అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో జైశంకర్ భేటీ
వాషింగ్టన్: భారత్‌తో తమ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అమెరికా నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ప్రమాణంచేసిన కొద్దిసేపటికే ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు.
53 ఏళ్ల రూబియో బాధ్యతలు చేపట్టగానే భారత్‌తో భేటీకి సిద్ధపడటం అమెరికా భారత్‌కు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను చాటిచెబుతోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం, తర్వాత క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికాకు వచ్చిన విషయం తెల్సిందే. క్వాడ్ భేటీ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో రూబియో, జైశంకర్ విస్తతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment