
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ(సవరణ) చట్టం(సీఏఏ)–2019 కింద భారత పౌరసత్వం పొందాలనుకునే శరణార్ధులకు సాయపడేందుకు త్వరలో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆన్‌లైన్ వేదికగా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుందని హోం శాఖ బుధవారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టింది.
దరఖాస్తుల సమర్పణకు ఇప్పటికే ఓ పోర్టల్‌ను సిద్ధం చేసినట్లు గుర్తుచేసింది. ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. దేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న వలసదారులైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ దరఖాస్తు సంబంధ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.