
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రదాడి ఘటన వేళ బారాముల్లాలో తాజాగా ఎన్‌కౌంటర్ జరిగింది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.
వివరాల ప్రకారం.. బారాముల్లలో బుధవారం ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భారత సరిహద్దుల నుంచి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ సందర్బంగా ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. దీంతో, యూరి సెక్టార్‌లో కూంబింగ్ కొనసాగుతోంది.
J&K | Heavy exchange of fire between security forces and terrorists, two terrorists have been eliminated, infiltration bid foiled by the security forces in the ongoing Operation in Baramulla. Large quantity of weapons, ammunition and other war-like stores have been recovered from… pic.twitter.com/OS3opx8lLg
— ANI (@ANI) April 23, 2025