ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడు? | Pravasi Bharatiya Divas to be organised by Jan 9 | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడు?

Published Wed, Dec 24 2014 8:56 AM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM

ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడు? - Sakshi

ప్రవాస భారతీయ దివస్ ఎప్పుడు?

ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దివస్  నిర్వహిస్తారు. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి 1915 జనవరి 9న భారతదేశానికి తిరిగి వచ్చారు. దీనికి చారిత్రకంగా  అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ సందర్భానికి  గుర్తుగా ఈ తేదీని ఎంచుకున్నారు.
 
 ద్వంద్వ పౌరసత్వం
 భారత సంతతికి చెంది ఉండి విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తరచుగా భారతదేశానికి రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఈ విషయంలో వీరు ఎదుర్కొంటున్న వీసాపరమైన ఇబ్బందులను తగ్గించడం కోసం పౌరసత్వ చట్టానికి
 2005 లో కొన్ని మార్పులు చేశారు. ద్వంద్వ పౌరసత్వంలో కొన్ని సదుపాయాలను కల్పించారు. వాటిని కింది విధంగా వివరించవచ్చు.
 ప్రవాస భారతీయులు (Non Resident Indians- NRIs): విదేశాల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివసిస్తున్న మొదటితరం భారతీయులు. 182 రోజులు భారతదేశం వెలుపల నివసిస్తూ ఉండేవారిని ఎన్.ఆర్.ఐ.లు అంటారు. వీరికి భారత పాస్‌పోర్‌‌ట ఉంటుంది.
 భారత సంతతికి చెందిన వారు (Personsof Indian Origin - PIOs): విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రెండో తరం భారతీయులు. అంటే విదేశాలకు వెళ్లి, అక్కడ స్థిరపడి ఆ దేశ పౌరసత్వాన్ని పొందిన తల్లిదండ్రులకు జన్మించిన సంతానం. వీరికి భారత పాస్‌పోర్‌‌ట  ఉండదు.
 ఉదాహరణకు అమెరికాలోని లూసియానా రాష్ట్రానికి గవర్నర్‌గా ఎన్నికైన బాబి జిందాల్.
 ఓవర్‌సీస్ సిటిజన్‌‌స ఆఫ్ ఇండియా (KUI)
 (Overseas Citizens of India): భారత ప్రభుత్వ చట్టం - 1955 ప్రకారం నమోదు చేసుకున్న వ్యక్తులను ఓవర్‌సీస్ సిటిజన్‌‌స ఆఫ్ ఇండియాగా పేర్కొంటారు.
 ద్వంద్వ పౌరసత్వం - ఎల్.ఎం. సింఘ్వి
 
 కమిటీ సూచనలు
 ద్వంద్వ పౌరసత్వంలో ఓటింగ్ హక్కులు ఉండవు. అదేవిధంగా ప్రజా పదవులకు అర్హులు కారు. ద్వంద్వ పౌరసత్వంలో ఉండే సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. పీఐఓలకు పీఐవో కార్డులు జారీ చేస్తారు. 2003లో చేసిన పీఐవో చట్టం ప్రకారం కొన్ని సదుపాయాలుంటాయి.
 ఈ సౌకర్యం అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంకకు వర్తించదు. పీఐవోలకు భారతదేశాన్ని సందర్శించడానికి ప్రత్యేక వీసా అవసరం లేదు. పీఐవో కార్డు జారీ చేసిన తేదీ నుంచి 15 ఏళ్లపాటు ఈ సౌకర్యం ఉంటుంది.
 ఈ కార్డు పొందడానికి వయోజనులు రూ. 15,000 చెల్లించాలి. ఎన్‌ఆర్‌ఐలకు ఉన్న అన్ని సౌకర్యాలు పీఐవోలకు ఉంటాయి.
 
 ఓవర్‌సీస్ సిటిజన్‌‌స ఆఫ్ ఇండియా- 2005
 ఈ చట్టం ప్రకారం ఇతర దేశాల్లో ఉన్న భారత సంతతికి చెందిన అందరికీ ఓసీఐ హోదాను పొందే అవకాశాన్ని కల్పించారు.
 
 చట్టంలోని ముఖ్యాంశాలు:
     ఈ చట్టం 2005 డిసెంబర్ 2 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ హోదా ఉన్న వారికి భారతదేశానికి మల్టిపుల్ ఎంట్రీ (Multiple Entry) సౌకర్యం ఉంటుంది. ఇందుకోసం దీర్ఘకాలిక పరిమితి ఉన్న వీసాలు జారీ చేస్తారు. వీరికి కూడా ద్వంద్వ పౌరసత్వ వీసాలు కల్పిస్తారు.
     ఓసీఐలు భారతదేశంలో పనిచేస్తూ నివాసం ఉండవచ్చు లేదా వారికి సహజ పౌరసత్వం ఉన్న దేశాల్లోనూ పౌరసత్వం ఉండవచ్చు. వీరికి కూడా ఎన్‌ఆర్‌ఐలతో సమానమైన ప్రతిపత్తి ఉంటుంది. అయితే రాజకీయ హక్కులుండవు.
     ఓసీఐ హోదాను పొందడానికి 275 యూఎస్ డాలర్లు చెల్లించాలి. ఓసీఐలుగా రిజిస్టర్ చేసుకున్న ఐదేళ్ల తర్వాత ఒక సంవత్సరం పాటు భారతదేశంలో నివాసం ఉంటే భారత సంపూర్ణ పౌరసత్వానికి అర్హులవుతారు.
 సరోగసీ పౌరసత్వం (Surrogacy)
 సరోగసీ అనేది వైద్యశాస్త్ర పరంగా తల్లిదండ్రులు మరో తల్లి ద్వారా సంతానాన్ని పొందడం. సరోగసీ మదర్ కేవలం పిండం పెరుగుదల కోసం తన గర్భసంచిని ఆధారంగా అందిస్తుంది. ఈ విధానంలో గర్భసంచిలో పెరిగే బిడ్డకు దాన్ని ఆధారంగా ఇచ్చిన తల్లికి ఏ మాత్రం సంబంధం ఉండదు. ఈ విధంగా జన్మించిన పిల్లలను ‘సరోగసీ బేబీస్’ అంటారు. ఇలాంటి పిల్లలకు భారతదేశంలో జన్మించినప్పటికీ భారత రాజ్యాంగం ప్రకారం పౌరసత్వం రాదు. అయితే ఇటీవలే సుప్రీంకోర్టు మానవతా దృక్పథంతో ఇలాంటి వారికి పౌరసత్వం ఇవ్వవచ్చని పేర్కొంది. కానీ ఈ విషయంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చట్టాలనూ రూపొందించలేదు.
 
 ఎమిగ్రి (Emigre): రాజకీయ కారణాల వల్ల స్వదేశాన్ని వదిలి వెళ్లిన పౌరులను ఎమిగ్రి అంటారు.
 ఎక్స్‌పాట్రియేట్ (Expatriate): స్వదేశాన్ని స్వచ్ఛందంగా వదిలి వెళ్లిన పౌరులను ఎక్స్‌పాట్రియేట్‌గా పేర్కొంటారు.
 రెఫ్యూజీ (Refugee): రాజకీయ కారణాల వల్ల మరో దేశానికి వలస వెళ్లే ప్రజలను రెఫ్యూజీలుగా పేర్కొంటారు. కొన్ని రకాల జాతి, మత, రాజకీయ కారణాల వల్ల వీరు స్వదేశానికి తిరిగి వెళ్లడానికి ఇష్టపడరు.
 గ్రీన్ కార్‌‌డ: అమెరికాలో అధికారికంగా శాశ్వత నివాసాన్ని ఏర్పర్చుకోవడానికి అక్కడి ప్రభుత్వం జారీ చేసే అనుమతి పత్రాన్ని గ్రీన్ కార్‌‌డ అని అంటారు.
 
 మాదిరి ప్రశ్నలు
 1.    భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం  కింద పేర్కొన్న ఏ పద్ధతిలో భారత పౌరసత్వాన్ని పొందవచ్చు?
     ఎ) పుట్టుక    బి) వారసత్వం
     సి) రిజిస్ట్రేషన్    డి) పైవన్నీ
 2.    కిందివాటిలో ఏ ప్రకరణలు భారత పౌరసత్వానికి సంబంధించినవి?
     ఎ) ప్రకరణ 1 నుంచి 4        
     బి) ప్రకరణ 5 నుంచి 11
     సి) ప్రకరణ 8 నుంచి 12
     డి) ప్రకరణ 4 నుంచి 9
 3.    కిందివాటిలో భారత పౌరసత్వ చట్టానికి సవరణ చేసిన సంవత్సరం?
     ఎ) 1986    బి) 1992
     సి) 2005    డి) పైవన్నీ
 4.    భారత సంతతికి చెంది ఉండి, విదేశాల్లో నివసించే వారి గురించే వివరించే ప్రకరణ ఏది?
     ఎ) 7    బి) 10    సి) 8    డి) 9
 5.    పౌరసత్వానికి సంబంధించి నియమ నిబంధనలు రూపొందించే అధికారం ఎవరికి ఉంది?
     ఎ) రాష్ట్రపతి    బి) పార్లమెంటు
     సి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు    
     డి) సుప్రీంకోర్టు
 6.    కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
     ఎ) ప్రవాస భారతీయ దివస్‌ను ఏటా జనవరి 9న నిర్వహిస్తారు    
     బి) 2014లో ప్రవాస భారతీయ దివస్ సదస్సు న్యూ ఢిల్లీలో జరిగింది
     సి) ఎంగేజింగ్ ఇండియన్ డయాస్పోరా - ది ఇండియన్ గ్రోత్‌స్టోరీ అనేది ప్రవాస భారతీయ దివస్-2014 ముఖ్య ఇతివృత్తం
     డి) పైవన్నీ సరైనవే
 7.    కిందివారిలో ఎవరికి ఇండియన్ పాస్ పోర్‌‌ట ఉంటుంది?
     ఎ) ఎన్‌ఆర్‌ఐలు    బి) పీఐఓలు
     సి) ఓసీఐలు     డి) పైవారందరికీ ఉంటుంది
 8.    భారత ఏక పౌరసత్వంలోని పరిమితులు?
     ఎ) స్థానిక, స్థానికేతర వర్గీకరణ
     బి) ప్రత్యేక ప్రాంతాలకు మినహాయింపులు
     సి) స్థిరనివాసంపై పరిమితులు
     డి) పైవన్నీ
 9.    ప్రతిపాదిత ద్వంద్వ పౌరసత్వానికి సంబంధించి కిందివాటిలో సరైన అంశాన్ని గుర్తించండి.
     ఎ)    పి.ఐ.ఒ. గుర్తింపు కార్డు ఉన్నవారికి
       15 ఏళ్లపాటు ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి
     బి)    ఒ.సి.ఐ. కార్డు ఉన్నవారికి బహుళ ప్రవేశ వీసాను జారీ చేస్తారు
     సి)    పి.ఐ.ఒ. స్థానంలో ఒ.సి.ఐ. కార్డులను జారీ చేస్తారు
     డి)    పైవన్నీ సరైనవే
 10.    కిందివాటిలో ద్వంద్వ పౌరసత్వం ఉన్న దేశం?
     ఎ) అమెరికా    బి) ఆస్ట్రేలియా
     సి) స్విట్జర్లాండ్    డి) పైవన్నీ
 11.    భారతదేశం ఏక పౌరసత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి కారణం?
     ఎ) దేశ ఐక్యత, సమగ్రత
     బి) విస్తృత అవకాశాలు    
     సి) ఏక రాజ్యాంగం        డి) పైవన్నీ సరైనవే
 
 సమాధానాలు
     1) డి;     2) బి;     3) డి;     4) సి;
     5) బి;     6) డి;      7) ఎ;  8) డి;
     9) డి;    10) డి;     11) డి.
 బి. కృష్ణారెడ్డి
 డెరైక్టర్ క్లాస్-1 స్టడీ సర్కిల్,
 హైదరాబాద్.  
 
 ప్రవేశాలు: ఐఐటీ రూర్కీ - ఎంబీఏ
 రూర్కీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 విభాగాలు: హెచ్‌ఆర్, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఐటీ సిస్టమ్స్ మేనేజ్‌మెంట్.
 సీట్ల సంఖ్య: 95
 అర్హతలు: ఇంజనీరింగ్/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్/ ఫార్మసీ/ అగ్రికల్చర్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ ఉండాలి. క్యాట్ 2014లో అర్హత సాధించాలి.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:
 జనవరి 14
 వెబ్‌సైట్: http://pgadm.iitr.ernet.in/
 
 ఐఐపీఎం
 బెంగళూరులోని  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్ (ఐఐపీఎం) కింద పేర్కొన్న కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
  పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్
 విభాగం: అగ్రి బిజినెస్ అండ్ ప్లాంటేషన్ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: రెండేళ్లు.
 అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. క్యాట్/ మ్యాట్/ ఏటీఎంఏ/ సీమ్యాట్ అర్హత అవసరం.
 దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:
 జనవరి 31
 వెబ్‌సైట్: www.iipmb.edu.in
 
 ఢిల్లీ టెక్నలాజికల్ వర్సిటీ
 ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీకి చెందిన స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఎస్‌ఎం) ఎంబీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
 - సీట్ల సంఖ్య: 91
 విభాగాలు: మార్కెటింగ్, ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్, సప్లయ్ చైన్ మేనేజ్‌మెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: రెండేళ్లు.
 అర్హతలు: బీఈ/ బీటెక్‌తో పాటు క్యాట్‌లో అర్హత సాధించాలి.
 దరఖాస్తులకు చివరి తేది: ఫిబ్రవరి 13
 వెబ్‌సైట్: www.dce.edu

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement