న్యూఢిల్లీ: బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి పరారైన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా, ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని త్వరగా అప్పగించాలని బ్రిటన్‌కు భారత్ విజ్ఞప్తి చేసింది. అలాగే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ఆచూకీ కనుగొనేందుకు సహకరించాలని విన్నవించింది. కశ్మీర్, ఖలిస్తాన్ వేర్పాటువాదులు బ్రిటన్ భూభాగంలో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు అనుమతించొద్దని కోరింది. బుధవారం ఢిల్లీలో జరిగిన మూడో ఇండో–యూకే హోం అఫైర్స్ సమావేశంలో హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ మేరకు బ్రిటన్‌కు విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment