one soldier
-
కశ్మీర్లో ఎన్కౌంటర్.. జవాను వీరమరణం
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆర్మీ ప్రత్యేక విభాగం జవాను ఒకరు అసువులు బాశారు. ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న బలగాలు డుడు–బసంత్‌గఢ్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా తారసపడిన ఉగ్రమూకలు బలగాలపైకి అకస్మాత్తుగా కాల్పులకు దిగాయి. ఘటనలో హవల్దార్ ఝంటు అలీ షేక్ నేలకొరిగారు. అనంతరం కూడా ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ సందర్భంగా బలగాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. కాగా, గత 24 గంటల్లో చోటుచేసుకున్న మూడో ఎన్కౌంటర్ ఇది. బుధవారం బారాముల్లాలోని ఉడి నాలా వద్ద జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమవ్వడం తెల్సిందే. -
కారుపై తీవ్రవాదుల కాల్పులు : ఆరుగురు మృతి
కాబూల్ : ఆఫ్ఘానిస్థాన్ గజనీ ప్రావిన్స్‌లోని చార్ దివార్ ప్రాంతంలో తీవ్రవాదులు రెచ్చిపోయారు. రహదారిపై వెళ్తున్న వాహనంపైకి విచక్షణరహితంగా తీవ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు పౌరులతోపాటు ఓ సైనికుడు మరణించాడు. ఈ మేరకు ప్రభుత్వ ప్రతినిధి మంగళవారం వెల్లడించారు. మరో సైనికుడు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వవద్దని ప్రజలకు తీవ్రవాదులు ఇప్పటికే సూచించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఉండవద్దని.... ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణించవద్దని ప్రజలకు తీవ్రవాదులు హితవు పలికారు. అయితే ప్రభుత్వానికి తీవ్రవాదులకు మధ్య జరుగుతున్న ఘర్షణలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 16 వందల మంది పౌరులు మరణించగా.... 3300 మంది గాయపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇటీవల యూఎన్ మిషన్ వెల్లడించింది.