indian External Affairs
-
భారత్‌పై కెనడా మంత్రి ప్రేలాపనలు
న్యూఢిల్లీ: భారత్‌కు వ్యతిరేకంగా కెనడా ప్రభుత్వ పెద్దల ప్రేలాపనలు ఆగడం లేదు. ఒకవైపు ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నప్పటికీ మరోవైపు వారు మరింత ఆజ్యం పోస్తున్నారు. కెనడాలో ఖలిస్తానీ మద్దతుదారులపై దాడులకు, కుట్రలకు భారత హోంశాఖ మంత్రి అమిత్ షా కారణమంటూ కెనడా విదేశాంగ శాఖ ఉప మంత్రి డేవిడ్ మోరిసన్ చేసిన ఆరోపణలతో వివాదం మరింత ముదురుతోంది. మోరిసన్ మంగళవారం కెనడా జాతీయ భద్రతా కమిటీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులతో మాట్లాడుతూ అమిత్ షా ప్రస్తావన తీసుకొచ్చారు. కెనడాలో ఉన్న సిక్కు వేర్పాటువాదులకు, ఖలిస్తానీ సానుభూతిపరులకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించాలని, సిక్కులను భయాందోళనకు గురి చేయాలని, వారికి సంబంధించిన సమాచారం సేకరించాలంటూ భారత నిఘా అధికారులను అమిత్ షా ఆదేశించారని చెప్పారు. అయితే, అమిత్ షా ఈ ఆదేశాలిచి్చనట్లు కెనడాకు ఎలా తెలిసిందో మోరిసన్ వెల్లడించలేదు. 2023 జూన్‌లో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో పదేపదే ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. జస్టిన్ ట్రూడో వైఖరితో భారత్–కెనడా మధ్య సంబంధాలు ఇప్పటికే చాలావరకు క్షీణించాయి. అయినా కూడా కెనడా మంత్రి మోరిసన్ నోరుపారేసుకోవడం గమనార్హం. కెనడా హైకమిషన్ ప్రతినిధికి నిరసన కెనడా మంత్రి డేవిన్ మోరిసన్ చేసిన ఆరోపణలపై భారత్ తీవ్రంగా స్పందించింది. అర్థంపర్థం లేని, ఆధారాల్లేని ఆరోపణలు చేశారని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ మండిపడ్డారు. తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. బాధ్యతారాహిత్యమైన ప్రవర్తన భారత్, కెనడా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. అసంబద్ధమైన ఆరోపణలతో పరిస్థితిని దిగజార్చవద్దని సూచించారు. భారత్‌ను అప్రతిష్టపాలు చేసే కుతంత్రాలు మానుకోవాలని కెనడాకు స్పష్టంచేశారు. కెనడా మంత్రులు, అధికారులు భారత్ గురించి అంతర్జాతీయ మీడియాకు ఉద్దేశపూర్వకంగా తప్పుడు లీకులు ఇస్తున్నారని రణ«దీర్ జైస్వా ల్ ఆరోపించారు. కెనడా మంత్రి మోరిస్ తాజా ఆరోపణల పట్ల భారత్‌లోని కెనడా హైకమిషన్ ప్రతినిధిని పిలిపించి, తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశామని తెలిపారు. కెనడాలో భారత కాన్సులర్ సిబ్బందికి వేధింపులు కెనడాలోని భారత కాన్సులర్ సిబ్బందిని కెనడా ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని రణ«దీర్ జైస్వాల్ ఆరోపించారు. వారిపై ఆడియో, వీడియో నిఘా పెట్టిందని చెప్పారు. సిబ్బంది మధ్య సమాచార మారి్పడిని అడ్డుకుంటోందని వెల్లడించారు. తరచుగా వేధించడంతోపాటు భయభ్రాంతులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. దౌత్యపరమైన నిబంధనలు, ఒప్పందాలను కెనడా ఉల్లంఘిస్తోందని విమర్శించారు. దీనిపై తమ నిరసనను కెనడా ప్రభుత్వానికి తెలియజేశామని చెప్పారు. -
S Jaishankar: ఆత్మపరిశీలన చేసుకోండి
ఇస్లామాబాద్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పాకిస్తాన్ గడ్డపై పాకిస్తాన్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. పొరుగు దేశంతో సంబంధాలు ఎందుకు దెబ్బతిన్నాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని పాకిస్తాన్‌కు హితవు పలికారు. పాక్ పట్ల భారత్‌కు విశ్వాసం సడలిపోవడానికి కారణాలేమిటో అన్వేíÙంచాలని సూచించారు. విశ్వాసం బలపడితేనే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయని తేల్చిచెప్పారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అనే మూడు భూతాలు ప్రాంతీయ సహకారానికి అతిపెద్ద అవరోధాలు అని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో ఉగ్రవాద, తీవ్రవాద, వేర్పాటువాద కార్యకలాపాలు భారత్–పాకిస్తాన్ మధ్య వ్యాపారం, వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రజల మధ్య అనుసంధానాన్ని నిరోధిస్తున్నాయని పేర్కొన్నారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన బుధవారం జరిగిన షాంఘై సహకార సంఘం(ఎస్సీఓ) సభ్యదేశాల కౌన్సిల్ ఆఫ్ ద హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్(సీహెచ్‌జీ) 32వ సదస్సులో జైశంకర్ మాట్లాడారు. ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతను, సార్వ¿ౌమతాన్ని తప్పనిసరిగా గౌరవిస్తేనే సంబంధాలు బలపడతాయని, వ్యాపారం, వాణిజ్యం, అనుసంధానం కొనసాగుతాయని స్పష్టంచేశారు. పరస్పరం గౌరవించుకోవడంపైనే పరస్పర సహకారం అధారపడి ఉంటుందన్నారు. పరస్పర విశ్వాసంతో కలిసికట్టుగా పనిచేస్తే ఎస్సీఓ సభ్యదేశాలు ఎంతగానో లబ్ధి పొందుతాయని సూచించారు. 3 భూతాలపై రాజీలేని పోరాటం చేయాలి ఎస్సీఓ చార్టర్‌కు సభ్యదేశాలన్నీ కట్టుబడి ఉండాలని జైశంకర్ స్పష్టంచేశారు. చార్టర్ పట్ల మన అంకితభావం స్థిరంగా ఉన్నప్పుడే ఆశించిన లక్ష్యాలు సాధించగలమని అన్నారు. ప్రాంతీయంగా అభివృద్ధి జరగాలంటే శాంతి, స్థిరత్వం అవసరమని ఉద్ఘాటించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదంపై అందరూ రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల ఆవశ్యకతను జైశంకర్ మరోసారి నొక్కిచెప్పారు. భద్రతా మండలిని మరింత పారదర్శకంగా, ప్రభావవంతంగా మార్చాలంటే సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిందేనని వెల్లడించారు. ఈ విషయంలో ఐక్యరాజ్యసమితిపై ఎస్సీఓ ఒత్తిడి పెంచాలని కోరారు. అంతకుముందు ఎస్సీఓ సదస్సులో పాల్గొనేందుకు జిన్నా కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న జైశంకర్‌తో పాక్ ప్రధాని షరీఫ్ కరచాలనం చేసి సాదర స్వాగతం పలికారు. -
భగ్గుమన్న దౌత్య బంధం
న్యూఢిల్లీ: సిక్కు వేర్పాటువాది, ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్యోదంతం ఒక్కసారిగా భారత్, కెనడా దౌత్యసంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సి ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం పంపింది. దీంతో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఖలిస్తాన్ వేర్పాటువాది హత్య కేసులో తమ దౌత్యాధికారులను ఇరికించడంపై భారత సర్కార్ తీవ్రంగా స్పందించింది. కెనడా తాత్కాలిక హైకమిషనర్ స్టివార్ట్ వీలర్సహా ఆరుగురు దౌత్యవేత్తలను భారత్ బహిష్కరించింది. బహిష్కరణకు గురైన వారిలో డెప్యూటీ హై కమిషనర్ ప్యాట్రిక్ హేబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ కేథరీన్ జోలీ, అయాన్ రోస్ డేవిడ్ ట్రైస్, ఆడమ్ జేమ్స్ చుప్కా, పౌలా ఓర్జులాలు ఉన్నారు. అక్టోబర్ 19వ తేదీన రాత్రి 11.59 గంటల్లోపు భారత్‌ను వీడాలని ఆదేశాలు జారీచేసింది. కెనడాలో విధులు నిర్వర్తిస్తున్న భారత దౌత్యవేత్త, దౌత్యాధికారులు, సిబ్బందిని స్వదేశానికి రప్పిస్తామని సోమవారం భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు తన నిరసన తెలిపేందుకు కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ రోస్ వీలర్‌కు భారత విదేశాంగ శాఖ సమన్లు జారీచేసింది. దీంతో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీలోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చి ఆ శాఖ కార్యదర్శి(తూర్పు) జైదీప్ మజుందార్‌ను కలిశారు. అనుమానితుల జాబితాలో భారత దౌత్యవేత్త పేరును చేర్చడంపై ఆయన ఎదుట భారత్ తన నిరసనను వ్యక్తంచేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికే దౌత్యాధికారులను రప్పించడంపై విదేశాంగశాఖ నిర్ణయం వెలువడింది. ‘‘ కెనడాలో తీవ్రవాదం, హింసాత్మక ఘటనలు, ట్రూడో ప్రభుత్వ చర్యలు అక్కడి భారతీయ దౌత్యాధికారులను ప్రమాదంలోకి నెట్టేశాయి. ప్రస్తుత కెనడా ప్రభుత్వం వీళ్ల భద్రతకు భరోసా కలి్పస్తుందన్న నమ్మకం పోయింది. అందుకే వీళ్లందరినీ వెనక్కి రప్పించుకోవాలని భారత సర్కార్ నిర్ణయంచుకుంది. సిక్కు వేర్పాటువాదానికి మద్దతు పలుకుతూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ట్రూడో సర్కార్ దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించే హక్కు భారత్‌కు ఉంది’’ అని విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొంది. భారత్, కెనడా దౌత్యసంబంధాలు దారుణస్థాయికి క్షీణించడంతో కెనడాలో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయ పౌరులు, విద్యనభ్యసిస్తున్న లక్షలాది మంది భారతీయ విద్యార్థులపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ట్రూడో ఓటు బ్యాంక్ రాజకీయాలు ఓటు బ్యాంక్ రాజకీయ లబి్ధపొందేందుకు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఇలా తమ దౌత్యవేత్తలను అప్రతిష్టపాలు చేస్తోందని భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. మీ ప్రభుత్వం నిందారోపణలు చేయడం మానుకోవాలని కెనడా దౌత్యవేత్త ఎదుట భారత్ తన నిరసన వ్యక్తంచేసింది. ‘‘ కెనడాలోని భారతీయ హై కమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై ఇలా నిరాధారపూరితంగా వేధించడం ఏమాత్రం ఆమోదనీయం కాదు’’ అని స్పష్టంచేసింది. ఆరోపణలకు తగ్గ ఆధారాలు ఇవ్వలేదు ‘‘ 2023 సెపె్టంబర్లో ఈ ఉదంతంలో భారత ప్రమేయం ఉందంటూ ట్రూడో ఆరోపణలు చేశారు. కానీ ఆ మేరకు సాక్ష్యాధారాలను భారత ప్రభుత్వానికి అందజేయలేదు. ట్రూడో కెనడా ఓటుబ్యాంక్ రాజకీయాల్లో లబ్ది పొందేందుకే కేసు దర్యాప్తు సమగ్రంగా జరక్కముందే వాస్తవాలు లేకుండా భారత హైకమిషనర్ వర్మకు వ్యతిరేకంగా కెనడా వ్యవహరిస్తోందన్నది సుస్పష్టం. 2018లో భారతలో పర్యటించినప్పటి నుంచే ట్రూడో భారత్‌తో ఘర్షణాత్మక వైఖరిని అవలంభిస్తున్నారు. భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహిస్తున్న, తీవ్రవాదులతో సత్సంబంధాలున్న వ్యక్తులకు ట్రూడో మంత్రివర్గంలో చోటుదక్కింది. 2020 డిసెంబర్లో భారత ఎన్నికల ప్రక్రియలోనూ ట్రూడో జోక్యం చేసుకునేందుకు యతి్నంచారు. ట్రూడో ప్రభుత్వం పూర్తిగా ఒకే రాజకీయ పారీ్టపై ఆధారపడింది. ఆ పార్టీ కేవలం భారత్‌లో సిక్కు వేర్పాటువాదాన్ని ఎగదోయడమే పనిగా పెట్టుకుంది’’ అని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.విశ్వసనీయ సమాచారం ఇచ్చాం: వీలర్ భారత విదేశాంగ శాఖ కార్యాలయం నుంచి బయటికొచ్చాక కెనడా దౌత్యవేత్త స్టీవర్ట్ వీలర్ మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత్ ఏవైతే ఆధారాలను అడిగిందో వాటిని కెనడా ప్రభుత్వం ఇచి్చంది. కెనడా సొంత గడ్డపై కెనడా పౌరుడి హత్యోదంతంలో భారత సర్కార్‌కు చెందిన ఏజెంట్ల పాత్రపై విశ్వసనీయ, ఖచి్చతమైన సమగ్ర ఆధారాలను భారత్‌కు కెనడా ప్రభుత్వం అందజేసింది. ఇక నిర్ణయం భారత్‌కే వదిలేస్తున్నాం. ఇరు దేశాల స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారత్ తన తదుపరి చర్యలు చేపట్టాలని ఆశిస్తున్నాం. ఈ విషయంలో సహకరించేందకు కెనడా సిద్ధంగా ఉంది’’అని వీలర్ వ్యాఖ్యానించారు.ఏమిటీ నిజ్జర్ వివాదం? నిజ్జర్ కెనడా కేంద్రంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గతంలోనే భారత్ కెనడా సర్కార్‌కు తెలియజేసినా ఎలాంటి స్పందనా రాలేదు. 2023 ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని సర్రే నగరంలో గురుద్వారా సాహెబ్ పార్కింగ్ ప్రదేశంలో నిజ్జర్‌ను గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు కాల్చి చంపారు. అయితే ఈ కాల్పుల ఘటన వెనుక భారత నిఘా ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని ట్రూడో గత ఏడాది సెపె్టంబర్లో తీవ్ర ఆరోపణలు చేశారు. ట్రూడో ఆరోపణలను భారత్ ఖండించింది. ఆధారాల్లేకుండా నిందలు వేయడం తగదని గట్టిగా హెచ్చరించింది. హత్యకు సంబంధించి ఆధారాలు సమర్పిస్తే పరిశీలించి దర్యాప్తునకు సహకరించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని భారత్ స్పష్టంగా చెప్పింది. అయితే నిజ్జర్‌ను పాక్ ఐఎస్ఐ ఏజెంట్లు చంపేసి ఆ నేరం భారత్‌పై మోపాలని కుట్ర జరిగిందని గతంలో అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. నిజ్జర్ హత్యకు గురై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జూన్‌లో అక్కడి పార్లమెంట్ దిగువసభలో కెనడా ఎంపీలు నిజ్జర్‌కు నివాళులర్పించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబట్టింది. ‘‘ భారత్ ఉగ్రవాదిగా ప్రకటించిన, ఇంటర్‌పోల్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తికి ఏకంగా పార్లమెంటులో నివాళులరి్పంచడం దారుణం’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఎవరీ నిజ్జర్? నిషేధిత ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ చీఫ్, ‘గురునానక్ సిక్ గురుద్వారా సాహిబ్’ అధిపతి అయిన నిజ్జర్ సిక్కు వేర్పాటువాదిగా పేరొందాడు. భారత్‌లోని జలంధర్ ప్రాంతంలోని బార్సింగ్పూర్లో జని్మంచాడు. 1997లో తప్పుడు పాస్ట్‌పోర్ట్‌లో కెనడాకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే అక్కడి నుంచే భారత్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. అమెరికాలో నెలకొల్పిన జస్టిస్ ఫర్ సిఖ్స్ సంస్థలో క్రియాశీలకంగా పనిచేశాడు. పంజాబ్‌లో హత్యలకు కుట్రపన్నాడన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం కింద భారత్ ఇతడిని 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఇతని తలపై రూ.10 లక్షల రివార్డు ఉంది. జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌లోని ఇతని ఆస్తులను స్వా«దీనం చేసుకుంది. -
భారత్‌లో ముస్లింలు బాధలు పడుతున్నారు
టెహ్రాన్/న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖమేనీ సోమవారం చేసిన ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు వేదనను అనుభవిస్తున్నారు. మయన్మార్, గాజా, భారత్..తదితర ఏప్రాంతంలోనైనా ముస్లింలు పడుతున్న బాధలను పట్టించుకోకుంటే మనం ముస్లింలమే కాదు’అంటూ ఖమేనీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్‌లోని మైనారిటీ వర్గాన్ని గురించి ఇరాన్ సుప్రీం నేత చేసిన ఈ వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. తప్పుడు సమాచారంతో చేసిన ఈ ప్రకటన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఇతర దేశాల్లోని మైనారిటీల గురించి వ్యాఖ్యలు చేసే ముందు సొంత మానవ హక్కుల రికార్డును పరిశీలించుకోవాలని ఇరాన్‌కు హితవు పలికింది. ప్రభుత్వ ఉత్తర్వులను తోసిరాజని ఇరాన్లో వేలాదిగా మహిళలు హిజాబ్ లేకుండా వీధుల్లోకి వచ్చిన రోజే ఖమేనీ భారత్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
S Jaishankar: ఆ విమానంలో నా తండ్రి కూడా ఉన్నారు
జెనీవా: ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలై వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’వెబ్‌సిరీస్‌పై ఇంకా చర్చ జరుగుతున్న వేళ అలాంటి హైజాక్ ఉదంతంలో తన తండ్రి, మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణస్వామి సుబ్రహ్మణ్యం కూడా బాధితుడిగా ఉన్నారని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ ప్రకటించారు. 1984 ఏడాదిలో జరిగిన విమాన హైజాక్ ఉదంతంలో తన కుటుంబం సైతం తీవ్ర ఉత్కంఠను ఎదుర్కొందని ఆయన వ్యాఖ్యానించారు. జెనీవాలో ఒక భారతీయసంతతి వ్యక్తులతో భేటీ సందర్భంగా జైశంకర్ తన కుటుంబం గతంలో పడిన వేదనను అందరితో పంచుకున్నారు. ఏడుగురు హైజాకర్లు చొరబడి.. ‘1984 జులై ఐదో తేదీన ఇండియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఐసీ 421 విమానం శ్రీనగర్ వెళ్లేందుకు ఢిల్లీ నుంచి టేకాఫ్ అయి మధ్యలో చండీగఢ్ సమీపంలోని పఠాన్‌కోట్‌లో ఆగింది. అప్పుడు ఏడుగురు హైజాకర్లు కాక్‌పిట్‌లోకి చొరబడి విమానాన్ని తమ అ«దీనంలోకి తీసుకున్నారు. విమానాన్ని హైజాక్ చేసిన వారంతా ఆలిండియా సిఖ్ స్టూడెంట్స్ ఫెడరేషన్‌కు చెందిన వాళ్లు. సిక్కు వేర్పాటువాది జరై్నల్ సింగ్ భింద్రన్‌వాలేతోపాటు ఇతర నేతలను విడుదలచేయాలని డిమాండ్ విధించారు. విమానాన్ని లాహోర్‌కు, తర్వాత కరాచీకి, చిట్టచివరకు దుబాయ్‌కు తీసుకెళ్లారు. విమానం విదేశీగడ్డపైకి వెళ్లడంతో భారత విదేశాంగ శాఖ సైతం రాయబారం నడిపేందుకు రంగంలోకి దిగింది. ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌లో చేరిన తొలినాళ్లలో.. అప్పుడు నేను ఇండియన్ ఫారిన్ సరీ్వస్(ఐఎఫ్ఎస్) యువ అధికారిగా పనిచేస్తున్నా. ప్రయాణికులన విడిపించేందుకు హైజాకర్లతో చర్చలు జరపాల్సిన బృందంలో నేను కూడా సభ్యునిగా ఉన్నా. అత్యంత కీలకమైన పనిలో నిమగ్నంకావాల్సి ఉన్నందున ఇంటికి రాలేనని చెప్పేందుకు మా అమ్మకు ఫోన్ చేశా. అప్పుడు నా భార్య ఉద్యోగానికి వెళ్లింది. ఇంట్లో పసిబిడ్డగా ఉన్న నా కుమారుడిని మా అమ్మ ఒక్కరే చూసుకుంటోంది. ‘‘ఇంటికి రావడం కుదరదు. ఇక్కడ విమానాన్ని హైజాక్ చేశారు’’అని చెప్పా. అయితే పనిలో సీరియస్‌గా మునిగిపోయాక నాలుగు గంటల తర్వాత నాకో విషయం తెల్సింది. అదేంటంటే నా తండ్రి కృష్ణస్వామి కూడా అదే విమానంలో బందీగా ఉన్నారు. ఓవైపు హైజాక్ విషయం తెల్సి ప్రయాణికుల కుటుంబసభ్యులు భారత ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. బాధిత కుటుంబసభ్యుల్లో నేను ఉన్నా. మరోవైపు ప్రభుత్వం తరఫున మాట్లాడాల్సిన వ్యక్తిని కూడా నేను. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి నాది. ఏదేమైనా 36 గంటల ఉత్కంఠ తర్వాత ఖలిస్తాన్ మద్దతుదారులు అధికారుల ఎదుట లొంగిపోవడంతో కథ సుఖాంతమైంది. విమానంలోని 68 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైజాక్ ఉదంతం విషాదాంతంగా ముగియకుండా ఒక సమస్యకు పరిష్కారంగా మలుపు తీసుకుంది’’అని అన్నారు. ‘‘నేనింకా కాందహార్ వెబ్‌సిరీస్ చూడలేదు. అయితే హైజాకర్లతో ప్రభుత్వం, మధ్యవర్తులు కాస్తంత వెనక్కి తగ్గి మాట్లాడినట్లుగా అందులో చూపించారట కదా. సినిమాల్లో హీరోను మాత్రమే అందంగా చూపిస్తారు. ప్రభుత్వం సరిగా పనిచేసినా చూపించరు’’అని అన్నారు. అణ్వస్త్ర విధానాల్లో సుబ్రహ్మణ్యం కీలకపాత్ర మాజీ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణస్వామి హైజాక్ జరిగిన ఏడాది ఢిల్లీలోని డిఫెన్స్ స్టడీస్, అనాలసిస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు. ఆ తర్వాత భారత ‘అణ్వస్త్ర’విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ప్రముఖ అంతర్జాతీయ వ్యూహాత్మక వ్యవహారాల నిపుణుడిగా పేరొందారు. ‘‘అణ్వాయుధాలను తొలుత భారత్ తనంతట తానుగా ఏ దేశం మీదా ప్రయోగించకూడదు. ఒక వేళ భారత్ మీద ఎవరైనా అణ్వాయుధం ప్రయోగిస్తే ధీటైన సమాధానం చెప్పే స్థాయికి మనం ఎదగాలి’’అనే ప్రాథమిక సిద్ధాంతాల్లో రూపకల్పనలో ఈయన పాత్ర ఉందని చెబుతారు. జాతీయ భద్రతా మండలి సలహా బోర్డుకు తొలి కనీ్వనర్‌గా వ్యవహరించారు. హైజాకర్లతో చర్చల వేళ ‘‘కావాలంటే మొదట నన్ను చంపండి. ప్రయాణికులను ఏమీ చేయకండి’’అని హైజాకర్లతో కృష్ణస్వామి అన్నారని నాటి పాత్రికేయులు రాజు సంతానం, దిలీప్ బాబ్లు చెప్పారు. -
భారత్, చైనా సరిహద్దుల్లో సైనికీకరణ ఆందోళనకరం
జెనీవా: తూర్పు లద్ధాఖ్‌లో భారత్–చైనా సరిహద్దులో నాలుగేళ్ల క్రితం మొదలైన ఉద్రిక్తతలను తగ్గించడానికి ప్రయత్నాలు ఊపందుకున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పారు. వివాదాస్పద సరిహద్దు ప్రాంతాల నుంచి ఇరుదేశాల సైన్యం వెనక్కి వెళ్లిపోయే విషయంలో చైనాతో నెలకొన్న సమస్యలు 75 శాతం పరిష్కారమైనట్లు తెలిపారు. చేయాల్సింది ఇంకా మిగిలే ఉందని పేర్కొన్నారు. గురువారం స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో ఓ చర్చా కార్యక్రమంలో జైశంకర్ మాట్లాడారు. 2020లో జరిగిన గల్వాన్ లోయ ఘర్షణలు భారత్–చైనా సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో శాంతియుత పరిస్థితులు ఉంటేనే ఇరుదేశాల మధ్య సంబంధాలు బలపడతాయని ఉద్ఘాటించారు. భారత్, చైనా సైన్యం మధ్య ఘర్షణలకు పూర్తిగా తెరదించడానికి నాలుగేళ్లుగా చర్చలు జరుగుతున్నాయని వివరించారు. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దుల వెంబడి భారత్, చైనా సైన్యం వెనక్కి వెళ్తుండగా, మరోవైపు అక్కడ మిగిలి ఉన్న రెండు దేశాల సేనలు ఎదురెదురుగా సమీపంలోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. సరిహద్దుల్లో సైనికీకరణ జరుగుతోందని వెల్లడించారు. ఈ సమస్యను కచి్చతంగా పరిష్కరించాల్సి ఉందన్నారు. సేనలను పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయం తూర్పు లద్దాఖ్‌లో వివాదాస్పద సరిహద్దుల నుంచి తమ సేనలను సాధ్యమైనంత త్వరగా పూర్తిగా ఉపసంహరించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయి. ఈ దిశగా ప్రయత్నాలను వేగవంతం, రెట్టింపు చేయాలని తీర్మానించుకున్నాయి. భారత భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గురువారం రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో సమావేశమయ్యారు. సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని తాము కోరుకుంటున్నామని అజిత్ దోవల్ ఈ సందర్భంగా తేలి్చచెప్పారు. వాస్తవా«దీన రేఖను(ఎల్ఏసీ)ని గౌరవించాలని వాంగ్ యీకి సూచించారు. భారత్, చైనా మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకోవాలంటే ఎల్ఏసీని గౌరవించాల్సిందేనని స్పష్టంచేశారు. -
విదేశాంగ కార్యదర్శిగా విక్రం మిశ్రి నియామకం
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు విక్రమ్ మిశ్రి (59) విదేశాంగ శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. వినయ్ క్వాట్రా స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. క్వాట్రాను అమెరికాలో భారత రాయబారిగా నియమించొచ్చని సమాచారం. 1989 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సరీ్వస్‌కు చెందిన మిశ్రి నియామకం జులై 15 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్, నరేంద్ర మోదీ రూపంలో ఏకంగా ముగ్గురు ప్రధానులకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన అరుదైన రికార్డు మిశ్రి సొంతం. చైనాతో సంబంధాలు దిగజారిన వేళ ఆ దేశ వ్యవహారాల నిపుణుడిగా పేరున్న మిశ్రి నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. 2019–21 మధ్య ఆయన చైనాలో భారత రాయబారిగా పని చేశారు. -
సీఏఏ అంతర్గత వ్యవహారం
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై అమెరికా స్టేట్ డిపార్టుమెంట్ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చేసిన వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ«దీర్ జైస్వాల్ గట్టిగా బదులిచ్చారు. భారతదేశ బహుళ సంప్రదాయాలను, దేశ విభజన తర్వాత ఇక్కడి చరిత్రను అర్థం చేసుకోలేనివారు తమకు పాఠాలు చెప్పొద్దని చురక అంటించారు. పౌరసత్వ సవరణ చట్టం తమ దేశ అంతర్గత వ్యవహారమని హితవు పలికారు. ఇక్కడ మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. పొరుగుదేశాల్లో మతహింసకు, వేధింపులకు గురై, వలస వచి్చన ముస్లిమేతరులకు పౌరసత్వం కలి్పంచేందుకు సీఏఏ తెచ్చామన్నారు. సీఏఏపై మాథ్యూ చేసిన వ్యాఖ్యలపై ఇండియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ‘‘ఇండియాలో సీఏఏను ఎలా అమలు చేయబోతున్నారన్నది గమనిస్తున్నాం. అన్ని మతాల స్వేచ్ఛను గౌరవించాలి. చట్ట ప్రకారం అన్ని మతాలను సమానంగా చూడడం అనేది ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రం’ అని మిల్లర్ వ్యాఖ్యానించారు. -
భారత వ్యతిరేక కార్యకలాపాల అడ్డాగా కెనడా
వాషింగ్టన్: కెనడాలో ఖలిస్తాన్ వేర్పాటువాద నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ మృతి, దానికి సంబంధించిన రగడపై అమెరికాతో లోతుగా చర్చించినట్టు విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన గురువారం ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో భేటీ అయ్యారు. హత్యపై కెనడా జరుపుతున్న దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని బ్లింకెన్ ఈ సందర్భంగా సూచించినట్టు విదేశాంగ శాఖ ఉన్నతాధికారి ఒకరు శుక్రవారం పేర్కొన్నారు. అనంతరం దీనిపై జై శంకర్ స్పందించారు. భారత్ లక్ష్యంగా వేర్పాటువాదం, హింస, వ్యవస్థీకృత నేరాలు, మనుషుల అక్రమ రవాణా వంటివాటికి కెనడా కొన్నేళ్లుగా అడ్డాగా మారుతోందని మండిపడ్డారు. ‘పైగా అక్కడి ప్రభుత్వం కూడా కొన్నేళ్లుగా అలాంటి వాటిని అనుమతిస్తున్న ధోరణి కనబరుస్తోంది. ట్రూడో సర్కారు రాజకీయ అనివార్యతలే ఇందుకు కారణం‘ అని ఆరోపించారు. ‘కెనడాలో భారత దౌత్యవేత్తలను బాహాటంగా బెదిరించే దుస్థితి నెలకొంది! కార్యాలయాలకు వెళ్లడం కూడా రిసు్కగా మారింది. అందుకే ఆ దేశానికి వీసా సేవలను కూడా ఆపేయాల్సి వచి్చంది‘ అని జైశంకర్ వివరించారు. బ్లింకెన్‌తో జైశంకర్ -
Sudan: సూడాన్‌లో కల్లోల పరిస్థితులు.. చిక్కుకుపోయిన మనోళ్లు
ఖార్తూమ్: సూడాన్ సైన్యం, పారామిలటరీ విభాగమైన తక్షణ మద్దతు దళం(ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్)కు మధ్య కొనసాగుతున్న పరస్పర దాడులతో నెలకొన్న కల్లోల పరిస్థితులు అక్కడి భారతీయులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. ఇరు వర్గాల కాల్పులు, బాంబుల మోతతో ఉన్నచోటు నుంచి కనీసం బయటకురాలేక బిక్కుబిక్కుమంటూ సాయం కోసం అర్థిస్తున్నారు. దీంతో దౌత్యమార్గంలో వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. కాల్పుల విరమణకు అమెరికా వంటి దేశాలు పిలుపునిచ్చినా కొద్ది గంటలకే అది విఫలమై గడిచిన 24 గంటల్లోనే మరో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో పరిస్థితి చేయి దాటేలోపే భారతీయులను వెనక్కితీసుకురావాలనే భారత్ కృతనిశ్చయంతో ఉందని భారత విదేశాంగ శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి. కర్ణాటక సంప్రదాయ మూలిక వైద్యం చేసే 31 మంది ‘హక్కీ పిక్కీ’ గిరిజనులుసహా 60 మంది భారతీయులు సూడాన్‌లో చిక్కుకున్నారని వారి గురించి పట్టించుకోండని ఆ రాష్ట్ర మాజీ సీఎం సిద్ధరామయ్య కోరడం, ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని ఇప్పటికే విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించడం తెల్సిందే. సూడాన్ ఘర్షణల్లో ఇప్పటిదాకా దాదాపు 270 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని ఖార్తూమ్‌లో జరిగిన కాల్పుల్లో ఒక మాజీ భారతీయ సైనికుడు ఆల్బర్ట్ అగస్టీన్ చనిపోయారు. 1,800 మందికిపైగా గాయాలపాలయ్యారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, సౌదీ, యూఏఈతో మంతనాలు సూడాన్‌తో సంబంధాలు నెరుపుతున్న అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, యూఏఈ దేశాలతో భారత విదేశాంగ శాఖ మంతనాలు కొనసాగిస్తోంది. క్షేత్రస్థాయిలో భారతీయుల రక్షణకు సాయపడతామని జైశంకర్‌కు సౌదీ, యూఏఈ విదేశాంగ మంత్రులు హామీ ఇచ్చారు. సూడాన్‌లో భారతీయ ఎంబసీ అక్కడి భారతీయులతో వాట్సాప్ గ్రూప్లుసహా పలు మార్గాల్లో టచ్‌లోనే ఉంది. ‘ మా నాన్న వ్యాపార నిమిత్తం అక్కడికెళ్లి శనివారమే ముంబైకి రావాల్సింది. సూడాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఉండగా చివరి నిమిషంలో విమానం రద్దయిందని చెప్పి అక్కడి అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి వెళ్లగొట్టారు. హోటల్‌కు కాలినడకనే వెళ్లారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఏంటో తెలీడం లేదు’ అని 63 ఏళ్ల వ్యక్తి కూతురు మానసి సేథ్ వాపోయారు. ‘అక్కడంతా ఆటవిక రాజ్యమే. ప్రాణాలకు విలువే లేదు. స్వయంగా సైనికులే లూటీ చేస్తూ అపహరణలకు పాల్పడుతున్నారు. ఖర్తూమ్ హోటల్లో నా భర్త చిక్కుకుపోయారు. బాంబుల దాడి భయంతో హోటల్లోని అతిథులంతా బేస్మెంట్లో దాక్కున్నారు’ అని మరో మహిళ పీటీఐకి చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీధుల్లో రాకపోకలు కూడా కష్టమేనని భారత విదేశాంగ శాఖ చెబుతోందంటే అక్కడి పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. 150 ఏళ్ల క్రితమే సూడాన్‌కు వలసలు ప్రస్తుతం సూడాన్‌లో దాదాపు 4,000 మంది భారతీయులున్నారు. వీరిలో 1,200 మంది శాశ్వత స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. వీరి కుటుంబాలు 150 ఏళ్ల క్రితమే అక్కడికి వలసవెళ్లాయి. ఇక మిగతావారు సూడాన్ ఆర్థిక రంగం వంటి పలు వృత్తుల్లో ఉద్యోగాల కోసం వెళ్లారు. కొందరు ఐక్యరాజ్యసమితి కార్యక్రమాలు, అంతర్జాతీయ సంస్థల్లో పనిచేస్తున్నారు. ఎవరీ హక్కీ పిక్కీలు ? గుజరాత్ నుంచి శతాబ్దాల క్రితం కర్ణాటకకు హక్కి పిక్కి అనే గిరిజన తెగ ప్రజలు వలసవచ్చారు. అడవుల్లో ఉంటూ మూలికా వైద్యం చేస్తారు. వీరికి సొంత భాష ‘వగ్రీబూలి’తోపాటు తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం వచ్చు. పేద ఆఫ్రికా దేశం సూడాన్‌లో ఖరీదైన ఇంగ్లిష్ మందులు, వైద్యం పొందగల స్తోమత ఉన్న జనాభా చాలా తక్కువ. అందుకే స్థానికులు చవక వైద్యం వైపు మొగ్గుచూపుతారు. అందుకే వారికి తమ సంప్రదాయ వైద్యం చేసేందుకు సుదూరంలోని సూడాన్‌కు ఈ కర్ణాటక గిరిజనులు చేరుకున్నారు. ఎందుకీ గొడవ ? ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని అబ్దల్లా హమ్దోక్ను గత ఏడాది సైన్యం, ఆర్ఎస్ఎఫ్ గద్దెదించి పాలనను తమ చేతుల్లోకి తీసుకున్నాయి. తాజాగా ఆర్ఎస్ఎఫ్ను సైన్యంలో విలీనం చేయాలని సైన్యాధ్యక్షుడు జనరల్ అబ్దుల్ ఫతాహ్ అల్–బుర్హాన్ ప్రతిపాదించగా ఆర్ఎస్ఎఫ్ చీఫ్ జనరల్ మొహమ్మద్ హమ్దాన్ దగాలో తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఇరు సాయుధ విభాగాల మధ్య అగ్గి రాజుకుంది. -
గోగ్రా నుంచి మూడు రోజుల్లో సైన్యం వెనక్కి
న్యూఢిల్లీ: తూర్పులద్దాఖ్‌లోని గోగ్రా హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో సైన్యాన్ని వెనక్కి ప్రక్రియను మూడు రోజుల్లో పూర్తి చేయాలని భారత్, చైనా నిర్ణయించాయి. సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఈ నెల 12 సోమవారం వరకు గడువు ఉందని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వాస్తవాధీన రేఖ వెంబడి గత రెండేళ్లుగా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న గోగ్రా–హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15 దగ్గర్నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను మొదలు పెట్టామని భారత్, చైనా ప్రకటించిన ఒక్క రోజు తర్వాతే భారత్ విదేశాంగ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. వచ్చేవారం ఉజ్బెకిస్తాన్‌లో షాంఘై సహకార సంస్థ సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యే అవకాశాలున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఇతర అంశాలను కూడా పరిష్కరించుకొని సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడానికి ఇరుపక్షాలు అంగీకరించినట్టుగా విదేశాంగ శాఖ అధికారప్రతినిధి అరిందమ్ బగాచి చెప్పారు. గురువారం ఉదయం 8.30 గంటలకు మొదలైన సైన్యం ఉపసంహరణ సోమవారంతో ముగియాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రాంతంలో తాత్కాలిక నిర్మాణాలు, ఇతర మౌలిక సదుపాయాలనూ ధ్వంసం చేస్తున్నటు చెప్పారు. 2020 జూన్ గల్వాన్‌లోయలో ఘర్షణలు జరగడానికి ముందు ఎలా ఉండేదో అలా ఉండేలా ఇరు పక్షాలు చర్యలు తీసుకుంటాయన్నారు. -
పీవోకేలో ఆమె పర్యటన.. భగ్గుమన్న భారత్
అమెరికా చట్టసభ్యురాలు ఇల్హాన్ ఒమర్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించడంపై భారత్ భగ్గుమంది. సంకుచిత మనస్తత్వ రాజకీయాలకు ఇది నిదర్శనమని గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. సోమాలియాలో పుట్టిపెరిగి, అమెరికా చట్టసభ్యురాలైన ఇల్హాన్ ఒమర్(39) మొదటి నుంచి భారత వ్యతిరేకి. నాలుగు రోజుల పాక్ పర్యటనలో భాగంగా ఏప్రిల్ 20 నుంచి 24వ తేదీల మధ్య పాక్‌లో పర్యటించనుంది. ఈ తరుణంలో ఇల్హాన్ ఒమర్, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను ఇంటికెళ్లి మరీ కలిసింది. ఆపై ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యి కశ్మీర్ అంశంపైనా చర్చించింది కూడా. ఈ తరుణంలో ఆమె పీవోకే పర్యటన చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై భారత విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాఘ్ఛి స్పందించారు. ప్రస్తుతం పాకిస్థాన్ అక్రమంగా ఆక్రమించుకున్న జమ్ము కశ్మీర్‌లోని భారత కేంద్రపాలిత అంతర్భాగాన్ని ఆమె పర్యటించాలనుకోవడం మా దృష్టికి వచ్చింది. ఇలాంటి రాజకీయ నాయకురాలు.. తమ సంకుచిత రాజకీయాలను ఆచరించాలని కోరుకుంటే, అది ఆమె ఇష్టం. కానీ, అలాంటి ఆమె ఇంట చేసుకోవాలి. అంతేగానీ ఆ ముసుగులో భారత ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా. కశ్మీర్ అంశంపై ఒమర్‌తో జరిగిన భేటీ గురించి.. స్వయంగా ప్రధాని షెహబాజ్ మీడియాకు వివరించారు. లాహోర్‌తో పాటు ‘‘ఆజాద్ జమ్ము కశ్మీర్’’ల గురించి ఆమెకు తెలుసని, ఆ ప్రాంతాల్లో ఆమె సందర్శిస్తుందని పాక్ ప్రధాని తెలిపారు. చదవండి: థ్యాంక్స్ ‘మోదీ జీ’.. పాక్ కొత్త పీఎం ఆసక్తికర వ్యాఖ్యలు -
రక్షణ భాగస్వామ్యం పెంచుదాం
వాషింగ్టన్: భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ శుక్రవారం వాషింగ్టన్లో అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో సమావేశయ్యారు. ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. భారత్–అమెరికా మధ్య వ్యూహాత్మక, రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని నిర్ణయానికొచ్చారు. రెండు దేశాలకు రక్షణపరంగా ఎదురవుతున్న సవాళ్ల గురించి తమ అభిప్రాయాలను పంచుకున్నారు. లాయిడ్ అస్టిన్‌తో సమావేశమై, కీలక అంశాలపై సంప్రదింపులు జరిపినట్లు జైశంకర్ పేర్కొన్నారు. జాతీయ భద్రత సలహాదారుతో భేటీ శంకర్ గురువారం అమెరికా జాతీయ భద్రత సలహాదారు జేక్ సాలివన్‌తో సమావేశమయ్యారు. రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై వారు చర్చించారు. కరోనా మహమ్మారి అంతం, కోవిడ్ వ్యాక్సినేషన్, స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతం, వాతావరణ మార్పుపై పోరు, అఫ్గానిస్తాన్‌లో శాంతి.. తదితర అంశాలపై ఇరువురు లోతుగా చర్చించారు. ఇరు దేశాలు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాళ్లను కలిసికట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయించారు. బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆ దేశం సందర్శించిన తొలి విదేశీ విదేశాంగ మంత్రి జైశంకర్ కావడం విశేషం. జేక్ సాలివన్‌తో భేటీ కావడం సంతోషదాయకమని అనంతరం జై శంకర్ ట్వీట్ చేశారు. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు, ఉమ్మడిగా పాటించే విలువలు ఇండో యూఎస్ భాగస్వామ్యానికి పునాదులని సమావేశం అనంతరం జేక్ ట్వీట్ చేశారు. కోవిడ్‌పై పోరు కోసం ఇటీవలి కొన్ని వారాల్లోనే అమెరికా ప్రభుత్వం, అక్కడి సంస్థలు, ఆ దేశ పౌరులు దాదాపు 50 కోట్ల డాలర్ల విలువైన సాయం భారత్‌కు అందించారని అమెరికా జాతీయ భద్రత మండలి అధికార ప్రతినిధి ఎమిలీ హార్నీ తెలిపారు. అమెరికాలోని పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలకు చెందిన శక్తిమంతమైన రాజకీయ నాయకులతో జైశంకర్ భేటీ అయ్యారు. అమెరికాకు భారత్ 9వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. రెండుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య విలువ, ఈ ఏడాది జనవరి నుంచి మార్చ్ వరకు, 24.8 బిలియన్ డాలర్లు ఉంటుంది. -
పాక్ లేఖాస్త్రం.. మరో కుట్ర!
ఇస్లామాబాద్ : భారత నౌకాదళ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ వ్యవహారంలో పాకిస్థాన్ వేగంగా పావులు కదుపుతోంది. జైల్లో ఉన్న జాదవ్ ‘భారత గూఢాచారి’ అని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నట్లు ప్రకటించింది. అంతర్జాతీయ న్యాయస్థానం లభించిన క్లియరెన్స్‌తో భారత్ నుంచి జాదవ్‌కు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘పట్టుబడే సమయంలో జాదవ్ భారత నేవీ అధికారిగా కొనసాగుతున్నారు’’ ఇది పాక్ బలంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనిని నిరూపించేందుకు తగిన సమాచారం సేకరించేందుకు ఐసీజే నుంచి ప్రత్యేక అనుమతిని పొందింది. దీంతో తాజాగా పాక్ భారత విదేశాంగ శాఖకు ఓ లేఖ రాసింది. ‘జాదవ్ వ్యక్తిగత విషయాలు, ఆయన ఉద్యోగంలో చేరిన తేదీ-విరమణ పొందిన తేదీ, పాస్‌పోర్ట్ వివరాలు, బ్యాంక్ అకౌంట్, పెన్షన్ తదితర అంశాలపై పూర్తి వివరాలను తమకు ఇవ్వాలి’’ అని పాక్ కోరింది. ఆ లెక్కన్న పట్టుబడిన సమయంలో జాదవ్ విధుల్లో ఉన్నాడా? లేదా? అన్నది ఈ రకంగా ధృవీకరించుకోవాలని పాక్ భావిస్తోంది. పాస్ పోర్టే కీలకం... మరీ ముఖ్యంగా పాస్ పోర్టు అంశంపైనే పాక్ ప్రధానంగా దృష్టిసారించినట్లు సమాచారం. హుస్సేన్ ముబాకర్ పటేల్ పేరు మీద ఉన్న పాస్పోర్టుతో జాదవ్ పుణే నుంచి ఇరాన్ కు ఆయన ప్రయాణించారనే పాక్ ఆరోపిస్తోంది. అంతేకాదు ముంబై, దుబాయ్ ఇలా 18 ప్రాంతాల్లో ఆయన ఇదే పాస్ పోర్టు మీద ప్రయాణించారంటోంది. అలాంటప్పుడు అది ఆయన ఒరిజినల్ పాస్‌పోర్టు అవునా? కాదా? అన్నది భారత్ నిర్ధారించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆస్తుల వివరాలను కూడా కోరినట్లు తెలుస్తోంది. ముంబై, పుణే, మహారాష్ట్రంలో హుస్సేన్ ముబారక్ పేరు మీద ఉన్న ఆస్తులు జాదవ్‌కు చెందినవేనని పాక్ అనుమానిస్తోంది. 13 మంది ఇండియన్ అధికారుల పేర్లను ఈ లేఖలో ప్రస్తావించినట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సహా, ఓ ‘రా’ మాజీ అధికారి(వీరిద్దరే జాదవ్ వ్యవహారాలను దగ్గరుండి చూసుకున్నారని పాక్ ఆరోపణ), నిఘా, బ్యాంక్, పాస్‌పోర్టు అధికారులకు పేర్లను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే ఈ లేఖల వ్యవహారంపై విదేశాంగ శాఖ మాత్రం స్పందించటం లేదు. 2016 మార్చిలో బెలూచిస్తాన్ ప్రాంతంలో తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్ర కుట్రలు పన్నారన్న ఆరోపణలపై పాక్ ఆయన్ని అరెస్ట్ చేసింది. ఆ సమయంలోనూ ఆయన విధుల్లో ఉన్నారంటూ పాక్ వాదిస్తూ వస్తోంది. కానీ, ఆయన పదవీ విరమణ పొందారని.. వ్యాపారం నిమిత్తం ఇరాన్ వెళ్లిన అతన్ని కిడ్నాప్ చేసి మరి పాక్ జైల్లో బంధీగా ఉంచారని భారత్ చెబుతోంది. జాదవ్‌పై మరో కేసు... అంతర్జాతీయ న్యాయస్థానం ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేయటంతో మరో కుట్రకు పాక్ తెరలేపింది. జాదవ్‌పై మరో కేసును బనాయించింది. ఉగ్రవాదం, మోసం, విద్రోహ చర్యలు కింద జాదవ్‌పై తప్పుడు కేసులు బనాయించి దర్యాప్తు ప్రారంభించింది. -
కాబుల్ మృతులకు భారత్ నివాళులు
న్యూఢిల్లీ: అప్ఘనిస్తాన్‌లో ముష్కరులు బుధవారం జరిపిన దాడులలో మృతి చెందినవారికి భారత విదేశాంగ శాఖ నివాళులర్పించింది. ఈ దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. మానవ బాంబులతో ముష్కరులు అప్ఘన్ రాజధాని కాబుల్‌లో రెండుసార్లు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 16 మంది మృతి చెందగా 43 మంది గాయపడ్డారు. భారత్ కూడా ఉగ్ర బాధిత దేశమని, ఉగ్రవాద నిర్మూలనకు అప్ఘనిస్తాన్తో కలిసి పోరాడతామని విదేశాంగ శాఖ పేర్కొంది.