రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్‌ | Parliament Sessions Live Updates On 24 July 2024 | Sakshi
Sakshi News home page

రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్‌.. అప్‌డేట్స్‌

Published Wed, Jul 24 2024 8:51 AM | Last Updated on Wed, Jul 24 2024 11:39 AM

Parliament Sessions Live Updates On 24 July 2024

Live Updates

  • రాజ్యసభ నుంచి విపక్ష ఎంపీలు వాకౌట్‌ చేశారు.

     

  • లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు.

  • పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

  • పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌ల కేంద్రమంతులతో మోదీ భేటీ
  • ఉభయ సభల్లో ఇండియా కూటమిని ఎదుర్కొవటంపై చర్చ

 

  • పార్లమెంట్‌ ముందు ఇండియా కూటమి ఎంపీలు ఆందోళన చేపట్టారు.
  • బడ్జెట్‌ కేటాయింపులపై విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి
  • బడ్జెట్‌లో రాష్ట్రాల పట్ల వివక్షకు నిరసనగా  ఇండియా కూటమి ఆందోళన 
  • నిరసనలో ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ పాల్గొన్నారు. 
  • ఎన్డీయే కూటమి ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలకే బడ్జెట్‌లో లబ్ది జరిగిందని ఆరోపణ
     
  •   

  • రాజ్యసభలో కేంద్ర బడ్జెట్‌, జమ్ము కశ్మీర్‌ బడ్జెట్‌పై చర్చ జరగనుంది.

     

  • ఈరోజు నుంచి పార్లమెంట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ 2024-25పై చర్చ
  • 20 గంటల పాటు బడ్జెట్‌పై చర్చ జరగనుంది.
  • పార్లమెంట్‌లో నిరసనలకు సిద్ధమైన ఇండియా కూటమి.
  • ఉభయ సభల్లో నిరసన తెలపాలని ఇండియా కూటమి నిర్ణయం
  • కుర్చి బచావో బడ్జెట్‌ ప్రవేశపెట్టిందని బీజేపీపై విపక్షాల విమర్శలు 
  • బడ్జెట్‌లో బీజేపీయేతర రాష్ట్రాలను విస్మరించారని ఆరోపణలు
  • కేంద్రం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్‌లో బీజేపీయేతర రాష్ట్రాలపై చూపిన వివక్షకు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి ఇవాళ పార్లమెంట్‌ లోపల, బయట నిరసన చేపట్టనుంది. 

  • మంగళవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసం ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీతో సహా కూటమి మిత్రపక్ష నేతలు సమావేశం అయ్యారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం బడ్జెట్‌ చూపిన వివక్షకు వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని నిర్ణయించారు.

  • ఇండియా కూటమి మీటింగ్‌ అనంతరం కాంగ్రెస్‌ నేత కేసీవేణుగోపాల్‌ మీడియాతో మాట్లడారు. ‘‘కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ బీజేపీయేతర రాష్ట్రాలపై తీవ్రమైన వివక్ష చూపింది. ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపేట్టిన కేంద్రం బడ్జెట్.. బడ్జెట్‌ అనే భావనను నాశనం చేసింది. ఇది చాలా వివక్ష, ప్రమాదకరమైన బడ్జెట్‌. సమాఖ్యావాదానికి, న్యాయానికి సంబంధించిన నియమాలకు విరుద్ధంగా ఉంది’’ అని అన్నారు.

  • తమ నిరసనలో భాగంగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జూలై  27 జరిగే నీతి  ఆయోగ్‌ మిటింగ్‌ను బాయ్‌కాట్‌ చేయనున్నారు.  ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా రాజ్యాంగ నిబంధనలు ఉల్లంఘించిందని కేసీ వేణగోపాల్‌ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement