
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరాల దర్యాప్తులో సిబ్బందిని బలోపేతం చేసే బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర హోం శాఖ తెలిపింది. పోలీసులకు సైబర్ నేరాలపై శిక్షణ, ఐటీ నిపుణులను పోలీసు శాఖలో నియామకాలు చేపడుతున్నాయని పేర్కొంది. ఇంటర్నెట్ వాడకం పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాలు పెరుగుతున్నాయని, నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2017లో 3,466, 2018లో 3,353 ఆన్‌లైన్ మోసాలు నమోదయ్యాయని వెల్లడించింది. ఈ కేసుల దర్యాప్తులో సంస్థలు ఐటీ నిపుణుల సహాయం తీసుకుంటున్నాయని పేర్కొంది. (చదవండి: చైనాకు దీటుగా బదులిస్తాం)
ఇక సైబర్ నేరాల విషయంలో పోలీసులు, ప్రాసిక్యూటర్లు, జ్యుడీషియల్ అధికారులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు కేంద్రం చర్యలు చేపట్టిందన్న హోం శాఖ, సైబర్ నేరాల్లో ముఖ్యంగా మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేసింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎంపీలు అడిగిన ప్రశ్నలకు బదులుగా కేంద్ర హోం శాఖ ఈ మేరకు సమాధానాలిచ్చింది.(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment