
సమీక్ష దశలోనే దేవయాని దరఖాస్తు: అమెరికా
వాషింగ్టన్: వీసా మోసం అభియోగాలను ఎదు ర్కొంటున్న భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడే ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత కార్యాలయానికి చేసుకున్న బదిలీ దరఖాస్తును ఇంకా సమీక్షిస్తున్నట్లు అమెరికా తెలిపింది. అలాగే పూర్తి దౌత్య రక్షణకు సంబంధించిన పత్రాలను జారీ చేసే అంశం కూడా పరిశీలనలో ఉందని పేర్కొంది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువేమీ లేదని...సమీక్ష ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని అమెరికా విదేశాంగశాఖ కార్యదర్శి ఒకరు చెప్పారు. డిసెంబర్ 20న దేవయాని దరఖాస్తు అమెరికా విదేశాంగశాఖకు అందగా ఇప్పటివరకూ ఆ శాఖ ఆ దరఖాస్తుపై నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.