న్యూఢిల్లీ : వీసా అక్రమాల కేసులో అరెస్టయిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదే పట్ల అమెరికా అధికారులు అనుచితంగా వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడినవారిని ఉంచే జైలు గదిలో ఆమెను ఉంచారు. దీనిపై భారత్ అమెరికారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెరికా అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని ప్రవాస భారతీయుల శాఖ మంత్రి వయ్‌లార్ రవి మండిపడ్డారు.
అమెరికా తీరుపై ఆగ్రహంతో ఉన్న భారత్.. దేశంలోని అమెరికా కాన్సులేట్లలో పనిచేస్తున్న ఆ దేశ దౌత్యవేత్తలు, దౌత్యాధికారులంతా తమ గుర్తింపు కార్డులను విదేశాంగశాఖకు సరెండర్ చేయాలని ఆదేశించింది. దేవయాని విషయంలో భారత్‌కు సంఘీభావం ప్రకటించడానికి ఢిల్లీ వచ్చిన అమెరికా ప్రతినిధి బృందాన్ని కలిసేందుకు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తిరస్కరించారు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్ధి నరేంద్రమోడీ కూడా అమెరికా డెలిగేషన్‌ను కలిసేందుకు నిరాకరించారు.
'ఐడీ కార్డులు విదేశాంగశాఖకు ఇచ్చేయండి'
Published Tue, Dec 17 2013 1:29 PM | Last Updated on Fri, Aug 24 2018 6:25 PM
Advertisement