కోల్‌కతా: కోల్‌కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కళాశాలలో జూనియర్ డాక్టర్ జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా అన్ని రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థులు, డాక్టర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో శాంతిభద్రతల పరిస్థితులపై ప్రతి రెండు గంటలకు ఒకసారి నివేదిక ఇవ్వాలని ఆయా ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలలోని పోలీసు ఉన్నతాధికారులు ప్రతి రెండు గంటలకు మెయిల్, ఫ్యాక్స్ లేదా వాట్సాప్ ద్వారా కేంద్రానికి నివేదికలు పంపాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ నివేదికల ఆధారంగా పరిస్థితులను అంచనా వేసి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కోల్‌కతా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఘటనపై సీబీఐకు దర్యాప్తు కొసాగిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment