dual citizenship
-
ఇరాన్లో మాజీ అధికారికి ఉరి
దుబాయ్: బ్రిటన్ రహస్య నిఘా సంస్థ ‘ఎం16’కు సమాచారం చేర వేస్తున్నాడనే అనుమానంతో రక్షణ శాఖ మాజీ అధికారి అలీ రెజా అక్బారీని ఉరి తీసినట్లు ఇరాన్ ప్రభుత్వం తెలిపింది. బ్రిటన్–ఇరాన్ ద్వంద్వ పౌరసత్వం ఉన్న అక్బారీ ఇరాన్ రక్షణ శాఖలో కీలకంగా ఉన్న అలీ షంఖానీకి సన్నిహితుడిగా పేరుంది. ఇరాన్ ప్రభుత్వం అక్బారీని 2019లోనే అదుపులోకి తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు. గతంలోనే అక్బారీకి మరణ శిక్ష విధించి, తాజాగా ఆ విషయం బయటపెట్టి ఉంటుందని భావిస్తున్నారు. దేశంలో అంతర్గతంగా ఆధిపత్య పోరు జరుగుతున్నట్లు అర్ధమవుతోందని పరిశీలకులు అంటున్నారు. తాము వద్దంటున్న అక్బారీకి ఇరాన్ ప్రభుత్వం మరణ శిక్ష విధించడంపై బ్రిటన్, అమెరికా మండిపడుతున్నాయి. -
ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా.. తొలి వ్యక్తి మన హైదరాబాదీనే !
Overseas citizenship Of India concept and Its benefits : ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడగరా నీ తల్లి భూమి భారతిని అన్నారు రాయప్రోలు సుబ్బారావు. తాతలు, ముత్తాతల కాలంలో విదేశాల్లో స్థిరపబడినా ఇంకా తమలోని భారతీయను మరిచిపోలేని వారు ఎందరో ఉన్నారు. ఇందులో కొందరు మరోసారి తమ మాతృనేల మీద మమకారంతో ఇక్కడి పౌరసత్వాన్ని ఆశించారు. అయితే అందుకు రాజ్యాంగ చిక్కులు ఎదురయ్యాయి... ఏళ్లు గడిచాయి.. చివరకు ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) తో ప్రవాస భారతీయులకు ఊరట లభించింది. ద్వంద పౌరసత్వ డిమాండ్‌కి మధ్యేమార్గంగా కేంద్రం తెచ్చిన ఓసీఐని అందుకున్న మొదటి ప్రవాసుడు మన హైదరాబాదీ. ఇంకా ఈ పథకం గురించి మరిన్ని వివరాలు మీ కోసం.. డ్యూయల్ సిటిజెన్ షిప్ (ద్వంద్వ పౌరసత్వం) కోసం.. ప్రవాస భారతీయులు (ఇండియన్ డయసపోరా) చాలా కాలంగా కోరుతున్నారు. మరోవైపు భారత రాజ్యాంగం ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించడం లేదు. దీంతో మధ్యేమార్గంగా భారత పౌరసత్వ (సవరణ) చట్టం, 2005 ద్వారా ఓసీఐ పథకాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. కొన్ని నిబంధనలకు లోబడి ఓసీఐ కలిగిన వారు భారత పౌరులతో సమానంగా అనేక హక్కులను పొందవచ్చు. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ నేపథ్యం ఉన్న వారికి మాత్రం అర్హత లేక పోవడం గమనార్హం. అంతకు ముందు పదహారేళ్ల ఏళ్ల క్రితం 2006 జనవరిలో హైదరాబాద్ లో జరిగిన ప్రవాసి భారతీయ దివస్ సదస్సులో ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (విదేశీ పౌరసత్వం కలిగిన భారత ప్రవాసీ) అనే పథకాన్ని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత కాలంలో అప్పటి వరకు జారీ చేస్తూ వచ్చిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పిఐఓ) కార్డులను ఓసీఐ కార్డులుగా విలీనం చేస్తున్నట్లు సెప్టెంబర్ 2014న భారత ప్రభుత్వం ప్రకటించింది. తొలి కార్డు హైదరాబాదీకే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఓవర్సీస్ సిటిజన్ షిప్ ఆఫ్ ఇండియా తొలి కార్డు ఓ హైదరాబాదీకి జారీ అయ్యింది. 2016 జనవరి 7న జరిగిన ఓ కార్యక్రమంలో అప్పటి భారత ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మొట్టమొదటి ఓసీఐ కార్డును హైదరాబాద్ కు చెందిన ఇండియన్-అమెరికన్ ఇఫ్తేఖార్ షరీఫ్ అందజేశారు. ఎవరీ ఇఫ్తేఖార్ షరీఫ్ అమెరికా పౌరసత్వం కలిగిన భారత సంతతి వ్యక్తి అయిన ఇఫ్తేఖార్ షరీఫ్ ప్రముఖ వ్యాపారవేత్త, సామాజిక సేవకులు. అమెరికాలోని చికాగో నివాసిస్తున్నారు. ఆయన పూర్వీకులు హైదరాబాద్ లోని శంషాబాద్‌లో ఉండేవారు. ఆయన బంధువులు ఇక్కడే జీవిస్తున్నారు. ఓసీఐతో ప్రయోజనాలు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా - ఓసీఐ (భారతీయ విదేశీ పౌరుడు) అంటే.. విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయ మూలాలు ఉన్న వ్యక్తి అని అర్థం. ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఉన్న వ్యక్తులకు వారి జీవిత భాగస్వాములకు భారతదేశంలో నిరవధికంగా నివసించడానికి, పని చేయడానికి అనుమతి ఉంటుంది. 'ఓసీఐ' కార్డుదారులు భారతదేశాన్ని ఎన్నిసార్లు అయినా సందర్శించడానికి జీవితకాల వీసా పొందుతారు. ఆర్థిక, విద్యా రంగాలలో ఎన్నారైలతో సమాన అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ భూములు, తోటలు కొనడంపై మాత్రం నిషేధం. వర్తించనవి ఓసీఐ కార్డు కలిగి ఉండటం వలన భారత పౌరసత్వ హోదా రాదు. భారతీయ ఎన్నికలలో ఓటు వేసే హక్కు రాదు. కేవలం నివాసం, పని చేసుకునే హక్కులు ఉంటాయి. కాగా చివరి సారిగా ఓవర్సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా పథకంలో కొన్ని మార్పులను 2021 ఏప్రిల్‌లో చేపట్టారు. ఇవీ అర్హతలు ఓసీఐ కార్డు పొందాలంటే దరఖాస్తుదారులు గాని, వారి తల్లిదండ్రులు గాని, తాతలు గాని, ముత్తాతలు గాని భారతీయులు అనే రుజువులను సమర్పించాలి. అనగా... తాము భారతీయ పూర్వీకుల పిల్లలు, మనుమలు, ముని మనుమలు / మనవరాళ్లు అని నిరూపించుకోవాలి. విదేశీ మిలిటరీలో పనిచేసిన వారు అనర్హులు. ఈ విషయంలో ఇజ్రాయిల్ వారికి మినహాయింపు ఇచ్చారు. 19వ శతాబ్దంలో భారతదేశం నుండి సురినామ్కి వెళ్లి డచ్ జాతీయత పొందినవారికి సంబంధించి ఆరు తరాల వరకు అర్హులుగా పేర్కొన్నారు. ఓసీఐ పొందడం ఇలా ఓసీఐ కార్డు కోసం ociservices.gov.in లో ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి. ఓసీఐ పొందేందుకు అర్హతలు, పాటించాల్సిన నియమాలతో పాటు మరిన్ని వివరాలు https://www.mea.gov.in/overseas-citizenship-of-india-scheme.htm పోర్టల్‌లో లభిస్తాయి. చదవండి:ఫినో బ్యాంకు.. అంతర్జాతీయ మనీ ట్రాన్స్ఫర్ సేవలు -
గ్రీన్‌కార్డ్ హోల్డర్స్పై ట్రంప్ నిషేధ ప్రభావముందా?
వాషింగ్టన్ : ఏడు ఇస్లామిక్ దేశాల నుంచి అమెరికాలోకి వలసలను నిషేధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఆదేశాలను ఎలా అమలు చేయాలో అర్థంకాక ఎయిర్‌పోర్టు అధికారులు, ఏజెన్సీలు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఏడు దేశాలపై విధించిన ఈ నిషేధం గ్రీన్‌కార్డు హోల్డర్స్, ద్వంద్వ పౌరసత్వం ఉన్న వారికి ఎలా వర్తింపచేయాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ సందిగ్థత సమయంలోనే ట్రంప్ కార్యాలయంలోని టాప్ అధికారులు చేస్తున్న వ్యాఖ్యలు మరిన్ని అనుమానాలను జోడిస్తున్నాయి. ట్రంప్ ఆర్డర్లు గ్రీన్‌కార్డు హోల్డర్స్పై ఎలాంటి ప్రభావం చూపదంటూనే, నిషేధించిన ఇరాన్, ఇరాక్, సిరియా, సూడాన్, లిబియా, యెమెన్, సోమాలియా దేశాలకు చెందిన గ్రీన్‌కార్డు హోల్డర్స్పై ఈ ప్రభావం తప్పక ఉంటుందని వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ రైయిన్స్ ప్రీబస్ పేర్కొన్నారు. ఏడు దేశాలకు చెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్‌కు ట్రంప్ ఆదేశాలను అమల్లోకి తెస్తామని మరో సీనియర్ అధికారి చెబుతున్నారు. కానీ అమెరికాకు తిరుగు ప్రయాణమై వచ్చే గ్రీన్ కార్డు హోల్డర్స్‌కు అదనపు స్క్రీనింగ్, ల్యాండింగ్ సమయంలోనే జాతీయ భద్రత తనిఖీలు నిర్వహించి దేశంలోకి అనుమతిస్తామని మరో హోమ్‌లాండ్ సెక్యురిటీ అధికారి చెబుతున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్‌ను పరిగణలోకి తీసుకొని, ట్రంప్ తన ఆర్డర్‌ను పునఃసమీక్షిస్తారని టాప్ జీఓపీ సెనెటరే పేర్కొంటున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్పై ఎవరూ సరియైన క్లారిటీ ఇవ్వడం లేదు. ఏడు ముస్లిం మెజారిటీ దేశాల పౌరులు అమెరికాకు రాకుండా ట్రంప్ సర్కారు తాత్కాలిక నిషేధం విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు తను జారీచేసిన ఆదేశాలపైన తానే ఖండనలు ప్రారంభించారు ట్రంప్. అణచివేతకు గురవుతున్న వారిపై కరుణ చూపుతానని, కానీ తమ దేశంలోని పౌరులు, ఓటర్లనూ రక్షిస్తానని ట్రంప్ ఆదివారం పేర్కొన్నారు. ఇది ముస్లిం నిషేధం కాదంటూ, మీడియానే దీన్ని తప్పుడుగా చిత్రీకరిస్తుందంటూ విమర్శించారు. కానీ ట్రంప్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని అమెరికా మీడియా తెగేసి చెప్పింది. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా? ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి! ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో! వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా 'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం' -
వారికి ద్వంద్వ పౌరసత్వం కుదరదు
న్యూఢిల్లీ: అమెరికా పౌరసత్వమున్న తన కుమార్తెలకు ద్వంద్వ పౌరసత్వం కల్పించాలంటూ కేంద్ర హోంశాఖకు భారత మాజీ దౌత్యవేత్త దేవయాని కోబ్రాగడే చేసిన అభ్యర్థనను ఆ శాఖ తిరస్కరించింది. ద్వంద్వ పౌరస్వత్వం తీసుకునేవారికి ఉండాల్సిన నిర్ణీత వయసు వారికి లేదని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు. 2013లో అమెరికాలో భారత ఉప దౌత్యాధికారిగా పనిచేసిన కాలంలో వీసా మోసం ఆరోపణలపై అమెరికా పోలీసులు ఆమెపై నేరాభియోగం మోపిన సంగతి తెలిసిందే. విదేశాల్లో జన్మించిన భారతీయసంతతి వారికి మాత్రమే ద్వంద్వ పౌరసత్వం ఇస్తారని, ఆమె పిల్లలు ముంబైలో జన్మించినందున భారత చట్టాలప్రకారం వారికి ద్వంద్వపౌరసత్వం ఇవ్వడంకుదరదని అధికారి చెప్పారు. -
ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడు?
ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనికి చారిత్రకంగా అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భానికి గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు. ద్వంద్వ పౌరసత్వం భారత సంతతికి చెంది ఉండి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తరచుగా భారతదేశానికి రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఈ విషయంలో వీరు ఎదుర్కొంటున్న వీసాపరమైన ఇబ్బందులను తగ్గించడం కోసం పౌరసత్వ చట్టానికి 2005 లో కొన్ని మార్పులు చేశారు. ద్వంద్వ పౌరసత్వంలో కొన్ని సదుపాయాలను కల్పించారు. వాటిని కింది విధంగా వివరించవచ్చు. ప్రవాస భారతీయులు (Non Resident Indians- NRIs): విదేశాల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివసిస్తున్న మొదటితరం భారతీయులు. 182 రోజులు భారతదేశం వెలుపల నివసిస్తూ ఉండేవారిని ఎన్.ఆర్.ఐ.లు అంటారు. వీరికి భారత పాస్పోర్ట ఉంటుంది. భారత సంతతికి చెందిన వారు (Personsof Indian Origin - PIOs): విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రెండో తరం భారతీయులు. అంటే విదేశాలకు వెళ్లి, అక్కడ స్థిరపడి ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన తల్లిదండ్రులకు జన్మించిన సంతానం. వీరికి భారత పాస్పోర్ట ఉండదు. ఉదాహరణకు అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికైన బాబి జిందాల్. ఓవర్సీస్ సిటిజన్స ఆఫ్ ఇండియా (KUI) (Overseas Citizens of India): భారత ప్రభుత్వ చట్టం - 1955 ప్రకారం నమోదు చేసుకున్న వ్యక్తులను ఓవర్సీస్ సిటిజన్స ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు. ద్వంద్వ పౌరసత్వం - ఎల్.ఎం. సింఘ్వి కమిటీ సూచనలు ద్వంద్వ పౌరసత్వంలో ఓటింగ్ హక్కులు ఉండవు. అదేవిధంగా ప్రజా పదవులకు అర్హులు కారు. ద్వంద్వ పౌరసత్వంలో ఉండే సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. పీఐఓలకు పీఐవో కార్డులు జారీ చేస్తారు. 2003లో చేసిన పీఐవో చట్టం ప్రకారం కొన్ని సదుపాయాలుంటాయి. ఈ సౌకర్యం అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంకకు వర్తించదు. పీఐవోలకు భారతదేశాన్ని సందర్శించడానికి ప్రత్యేక వీసా అవసరం లేదు. పీఐవో కార్డు జారీ చేసిన తేదీ నుంచి 15 ఏళ్లపాటు ఈ సౌకర్యం ఉంటుంది. ఈ కార్డు పొందడానికి వయోజనులు రూ. 15,000 చెల్లించాలి. ఎన్ఆర్ఐలకు ఉన్న అన్ని సౌకర్యాలు పీఐవోలకు ఉంటాయి. ఓవర్సీస్ సిటిజన్స ఆఫ్ ఇండియా- 2005 ఈ చట్టం ప్రకారం ఇతర దేశాల్లో ఉన్న భారత సంతతికి చెందిన అందరికీ ఓసీఐ హోదాను పొందే అవకాశాన్ని కల్పించారు. చట్టంలోని ముఖ్యాంశాలు: ఈ చట్టం 2005 డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ హోదా ఉన్న వారికి భారతదేశానికి మల్టిపుల్ ఎంట్రీ (Multiple Entry) సౌకర్యం ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక పరిమితి ఉన్న వీసాలు జారీ చేస్తారు. వీరికి కూడా ద్వంద్వ పౌరసత్వ వీసాలు కల్పిస్తారు. ఓసీఐలు భారతదేశంలో పనిచేస్తూ నివాసం ఉండవచ్చు లేదా వారికి సహజ పౌరసత్వం ఉన్న దేశాల్లోనూ పౌరసత్వం ఉండవచ్చు. వీరికి కూడా ఎన్ఆర్ఐలతో సమానమైన ప్రతిపత్తి ఉంటుంది. అయితే రాజకీయ హక్కులుండవు. ఓసీఐ హోదాను పొందడానికి 275 యూఎస్ డాలర్లు చెల్లించాలి. ఓసీఐలుగా రిజిస్టర్ చేసుకున్న ఐదేళ్ల తర్వాత ఒక సంవత్సరం పాటు భారతదేశంలో నివాసం ఉంటే భారత సంపూర్ణ పౌరసత్వానికి అర్హులవుతారు. సరోగసీ పౌరసత్వం (Surrogacy) సరోగసీ అనేది వైద్యశాస్త్ర పరంగా తల్లిదండ్రులు మరో తల్లి ద్వారా సంతానాన్ని పొందడం. సరోగసీ మదర్ కేవలం పిండం పెరుగుదల కోసం తన గర్భసంచిని ఆధారంగా అందిస్తుంది. ఈ విధానంలో గర్భసంచిలో పెరిగే బిడ్డకు దాన్ని ఆధారంగా ఇచ్చిన తల్లికి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఈ విధంగా జన్మించిన పిల్లలను ‘సరోగసీ బేబీస్’ అంటారు. ఇలాంటి పిల్లలకు భారతదేశంలో జన్మించినప్పటికీ భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం రాదు. అయితే ఇటీవలే సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో ఇలాంటి వారికి పౌరసత్వం ఇవ్వవచ్చని పేర్కొంది. కానీ ఈ విషయంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చట్టాలనూ రూపొందించలేదు. ఎమిగ్రి (Emigre): రాజకీయ కారణాల వల్ల స్వదేశాన్ని వదిలి వెళ్లిన పౌరులను ఎమిగ్రి అంటారు. ఎక్స్పాట్రియేట్ (Expatriate): స్వదేశాన్ని స్వచ్ఛందంగా వదిలి వెళ్లిన పౌరులను ఎక్స్పాట్రియేట్గా పేర్కొంటారు. రెఫ్యూజీ (Refugee): రాజకీయ కారణాల వల్ల మరో దేశానికి వలస వెళ్లే ప్రజలను రెఫ్యూజీలుగా పేర్కొంటారు. కొన్ని రకాల జాతి, మత, రాజకీయ కారణాల వల్ల వీరు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడరు. గ్రీన్ కార్డ: అమెరికాలో అధికారికంగా శాశ్వత నివాసాన్ని ఏర్పర్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రాన్ని గ్రీన్ కార్డ అని అంటారు. మాదిరి ప్రశ్నలు 1. భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం కింద పేర్కొన్న ఏ పద్ధతిలో భారత పౌరసత్వాన్ని పొందవచ్చు? ఎ) పుట్టుక బి) వారసత్వం సి) రిజిస్ట్రేషన్ డి) పైవన్నీ 2. కిందివాటిలో ఏ ప్రకరణలు భారత పౌరసత్వానికి సంబంధించినవి? ఎ) ప్రకరణ 1 నుంచి 4 బి) ప్రకరణ 5 నుంచి 11 సి) ప్రకరణ 8 నుంచి 12 డి) ప్రకరణ 4 నుంచి 9 3. కిందివాటిలో భారత పౌరసత్వ చట్టానికి సవరణ చేసిన సంవత్సరం? ఎ) 1986 బి) 1992 సి) 2005 డి) పైవన్నీ 4. భారత సంతతికి చెంది ఉండి, విదేశాల్లో నివసించే వారి గురించే వివరించే ప్రకరణ ఏది? ఎ) 7 బి) 10 సి) 8 డి) 9 5. పౌరసత్వానికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారం ఎవరికి ఉంది? ఎ) రాష్ట్రపతి బి) పార్లమెంటు సి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డి) సుప్రీంకోర్టు 6. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. ఎ) ప్రవాస భారతీయ దివస్‌ను ఏటా జనవరి 9న నిర్వహిస్తారు బి) 2014లో ప్రవాస భారతీయ దివస్ సదస్సు న్యూ ఢిల్లీలో జరిగింది సి) ఎంగేజింగ్ ఇండియన్ డయాస్పోరా - ది ఇండియన్ గ్రోత్స్టోరీ అనేది ప్రవాస భారతీయ దివస్-2014 ముఖ్య ఇతివృత్తం డి) పైవన్నీ సరైనవే 7. కిందివారిలో ఎవరికి ఇండియన్ పాస్ పోర్ట ఉంటుంది? ఎ) ఎన్ఆర్ఐలు బి) పీఐఓలు సి) ఓసీఐలు డి) పైవారందరికీ ఉంటుంది 8. భారత ఏక పౌరసత్వంలోని పరిమితులు? ఎ) స్థానిక, స్థానికేతర వర్గీకరణ బి) ప్రత్యేక ప్రాంతాలకు మినహాయింపులు సి) స్థిరనివాసంపై పరిమితులు డి) పైవన్నీ 9. ప్రతిపాదిత ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి కిందివాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ఎ) పి.ఐ.ఒ. గుర్తింపు కార్డు ఉన్నవారికి 15 ఏళ్లపాటు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి బి) ఒ.సి.ఐ. కార్డు ఉన్నవారికి బహుళ ప్రవేశ వీసాను జారీ చేస్తారు సి) పి.ఐ.ఒ. స్థానంలో ఒ.సి.ఐ. కార్డులను జారీ చేస్తారు డి) పైవన్నీ సరైనవే 10. కిందివాటిలో ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశం? ఎ) అమెరికా బి) ఆస్ట్రేలియా సి) స్విట్జర్లాండ్ డి) పైవన్నీ 11. భారతదేశం ఏక పౌరసత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం? ఎ) దేశ ఐక్యత, సమగ్రత బి) విస్తృత అవకాశాలు సి) ఏక రాజ్యాంగం డి) పైవన్నీ సరైనవే సమాధానాలు 1) డి; 2) బి; 3) డి; 4) సి; 5) బి; 6) డి; 7) ఎ; 8) డి; 9) డి; 10) డి; 11) డి. బి. కృష్ణారెడ్డి డెరైక్టర్ క్లాస్-1 స్టడీ సర్కిల్, హైదరాబాద్. ప్రవేశాలు: ఐఐటీ రూర్కీ - ఎంబీఏ రూర్కీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. విభాగాలు: హెచ్ఆర్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఐటీ సిస్టమ్స్ మేనేజ్మెంట్. సీట్ల సంఖ్య: 95 అర్హతలు: ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ ఫార్మసీ/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. క్యాట్ 2014లో అర్హత సాధించాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జనవరి 14 వెబ్సైట్: http://pgadm.iitr.ernet.in/ ఐఐపీఎం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపీఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విభాగం: అగ్రి బిజినెస్ అండ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ కాలపరిమితి: రెండేళ్లు. అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. క్యాట్/ మ్యాట్/ ఏటీఎంఏ/ సీమ్యాట్ అర్హత అవసరం. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జనవరి 31 వెబ్సైట్: www.iipmb.edu.in ఢిల్లీ టెక్నలాజికల్ వర్సిటీ ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (ఎస్ఎం) ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. - సీట్ల సంఖ్య: 91 విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సప్లయ్ చైన్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ కాలపరిమితి: రెండేళ్లు. అర్హతలు: బీఈ/ బీటెక్‌తో పాటు క్యాట్‌లో అర్హత సాధించాలి. దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 13 వెబ్సైట్: www.dce.edu -
ఎమ్మెల్యే రమేశ్ పౌరసత్వం కేసు నేటికి వాయిదా
వేములవాడ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే రమేశ్ చెన్నమనేని ద్వంద్వ పౌరసత్వం కేసు సుప్రీంకోర్టులో గురువారానికి వాయిదా పడింది. రమేశ్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నారని 2009 ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ఆది శ్రీనివాస్ గతంలో హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రమేశ్ ఎన్నిక చెల్లదని హైకోర్టు గతేడాది తీర్పునివ్వగా రమేశ్ సుప్రీంకోర్టు ద్వారా స్టే పొందారు. స్టే వెకేట్ చేయాలని ఆది శ్రీనివాస్ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. బుధవారం సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఉండగా, బెంచ్‌పై దీనికి ముందు కేసు విచారణ సాయంత్రం వరకు కొనసాగింది. దీంతో రమేశ్ కేసును గురువారం విచారణకు స్వీకరించనున్నట్లు ధర్మాసనం ప్రకటించిందని ఆది శ్రీనివాస్ వెల్లడించారు.