
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం చోటు చేసుకున్న ఎన్‌కౌంటర్‌లో ఆర్మీ ప్రత్యేక విభాగం జవాను ఒకరు అసువులు బాశారు. ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న బలగాలు డుడు–బసంత్‌గఢ్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా తారసపడిన ఉగ్రమూకలు బలగాలపైకి అకస్మాత్తుగా కాల్పులకు దిగాయి.
ఘటనలో హవల్దార్ ఝంటు అలీ షేక్ నేలకొరిగారు. అనంతరం కూడా ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ సందర్భంగా బలగాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. కాగా, గత 24 గంటల్లో చోటుచేసుకున్న మూడో ఎన్‌కౌంటర్ ఇది. బుధవారం బారాముల్లాలోని ఉడి నాలా వద్ద జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమవ్వడం తెల్సిందే.