అమెరికా వ్యాఖ్యలను తిప్పికొట్టిన భారత్
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ బహుళ సంప్రదాయాలను, దేశ విభజన తర్వాత ఇక్కడి చరిత్రను అర్థం చేసుకోలేనివారు తమకు పాఠాలు చెప్పొద్దని చురక అంటించారు. పౌరసత్వ సవరణ చట్టం తమ దేశ అంతర్గత వ్యవహారమని హితవు పలికారు.
ఇక్కడ మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. పొరుగుదేశాల్లో మతహింసకు, వేధింపులకు గురై, వలస వచి్చన ముస్లిమేతరులకు పౌరసత్వం కలి్పంచేందుకు సీఏఏ తెచ్చామన్నారు. సీఏఏపై మాథ్యూ చేసిన వ్యాఖ్యలపై ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఇండియాలో సీఏఏను ఎలా అమలు చేయబోతున్నారన్నది గమనిస్తున్నాం. అన్ని మతాల స్వేచ్ఛను గౌరవించాలి. చట్ట ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడడం అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment