Home Affairs
-
సీఏఏ అంతర్గత వ్యవహారం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ బహుళ సంప్రదాయాలను, దేశ విభజన తర్వాత ఇక్కడి చరిత్రను అర్థం చేసుకోలేనివారు తమకు పాఠాలు చెప్పొద్దని చురక అంటించారు. పౌరసత్వ సవరణ చట్టం తమ దేశ అంతర్గత వ్యవహారమని హితవు పలికారు. ఇక్కడ మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. పొరుగుదేశాల్లో మతహింసకు, వేధింపులకు గురై, వలస వచి్చన ముస్లిమేతరులకు పౌరసత్వం కలి్పంచేందుకు సీఏఏ తెచ్చామన్నారు. సీఏఏపై మాథ్యూ చేసిన వ్యాఖ్యలపై ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఇండియాలో సీఏఏను ఎలా అమలు చేయబోతున్నారన్నది గమనిస్తున్నాం. అన్ని మతాల స్వేచ్ఛను గౌరవించాలి. చట్ట ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడడం అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. -
సీఏఏ దరఖాస్తుదారుల కోసం హెల్ప్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ(సవరణ) చట్టం(సీఏఏ)–2019 కింద భారత పౌరసత్వం పొందాలనుకునే శరణార్ధులకు సాయపడేందుకు త్వరలో హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులోకి తేనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆన్లైన్ వేదికగా దరఖాస్తు ప్రక్రియ జరుగుతుందని హోం శాఖ బుధవారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్ పెట్టింది. దరఖాస్తుల సమర్పణకు ఇప్పటికే ఓ పోర్టల్‌ను సిద్ధం చేసినట్లు గుర్తుచేసింది. ప్రతిరోజూ ఉదయం 8గంటల నుంచి రాత్రి 8గంటల వరకు ఈ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయి. దేశంలోని ఏ ప్రాంతంలో నివసిస్తున్న వలసదారులైనా ఈ నంబర్లకు ఫోన్ చేసి తమ దరఖాస్తు సంబంధ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. -
అక్రమ వలసల విపరిణామం
సుమారు 300 మంది భారతీయులు ప్రయాణిస్తున్న ఒక విమానాన్ని ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో నిర్బంధించడం అంతర్జాతీయ వార్తగా మారింది. నికరాగ్వాకు వెళ్తున్న ఇలాంటి వాళ్లందరూ అక్కడి నుంచి తమ దేశంలోకి అక్రమంగా వస్తున్నారని అమెరికా ఆరోపణ. ఫ్రెంచ్ అధికారులతో ఈ సమాచారాన్ని పంచుకున్న అమెరికన్ నిఘా వర్గాలు న్యూఢిల్లీని మాత్రం చీకట్లో ఉంచాయి. ఈ వార్తను పతాక శీర్షికల్లో వచ్చేలా చేయడం ద్వారా అక్రమ వలస రాకెట్‌ను సమర్థంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. తమ అమెరికా కలల్ని నెరవేర్చే అక్రమ ముఠాలకు భారీగా డబ్బులు ముట్టచెబుతూ, జనాలు తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్ని ఈ ఉదంతం సూచిస్తుంది. తమ వలస, జాతీయతా చట్టంలో అమెరికా విదేశీ వ్యవహారాల శాఖ నవంబర్ 21న ఒక నిబంధనను పొందుపర్చింది. నికరాగ్వాకు ప్యాసింజర్ విమానాల్లో రివాజుగా విదేశీయులను తీసుకెళ్తున్న వారిని గుర్తించి, వారి ప్రయత్నాలను విఫలం చేయడానికీ, అలాంటి వారిని శిక్షించడానికీ సంబంధించిన నిబంధన అది. విదేశీయులను ప్రమాదకరమైన భూభాగం, జలమార్గాల ద్వారా అమెరికాలోకి నెట్టడమే మానవ రవాణా చేస్తున్న వారి ఉద్దేశం అని అమెరికా విదేశీ మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఆ సమయంలో భారతదేశంలో ఎవరికీ పెద్దగా తెలియని ఈ ప్రకటన, నాలుగు కీలక అంశాలను పేర్కొంది. ఒకటి, చట్టవిరుద్ధమైన మార్గాల ద్వారా అమెరికాకు రాబోయే వలసదారుల కోసం కొత్త అక్రమ రవాణా కేంద్రంగా నికరాగ్వా ఉద్భవించింది. రెండు, నేరస్థ ముఠాలు వలస వచ్చేవారి నుండి ’భారీ–స్థాయిలో డబ్బు’ను వసూలు చేస్తు న్నాయి, వారిని తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తున్నాయి. మూడు, అటు వంటి అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశించినా, ఎలాగైనా వారిని తమ తమ దేశాలకు అమెరికా తిప్పి పంపుతుంది. నాలుగు, నికరాగ్వా లోకి చార్టర్ విమానాలను పంపించే కంపెనీల యజమానులు, అధి కారులు, సీనియర్ అధికారులతో కఠినంగా వ్యవహరించడానికి అమె రికా పాలనాయంత్రాంగం సిద్ధమవుతోంది. అమెరికా చట్టంలోని సెక్షన్ 212 (ఎ)(3)(సి) ‘యునైటెడ్ స్టేట్స్లో ప్రవేశించడం లేదా తీవ్రమైన అమెరికన్ ప్రతికూల విదేశాంగ విధాన పరిణామాలను కలిగి ఉన్న ఏ దరఖాస్తుదారుని అయినా సరే మినహాయించడానికి విదేశాంగ శాఖ మంత్రిని అమెరికా అనుమ తిస్తుంది’. నికరాగ్వా బడా ముఠాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహాయకులకు వ్యతిరేకంగా అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఈ నిబంధనను ఉపయోగించడానికి పథక రచన చేశారని నవంబర్ ప్రకటన పేర్కొంది. నికరాగ్వాకు అలాంటి విమానాలను నడుపుతున్న వారినీ, అమెరికా–మెక్సికో సరిహద్దులోని చివరి గమ్య స్థానానికి వలసదారులను తీసుకువెళ్లేవారినీ వదిలిపెట్టబోమని అమె రికా విదేశాంగ శాఖ పునరుద్ఘాటించింది. దురదృష్టవశాత్తు, వాషింగ్టన్ చేసిన ఈ రెండవ హెచ్చరిక కూడా భారతదేశం దృష్టిలోకి రాకుండా పోయింది. వందలాదిమంది అనుమానిత భారతీయులను తీసుకెళుతున్న లెజెండ్ ఎయిర్‌లైన్స్(రొమేనియన్ సంస్థ) విమానం ఇంధనం నింపు కోవడం కోసం ఫ్రాన్స్‌లోని వాట్రీ విమానాశ్రయంలో దిగుతోందన్న సమాచారాన్ని సేకరించిన అమెరికన్ ప్రభుత్వ నిఘావర్గాలు, వ్యవ స్థీకృత నేరాలపై పోరాడే ఒక ఫ్రెంచ్ ప్రభుత్వ విభాగానికి ఉప్పందించాయి. అట్లాంటిక్ సముద్ర ప్రాంతం పొడవునా నిఘా సమాచారాన్ని పంచుకోవడం అనేది ప్రపంచాన్ని సురక్షితమైన ప్రదేశంగా మారుస్తుందన్నది దీని వెనుక ఉద్దేశం. కానీ ఇది కలవరపెట్టే ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది: అలాంటి నిఘా సమాచారాన్ని న్యూఢిల్లీతో ఎందుకు పంచుకోలేదు? అత్యవసర పరిస్థితుల కోసం తగినంతగా సన్నద్ధత లేని ఒక విమానాశ్రయంలో, నాలుగు రోజుల పాటు భారతీయ ప్రయాణికులు నిర్బంధించబడ్డారు. వాషింగ్టన్ లోని విశ్వసనీయ వర్గాల ప్రకారం, అమెరికన్ అధికా రులు ఆ విమానాన్ని ఎగరడానికి ముందే ఆపాలని అనుకోలేదు. పతాక శీర్షికల్లోకి వచ్చేలా చేయడం ద్వారా ప్రపంచ స్థాయిలో చర్యలు తీసుకునేలా అక్రమ వలస రాకెట్‌ను సమర్థవంతంగా బహిర్గతం చేయాలని వారు కోరుకున్నారు. ఎవరి తోడూ లేని మైనర్ ప్రయాణీకు లను కూడా కలిగి ఉన్న ఆ విమానం వాట్రీ విమానాశ్రయం వద్ద ముట్టడిలో ఉండగానే అది ప్రపంచవ్యాప్తంగా వార్తలను సృష్టించింది. యూరప్ టీవీల్లో అతిపెద్ద వార్తగా మారిన ఈ అసాధారణ సంఘటన కారణంగా, ఈశాన్య ఫ్రాన్స్‌లో క్రిస్మస్ వేడుకలకు, పారిస్‌లోని అధికా రిక వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. పశ్చిమ దేశాలకు వలస వచ్చే వారికోసం వేటాడే నేరస్థ ముఠాలు ఈ ఉదంతం కారణంగా, కనీసం కొంతకాలం అయినా ఇలాంటి విమాన వలసలకు ప్రయత్నించవు. అమెరికన్ విదేశాంగ శాఖ శిక్షా త్మకమైన వలస చట్టాన్ని అమలు చేయడానికి కొన్ని వారాల ముందు, హైతీ తన రాజధాని నుండి నికరాగ్వాకు అన్ని విమానాలను నిలిపి వేసింది. భారతదేశంలాగే, ప్రస్తుతం హైతీ కూడా అక్రమ వలసలకు ఒక వనరుగా ఉందని అమెరికా పేర్కొంది. సంపన్న దేశాలకు తమను అక్రమంగా తరలించేందుకు లక్షల రూపాయలు అప్పులు చేసి నికరాగ్వాకు వెళ్లే విమానం ఎక్కుతున్నారు భారతీయులు. ప్రభుత్వం ఈ నష్టాన్ని నివారించడంలో ఆలస్యం చేసింది. ఎట్టకేలకు డిసెంబరు 21న ఆర్భాటంగా, ఆకర్షణీయమైన సంక్షిప్త నామంతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. యువత, నైపుణ్యం కలిగిన నిపుణుల కోసం క్రమబద్ధమైన సహాయకరమైన వలసను ప్రోత్సహించే ‘ప్రయాస్’ కార్యక్రమం అది. అంతర్జాతీయ వలస చట్రానికి సంబంధించిన విషయాలపై మెరుగైన అవగాహనను ప్రోత్సహించడానికి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మెరుగైన సమన్వయం కోసం ఒక రోడ్‌మ్యాప్‌ను అభివృద్ధి చేయడం దీని లక్ష్యం. నికరాగ్వాకు ఇటీవల కనీసం రెండు విమానాల్లో వెళ్లిన భారతీయులను ఎవరూ గుర్తించలేదని పోలీసులు ఇప్పుడు చెబుతున్నారు. అనేక వందల మంది భారతీయ అక్రమ వలసదారులు దొరకకుండా తప్పించుకు పోతుండటాన్ని నాటకీయంగా చూపించే తమ ప్రయత్నంలో అమెరికా, ఫ్రెంచ్ ప్రభుత్వాల నేరనిరోధక ఏజెన్సీలు... ప్రధానంగా పంజాబ్, గుజరాత్ల నుండి యూరప్ గుండా పశ్చిమ అర్ధ గోళానికి వలసదారులను చేర్చడం కోసం పనిచేస్తున్న విస్తృత నేరస్థ నెట్వర్క్ గురించి భారతదేశాన్నే కాకుండా ఐక్యరాజ్యసమితిని కూడా చీకటిలో ఉంచాయి. ప్రయాస్ అనేది ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ వలస సంస్థ, భారతీయ అంతర్జాతీయ వ్యవహారాల మండలి... ఉమ్మడి ప్రాజెక్ట్. మరో విడ్డూరం ఏమిటంటే, లెజెండ్ ఎయిర్‌లైన్స్ చార్టర్ ఫ్లైట్ ఉదంతం వెలుగులోకి రావడానికి ఒక వారం ముందు, ‘నమోదు కాని రిక్రూట్మెంట్ ఏజెంట్ల వల్ల మోసపోతున్న విదేశీ ఉద్యోగార్థుల సంఖ్య భారీగా పెరిగింది’ అని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. విదేశాలకు వెళ్లాలనుకునే భారతీయులపై వేటు వేయడం ప్రపంచ స్థాయిలో జరుగుతోంది. ‘చాలా తూర్పు యూరోపియన్ దేశాలు, కొన్ని గల్ఫ్ దేశాలు, మధ్య ఆసియా, ఇజ్రాయెల్, కెనడా, మయన్మార్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్లలో వీటికి సంబంధించి కేసులు నమోదవుతున్నాయి’ అని హెచ్చరించింది. పార్లమెంట్‌లోని ప్రతి సెషన్ లోనూ, అక్రమ వలసల శాపం గురించి జీరో అవర్‌లో పెద్ద మొత్తంలో ప్రశ్నలు వస్తుంటాయి. భారత విదేశాంగ మంత్రి లోక్‌సభలో ఒక ప్రకటన చేస్తూ ఈ సమస్య సంక్లి ష్టత రీత్యా తాము నిస్సహాయంగా ఉంటున్నట్టు పేర్కొన్నారు. ‘బహి ష్కరణ ఉత్తర్వులు వచ్చే వరకు విదేశాలు చాలావరకు తమ తమ దేశాల్లో అక్రమంగా ఉంటున్న వారి గురించి సమాచారాన్ని అందించవు’ అని చెప్పారు. ‘విదేశాల్లో చట్టవిరుద్ధంగా ఉంటున్న లేదా పని చేస్తున్న భారతీయుల సంఖ్యపై మన దౌత్య కార్యాలయాల వద్ద ఎటువంటి విశ్వసనీయమైన డేటా లేదు’ అని అంగీకరించారు. ఇది షాకింగ్‌గా ఉందని చెబితే సమస్యను తక్కువ అంచనా వేయడమే అవుతుంది. వాట్రీ విమానాశ్రయ ఘటన ఉదంతం, సమస్య తీవ్ర తనూ, సమగ్ర వలస విధాన సంస్కరణల అవసరాన్నీ సూచిస్తుంది. ఈ విషయంలో విఫలమైతే ఎక్కువ మంది భారతీయులు... అంత ర్జాతీయ నేరస్థ ముఠాల బాధితులుగా మారతారు. కేపీ నాయర్ వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకులు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
వాళ్లు ఇండియాకు రావొచ్చు!
న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కేంద్రం తాజాగా మరికొన్ని సడలింపులు ప్రకటించింది. ఇప్పటికే కొన్ని ప్రత్యేకంగా ఎంచుకున్న కేటగిరీల కింద దేశంలోకి వచ్చేందుకు విదేశీయులు, భారత పౌరులకు అనుమతించిన ప్రభుత్వం, ఇప్పుడు ఓసీఐ(ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా), పీఐఓ(పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఓరిజన్) కార్డు హోల్డర్ల ప్రయాణానికి అనుమతినిచ్చింది. చట్టబద్ధమైన ఎయిర్‌పోర్టులు, సీపోర్టు చెక్‌పోస్టుల గుండా వాయు, జల మార్గాల ద్వారా దేశంలోకి ప్రవేశించవచ్చని పేర్కొంది. అయితే టూరిస్టు వీసా కింద దేశానికి వచ్చే ప్రయాణీకులకు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేసింది. (చదవండి: విశాఖలో జల ప్రవేశం చేసిన ఐఎన్ఎస్ కవరట్టి) అదే విధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆరోగ్య శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి ప్రయాణీకులు కోవిడ్ నిబంధనలు పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తాజాగా ప్రకటించిన నిబంధనల్లో భాగంగా, ఎలక్ట్రానిక్, టూరిస్ట్, మెడికల్ వీసా మినహా మిగిలిన వీసాలన్నింటినీ పునరుద్ధరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఒకవేళ ఆ వీసాల గడువు తేదీ గనుక ముగిసినట్లయితే, తాజా దరఖాస్తులతో మళ్లీ వీసా పొందవచ్చని పేర్కొంది. ఇక వైద్య చికిత్స కోసం భారత్‌కు రావాలనుకున్న విదేశీయులు మెడికల్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ గురువారం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. -
ఐదేళ్లలో 95.47 కోట్లు; 2019-20లో 37 కోట్లు!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. భద్రతా పరమైన ఖర్చు (సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్) స్కీమ్ పరిధిలో ఈ జిల్లా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఈ పథకం కింద 2019-20లో రూ. 37.23 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది. గత ఐదేళ్లలో మొత్తంగా 95.47 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.(చదవండి: అరకు లోయ పర్యాటకులకు రైల్వే శుభవార్త) ఇందులో భాగంగా నక్సలైట్ల లొంగుబాట్లను ప్రోత్సహించే పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. లొంగిపోయినవారు వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా శిక్షణ ఇవ్వడంతో పాటుగా.. ఆ సమయంలో నెలకు రూ. 6,000 స్టైపండ్ కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పలువురు ఎంపీల ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కేజీ బేసిన్లో 9.55 బిలియన్ టన్నుల ఆయిల్ ! దేశవ్యాప్తంగా సహజవాయువు, పెట్రోలియం లభ్యతపై అధ్యయనం జరిగిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. తాజా అధ్యయనాల ప్రకారం 42 బిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ లభ్యత ఉందని అంచనాలున్నాయన్నారు. కేజీ(కృష్ణా- గోదావరి) బేసిన్లో 9.55 బిలియన్ టన్నుల ఆయిల్ ఉందనే అంచనాలు ఉన్నట్లు తెలిపారు. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో ఎక్కువ లభ్యత ఉందన్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రశ్నకు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. -
ఆ బాధ్యత రాష్ట్రాలదే: కేంద్ర హోం శాఖ
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాల దర్యాప్తులో సిబ్బందిని బలోపేతం చేసే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర హోం శాఖ తెలిపింది. పోలీసులకు సైబర్ నేరాలపై శిక్షణ, ఐటీ నిపుణులను పోలీసు శాఖలో నియామకాలు చేపడుతున్నాయని పేర్కొంది. ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017లో 3,466, 2018లో 3,353 ఆన్లైన్ మోసాలు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ కేసుల దర్యాప్తులో సంస్థలు ఐటీ నిపుణుల సహాయం తీసుకుంటున్నాయని పేర్కొంది. (చదవండి: చైనాకు దీటుగా బదులిస్తాం) ఇక సైబర్ నేరాల విషయంలో పోలీసులు, ప్రాసిక్యూటర్లు, జ్యుడీషియల్ అధికారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు కేంద్రం చర్యలు చేపట్టిందన్న హోం శాఖ, సైబర్ నేరాల్లో ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర హోం శాఖ ఈ మేరకు సమాధానాలిచ్చింది.(చదవండి: -
ఆ ఉత్తర్వులను ఉపసంహరించుకున్న కేంద్రం
సాక్షి, న్యూడిల్లీ: ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పారామిలిటరీ క్యాంటీన్లలో దిగుమతి అయిన 1,000పైగా ఉత్పత్తులను నిషేధించాలన్న ఉత్తర్వులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఉపసంహరించుకుంది. దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల్లో అనేక వస్తువులు భారత్‌లోనే తయారైనట్లు వెల్లవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. పారామిలిటరీ క్యాంటీన్లు దేశీయ పరిశ్రమలకు మద్దతునిచ్చే క్రమంలో జూన్ 1వ తేదీ నుంచి స్వదేశీ లేదా భారతీయ ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తామని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. (‘కరోనా వ్యాప్తిలో భారత్ అగ్రస్థానానికి వెళ్తుంది’) ఇటీవల క్యాంటీన్లలో దిగుమతి అయిన ఉత్పత్తులను పరిశీలించగా అందులో నిషేధించబడిన ‘నుట్రెల్లా, కిండర్ జాయ్, టిక్ టాక్, హార్లిక్స్, ఓట్స్, యురేకా ఫోర్బ్స్, టామీ హిల్ఫిగర్ షర్ట్స్, అడిడాస్ బాడీ స్ప్రే’లు వంటి బ్రాండ్లు ఉన్నట్లు గమనించారు. మైక్రోవేవ్ ఓవెన్లు వంటి ఇతర గృహోపకరణాల వస్తువులను కూడా తీసివేసింది. అంతేగాక స్కెచర్స్, ఫెర్రెరో, రెడ్‌బుల్, విక్టోరినాక్స్, సఫిలో (పోలరాయిడ్, కారెరా) సహా దిగుమతి చేసుకునే ఏడు సంస్థల ఉత్పత్తులను కూడా నిషేధ జాబితా నుంచి తొలగించింది. ఈ జాబితాలో ఉన్న భారత ఉత్పత్తులైన డాబర్, బజాజ్, ఉషాతో సహా అనేక భారతీయ ఉత్పత్తులను కూడా ఈ జాబితా నుంచి తొలగించినట్లు హోంమంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హోంమంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి స్పందిస్తూ.. ‘‘మా అధికారి మంత్రిత్వ శాఖను సంప్రదించకుండానే దిగుమతి ఉత్పత్తులను తీసుకున్నారు. ఇండియా ఉత్పత్తులను కూడా నిషేధ బ్రాండ్లలో చేర్చిన సదరు సీనియర్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకుంటాం. అంతేగాక పూర్వ జాబితాను పరిశీలించి దానిని సవరించాం. త్వరలో సవరించిన జాబితాను పంపిస్తాం’’ అని చెప్పారు. ఈ క్యాంటీన్ల మాతృసంస్థ కేంద్రీయ పోలీసు కళ్యాణ్ భండార్స్ అన్ని ఉత్పత్తులను మూడు వర్గాలుగా విభజించారు. కేటగిరి1- భారతదేశంలో పూర్తిగా తయారైన ఉత్పత్తులను కలిగి ఉంది. కేటగిరీ 2- దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలతో ఉత్పత్తులు ఉన్నాయి, కానీ అవి భారతదేశంలో తయారు చేయబడతాయి లేదా సమావేశమవుతాయి. కేటగిరి 3 - పూర్తిగా దిగుమతి చేసుకున్న ఉత్పత్తులు మాత్రమే ఉంటాయి. -
కీలక రంగాలకు సడలింపు ఇచ్చిన మమత
కోల్కత్తా: లాక్డౌన్ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని దినసరి కూలీలకు, కార్మికులకు జీవనోపాధికి వీలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఏప్రిల్ 20 నుంచి ఆర్థిక కార్యకలాపాలకు అనుమతినిచ్చినట్లు ప్రకటించారు. ‘కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా.. మేమూ కొన్ని అదనపు కార్యకలాపాలను కూడా అనుమతిస్తున్నాము. కార్మికులు విధుల్లో సరైన శానిటైజేషన్ సదుపాయాలు, మాస్క్‌లు ధరించటంతో పాటు సామాజిక దూరానికి కట్టుబడి ఉండటం వంటి నిబంధనలు ఆయా శాఖలు పాటించడం తప్పనిసరి’ అని మమత తెలిపారు. కాగా ఏప్రిల్ 20 నుంచి కొన్ని రంగాలకు మినహాయింపులు ఇస్తున్నట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మమతాబెనర్జీ గురువారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. హాట్‌స్పాట్ సడలింపులు వీటికి వర్తించవు... కేంద్రం ప్రకటించిన హాట్‌స్పాట్ జిల్లాల జాబితాతో బెంగాల్‌కు చెందిన 4 జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ జిల్లాలో జనప నార మిల్లులు ఎక్కువగా ఉన్నందున హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన సడలింపులు ఈ జిల్లాలకు వర్తించవు అని సీఎం మమత తెలిపారు. ఈ మార్గదర్శకాలు వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలహీనపడకుండా ఉపయోగపడతాయని తామే ఆశిస్తున్నట్లు మమతా చెప్పారు. ఇక సెప్టెంబర్ నెల వరకు రాష్ట్రంలోని దాదాపు ఏడు కోట్ల మందికి ప్రభుత్వం ఉచిత రేషన్ అందిస్తుందని తెలిపారు. ఈ కార్యకలాపాలను ప్రారంభించడం వల్ల గ్రామీణ ప్రజలకు కొంత జీవనోపాధి అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు. (లాక్డౌన్ సడలించే రంగాలు ఇవే..) 100 రోజు ఉపాధి హామీ పథకం కార్మికులు కూడా ఈ ప్రాజెక్టుల్లో నిమగ్నమవ్వోచ్చు.. నీటిపారుదల, రహదారి నిర్మాణం, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్, సివిల్ నిర్మాణానికి సంబంధించిన చిన్న ప్రాజెక్టుల నిర్మాణం స్థానిక కార్మికులతో అనుమతించబడతాయి. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న కార్మికులకు వెసులు బాటు కల్పించింది. ప్రాజెక్టులు చేపట్టే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోజులలో కార్మికులకు పని లభించేలా చూడటానికి ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఒక యంత్రాంగం రూపొందించబడుతుంది అని మమతా చెప్పారు. కాగా గ్రామీణ ప్రాంతాల్లో, పారిశ్రామిక సమూహాలు లేదా ఎస్టేట్ల వద్ద పరిశ్రమలను, యూనిట్లను నడపాలనుకునే వారు, ప్రధాన కార్యదర్శికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని మమతా పేర్కొన్నారు. బెంగాల్లో అనుమతించబడే ఆర్థిక రంగాలు ఇవే: టీ ప్రాసెసింగ్.. ఇది 25 శాతం శ్రామిక శక్తితో అనుమతించబడుతుంది. రబీ పంట కోతలో 100 వంద రోజుల పని పథక కార్మికులకు అనుమతి గిడ్డంగులు రబీ పంట కోతకు ప్రత్యక్ష సంబంధం కలిగిన పనునలు ఇటుక బట్టీలో 15 శాతంతో కార్మికులలో రోజు పనిచేయడానికి అనుమతి గ్రామీణ ఉద్యోగ పథకాల ప్రాజెక్టులైన భూ అభివృద్ధి, నీటి సేకరణ, నర్సరీలకు సంబంధిత పనులు జనపనార మిల్లులు, 15 శాతం శ్రామిక శక్తితో పనిచేయడానికి అనుమతి కాగా రోజు రోజుకు దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తున్నందున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా మే 3 వరకూ లాక్డ్న్ను పొడిగించిన విషయం తెలిసిందే. లాక్డౌన్ కారణంగా ఇప్పటికే దినసరి కూలీలు, వలస కూలీల, కార్మికుల ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారింది. అంతేగాక దేశ ఆర్థిక పరిస్థితి కూడా అతలాకుతలంగా మారింది. ఈ నేపథ్యంలో కొన్ని అత్యవసర రంగాలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిబంధనలతో కూడిన సడలింపులు విధిస్తూ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. (మద్యం హోం డెలివరీకి సీఎం గ్రీన్ సిగ్నల్!) -
లాక్డౌన్ సడలించే రంగాలు ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19 విస్తరణను అరికట్టడానికి దేశంలో ప్రస్తుతం అమలులో ఉన్న లాక్‌డౌన్‌ను మే 3 వరకు పొడిగిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా గుర్తించిన ప్రాంతాల్లో ఏప్రిల్ 20వ తేదీ నుంచి కొన్ని కార్యకలాపాలు పునః ప్రారంభించడానికి అనుమతించనున్నట్టు కూడా ప్రధాని ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం పలు మార్గదర్శకాలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఎంపిక చేసిన కార్యకలాపాలను కరోనా వ్యాప్తి గల ప్రాంతాల్లో అమలులో ఉన్న నిషిద్ధ కార్యకలాపాలపై ఆంక్షలను తొలగించడంతో పాటు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కార్యకలాపాల అమలుకు కూడా అనుమతిస్తున్నట్టు ఆ ఉత్తర్వులో పేర్కొంది. లాక్డౌన్ తొలి దశలో సాధించిన లాభాలను ఏకీకృతం చేయడం, ఆయా ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని మరింతగా అదుపు చేయడం, అదే సమయంలో ఆయా ప్రాంతాల్లోని వ్యవసాయదారులు, కార్మికులు, రోజువారీ వేతనాలపై ఆధారపడిన కార్మికులకు ఊరట కల్పించడం ఈ సవరించిన మార్గదర్శకాల లక్ష్యమని తెలిపింది. (ఏప్రిల్ 20 తర్వాత లాక్డౌన్ సడలింపు) ఏయే రంగాలకు అనుమతులు.. వ్యవసాయ, అనుబంధ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరిగేందుకు సహాయపడడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యంతో పని చేసేందుకు దోహదపడడం, రోజువారీ కూలీలు, ఇతర కార్మిక శక్తి ఉపాధి అవకాశాలు కొనసాగేలా చూడడం, తగు రక్షణలు చట్టబద్ధంగా ఆయా పనుల్లో తీసుకోవలసిన జాగ్రత్తలతో ఎంపిక చేసిన పారిశ్రామిక కార్యకలాపాలు పునరుద్ధరించడం. డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడం లక్ష్యంగా 2020 ఏప్రిల్20వ తేదీ నుంచి పైన సూచించిన కార్యకలాపాలను అనుమతించడం జరుగుతుంది. అదే సమయంలో దేశవ్యాప్తంగా కోవిడ్-19 అదుపు చర్యలు పాటించడం కోసం కోవిడ్-19 నివారణ జాతీయ నిర్దేశకాలు కూడా జారీ చేశారు. వైపరీత్యాల నిర్వహణ చట్టం, 2005 పరిధిలో జిల్లా మెజిస్ర్టేట్లు వాటిని కట్టుదిట్టంగా అమలుపరుస్తూ ఉల్లంఘించిన వారికి జరిమానాలు, శిక్షలు విధించడం తప్పనిసరి. అత్యవసర వస్తువులు, అత్యవసరం కానివి అనే వివక్ష ఏదీ లేకుండా అన్ని రకాల వస్తువుల రవాణాను అనుమతించాలి. నోటిఫైడ్ మండీలు, ప్రత్యక్ష, వికేంద్రీకృత మార్కెటింగ్ విధానాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల సమీకరణ, మార్కెటింగ్, ఎరువులు, పురుగుల మందులు, విత్తనాల తయారీ, పంపిణీ, రిటైల్, పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ, పశుసంవర్థక కార్యకలాపాలు, తేయాకు, కాఫీ, రబ్బర్ తోటల పెంపకం సహా అన్ని రకాల వ్యవసాయ కార్యకలాపాలకు అనుమతులు ఉంటాయి. (లాక్‌డౌన్‌పై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: సజ్జనార్) ‘గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉత్తేజం కలిగించడం కోసం ఫుడ్ ప్రాసెసింగ్ సహా గ్రామీణ ప్రాంతాల్లో అన్ని పరిశ్రమలు నడిచేందుకు అనుమతించాలి. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, ఇరిగేషన్ ప్రాజెక్టులు, భవనాలు, పారిశ్రామిక ప్రాజెక్టుల నిర్మాణ కార్యకలాపాలను అనుమతించాలి. అలాగే నీటి పారుదల వసతులు,జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం ఇస్తూ ఎంఎన్ఆర్ఇజిఏ కింద పనుల నిర్వహణ, గ్రామీణ కామన్ సర్వీసు కేంద్రాల పనులను అనుమతించాలి. ఈ కార్యకలాపాలన్నీ గ్రామీణ కార్మికులు, వలస కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాయి. కార్మికులు వచ్చి పోవడంపై నిరంతర పర్యవేక్షణ గల సెజ్‌లు, ఎగుమతి ఆధారిత యూనిట్లు, పారిశ్రామిక కేంద్రాలు, పారిశ్రామిక టౌన్ షిప్ లలో తగు ఎస్ఓపి అమలుపరచడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలతో తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతించవచ్చు. ఐటి హార్డ్ వేర్, నిత్యావసర వస్తువుల తయారీ, ప్యాకేజింగ్ కార్యకలాపాలను కూడా అనుమతించాలి. బొగ్గు, ఖనిజాలు, చమురు తయారీ అనుమతించిన కార్యకలాపాల్లో ఉన్నాయి. భద్రతాపరమైన తగు జాగ్రత్తలు తీసుకుంటూ, సామాజిక దూరం పాటిస్తూ పారిశ్రామిక, తయారీ కార్యకలాపాల పునరుద్ధరణకు ఈ చర్యలు దోహదపడతాయి. తద్వారా ఉపాధి అవకాశాలుఏర్పడతాయి. అంతే కాదు, పారిశ్రామిక రంగానికి అవసరం అయిన రుణ మద్దతు ఇవ్వడంతో పాటు ఆర్థిక వ్యవస్థలో తగినంత నగదు లభ్యత కోసం ఆర్థిక రంగానికి వెన్నెముకగా నిలిచే ఆర్ బిఐ, బ్యాంకులు, ఎటిఎంలు, సెబీ నోటిఫై చేసిన పెట్టుబడి, రుణ మార్కెట్లు, బీమా కంపెనీలు కూడా పని చేస్తాయి. (అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా) సేవల రంగానికి, జాతీయ వృద్ధికి డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అత్యంత కీలకం. అందుకు దీటుగా ఇ-కామర్స్ కార్యకలాపాల నిర్వహణ ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరం అయిన ఐటీ, ఐటీ ఆధారిత సర్వీసుల కార్యకలాపాలు, డేటా కాల్ సెంటర్ల నిర్వహణ; ఆన్ లైన్ బోధన, దూర విద్య వంటి కార్యకాలాపాలకు కూడా అనుమతి ఉంది.ఆరోగ్య సర్వీసులు, ఎలాంటి గోప్యత అవసరం లేకుండా ప్రభుత్వ యుటిలిటీలు నిత్యావసర వస్తువుల సరఫరా వ్యవస్థ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల కీలక కార్యాలయాల్లో అవసరమైనంత మంది ఉద్యోగులతో పని చేసేందుకు సవరించిన మార్గదర్శకాలు అనుమతిస్తున్నాయి. మొత్తం మీద గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయాభివృద్ధి, ఉపాధి కల్పన కోణంలో ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా భావించే అన్ని రంగాల కార్యకలాపాలు ఆయా ప్రాంతాల్లో కోవిడ్-19 అదుపు చేయడానికి అమలులో ఉండే చర్యలు కట్టుదిట్టంగా పాటిస్తూ పని చేసేలా అనుమతించడం ఈ సవరించిన ఏకీకృత మార్గదర్శకాల లక్ష్యం’ అని కేంద్ర ప్రభత్వుం జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొంది. -
‘నిజాముద్దీన్’పై కేంద్ర హోంశాఖ దర్యాప్తు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కట్టడి నేపథ్యంలో నిజాముద్దీన్ మర్కజ్‌పై లోతైన దర్యాప్తు చేపట్టినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం వెల్లడించింది. ఈ క్రమంలో మర్కజ్ కార్యక్రమానికి ఎవరెవరు హాజరయ్యారన్న దానిపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపింది. ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్, నేపాల్, మయన్మార్, బంగ్లాదేశ్, శ్రీలంక, కజకిస్తాన్ నుంచి వచ్చిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు హోంశాఖ నిర్థారించింది. విదేశాల నుంచి వచ్చిన వారు మర్కజ్ భవనంలో రిపోర్టు చేసి దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్తారని, వీరు వివిధ రాష్ట్రాల్లోని జిల్లా కోర్డినేటర్ ద్వారా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని చెప్పింది. మార్చి 21 నాటికి మర్కజ్ భవనంలో 1746 మంది ఉన్నారని, వారిలో 1530 మంది దేశీయలు కాగా.. 216 మంది విదేశీయలు ఉన్నట్లు తెలిపింది. (‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’) ఇక భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారని హోంశాఖ పేర్కొంది. కాగా ఈ 824 మంది విదేశీయులను కోవిడ్-19 స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి వారిని క్వారంటైన్‌కు పంపాలని రాష్ట్రాల పోలీసులకు సమాచారం అందించినట్లు తెలిపింది. అదే విధంగా వీరితో పాటు భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలు, జిల్లా కోర్డినేటర్లకు కూడా స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని పోలీసులను ఆదేశించామంది. ఇప్పటి వరకు 2137 మంది భారత తబ్లీక్ జమాత్ కార్యకర్తలను పరీక్షించి అవసరమైన మేరకు క్వారంటైన్‌కు తరలించామని తెలిపింది. దీంతో పాటు జమాత్ కార్యకర్తలు తిరిగిన ప్రాంతాలు, ప్రైమరీ కాంట్రాక్ట్ వ్యక్తుల వివరాలను సేకరించాలని ఐబీ రాష్ట్రాల డీజీపీలకు సూచించామని, ఈ ఆదేశం మేరకు రాష్ట్రాల పోలీసులు చర్యలు చేపడుతున్నారని తెలిపింది. మర్కజ్ భవనంలో మార్చి 26 నుంచి తబ్లీక్ జమాత్ కార్యకర్తలు అందరినీ స్క్రీనింగ్ చేస్తున్నామని కూడా తెలిపింది. ఇక 1203 మందికి స్క్రీనింగ్ చేయగా 303 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించామంది. వారిని దిల్లీలోని వివిధ ఆస్పత్రులకు తరలించగా.. మిగతావారిని నరేలా, బక్కర్ వాలా, సుల్తాన్ పూరిలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించామని పేర్కొంది. జనవరి 1 నుంచి తబ్లీక్ జమాత్ కార్యక్రమాల కోసం భారత్ వచ్చిన 2100 మంది విదేశీయులను గుర్తించామని, ఈ మేరకు ఇమీగ్రేషన్ బ్యూరో ఆయా రాష్ట్రాలకు విదేశీయుల రాకపై వివరాలను అందిస్తోందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. -
ఎన్నార్సీ అమలుపై కేంద్ర హోం శాఖ వివరణ
-
ఎన్నార్సీ అమలుపై కేంద్రం కీలక ప్రకటన!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న జాతీయ పౌర రిజిస్టర్(ఎన్నార్సీ) అమలు విషయంపై కేంద్రం మంగళవారం వివరణ ఇచ్చింది. ప్రస్తుతానికి దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ... ‘‘ఇప్పటి వరకు ఎన్నార్సీపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’’ అని లోక్‌సభలో విపక్షాలకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. జాతీయ స్థాయిలో ఎన్నార్సీ చేపట్టే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. కాగా బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్నార్సీపై చర్చ జరగాలంటూ విపక్షాలు సోమవారం పట్టుబట్టిన విషయం తెలిసిందే. (పౌరసత్వ చట్టం: ఎందుకీ ఆందోళనలు?) ఈ రెండు అంశాలపై కేంద్రం సమాధానం చెప్పాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. వీటిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగేంత వరకు బడ్జెట్‌పై చర్చింబోమంటూ కాంగ్రెస్ పార్టీ సహా డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, ఎన్సీపీ, టీఎంసీ, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు నోటీసులు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో హోం శాఖ ఎన్నార్సీపై వివరణ ఇచ్చింది. ఎన్నార్సీ అమలుపై ఎలాంటి సందేహాలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఇక సీఏఏ తర్వాత దేశ వ్యాప్తంగా ఎన్నార్సీ అమలు చేస్తామంటూ కేంద్రం హోం మంత్రి అమిత్ షా గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో... మాట మార్చారు. ఇప్పటికిప్పుడు ఎన్నార్సీ అమలు చేయబోమని తెలిపారు.(ఎన్పీఆర్కు, ఎన్నార్సీకి సంబంధం లేదు: అమిత్ షా) ఇదిలా ఉండగా.. జాతిపిత మహాత్మా గాంధీపై బీజేపీ ఎంపీ అనంత్ కుమార్ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు లోక్‌సభలో దుమారానికి దారి తీశాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతోంది. కాగా కేంద్ర ప్రభుత్వంపై తీసుకువచ్చిన సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్పై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.(కేంద్రం కీలక నిర్ణయం: ఎన్పీఆర్ అంటే ఏమిటి?) -
అయోధ్య తీర్పు: దేశ వ్యాప్తంగా హైఅలర్ట్
సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తున్న చరిత్రాత్మక అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే తన తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. తీర్పుపై ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైనదిగా భావిస్తోన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఈ మేరకు గురువారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా తీర్పుపై ఎవరూ వివాదస్పద రీతిలో బహిరంగ ప్రకటన చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు ఇదివరకే సూచించారు. ఈ మేరకు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని తీర్పులో స్పందించిన విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు ఇది వరకే స్పష్టమైన హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. తీర్పు వెలువడిన తరువాత దానికి వ్యతిరేకంగా, సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేశారు. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని శాంతి భద్రతలను దెబ్బతీస్తే అలాంటివారిని ఉపేక్షించబోమని, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ డీజీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ నేపథ్యంలో ఆ లోపు రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై తీర్పు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. 17వ తేదీలోగా సుప్రీంకోర్టు పని దినాలు కూడా తక్కువగా ఉండడంతో ఏ రోజైనా సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదంపై తీర్పును వెలువరించే అవకాశం ఉంది. -
ఎట్టకేలకు కదలిక
మూడేళ్లు గడిచాక... దాదాపు 48మంది మరణించాక... ఒక చట్టం చేసే అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించాక కేంద్ర ప్రభుత్వంలో కదలిక వచ్చింది. మూక దాడులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫార్సు చేయటం కోసం ఉన్నతాధికారుల కమిటీ, మంత్రుల బృందం ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది. మూక దాడులు జరిగినప్పు డల్లా ఆరోపణలు రావడం, వాటిని బీజేపీ, సంఘ్ పరివార్ సంస్థలు ఖండించడం, ఎదురు దాడి చేయడం తప్ప దాడుల్ని ఆపడానికి ఎలాంటి చర్యలు అవసరమన్న విషయంలో కేంద్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టలేదు. మూక దాడులు జరగకుండా చూడమని రాష్ట్రాలనూ, కేంద్ర పాలిత ప్రాంతాలనూ కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ నెల మొదట్లో కోరింది. పిల్లల్ని అపహరించుకుపోతున్నారన్న అను మానంతో వ్యక్తులను కొట్టి చంపుతున్న ఘటనలు ముదిరాక ఈ పని చేసింది. గోరక్షణ పేరుతో మూకలు చెలరేగినప్పుడే ఇలాంటి ప్రయత్నం జరిగితే... ఈ అనాగరిక హత్యాకాండను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నదన్న సంకేతాలు వెళ్తే పరిస్థితి ఇంతగా దిగజారేది కాదు. రాజస్తాన్‌లోని అల్వార్ జిల్లాలో శనివారం జరిగిన ఉదంతమే దీనికి రుజువు. మూక దాడులు జరిగినప్పుడల్లా పోలీసులు నిందితుల్ని కాపాడుతున్నారని, అరెస్టులో అల సత్వం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు రావడం రివాజు. తాజా ఉదంతంలో పోలీసుల ప్రవర్తన మరింతగా దిగజారింది. ఉన్మాదులు తీవ్రంగా కొట్టడంతో ఒంట్లో ప్రతి అవయమూ చిట్లిపోయి నెత్తుటి ముద్దలా మారిన బాధితుడి గురించి వారు అసలు పట్టించుకోనేలేదు. గో రక్షక భటుల్లా మారి అక్కడున్న రెండు ఆవులనూ గోశాలకు తరలించేలా చూసి, ఆ తర్వాత ఓ దుకాణం వద్ద తాపీగా టీ తాగి అటుపై అతడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించి, అక్కడినుంచి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు మనిషిని తీసుకెళ్లారంటే అది అబద్ధమవుతుంది. అతని మృత దేహాన్ని తీసుకెళ్లారని చెప్ప టమే సబబు. ఘటన జరిగింది మొదలు ఆసుపత్రికి తీసుకెళ్లేవరకూ చూస్తే మూడుగంటల సమ యం పట్టింది. ఈ సమయంలో బాధితుడు ఎంతసేపు ప్రాణాలతో ఉన్నాడోగానీ... ముందు నడి రోడ్డుపై, ఆ తర్వాత పోలీస్ వ్యాన్‌లో, అటుపై పోలీస్‌స్టేషన్‌లో నరకయాతన అనుభవించి ఉంటాడు. తమకు పశువులే తప్ప మనుషుల ప్రాణాలంటే లెక్కలేదని చెప్పే ఉన్మాద మూకలకూ, ఈ పోలీసులకూ తేడా ఏమైనా ఉందా? మూక దాడుల్ని చూసీచూడనట్టు వదిలేయటమే కాదు... అలాంటి దాడుల్లో పాల్గొన్నవారికి వెన్నుదన్నుగా ఉంటున్న ప్రభుత్వాల తీరువల్లే ఈ దుస్థితి ఏర్పడింది. ఇదే అల్వార్ జిల్లాలో ఇంతవరకూ అయిదుగుర్ని ఉన్మాద మూకలు పొట్టనబెట్టుకోగా... వారిలో చాలామంది బెయిల్‌పై బయటికొచ్చారు. నిరుడు ఏప్రిల్‌లో 55 ఏళ్ల పాల ఉత్పత్తిదారును ఇదే సాకుతో గోరక్షక మూక తీవ్రంగా కొట్టి చంపింది. చనిపోయే ముందు బాధితుడిచ్చిన మరణ వాంగ్మూలంలో దాడికి కారకులైన అయిదుగురి పేర్లిస్తే... పోలీసులు మాత్రం వారంతా ఘటన జరిగినప్పుడు వేరేచోట ఉన్నారని తేల్చి అసలు అరెస్టే చేయలేదు! రాజస్తాన్ ప్రభుత్వం ఏ ఉదం తంలోనూ బాధిత కుటుంబాలకు తక్షణ పరిహారం అందించలేదు. తాజా ఉదంతంలో మాత్రం రూ. లక్షా 25 వేలు ఇస్తామని ప్రకటించింది. అదే పెద్ద ఔదార్యమనుకోవాలి! దాడిలో మరణించిన రక్బార్‌ఖాన్ పశువులు అమ్మడం కొనడం ప్రధాన వ్యాపకంగా ఉండే రబారీ సంచారతెగకు చెందిన వాడు. ఆ తెగలో హిందువులూ ఉంటారు. ముస్లింలూ ఉంటారు. వందల ఏళ్లనుంచి రబారీ తెగ ఆ వ్యాపారమే చేస్తోంది. గోరక్షణ మూకల ఆగడాలు మితిమీరుతున్నాయి గనుక దాన్ని ప్రస్తుతానికి మానుకోవాలని కొందరు హితవు చెప్పినా, ఇది తప్ప తమకు బతుకుతెరువు లేదని ఆ తెగ మొత్తు కుంటోంది. గుజరాత్ నుంచి రాజస్తాన్ వరకూ ఉండే వందల కిలోమీటర్ల దూరం వీరు నడిచి పోతూ పశువుల సంతలో కొనుగోళ్లు, అమ్మకాలు చేస్తారు. గొర్రెలు, ఒంటెలు, ఎడ్లు, ఆవులు... ఇలా వేటిని తోలుకుంటూ వెళ్లినా మూక ఎదురుపడినప్పుడల్లా కప్పం కట్టి బతుకు కొనుక్కుంటు న్నామని ఆ తెగ అంటోంది. గోరక్షణ పేరుతో జరిగిన దాడులతోపాటు పిల్లల్ని అపహరిస్తున్నారన్న అనుమానంతో కొట్టి చంపుతున్న కేసులు కూడా ఈమధ్య పెరిగాయి. ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి హింసాయుత వాతా వరణాన్ని ఎలా పెంచుతుందో చెప్పడానికి మూకదాడులే ఉదాహరణ. 2015 వరకూ గోరక్షణ దాడుల్లో అత్యధికభాగం అంటే 76 శాతం ఉత్తరాదిలో జరిగాయని, ఆ తర్వాత కాలంలో అవి దాదాపు దేశమంతా వ్యాపించాయని ‘ఇండియాస్పెండ్’ వెబ్సైట్ గణాంకాలు చెబుతున్నాయి. చిత్రమేమంటే జాతీయ క్రైం రికార్డుల బ్యూరో(ఎన్సీఆర్బీ) దగ్గర అసలు గోరక్షకæ దాడుల లెక్కలే లేవు! పిల్లల్ని అపహరించడానికొచ్చారన్న అనుమానంతో 2012లో ఒకే ఒక దాడి జరగ్గా నిరుడు జనవరినుంచి లెక్కేస్తే 69 మూకదాడి ఉదంతాల్లో 33మంది చనిపోయారని ఆ వెబ్సైట్ వెల్లడిం చింది. గోరక్షక మూకల దాడుల్ని అదుపు చేయటంలో రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం కావటం పర్యవ సానంగానే అవి వేరే రకాల దాడులకు చోటిచ్చాయి. కనీసం ఈ దశలోనైనా కదిలినందుకు కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించాలి. ఇప్పుడు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబ ఆధ్వర్యంలో ఉన్న తాధికారుల కమిటీ పరిస్థితిని ఎదుర్కొనడానికి ఎలాంటి చర్యలు అవసరమో పక్షంరోజుల్లో సూచి స్తుంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలోని మంత్రుల బృందం వాటిని పరిశీలించి ప్రధానికి తుది సిఫార్సులు చేస్తుంది. ఈ కమిటీకి ఎలాంటి గడువూ లేదు. మూకదాడుల నియం త్రణకు చట్టం తీసుకురావాలని ఇటీవల సుప్రీంకోర్టు చెప్పింది. దానికి అనుగుణంగా సీఆర్పీసీలో కొత్తగా ఒక నిబంధన చేర్చాలని ఈ కమిటీలు సిఫార్సు చేస్తాయో లేక రాష్ట్రాల స్థాయిలో చట్టా లుంటే సరిపోతుందని చెబుతాయో వేచిచూడాలి. అయితే ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులను సైతం నేరాల్లో సహ భాగస్వాములుగా పరిగణిస్తే తప్ప ఈ దాడులు ఆగవు. -
మాల్యాను అప్పగించండి
న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని త్వరగా అప్పగించాలని బ్రిటన్‌కు భారత్ విజ్ఞప్తి చేసింది. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని విన్నవించింది. కశ్మీర్, ఖలిస్తాన్ వేర్పాటువాదులు బ్రిటన్ భూభాగంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు అనుమతించొద్దని కోరింది. బుధవారం ఢిల్లీలో జరిగిన మూడో ఇండో–యూకే హోం అఫైర్స్ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది. -
పన్ను ఎగవేతదారుల ఫోన్లు ఇకపై ట్యాప్!
న్యూఢిల్లీ: పన్ను ఎగవేతదారుల ఆట కట్టించడానికి ఆదాయపు పన్ను శాఖ కొత్త కొత్త దారులు వెతుకుతోంది. తరచూ విదేశాలకు వెళ్లే వారి ఫేస్ బుక్, ట్విట్టర్ అకౌంట్లపై దృష్టి పెట్టే యోచనలో ఉన్న శాఖ అధికారులు.. తాజాగా వ్యక్తుల ఫోన్లను ట్యాంపింగ్ చేసే యోచనను హోం మంత్రిత్వశాఖ అధికారుల ముందుంచారు. ఫోన్ ను ట్యాప్ చేస్తే కాల్ రికార్డుల ఆధారాలు దొరుకాతాయని, అప్పుడు నిందితులు తప్పించుకోలేరని ఓ సీనియర్ ఐటీ అధికారి అన్నారు. నల్లధనాన్ని అంతమొందించడం తమ లక్ష్యమని ఎన్డీయే సర్కారు ప్రకటించడంతో ఈ ఆలోచనకు ఆమోదముద్ర పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2014-2015, 2015-2016 మధ్య కాలంలో ఐటీ దాడులు నిర్వహించి సరిగ్గా లెక్కలు లేనివారిని ఈ జూన్ 1 తర్వాత ఆదాయమార్గాలను చూపాలని ఆదేశించింది. ఈ లెక్కలకు సంబంధించిన డాక్యుమెంట్లను ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) సింగిల్ విండో విధానంలో పరిశీలించనుంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లోని హెచ్ఎస్ బీసీ బ్యాంక్ లో 398 కేసులకు, పనామా పేపర్ల నుంచి 53 కేసులకు సంబంధించిన లీకులు ప్రభుత్వం వద్ద ఉన్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ ముఖ్ ఆధియా తెలిపారు. -
ఇందిరకు పెద్ద కోడలంటే ఇష్టం!
ఇంటి వ్యవహారాల్లో సోనియాదే పై చేయి * ఇందిరకు దగ్గర కాలేకపోయిన మేనక * దివంగత ప్రధానిపై ఆమె వ్యక్తిగత వైద్యుడి పుస్తకం న్యూఢిల్లీ: దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ.. తన చిన్న కుమారుడు సంజయ్‌గాంధీ మరణించిన తర్వాత చిన్న కోడలు మేనకాగాంధీ రాజకీయాల్లో తనకు సహాయంగా ఉండాలని కోరుకున్నారని.. అయితే ఇందర పెద్ద కుమారుడు రాజీవ్‌గాంధీకి వ్యతిరేక వర్గంలో మేనకాగాంధీ ఉండటంతో ఆమె తన అత్తకు దగ్గర కాలేదని.. ఇందిరకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేసిన కె.పి.మాథుర్ తాజాగా రాసిన పుస్తకంలో వివరించారు. సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ మాజీ వైద్యుడైన మాథుర్ 20 ఏళ్ల పాటు ఇందిరకు వ్యక్తిగత వైద్యుడిగా పనిచేశారు. 1984 అక్టోబర్‌లో ఆమె హత్యకు గురయ్యే వరకూ ప్రతి రోజూ ఉదయం ఇందిరను కలిసేవారు. ఆయన రాజకీయవేత్తగా ఇందిర ప్రస్థానం, కుటుంబంతో ఆమె సంబంధాలపై ‘ద అన్‌సీన్ ఇందిరాగాంధీ’ పేరుతో పుస్తకం రాశా రు. ఈ పుస్తకానికి ఇందిర మనుమరాలు ప్రియాంకా గాంధీ ముందుమాట రాశా రు. ‘‘ఇందిరకు ఎప్పుడూ తన పెద్ద కోడలు సోనియా అంటేనే ఎక్కువ ఇష్టం. అయితే.. సంజయ్ మరణించిన కాలంలో ఆమె మేనక వైపు కొంత మొగ్గు చూపారు. కానీ మేనక ఆమెకు దగ్గర కాలేకపోయారు. ఇంటి వ్యవహారాల్లో సోనియాదే పై చేయి. అయితే.. రాజకీయ వ్యవహారాలకు వచ్చే సరికి మేనక అభిప్రాయాలను ఇందిర పట్టించుకునేవారు. ఎందుకంటే.. ఆమెకు మంచి రాజకీయ దృక్కోణం ఉంది’’ అని పేర్కొన్నారు. ఆ సదస్సే కారణం... ‘‘సంజయ్ మరణించిన రెండేళ్ల లోపే.. కఠిన పరిస్థితుల్లో ఆమె (నాటి) ప్రధాని నివాసం నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. లక్నోలో సంజయ్ విచార్ మంచ్ సదస్సు నిర్వహించ తలపెట్టినపుడు ఇందిర విదేశాల్లో పర్యటిస్తున్నారు. ఆ సదస్సులో మాట్లాడవద్దని మేనకకు ఇందిర సమాచారం పంపారు. కానీ మేనక ఆ సదస్సులో మాట్లాడారు. ఇది విభేదాలకు దారితీసింది’’ అని చెప్పారు. ఇందిర, సోనియాలు కలిసిపోయారు ‘‘రాజీవ్, సోనియా వివాహం తర్వాత.. ఇందిర, సోనియాలు చాలా త్వరగా కలసిపోయారు. ఇందిరకు సోనియా చాలా గౌరవం ఇచ్చేవారు. సోనియాపై ఇందిర ఆపేక్ష, మక్కువ చూపేవారు. అతి త్వరలోనే సోనియా ఇంటి బాధ్యతను తీసుకున్నారు’’ అని డాక్టర్ మాథుర్ పేర్కొన్నారు. ‘‘ఇందిర ఆదివారాలు, ఇతర సెలవు దినాల్లో పుస్తకాలు చదువుతూ విశ్రాంతి తీసుకునేవారు. ప్రత్యేకించి గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదివేవారు. శరీరం, మనసుకు సంబంధించి అంశాలు.. ప్రజాదరణ గల సైన్స్ మేగజీన్లు ఇష్టపడేవారు. అంతర్జాతీయ ప్రచురణల్లో క్రాస్‌వర్డ్ పజిల్స్‌ను పరిష్కరించటం ఆమెకు చాలా ఇష్టం. ఒక్కోసారి మధ్యాహ్న భోజనం తర్వాత పేక ఆడేవారు’’ అని వివరించారు. ఎమర్జెన్సీ ఆమెకు నచ్చకపోయినా... ఎమర్జెన్సీ పరిస్థితులను వివరిస్తూ ‘‘ప్రధాని (ఇందిర), సంజయ్‌లపై వ్యతిరేకత గంట గంటకూ పెరుగుతూపోతోంది.అప్పటి పరిస్థితులపై ఆమె కూడా అసంతృప్తిగా ఉన్నారు. కానీ.. ఎందుకో ఆమె జోక్యం చేసుకోలేదు. దాన్ని అలాగే కొనసాగనిచ్చారు. చిన్న కుమారుడిపై తన అధిక ప్రేమకు ఆమె బాధితురాలై ఉంటారు’’ అని మాథుర్ చెప్పారు. -
అది ఉగ్రవాదుల దాడే: కిరెన్ రిజ్జూ
న్యూఢిల్లీ: బెంగళూరులో ఆదివారం చోటు చేసుకున్న బాంబు పేలుళ్ల వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందని హోంశాఖ స్పష్టం చేసింది. సోమవారం మీడియాతో మాట్లాడిన హోంశాఖ సహోయమంత్రి కిరణ్ రిజ్జూ.. ఆ దాడి ఖచ్చితంగా ఉగ్రవాదులు చేసిందేనని తెలిపారు. అయితే ఆ బాంబు దాడి ప్రభావం తక్కువ ఉండటంతో పెద్దగా ప్రాణం నష్టం జరగలేదన్నారు. ఆ దాడి వెనుక సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్ మెంట్ ఆఫ్ ఇండియా) ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆ కోణంలోనే దర్యాప్తు సాగుతుందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నగరంలోని చర్చిస్ట్రీట్ ప్రాంతంలో ఆదివారం రాత్రి 8.30 గంటలకు పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళ మరణించిగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రెస్టారెంట్‌కు సమీపంలోని ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్ల పొదల్లో ఈ బాంబ్‌ను అమర్చినట్లు పోలీసులు తెలిపారు.