వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తా: దేవయాని తండ్రి | Retd IAS officer Khobragade to contest LS election | Sakshi
Sakshi News home page

వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీచేస్తా: దేవయాని తండ్రి

Published Wed, Jan 15 2014 4:33 PM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM

వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని దేవయాని ఖోబ్రగడే తండ్రి, సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే స్పష్టం చేశారు.

ముంబై: వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని దేవయాని ఖోబ్రగడే తండ్రి, సీనియర్ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఉత్తమ్ ఖోబ్రగడే స్పష్టం చేశారు.  దేవయాని తండ్రి ఉత్తమ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. తాను రాజకీయాల్లో వస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇందులో కొత్త విషయమేమీ లేదన్నారు. త్వరలో తన రాజకీయ ఆరంగేట్రం జరుగుతుందన్నారు. తప్పకుండా రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పాల్గొంటానన్నారు. కాగా ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారన్న అంశంపై మాత్రం చెప్పడానికి ఆయన నిరాకరించారు. తగిన సమయం చూసుకుని ఏ పార్టీలో చేరతానన్న విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు.

 

అమెరికాలో భారత దౌత్త్యవేత్త గా సేవలందించి పని మనిషి వీసా కేసుకు సంబంధించి ఆరోపణలు రావడంతో ఆమె గత వారం భారత్ కు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం తన కూతురు అమెరికాలో ఉన్న పిల్లల్ని భారత్ కు తీసుకు వచ్చే యత్నాల్లో నిమగ్నమైందన్నారు.  వారు ఫిబ్రవరి నెలలో భారత్ కు వచ్చే అవకాశం ఉందన్నారు. పిల్లల విద్యకు ఆటంకం కల్గకుండా ఉండేందుకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో అడ్మిషన్లు పొందినట్లు తెలిపారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement