వారికి ద్వంద్వ పౌరసత్వం కుదరదు
న్యూఢిల్లీ: అమెరికా పౌరసత్వమున్న తన కుమార్తెలకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు భారత మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే చేసిన అభ్యర్థనను ఆ శాఖ తిరస్కరించింది. ద్వంద్వ పౌరస్వత్వం తీసుకునేవారికి ఉండాల్సిన నిర్ణీత వయసు వారికి లేదని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు.
2013లో అమెరికాలో భారత ఉప దౌత్యాధికారిగా పనిచేసిన కాలంలో వీసా మోసం ఆరోపణలపై అమెరికా పోలీసులు ఆమెపై నేరాభియోగం మోపిన సంగతి తెలిసిందే. విదేశాల్లో జన్మించిన భారతీయసంతతి వారికి మాత్రమే ద్వంద్వ పౌరసత్వం ఇస్తారని, ఆమె పిల్లలు ముంబైలో జన్మించినందున భారత చట్టాలప్రకారం వారికి ద్వంద్వపౌరసత్వం ఇవ్వడంకుదరదని అధికారి చెప్పారు.