వ్యకిగత సహాయకురాలి కోసం వీసా అవకతవకలకు పాల్పడి నిన్న అరెస్ట్ అయిన న్యూయార్క్లోని భారతీయ దౌత్యవేత్త కార్యాలయంలో ఉన్నతాధికారి దేవయాని కొబ్రాగాడె బెయిల్పై విడుదల అయ్యారు. ఈ మేరకు మన్హట్టన్లోని అత్యున్నత ఫెడరల్ ప్రాసిక్యూటర్ ప్రీతి బరార్ శుక్రవారం వెల్లడించారు. రూ.25 వేల అమెరికన్ డాలర్లు చెల్లించి ఆమె విడుదల అయ్యారని చెప్పారు.
స్వదేశం నుంచి వ్యక్తిగత సహాయకురాలుని తీసుకువచ్చే క్రమంలో వీసా కోసం పలు తప్పుడు పత్రాలు సమర్పించినట్లు ఆమెపై ఆరోపణలు రుజువు కావడంతో దేవయానికిని నిన్న ఉదయం లా ఎన్ఫోర్స్మెంట్ ఉన్నతాధికారులు అరెస్ట్ చేసినట్లు చెప్పారు.
దేవయానిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వాషింగ్టన్లోని భారతీయ దౌత్యకార్యాలయం ఇప్పటికే అమెరికా ప్రభుత్వానికి స్పష్టమైన హామీ ఇచ్చింది. న్యూయార్క్లోని భారతీయ దౌత్యకార్యాలయంలో డిప్యూటీ కౌనిల్స్ జనరల్గా విధులు నిర్వహిస్తున్న దేవయాని రాజకీయ,ఆర్థిక, వాణిజ్య, మహిళ వ్యవహారాల విభాగాలను పర్యవేక్షిస్తున్నారు.