఆగ్రహాన్ని తెలియజేశారు. ఆ ‘గే’లను అరెస్టు చేయండి స్వలింగ సంపర్కం నేరమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అమెరికా దౌత్యాధికారుల వెంట వచ్చిన స్వలింగ సంపర్కులను(గే) వెంటనే అరెస్టు చేయాలి. చాలా మంది దౌత్యాధికారులతోపాటు వారి ‘సహధర్మచారు’లకు కూడా మనం వీసాలు ఇచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అమెరికాలో తక్కువ వేతనం ఇవ్వడం ఎలా నేరమో.. ఇక్కడ స్వలింగ సంపర్కం కూడా అలాగే నేరం కాబట్టి.. వారందరికీ ఇచ్చిన వీసాలను రద్దు చేసి వారిని శిక్షించండి. - యశ్వంత్ సిన్హా, బీజేపీ నేత, విదేశాంగ శాఖ మాజీ మంత్రి బేషరతు క్షమాపణ చెప్పాల్సిందే దేవయానికి జరిగిన అవమానానికి అమెరికా భారత్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. ప్రపంచం మారిందని అమెరికాకు తెలిసొచ్చేలా చేయడానికి మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంది. భారత్ చిన్నాచితకా దేశంగా చూస్తే సహించం. ఈ విషయాన్ని అమెరికా గ్రహించాలి. ఇతర దేశాల గౌరవ మర్యాదలను కూడా అమెరికా గుర్తించాలి. - కమల్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కుక్క కాటుకు చెప్పుదెబ్బ కొట్టాల్సిందే.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్లు అమెరికాకు తగని విధంగా బుద్ధి చెప్పాల్సిందే. దేవయానిని అవమానించినట్లుగానే అమెరికా దౌత్యాధికారులను కూడా బట్టలు విప్పి తనిఖీ చేయాల్సిందే. ఇంత జరుగుతున్నా.. విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్.. అమెరికా ప్రతినిధి బృందాన్ని కలవడం దారుణం. దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని అమెరికాకు గట్టి సందేశం పంపాలి. దీనిపై చర్చించాల్సిందిగా నేను రాజ్యసభలో నోటీసు ఇచ్చినప్పటికీ.. లోక్‌పాల్ ఉన్నందువల్ల చర్చకు రాలేదు. బుధవారం మళ్లీ నోటీసు ఇస్తాను. - కె.సి.త్యాగి, జేడీయూ ఎంపీ నిబంధనల ప్రకారమే నడుచుకున్నాం: అమెరికా వాషింగ్టన్: దేవయానిని దుస్తుల విప్పి తనిఖీలు చేసింది నిజమేనని, అయితే తమ నిబంధనల ప్రకారమే పోలీసులు నడుచుకున్నారని విదేశాంగ శాఖ ఉప ప్రతినిధి మేరీ హార్ఫ్ సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆమె మీద ఆరోపణలు ఉన్నందున.. ఆమెకు దౌత్యపరమైన రక్షణ పూర్తిగా లభించదని పేర్కొన్నారు. ‘‘అరెస్టు చేసిన తర్వాత తదుపరి చర్యల నిమిత్తం ఆమెను అమెరికా మార్షల్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ ఏం జరిగిందన్న దానిపై ప్రశ్నలు వేయాలంటే మీరు వారినే సంప్రదించాలి.. మమ్మల్ని కాదు’’ అని విలేకరుల ప్రశ్నలకు ఆమె సమాధానంగా చెప్పారు. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, జాతీయ భద్రత సలహాదారు శివశంకర్ మీనన్‌లు.. అమెరికా ప్రతినిధి బృందంతో భేటీలను రద్దుచేసుకోవడంపై ప్రశ్నించగా.. ఆ వివరాలు తనకు తెలియవని, ఏమైనా అడగాలంటే ఆ ప్రతినిధి బృందాన్నే అడగాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె దౌత్యపరమైన రక్షణకు, వాణిజ్య దౌత్యపరమైన రక్షణకు తేడా ఉందని చెప్పారు. అవమానించడం కొత్తకాదు.. న్యూఢిల్లీ: భారత దౌత్యవేత్తలను ఉద్దేశపూర్వకంగా అవమానించడం అగ్ర రాజ్యానికి కొత్తకాదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నప్పటికీ.. నీచంగా ప్రవర్తించడం ఆ దేశానికి అలవాటేనని, ఇలాంటి తనిఖీలతో అమెరికా ఉద్దేశపూర్వకంగా భారత్‌పై దాడి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు. 2010లో అమెరికాలో భారత రాయబారిగా ఉన్న మీరా శంకర్ విషయంలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. దౌత్య పర్యటనకు సంబంధించి ఆమె మిసిస్సిపీ వెళ్లినప్పుడు.. జాక్సన్ ఎవర్స్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత సిబ్బంది ఆమెను భద్రత గీత దాటి బయటకు రమ్మని సూచించారు. ఆమె వచ్చాక ఓ భద్రత సిబ్బంది ఆమె ఒళ్లంతా తడుముతూ తనిఖీ చేశారు. తనకు దౌత్య హోదా ఉందని చెప్పినప్పటికీ వినకుండా బహిరంగంగా అవమానించారు. మరో ఘటనలో.. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి హర్దీప్ పూరీని కూడా ఒళ్లంతా తడుముతూ తనిఖీలు చేశారు. ఆయన్ను ఓ ప్రత్యేక గదిలోనికి తీసుకెళ్లి.. తలపాగాను సైతం తెరవాల్సిందిగా కోరారు. దానికి ఆయన నిరాకరించారని సమాచారం. అయితే ఇదే అంశంపై హర్దీప్ను ప్రశ్నిస్తే.. అలాంటిదేమీ జరగలేదని అప్పట్లో ఆయన చెప్పారు. క్షమాపణ చెప్పాల్సిందే: కమల్‌నాథ్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి దేవయానికి జరిగిన అవమానానికి అమెరికా భారత్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సిందే. భారత్‌ను చిన్నాచితకా దేశంగా చూస్తే సహించం. ఇతర దేశాల గౌరవ మర్యాదలను కూడా అమెరికా గుర్తించాలి. -
దీటుగా స్పందిస్తున్న భారత్
వీసా కేసులో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదేను అరెస్టు చేయడం పట్ల భారత్ తీవ్రస్థాయిలో స్పందించింది. అగ్రరాజ్యం అమెరికా అడుగులకు ఇన్నాళ్లూ మడుగులు ఒత్తుతూ వస్తున్న భారత్.. తొలిసారిగా జూలు విదిల్చింది. మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేస్తున్న ఆ దేశ దౌత్యవేత్తలు, దౌత్యాధికారులు అందరూ తమ గుర్తింపుకార్డులను భారత విదేశాంగ శాఖకు అప్పగించేయాలని ఆదేశించింది. అంతేకాదు, దేవయాని విషయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడానికి ఢిల్లీ వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కలిసేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరస్కరించారు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ కూడా అమెరికా డెలిగేషన్ను కలిసేందుకు నిరాకరించారు. దాంతోపాటు అమెరికా నుంచి అన్ని రకాల దిగుమతులను భారత్ ఆపేసింది. అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్లకు జారీ చేసిన అన్ని ఎయిర్‌పోర్టు పాస్‌లను భారత్ ఉపసంహరించుకుంది. అమెరికన్ రాయబార కార్యాలయం వెలుపల భద్రత కోసం ఏర్పాటుచేసిన బారికేడ్లను తొలగించాల్సిందిగా ఢిల్లీ పోలీసులను కోరింది. వాళ్లు ఎలా వ్యవహరిస్తే తామూ అలాగే ఉంటామని, చెప్పుదెబ్బకు అదే స్థాయిలో సమాధానం ఇస్తామని మన దౌత్యవర్గాలు ఆవేశంగా వ్యాఖ్యానించాయి. కాగా, దేవయాని పట్ల అమెరికా చాలా నీచంగా వ్యవహరిస్తోంది. డ్రగ్స్‌కు అలవాటుపడినవారిని ఉంచే జైలు గదిలో ఆమెను ఉంచారు. దీనిపై భారత్ అమెరికాకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ప్రవాస భారతీయుల శాఖ మంత్రి వయ్లార్ రవి మండిపడ్డారు. అయితే, అమెరికా మాత్రం ఖోబ్రగాదే తన పనిమనిషికి గంటకు కేవలం మూడు డాలర్లు మాత్రమే చెల్లిస్తున్నారని, అది కనీస వేతనాల కంటే చాలా తక్కువని అంటున్నారు. వాళ్లు చెబుతున్న విషయాలు తమకు సమ్మతం కాదని భారత విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ అన్నారు. ఈ సమస్యను వీలైనంత మర్యాదపూర్వకంగా పరిష్కరించుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమెరికన్ కాన్సులేట్లలో భారతీయ సిబ్బందికి ఎంత వేతనం చెల్లిస్తున్నారు, అలాగే అమెరికన్ అధికారులు తమ ఇళ్లలో పనిచేసేవాళ్లకు ఎంత జీతం ఇస్తున్నారనే విషయాలను కూడా భారత్ కూపీ లాగుతోంది. అమెరికన్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వీసా వివరాలు, వాళ్ల బ్యాంకు ఖాతాలు, జీతాల వివరాలు కూడా తెలుసుకుంటోంది. అమెరికన్ ఎంబసీలకు దిగుమతి క్లియరెన్సులను స్తంభింపజేశారు. ఇవి ఆరంభం మాత్రమేనని, దేవయాని విషయంలో సరిగా వ్యవహరించకపోతే మరిన్ని కఠిన చర్యలు ఎదురవుతాయని దౌత్యాధికారులు చెబుతున్నారు. -
'నా కూతుర్ని బలిపశువును చేశారు'
న్యూఢిల్లీ: తన కూతురు దేవయాని ఖోబ్రాగాదేను అరెస్టు చేసి బలిపశువును చేశారని ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రాగాదే ఆవేదన వ్యక్తం చేశారు. పని మనిషి వీసాలో తప్పుడు సమాచారాన్ని క్రోఢీకరించారనే అంశంపై అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మంగళవారం మీడియాతో మాట్లాడిన తండ్రి ఉత్తమ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో భారత ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకుని కూతుర్ని వెనక్కు తీసుకురావడానికి సహకరించాలన్నారు. ఇది ఇరు దేశాలకు సంబంధించిన రాజకీయ అంశంలో తన కూతురు బలి పశువు అయ్యిందన్నారు. తన కూతురు అమాయకురాలని, ఆమె అరెస్టు చేయడం వెనుక ఏదో కుట్ర జరిగిందని మీడియా ముందు వాపోయారు. ఆమెను అరెస్టు చేసిన తీరు మాత్రం తనను ఆవేదనకు గురి చేసిందన్నారు. భారత దౌత్తవేత్తగా సేవలందిస్తున్న ఆమెను అరెస్టు చేసినా, తగిన గౌరవం ఇచ్చి ఉండాల్సిందని ఆయన తెలిపారు. ఈ ఘటన సోనియా గాంధీ వెంటనే జోక్యం చేసుకుని దేవయానిని తిరిగి భారత్ కు రప్పించాడానికి కృషి చేయాలన్నారు. దీనిపై విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ను కలుస్తానన్నారు. గురువారం తన కుమార్తెను స్కూలు వద్ద దింపేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందరూ చూస్తుండగానే చేతికి సంకెళ్లు వేసి తమ వెంట తీసుకెళ్లారు. అనంతరం మాన్‌హట్టన్ ఫెడరల్ కోర్టులో ఆమెను హాజరు పరచగా న్యాయస్థానం సుమారు రూ. 1.55 కోట్లు పూచీకత్తుపై ఆమెకు బెయిల్ ఇచ్చింది. -
'ఐడీ కార్డులు విదేశాంగశాఖకు ఇచ్చేయండి'
న్యూఢిల్లీ : వీసా అక్రమాల కేసులో అరెస్టయిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదే పట్ల అమెరికా అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడినవారిని ఉంచే జైలు గదిలో ఆమెను ఉంచారు. దీనిపై భారత్ అమెరికారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ప్రవాస భారతీయుల శాఖ మంత్రి వయ్లార్ రవి మండిపడ్డారు. అమెరికా తీరుపై ఆగ్రహంతో ఉన్న భారత్.. దేశంలోని అమెరికా కాన్సులేట్లలో పనిచేస్తున్న ఆ దేశ దౌత్యవేత్తలు, దౌత్యాధికారులంతా తమ గుర్తింపు కార్డులను విదేశాంగశాఖకు సరెండర్ చేయాలని ఆదేశించింది. దేవయాని విషయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడానికి ఢిల్లీ వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కలిసేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరస్కరించారు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ కూడా అమెరికా డెలిగేషన్ను కలిసేందుకు నిరాకరించారు. -
అమెరికాలో దౌత్యవేత్త అరెస్ట్ అవమానకరం: ఖుర్షీద్
ఫర్కుహాబాద్: అమెరికాలో భారత దౌత్యవేత్త పట్ల అమర్యాదగా ప్రవర్తించడాన్ని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తప్పుబట్టారు. డిప్యూటీ కాన్సుల్ జనరల్ దేవయాని ఖోబ్రాగాదేను నడిబజార్లో అరెస్ట్‌చేసి, చేతికి సంకెళ్లు వేయడం అవమానకరమని ఆయన అన్నారు. తాము ఈ ఘటనను చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామని ఖుర్షీద్ ఆదివారమిక్కడ విలేకరులతో పేర్కొన్నారు. దీనిపై అమెరికా స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, దాన్నిబట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. తన ఇంట్లో పనిచేస్తున్న మహిళ వీసా పత్రాల్లో తప్పుడు సమాచారమిచ్చారన్న ఆరోపణలపై 1999 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారిణి అయిన దేవయానిని న్యూయార్క్ పోలీసులు అరెస్ట్‌చేసిన సంగతి తెలిసిందే. -
భారతీయ దౌత్యకార్యాలయ అధికారి అరెస్ట్,విడుదల
వ్యకిగత సహాయకురాలి కోసం వీసా అవకతవకలకు పాల్పడి నిన్న అరెస్ట్ అయిన న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యవేత్త కార్యాలయంలో ఉన్నతాధికారి దేవయాని కొబ్రాగాడె బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ మేరకు మన్‌హట్టన్‌లోని అత్యున్నత ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీతి బరార్ శుక్రవారం వెల్లడించారు. రూ.25 వేల అమెరికన్ డాలర్లు చెల్లించి ఆమె విడుదల అయ్యారని చెప్పారు. స్వదేశం నుంచి వ్యక్తిగత సహాయకురాలుని తీసుకువచ్చే క్రమంలో వీసా కోసం పలు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో దేవయానికిని నిన్న ఉదయం లా ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు. దేవయానిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వాషింగ్టన్‌లోని భారతీయ దౌత్యకార్యాలయం ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి స్పష్టమైన హామీ ఇచ్చింది. న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యకార్యాలయంలో డిప్యూటీ కౌనిల్స్ జనరల్‌గా విధులు నిర్వహిస్తున్న దేవయాని రాజకీయ,ఆర్థిక, వాణిజ్య, మహిళ వ్యవహారాల విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.