women battalion
-
CISF: మరో అడుగు...
వెయ్యిమందికిపైగా మహిళలతో తొలిసారిగా మహిళా సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) బెటాలియన్ ఏర్పాటుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది. విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను ఈ బెటాలియన్ భుజాలకెత్తుకోనుంది.ప్రస్తుతం 1.80 లక్షల మంది ఉన్న సీఐఎస్ఎఫ్లో ఏడు శాతానికి పైగా మహిళలు ఉన్నారు. సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వ్ బెటాలియన్ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వ్ బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, స్థలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలయ్యాయి.సీఐఎస్ఎఫ్ 1969లో ఏర్పాటు అయింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతల నుంచి పార్లమెంట్ హౌజ్ భద్రత వరకు సీఐఎస్ఎఫ్ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా...ఆల్–ఉమెన్ బెటాలియన్ ఏర్పాటు చేయడమన్నది మహిళా సాధికారత విషయంలో సీఐఎస్ఎఫ్ వేసిన మరో అడుగు అనవచ్చు.‘వీఐపీ భద్రతతో పాటు విమానాశ్రయాలు, దిల్లీ మెట్రో... మొదలైన వాటి భద్రతలో కమాండోలుగా బహుముఖ పాత్రపోషించే సామర్థ్యం ఉన్న ఎలైట్ బెటాలియన్‌ను రూపొందిస్తున్నాం. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్ఎఫ్ మంచి ఎంపిక. కొత్త ఆల్–ఉమెన్ బెటాలియన్ వల్ల దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్ఎఫ్లో చేరేందుకు ప్రోత్సాహం లభిస్తుంది’ అని అధికార ప్రకటన తెలియజేసింది.‘ఇదొక చారిత్రక నిర్ణయం. జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆల్–ఉమెన్ బెటాలియన్ ఉపకరిస్తుంది’ అంటూ ‘ఎక్స్’ వేదికగా సీఐఎస్ఎఫ్ హర్షం ప్రకటించింది. -
సీఐఎస్ఎఫ్లో మొట్టమొదటి మహిళా బెటాలియన్.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సెంట్రల్ ఇండ్రస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్, సీఐఎస్ఎఫ్)లో మొట్టమొదటి మహిళా బెటాలియన్ ఏర్పాటుకు కేంద్రం అనుమతి తెలిపింది. పూర్తిగా మహిళలతో కూడిన ఈ బెబాలియన్లో వెయ్యి మంది సభ్యులుంటారు. ఇటీవలి కాలంలో విమానాశ్రయాల వంటి కీలక ప్రదేశాలు, ప్రముఖుల భద్రత విధులు సీఐఎస్ఎఫ్కు తలకుమించిన భారంగా మారిన నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంగళవారం ఈ నిర్ణయం వెలువరించినట్లు సమాచారం.సీఐఎస్ఎఫ్కు మంజూరైన 2 లక్షల మంది బలగాల్లోనే మహిళల రిజర్వుడు బెటాలియన్ కూడా ఉంటుందని ఓ అధికారి తెలిపారు. మొత్తం 1,025 మంది సభ్యులకుగాను సీనియర్ కమాండెంట్ ర్యాంకు అధికారి నాయకత్వం వహిస్తారు. తాజాగా ప్రకటించిన బెటాలియన్ ఎంపిక, శిక్షణ, కేటాయించే విధులకు సంబంధించిన ఏర్పాట్లు మొదలయ్యాయని ఆ అధికారి తెలిపారు. ప్రస్తుతం సీఐఎస్ఎఫ్లోని 1.80 లక్షల మందిలో ఏడు శాతం వరకు మహిళలున్నారు.కశ్మీర్లో 119 మంది ఉగ్రవాదులు శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో చురుగ్గా వ్యవహరించే ఉగ్రవాదులు ఎందరన్న దానిపై నిఘా వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. మొత్తం 119 మంది ఉగ్రవాదులు హింసాత్మక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు తేల్చాయి. ఉగ్రవాదుల ఉనికి, వారి కార్యకలాపాల తీవ్రత, కొత్త వారిని చేర్చుకుంటున్న తీరును బట్టి నిఘా వర్గాలు ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు సమాచారం.చదవండి: బుల్డోజర్లతో ఇళ్ల కూల్చివేతలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పుమొత్తం 119 మందిలో పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లోని ఉత్తర ప్రాంతంలో 79 మంది ఉండగా వీరిలో 16 మంది స్థానికులు కాగా, 61 మంది విదేశీయులని తేలింది. పర్వత శ్రేణుల దక్షిణ భాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్న 40 మంది ముష్కరుల్లో ఏకంగా 34 మంది విదేశీయులు కాగా, ఆరుగురు మాత్రమే స్థానికంగా ఎంపికైన వారిగా నిఘా వర్గాలు గుర్తించాయి. -
మహిళా పోలీసులపై ఆనంద్ మహింద్రా ట్వీట్
-
‘ఆ పోలీసుల సత్తా తెలుసు.. జాగ్రత్తగా ఉంటాను’
కోహిమ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ట్విటర్లో షేర్ చేసిన ఓ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రోడ్డు పక్కన గుంతలో ఇరుక్కుపోయిన మహింద్రా బొలెరో వాహనాన్ని నాగా బెటాలియన్‌కు చెందిన కొందరు మహిళా పోలీసులు బయటకు తీస్తున్న వీడియో అది. దట్టమైన అడవిగుండా వెళ్తున్న పోలీసులకు గుంతలో ఇరుక్కుపోయిన మహింద్రా బొలెరో వాహనం కనిపించింది. అసలే నిర్మానుష్య ప్రాంతం కావడంతో కొద్ది గంటల నుంచి దాన్ని బయటకు తీసేవారు లేక అక్కడే ఉండిపోయింది. ఎవరి సాయం దొరకక ఆ వాహనంలోని వారు అవస్థలు పడ్డారు. ఈ క్రమంలో అదే దారిగుండా వస్తున్న పోలీసులను సాయం కోరడంతో.. వారు బండి దిగొచ్చి తలో చేయి వేసి బండిని బయటకు తీశారు. ఇది జరిగి నెలలు కావొస్తున్నా.. వీడియో మాత్రం వైరల్ అయింది. ఎం.కికోన్ అనే వ్యక్తి ఈ వీడియోను తాజాగా పోస్టు చేయగా.. ఆనంద్ మహింద్రా షేర్ చేశాడు. ‘బొలెరో వాహనం అక్కడెలా కూరుకుపోయిందో తెలియదు. కానీ, దాన్ని బయటకు తీసినందుకు మహిళా పోలీసులకు థాంక్స్. వారితో తలపడాల్సి వస్తే జాగ్రత్తగా ఉంటాను. వారి సత్తా నాకు తెలుసు’ అని సరదాగా వ్యాఖ్యానించారు. -
జమ్మూకశ్మీర్‌లో మహిళా బెటాలియన్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు, ముఖ్యంగా విద్యార్థినులను నియంత్రించేందుకు ప్రత్యేకంగా మహిళా బెటాలియన్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 24న శ్రీనగర్‌లోని ప్రముఖ ప్రాంతమైన లాల్ చౌక్‌లో భద్రతా బలగాలపై విద్యార్థినులు దాడికి దిగారు. అలాగే రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులకు ఇటీవల మహిళలు కూడా తోడవుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఐదు ఇండియా రిజర్వుడ్ బెటాలియన్ల (ఐఆర్బీ) ఏర్పాటుకు కేంద్రం అనుమతిచ్చింది. -
ఉగ్రవేటలో ఇక మహిళా దళం
అజ్మీర్: ఉగ్రవాదులు, నక్సల్స్ వేటలో ఇక నుంచి మహిళా రక్షక దళం కూడా తన పాత్రను పోషించనుంది. సెంట్రల్ రిజర్వ్ పొలీస్ ఫోర్స్ (సీఆర్పీఫ్) 232 మహిళా బెటాలియన్ కు చెందిన 567 మంది మహిళలు నలభై నాలుగు వారాల కఠిన శిక్షణ పూర్తి చేసుకొని అజ్మీర్ లో అవుట్ పరేడ్ ను నిర్వహించారు. ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని నిర్మూలించేందుకు తమ వంతు పాత్ర పోషిస్తామని వారు శపథం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్నసీఆర్ పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కే దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఉగ్రవాద నిర్మూలనలో ఆత్మవిశ్వాసంతో పోరాడాలని పిలుపునిచ్చారు. నక్సల్ ను వేటాడేందుకు మహిళా రక్షక దళం ప్రత్యేక శిక్షణ తీసుకుంది. కరాటే, యుద్ధ విద్యల్లో ప్రావీణ్యం సంపాదించిన వీరు ఆయుధాలు లేకున్నా పోరాటం చేయగలరు.