న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్‌ఎఫ్)లో మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తెలిపింది. పూర్తిగా మహిళలతో కూడిన ఈ బెబాలియన్‌లో వెయ్యి మంది సభ్యులుంటారు. ఇటీవలి కాలంలో విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాలు, ప్రముఖుల భద్రత విధులు సీఐఎస్‌ఎఫ్‌కు తలకుమించిన భారంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంగళవారం ఈ నిర్ణయం వెలువరించినట్లు సమాచారం.
సీఐఎస్‌ఎఫ్‌కు మంజూరైన 2 లక్షల మంది బలగాల్లోనే మహిళల రిజర్వుడు బెటాలియన్ కూడా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. మొత్తం 1,025 మంది సభ్యులకుగాను సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నాయకత్వం వహిస్తారు. తాజాగా ప్రకటించిన బెటాలియన్ ఎంపిక, శిక్షణ, కేటాయించే విధులకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీఐఎస్‌ఎఫ్‌లోని 1.80 లక్షల మందిలో ఏడు శాతం వరకు మహిళలున్నారు.
కశ్మీర్‌లో 119 మంది ఉగ్రవాదులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో చురుగ్గా వ్యవహరించే ఉగ్రవాదులు ఎందరన్న దానిపై నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. మొత్తం 119 మంది ఉగ్రవాదులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదుల ఉనికి, వారి కార్యకలాపాల తీవ్రత, కొత్త వారిని చేర్చుకుంటున్న తీరును బట్టి నిఘా వర్గాలు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు సమాచారం.
చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
మొత్తం 119 మందిలో పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని ఉత్తర ప్రాంతంలో 79 మంది ఉండగా వీరిలో 16 మంది స్థానికులు కాగా, 61 మంది విదేశీయులని తేలింది. పర్వత శ్రేణుల దక్షిణ భాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్న 40 మంది ముష్కరుల్లో ఏకంగా 34 మంది విదేశీయులు కాగా, ఆరుగురు మాత్రమే స్థానికంగా ఎంపికైన వారిగా నిఘా వర్గాలు గుర్తించాయి.
Comments
Please login to add a commentAdd a comment