‘దేవయానికి గడువు పొడిగించలేం’
న్యూయార్క్: దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడేకు అమెరికా కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వీసా కేసులో ప్రాథమిక విచారణ మొదలుపెట్టడానికి ఉన్న గడువును పొడిగించాలంటూ దేవయాని చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. అరెస్టు తర్వాత నిబంధనల ప్రకారం నెలరోజుల లోపు ప్రభుత్వం అభియోగపత్రం దాఖలు చేయాలని, ఆ వెంటనే ప్రాథమిక విచారణ మొదలవుతుందని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ గడువును పెంచేందుకు చట్టం అంగీకరించదని పేర్కొంది. వీసాలో అక్రమాల ఆరోపణలపై దేవయానిని పోలీసులు డిసెంబర్ 12న అవమానకర రీతిలో అరె స్టు చేసిన సంగతి తెలిసిందే. చట్టం ప్రకారం నెలరోజుల్లోపు అంటే జనవరి 13కల్లా కేసులో ప్రాథమిక విచారణ మొదలుపెట్టాల్సి ఉంది.