అమిత్‌ షా వరుస రివ్యూలు.. మణిపూర్‌కు అదనపు బలగాలు | Central Home Ministry To Send Additional Troops To Manipur Over Escalating Violence Following Amit Shah Meeting, See More Details | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా వరుస రివ్యూలు.. మణిపూర్‌కు అదనపు బలగాలు

Published Mon, Nov 18 2024 8:50 PM | Last Updated on Tue, Nov 19 2024 9:10 AM

Central Home Ministry To Send Additional Troops To Manipur

న్యూఢిల్లీ:మణిపూర్‌లో ఇటీవల మళ్లీ హింస చెలరేగుతోంది. దీంతో అక్కడి తాజా పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా దేశ రాజధాని ఢిల్లీలో వరుస ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపులోకి తెచ్చేందుకు కేంద్రహోంశాఖ చర్యలు మొదలుపెట్టింది. 

త్వరలో 50 కంపెనీల అదనపు బలగాలను కేంద్రం మణిపూర్‌కు తరలించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.దీనిపై హోం మంత్రిత్వ శాఖలో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా కేంద్ర హోం మంత్రిత్వశాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, మణిపూర్‌లో జాతుల మధ్య వైరం ఇంకా కొనసాగుతూనే ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement