Trade relations
-
భారత్‌తో అమెరికా వాణిజ్యం బలోపేతం
వాషింగ్టన్: భారత్‌తో తమ వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని కోరుకుంటున్నట్లు అమెరికా నూతన విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగ మంత్రిగా ప్రమాణంచేసిన కొద్దిసేపటికే ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌తో భేటీ అయ్యారు. 53 ఏళ్ల రూబియో బాధ్యతలు చేపట్టగానే భారత్‌తో భేటీకి సిద్ధపడటం అమెరికా భారత్‌కు ఇస్తున్న అత్యధిక ప్రాధాన్యతను చాటిచెబుతోంది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం, తర్వాత క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ అమెరికాకు వచ్చిన విషయం తెల్సిందే. క్వాడ్ భేటీ తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ప్రధాన కార్యాలయంలో రూబియో, జైశంకర్ విస్తతస్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
భారత్, అమెరికా సంబంధాలు.. చపాతి, పూరీలతో పోలిక
వాషింగ్టన్: భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలపై అమెరికా ఉన్నతాధికారి జెఫ్రీ ఆర్ ప్యాట్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు చపాతీలా చదునుగా లేవని పూరీలా పొంగి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాయన్నారు. ఇంధనం, భద్రత అంశాల పరంగా భారత్‌తో తమకున్న సంబంధాలు ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైనవని చెప్పారు. అయితే భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై (ఎఫ్‌టీఏ)పై ఎలాంటి చర్చలు జరగడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరో దశకు తీసుకెళ్లడంపైనే దృష్టిపెట్టినట్లు తెలిపారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగంలో రెండు దేశాల మధ్య మంచి సంబంధాలున్నట్లు తెలిపారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు చెందిన గ్రీన్ కో కంపెనీతో చర్చలు జరిపిన విషయాన్ని గుర్తు చేశారు. హౌతీల దాడులతో అంతర్జాతీయ సముద్ర రవాణా సమస్యలు ఎదుర్కొంటోందన్నారు. హౌతీల దాడికి గురైన నౌకలను కాపాడేందుకు భారత నేవీ చేసిన కృషి గొప్పదని, ఇది భారత సామరర్థ్యాన్ని తెలియజేస్తోందని కొనియాడారు. #WATCH | On Foreign Trade Agreements between US and India, US Secretary of State for Energy Resources Geoffrey R. Pyatt says, "Nobody today characterises their trade relationship as flat as a 'chapati'. It has become big and puffed up like a big 'puri'... I think we are not… pic.twitter.com/Gf5Tw7o8Ee — ANI (@ANI) February 5, 2024 ఇదీ.. చదవండి.. వెనక్కు తగ్గని హౌతీలు -
లంకతో రూపీలో వాణిజ్యం
కొలంబో: శ్రీలంక రూపీ–భారత్ రూపీ మధ్య వాణిజ్యాన్ని ప్రారంభించినందుకు ఎస్బీఐని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అభినందించారు. శ్రీలంక నుంచి లంకన్ రూపీ–భారత్ రూపీలో నేరుగా వాణిజ్యం ప్రారంభించిన తొలి విదేశీ బ్యాంక్‌గా ఎస్బీఐ నిలిచినట్టు చెప్పారు. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంకలో మంత్రి సీతారామన్ పర్యటిస్తుండడం తెలిసిందే. నార్తర్న్ ప్రావిన్స్ గవర్నర్ పీఎస్ఎం చార్లెస్‌తో కలసి జాఫ్నా ప్రాంతంలో ఎస్బీఐ రెండో శాఖను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖరా, భారత హై కమిషనర్ (శ్రీలంక) గోపాల్ బాగ్లే కూడా పాల్గొన్నారు. ఎస్బీఐ ప్రారంభించిన ఈ నూతన సేవ వల్ల శ్రీలంక దిగుమతిదారులు అమెరికా డాలర్లపై ఆధారపడాల్సిన ఇబ్బంది తప్పుతుందని మంత్రి చెప్పారు. ఇది శ్రీలంక ఆర్థిక వ్యవస్థకు సాయంగా ఉంటుందన్నారు. జాఫ్నా బ్రాంచ్ ద్వారా నార్తర్న్ ప్రావిన్స్‌లో వ్యాపారాలకు ఎస్ బీఐ మద్దతుగా నిలుస్తుందని చెప్పనారు. మంత్రి సీతారామన్ గురువారం ట్రింకోమలేలోనూ ఎస్బీఐ శాఖను ప్రారంభించడం గమనార్హం. తన పర్యటనలో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, ప్రధాని దినేష్ గుణవర్ధనేతో మంత్రి సీతారామన్ సమావేశమయ్యారు. -
Canada-India relations: కెనడా పెట్టుబడులు ఎక్కువే
న్యూఢిల్లీ: ఇటీవల కెనడా, భారత్ మధ్య దౌత్య సంబంధ వివాదాలు తలెత్తిన నేపథ్యంలో పెట్టుబడుల రాకపై పెద్దగా ప్రభావం పడకపోవచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలలో వెనువెంటనే ప్రతికూల పరిస్థితులు ఏర్పడకపోవచ్చని ఇన్వెస్టర్ల ఫోరమ్.. సావరిన్ వెల్త్ ఫండ్ ఇన్స్టిట్యూట్(ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ) పేర్కొంది. రెండు దేశాల మధ్య రాజకీయ సంబంధాలు కొంతమేర దెబ్బతిన్నప్పటికీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) వంటి అంశాలు పెద్దగా ప్రభావితం కాకపోవచ్చని అభిప్రాయపడింది. నిజానికి 2000 ఏప్రిల్ నుంచి 2023 మార్చి మధ్య కాలంలో కెనడా నుంచి దేశీయంగా 3.64 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 30,212 కోట్లు) ఎఫ్‌డీఐలు ప్రవహించాయి. వెరసి ఎఫ్‌డీఐల రాకలో కెనడా 17వ ర్యాంకులో నిలిచినట్లు ఇన్వెస్ట్ ఇండియా పేర్కొంది. కెనడియన్ పెట్టుబడుల్లో సరీ్వసులు, మౌలికసదుపాయాల పెట్టుబడులు 40.63 శాతంకాగా.. దేశీయంగా 600కుపైగా కంపెనీలు కార్యకలాపాలు కలిగి ఉన్నాయి. ఇంతకంటే అధికస్థాయిలో కెనడా కంపెనీలు దేశీయంగా పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. జీటీఆర్ఐ నివేదిక ప్రకారం కెనడియన్ పెన్షన్ ఫండ్స్ 2022 చివరికల్లా దేశీయంగా 45 బిలియన్ డాలర్లకుపైగా ఇన్వెస్ట్ చేశాయి. తద్వారా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఎఫ్‌డీఐగా కెనడా నిలిచింది. ఫండ్ పెట్టుబడుల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, ఫైనాన్షియల్ సర్వీసులున్నాయి. భారీ మార్కెట్ కావడం, పెట్టుబడులపై అత్యధిక రిటర్నులు కారణంగా కెనడా పెన్షన్ ఫండ్స్ దేశీయంగా పెట్టుబడులను కొనసాగించనున్నట్లు జీటీఆర్ఐ అభిప్రాయపడింది. లక్ష కోట్లకుపైగా దేశీయంగా రియలీ్ట, ఎనర్జీ, హెల్త్‌కేర్, ఐటీ తదితర రంగాలలో కెనడియన్ పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్(సీపీపీఐబీ) లక్ష కోట్లకుపైగా ఇన్వెస్ట్ చేసింది. సీపీపీఐబీ తాజా గణాంకాల ప్రకారం ఏడాదిక్రితంవరకూ దేశంలో 21 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ఇది ప్రభుత్వ సంస్థ అయినప్పటికీ స్వతంత్ర బోర్డు నిర్వహణలో ఉంటుందని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ఐ చైర్మన్ లక్ష్మీ నారాయణన్ పేర్కొన్నారు. ప్రధానంగా వాటాదారులకు లబ్ది చేకూర్చే లక్ష్యంతో ఇన్వెస్ట్ చేస్తుందని తెలియజేశారు. దేశీ స్టార్టప్‌లలో సీపీపీఐబీ పెట్టుబడులు చేపడుతోంది. డెల్హివరీలో 6 శాతం, కొటక్ మహీంద్రా బ్యాంక్‌లో 2.68 శాతం, జొమాటోలో 2.42 శాతం, ఇండస్టవర్లో 2.18 శాతం, పేటీఎమ్‌లో 1.76 శాతం, నైకాలో 1.47 శాతం చొప్పున వాటాలు కలిగి ఉంది. ఈ బాటలో విదేశాలలో లిస్టయిన దేశీ కంపెనీలలోనూ ఇన్వెస్ట్ చేసింది. యూఎస్ లిస్టెడ్ విప్రో, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకులలో పెట్టుబడులు కలిగి ఉంది. మరికొన్ని ఇతర అన్‌లిస్టెడ్ కంపెనీలోనూ వాటాలు పొందినట్లు నారాయణన్ తెలియజేశారు. రెండింటికీ మేలే భారత్, కెనడా సంబంధాలు రెండింటి లబ్ది ఆధారితమై ఉన్నట్లు స్వతంత్ర రీసెర్చర్, కన్సల్టెంట్ ప్రతీమ్ రంజన్ బోస్ పేర్కొన్నారు. దీంతో పెట్టుబడులపై వెనువెంటనే ప్రతికూల ప్రభావం పడకపోవచ్చని అంచనా వేశారు. రెండు ఆర్థిక వ్యవస్థలకూ నష్టదాయకం కావడంతో ప్రస్తుత వివాదాలు కొనసాగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. దౌత్య మార్గంలో సమస్యలు సర్దుకునే అవకాశమున్నట్లు తెలియజేశారు. దశాబ్దకాలం తదుపరి ఇటీవలే రెండు దేశాల మధ్య విదేశీ వాణిజ్య ఒప్పంద చర్చలకు తెరతీసినట్లు తెలియజేశారు. అయితే రాజకీయ వివాదాలు తలెత్తడంతో తిరిగి నిలిచిపోయినట్లు తెలియజేశారు. 2022లో కెనడాకు తొమ్మిదో ర్యాంకు విదేశీ వాణిజ్య భాగస్వామిగా భారత్ నిలిచిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. అధిక రిటర్నులు దౌత్యపరమైన ప్రస్తుత ఉద్రిక్తతలు రెండు దేశాల మధ్య పెట్టుబడులను దెబ్బతీయకపోవచ్చని ప్రభుత్వ అత్యున్నత అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. దేశీయంగా అత్యధిక రిటర్నులు లభిస్తుండటంతో కెనడియన్ పెన్షన్ ఫండ్స్ మౌలిక సదుపాయాల రంగంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు తెలియజేశారు. అధిక లాభాలను పొందుతున్నందునే దేశీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. వెరసి ప్రస్తుత పరిస్థితుల కారణంగా పెట్టుబడులు వెనక్కి మళ్లేందుకు కారణాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే వివాదాలు పరిష్కారంకావచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఫండ్స్ పెట్టుబడులపై ప్రపంచంలో మరెక్కడా ఈ స్థాయి రిటర్నులు పొందలేకపోవచ్చని స్పష్టం చేశారు. -
భారత్, యూఏఈ మధ్య బంగారం వాణిజ్యం పెంపు
న్యూఢిల్లీ: విలువ ఆధారిత బంగారం ఉత్పత్తుల్లో వాణిజ్యం పెంచుకునే విషయమై భారత్, యూఏఈ దృష్టి సారించినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాన్ని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. స్విట్జర్లాండ్ తర్వాత భారత్‌కు ఎక్కువ బంగారం సరఫరా చేసే దేశం యూఏఈ అని చెప్పారు. యూఈఏతో బంగారం వాణిజ్యాన్ని మరింత పెంచుకోవాలని అనుకుంటున్నట్టు తెలిపారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కింద యూఏఈ నుంచి బంగారం దిగుమతులపై కేంద్రం పలు రాయితీలు కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే, ఈ రాయితీలకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయంటూ, త్వరలోనే అవి పరిష్కామవుతాయన్నారు. సోమవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు మంత్రి మాట్లాడారు. ఈయూఏతో భారత్‌కు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 2022 మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఏడాదిలో 200 టన్నుల వరకు బంగారం దిగుమతులపై సుంకాల్లో రాయితీలు ఇచ్చేందుకు భారత్ అంగీకరించింది. సాధారణంగా అయితే బంగారం దిగుమతులపై సుంకం 15 శాతంగా ఉంది. ఈ పరిమితి మేరకు బంగారాన్ని ఎగుమతి చేయడం ద్వారా యూఏఈ ప్రయోజనం పొందొచ్చని కేంద్రం భావిస్తోంది. భారత జెమ్స్, జ్యుయలరీకి యూఏఈ అతిపెద్ద మార్కెట్‌గా ఉండడం గమనార్హం. ఈ రంగంలో భారత్ నుంచి జరిగే ఎగుమతుల్లో 15 శాతం యూఏఈకే వెళుతుంటాయి. 2022–23లో భారత్ నుంచి జెమ్స్ జ్యుయలరీ మొత్తం ఎగుమతులు 37.5 బిలియన్ డాలర్ల మేర ఉన్నాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5 శాతం తగ్గాయి. -
పతనం అంచున పాక్
‘‘భారత్‌తో మూడు యుద్ధాలు చేశాం. సాధించింది ఏమీ లేదు. దేశంలో మరింత విధ్వంసం జరిగింది. నిరుద్యోగం పేదరికం మీద పడ్డాయి. యుద్ధానికి కారణమైన కశ్మీర్ వంటి అంశాలపై భారత్‌తో చర్చలకు సిద్ధంగా ఉన్నాం’’ ‘‘అణ్వాయుధాలు కలిగిన మన దేశం అన్నవస్త్రాల కోసం ప్రపంచ దేశాల ముందు దేహి అంటూ చేయి చాపడం నిజంగా సిగ్గు చేటు. అంతర్జాతీయ సంస్థల్ని రుణాలు అడగాలన్నా ఇబ్బందిగా అనిపిస్తోంది. ఇలా ప్రపంచ దేశాలను భిక్షమడిగి దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కించడం పరిష్కారం కాదు’’ ఈ వ్యాఖ్యలు చేసినది ఎవరో కాదు. సాక్షాత్తూ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్. రోజు రోజుకీ దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారి పోతూ ఉండడంతో మరో దారి లేక షరీఫ్ శాంతి మంత్రం జపిస్తున్నారు. భారత్‌తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించుకుంటే ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కుతామన్న భావనలో పాక్ సర్కార్ ఉంది. గోధుమల లారీని వెంబడించి.. ! పాకిస్తాన్లో ప్రధాన ఆహారమైన గోధుమ పిండికి విపరీతమైన కొరత ఏర్పడింది. నిరుపేదలు గోధుమ పిండి కొనుక్కోవడానికి గంటల తరబడి దుకాణాల దగ్గర క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో కరాచీలో ఒక గోధుమ పిండి లారీ వెళుతూ ఉంటే దాని వెనక ప్రజలు పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఒక్క వీడియో చాలు పాక్‌లో ఆహార సంక్షోభం ఏ స్థాయికి చేరుకుంటోందో చెప్పడానికి. బియ్యం, గోధుమలు, కూరగాయలు డిమాండ్‌కు తగ్గ సప్లయి కావడం లేదు. ఇరుగు పొరుగు దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలంటే డాలర్ నిల్వలు తరిగిపోతున్నాయి. కరాచీలో కేజీ గోధుమ పిండి రూ.160 ధర పలుకుతూ ఉండడంతో ప్రజలు కడుపు నింపుకోవడమెలాగ అని ఆందోళన చెందుతున్నారు. కొన్ని రెస్టారెంట్లలో ఒక భోజనం ఖరీదు ఏకంగా రూ.800కి చేరుకుంది. విద్యుత్ సంక్షోభంతో మార్కెట్లను, రెస్టారెంట్లను రాత్రి 8 గంటలకే మూసేస్తూ ఉండడంతో జనం కూడా చేసేదేమి లేక త్వరగా నిద్రపోతున్నారు. దీంతో పాక్‌లో చీకటి పడగానే విద్యుత్ వెలుగులు లేక కారు చీకట్లోకి దేశం వెళ్లిపోతోంది. పెట్రోల్ ధరలు చుక్కల్ని తాకుతున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.200కి పైనే ఉండడంతో సామాన్యులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. మరోవైపు ప్రాణావసరమైన మందులకి కూడా కొరత ఏర్పడడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరాచీలో ఇన్సులిన్ లభించకపోవడంతో మధుమేహ రోగులు నానా తంటాలు పడుతున్నారు. ఇక సైనికులకి రెండు పూటలా తిండి పెట్టే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. దేశంలో టాప్‌లో ఉన్న 8 తయారీ సంస్థలు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లేక మూతపడ్డాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి వివిధ దేశాల్లో రాయబార కార్యాలయాలను కూడా పాక్ ప్రభుత్వం అమ్మకానికి పెట్టడంతో ఆర్థిక సంక్షోభం పరాకాష్టకు చేరుకున్నట్టయింది. ►పాకిస్తాన్ సెంట్రల్ బ్యాంకులో నిల్వలు నిండుకుంటున్నాయి. స్టేట్ బ్యాంకులో 420 కోట్ల డాలర్లే ఉన్నాయి. ఇవి 25 రోజుల దిగుమతి అవసరాలకు మాత్రమే సరిపోతాయి. ►విదేశీ మారక నిల్వలు 2022 జనవరిలో 1660 కోట్లు ఉంటే ఈ ఏడాది జనవరి నాటికి కాస్త 560 కోట్ల డాలర్లకి పడిపోయాయి. ►ఈ ఆర్థిక సంవత్సరం జనవరి –మార్చి మధ్య పాకిస్తాన్ 830 కోట్ల డాలర్ల విదేశీ అప్పులు తీర్చవలసి ఉంది. ►2022–23లో జీడీపీలో 2.8% ఉన్న రక్షణ బడ్జెట్‌ను 2.2శాతానికి తగ్గించారు. ►2022 ఆకస్మిక వరదలు 3.8 కోట్ల మందిని ప్రభావితం చేశాయి. దేశం విలవిలలాడింది. ► స్టేట్ బ్యాంకు ఆఫ్ పాకిస్తాన్ లెటర్ ఆఫ్ క్రెడిట్స్ ఇవ్వడానికి కూడా ఇష్టపడడం లేదు. ►వాణిజ్య లోటు ఒక్కసారిగా 57% పెరిగిపోయింది. అత్యవసర జాబితాలో లేని లగ్జరీ వస్తువులు 800కి పైగా రకాల వస్తువుల దిగుమతులపై నిషేధం విధించినప్పటికీ వాణిజ్య లోటు పెరిగిపోతూనే ఉంది. ప్రస్తుతం పాక్ వాణిజ్య లోటు 4.866 కోట్ల డాలర్లుగా ఉంది. భారతే దిక్కా ..? పాకిస్తాన్‌కు అండదండ అందించే చైనా ఈ సారి ఆ దేశాన్ని గట్టెక్కించే పరిస్థితులు కనిపించడం లేదు. పాకిస్తాన్ ప్రాంతంలో చైనా చేపట్టిన చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ (సీపీఈసీ) ప్రాజెక్టుకు సంబంధించిన భద్రతాపరమైన ముప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఆ ప్రాజెక్టు కోసం వందల కోట్ల డాలర్లను వెచ్చించిన చైనా ఇంక ఆర్థికంగా ఆదుకుంటుందన్న నమ్మకం లేదు. యూఏఈ, సౌదీ అరేబియాలు ముస్లిం దేశాలు కావడంతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చాయి. యూఏఈ 200 కోట్ల డాలర్ల సాయాన్ని చేయడానికి కూడా అంగీకరించింది. కరోనా విలయం, రష్యా, అమెరికా యుద్ధంతో అన్ని దేశాల ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ వంటి దేశాలు కూడా సాయం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే భారత్‌తో బలమైన సంబంధాలు కలిగి ఉంటే ఈ సంక్షోభం నుంచి గట్టెక్కవచ్చునని పాక్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మన దేశంతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరిస్తే నిత్యావసరాలైన బియ్యం, గోధుమ పిండి, కూరగాయలు, మందులు వంటివి తీసుకురావడం అత్యంత సులభంగా మారుతుంది. వాఘా–అట్టారి, ఖోఖర్పార్–మునాబావో సరిహద్దుల నుంచి నిత్యావసర సామగ్రి తరలించడం సులభతరంగా ఉంటుందని పాక్‌లో ఆర్థిక నిపుణులు ప్రభుత్వానికి హితవు పలుకుతున్నారు. దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ దక్షిణాసియాలో బలహీనమైన ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం పాకిస్తానేనని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది ఆ దేశ వృద్ధి రేటు గతంలో వేసిన అంచనాల కంటే 2%‘ నెమ్మదిస్తుందని తెలిపింది. పాక్ ఆర్థిక వ్యవస్థ కారణంగా దక్షిణాసియా ప్రాంత పురోగతి రేటు కూడా తగ్గిపోతోందని పేర్కొంది. పాకిస్తాన్‌ను గత ఏడాది ముంచెత్తిన వరదలే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషించింది. ఇప్పటికిప్పుడు పాకిస్తాన్‌కు 3,300 కోట్ల డాలర్లు రుణంగా వస్తే తప్ప ఆ దేశం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..!
తాలిబన్లు అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకోవడంతో అఫ్గనిస్తాన్ కు ఇతర దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. తాలిబన్ల రాకతో పలు దేశాల వాణిజ్య రంగంలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు వ్యాపార నిపుణులు భావిస్తున్నారు. కాగా అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా కైవసం చేసుకున్న తాలిబన్లతో స్నేహపూర్వక చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా తన కుటీలబుద్దిని మరో సారి బయటకు తెలిపిన విషయం తెలిసిందే..! తాలిబన్లు తమతో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, వారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చైనా ఒక ప్రకటనలో పేర్కొంది. అఫ్గనిస్తాన్ పునర్నిర్మాణానికి తమ వంతు సహాయం అందిస్తామని డ్రాగన్ దేశం వెల్లడించింది.కాగా చైనా దేశపు కుటీలనీతి ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తోంది. చదవండి: Google: ఆ స్మార్ట్ఫోన్లు ఇకపై కనిపించవు...! అఫ్గనిస్తాన్‌తో చైనా దోస్తీ దాని కోసమేనా...! అఫ్గనిస్తాన్‌ను సొంతం చేసుకున్న తాలిబన్లు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతులైన ఐదో ఉగ్రవాద సంస్థ అని అమెరికా వెల్లడించింది. తాలిబన్ల రాకతో ఇప్పటికే అఫ్గనిస్తాన్‌లోని ప్రపంచంలో అత్యధిక లిథియం ఖనిజ నిక్షేపాలు ఉన్న ప్రాంతాలను అఫ్గనిస్తాన్ తమ అధీనంలోకి తీసుకుంది. ఇంతవరకు వెలికితీయని ఖనిజాలు అఫ్గనిస్తాన్‌లో ఉన్నాయి వీటి విలువ సుమారు ఒక ట్రిలియన్ డాలర్లకు ఉండనుంది. ఈ ఖనిజాలు పునరుత్పాదక శక్తిగా మార్చే స్వభావాన్ని కలిగి ఉన్నాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం బాక్సెట్, రాగి, ఇనుప ఖనిజం, వంటి అరుదైన నిక్షేపాలను కలిగి ఉన్నట్లు పేర్కొంది. విద్యుత్ కేబుల్స్ తయారుచేయడానికి రాగి వంటి లోహల ధర ప్రపంచ మార్కెట్లో భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా నిష్క్రమించడంతో చైనా కు మార్గం సులువైంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను కలిగిన చైనా తాలిబన్లతో స్నేహం చేయడానికి సిద్ధంకావడంతో వారి మైత్రి ప్రపంచదేశాలపైనా భారీ ప్రభావం ఉంటుందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుష్కలమైన ఖనిజసంపదను కలిగి ఉన్న అఫ్గనిస్తాన్ దేశం చైనాకు ఎల్‌డోరాడ్‌గా మారనుందని ఫ్రెంచ్ నిపుణుడు పిట్రాన్ హెచ్చరించాడు. దీంతో చైనా ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లను శాసించడానికి భారీ పన్నాగమే పన్నిందని వ్యాపార నిపుణులు ఆశాభావం వ్యక్తం చేశారు. పునరుత్పాదకత రంగంపై భారీ దెబ్బ..! ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌజ్ ఎఫెక్ట్ పెరుగుతున్న తరుణంలో ప్రపంచ దేశాలు పునరుత్పాదకత శక్తిపై అడుగులు వేస్తున్నాయి. గ్రీన్ ఎనర్జీ సెక్టార్లో ఉపయోగించే అరుదైన నియోడైమియం, ప్రెసోడైమియం, డైస్ప్రోసియం వంటి ఖనిజాలు అఫ్గన్ సొంతం. ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలు, సోలార్ ప్యానెల్, విండ్‌ఫామ్‌లను తయారుచేయడానికి లిథియం కీలకమైన అంశం. అంతర్జాతీయ ఇంధన సంస్ధ ప్రకారం లిథియంకు ప్రపంచ వ్యాప్తంగా 2040 నాటికి 40 రెట్ల మేర డిమాండ్ పెరుగుతుందని పేర్కొంది. (చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్...!) -
డెమోక్రాట్లను గెలిపిస్తే భారత్‌కు మేలు
వాషింగ్టన్: తాను అమెరికా అధ్యక్షుడిగా గెలిస్తే, భారత్ సరిహద్దుల్లోనూ, ఇతర భూభాగాల్లోనూ, భారత్ ఎదుర్కొంటోన్న సవాళ్లను అధిగమించడంలో అమెరికా భారత్ పక్షం వహిస్తుందని డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ వ్యాఖ్యానించారు. ఇరు దేశాల సంబంధాలు మెరుగుపడడానికీ, ఇండో అమెరికన్లు పరస్పర సహకారంతో కలిసి జీవించడానికి, ఇరుదేశాల మధ్య స్నేహాన్ని కొనసాగించడానికి కృషి చేస్తానని ఆయన ప్రతిజ్ఞచేశారు. అమెరికాలో నవంబర్ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో జో బైడెన్ తలపడుతున్నారు. ‘పదిహేనేళ్ల క్రితం భారత దేశంతో చారిత్రాత్మక అణ్వాయుధ ఒప్పందం కొరకు ప్రయత్నం చేశాను. భారత్, అమెరికాల మధ్య మైత్రీ సంబంధాలు బలపడితే, యావత్ ప్రపంచం సురక్షితంగా ఉంటుందని ఆనాడే నేను చెప్పాను’’అని భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని భారతీయులను ఉద్దేశించి, ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడిగా ఉన్న జో బైడెన్ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే ఇదే విధానాన్ని కొనసాగిస్తూ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తామని, ప్రపంచం ఎదుర్కొంటోన్న వాతావరణ మార్పులు, ప్రపంచ ఆరోగ్య రక్షణపై దృష్టిసారిస్తామని బైడెన్ చెప్పారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో, దేశ చరిత్రలోనే అత్యధికంగా భారతీయులను వివిధ పదవుల్లో నియమించినట్లు, ఇప్పుడు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉపాధ్యక్షురాలిగా పోటీలో నిలిపామని ఆయన అన్నారు. భారత దేశానికి చెందిన హిందూ, సిక్కు, ముస్లిం, జైన్, ఇతరులపై జరుగుతోన్న దాడుల నుంచి రక్షణ కల్పిస్తామని ఆయన అన్నారు. హెచ్–1బీ వీసా... హెచ్–1బీ వీసాల విధానాన్ని సంస్కరించి, గ్రీన్ కార్డుల కోసం దేశాల వారీగా ఇచ్చే కోటా విధానాన్ని రద్దు చేస్తామని బైడెన్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం అమెరికాలో జాతి విద్వేషాలు పెరుగుతున్నాయని, ఇతర దేశాల వారిపై ఆంక్షలు విధిస్తూ, హెచ్–1బీ వీసాలపై హానికరమైన, కఠిన చర్యలకు పూనుకుంటున్నారని బైడెన్ వ్యాఖ్యానించారు. గ్రీన్ కార్డుల సంఖ్యను పెంచుతామని, కుటుంబ సభ్యుల రాకపై ఆంక్షలు తొలగిస్తామని, అమెరికాలో చదివిన విద్యార్థులపై ఆంక్షలు ఎత్తివేస్తామని, ఉపాధి కోసం వచ్చేవారికి ఉద్యోగ వీసాల సంఖ్యను పెంచుతామని చెప్పారు. అమెరికాలో భారతీయుల రక్షణ కోసం, తొలిసారిగా డెమొక్రాటిక్ పార్టీ ఒక విధానపత్రంతో ముందుకు వచ్చింది. -
హౌడీ మోదీ కలిసొచ్చేదెవరికి
వాషింగ్టన్: అమెరికాలోని టెక్సాస్‌లో జరగనున్న హౌడీ మోదీ కార్యక్రమానికి అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ హాజరవడానికి అంగీకరించడంతో మోదీ ప్రభుత్వం దౌత్యపరంగా సక్సెస్ అయ్యింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల అధినేతలు ఇద్దరూ ఒకే కార్యక్రమంలో పాల్గొంటూ ఉండడంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. హ్యూస్టన్ ర్యాలీలో కీలక ప్రకటనకు అవకాశం ఉందంటూ ట్రంప్ సంకేతాలిచ్చారు. గురువారం కాలిఫోర్నియా నుంచి వాషింగ్టన్ వెళుతుండగా ప్రత్యేక విమానంలో విలేకరుల హ్యూస్టన్ ర్యాలీలో ఏదైనా ప్రకటన ఉంటుందా అన్న ప్రశ్నకు ఉండొచ్చునని బదులిచ్చారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ అంశం ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో ట్రంప్ ఇలా మాట్లాడడంతో అమెరికా భారత్ పక్షమే వహిస్తోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులనుద్దేశించి టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్‌లో ఈ నెల 22న మోదీ ప్రసంగించనున్నారు. వాణిజ్య బంధాల బలోపేతమే మోదీ లక్ష్యం గత కొద్ది నెలలుగా భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇటీవల అమెరికా వాణిజ్య ప్రతినిధి రోబర్ట్ లైటింగర్ భారత్ ఎగుమతులపై కొన్ని ప్రయోజనాలను రద్దు చేశారు. దీనికి ప్రతిగా అమెరికాకు చెందిన 28 ఉత్పత్తులపై భారత్ సుంకాలను పెంచింది. ఇలాంటి సమయంలో రెండు దేశాల అధినేతలు ఒకే వేదికను పంచుకోవడం వల్ల రెండు దేశాల మ«ధ్య వాణిజ్య రంగంలో విభేదాలు సమసిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ట్రంప్ రాకతో అమెరికా సమాజ ఆర్థిక పురోగతికి ప్రవాస భారతీయులు చేస్తున్న కృషికి గుర్తింపు లభిస్తోందని మోదీ భావిస్తున్నారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సంబంధాలు బలోపేతం అయ్యే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఓటు బ్యాంకు కోసం ట్రంప్ అమెరికాలో నివసించే భారతీయులు ఏర్పాటు చేసిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి ట్రంప్ హాజరుకావడం ఇదే తొలిసారి. 2020 అధ్యక్ష ఎన్నికల కోసం ఇప్పటికే సన్నాహాలు చేస్తున్న ట్రంప్ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హాజరవుతున్నారని భావిస్తున్నారు. ఇక్కడ స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్న ఆసియన్ అమెరికన్లలో అయిదో వంతు మంది భారతీయులే. అందులోనూ టెక్సాస్‌లో భారతీయుల ఓటుబ్యాంకు బలంగా ఉంది. 2 లక్షల 70 వేల మందికిపైగా ఓటర్లు టెక్సాస్‌లో ఉన్నారు. హౌడీ మోదీ కార్యక్రమానికి 50 వేల మందికిపైగా ప్రవాస భారతీయులు హాజరుకానున్నారు. అమెరికా ఎన్నికల్లో భారతీయులు సంప్రదాయంగా డెమొక్రాట్లకే మద్దతుగా ఉంటూ వస్తున్నారు. టెక్సాస్ రాష్ట్రంపై రాజకీయంగా రిపబ్లికన్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ ప్రాంతంలో డెమోక్రాట్లు పట్టుకు యత్నిస్తున్నారు. -
మోదీకి యూఏఈ అవార్డు
అబుధాబి/మనామా: భారత ప్రధాని మోదీ తన సోదరుడంటూ రెండు దేశాల సంబంధాల్లో సౌహార్థతను చాటిచెప్పారు యూఏఈ రాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్. యూఏఈలో మోదీ పర్యటనను పురస్కరించుకుని విడుదల చేసిన సందేశంలో ఆయన.. ‘మరోసారి రెండో సొంతింటికి వస్తున్నందుకు నా సోదరుడికి కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత మోదీకి రాజప్రసాదంలో ఆయన స్వాగతం పలికారు. ఇరువురు నేతలు వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల బలోపేతంపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీని యూఏఈ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్’ పురస్కారంతో గౌరవించారు. 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ఎన్నడూ లేనంత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేసిన మోదీ ని ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు యూఏఈ రాజు అల్ నహ్యాన్ ఏప్రిల్‌లో ప్రకటించిన విష యం తెలిసిందే. అనంతరం జరిగిన కార్యక్రమం లో ప్రధాని మోదీ భారతీయ ఎలక్ట్రానిక్ పేమెంట్ విధానం రూపే కార్డును ప్రారంభించారు. దీనివల్ల ఏటా యూఏ ఈ సందర్శించే 30 లక్షల మంది భారతీయులకు లాభం కలగనుంది. కశ్మీర్ దేశ చోదకశక్తి రాజకీయ స్థిరత్వం, సానుకూల విధానాల కారణంగానే భారత్ పెట్టుబడిదారులను విశేషంగా ఆకర్షిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త చోదకశక్తిగా మారనున్న కశ్మీర్లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నా రు. అబుధాబిలో ప్రవాస భారతీయ పారిశ్రామిక వేత్తలతో జరిగిన సమావేశంలో మోదీ ప్రసంగించారు. ‘రాజకీయ స్థిరత్వం, అనుకూల విధానాల వల్లే పెట్టుబడిదారులు భారత్‌వైపు ఆకర్షితులవుతున్నారు. దేశంలో వృద్ధికి ప్రోత్సాహం, ఉద్యోగ కల్పన, ‘మేక్ ఇన్ ఇండియా’కు తోడ్పాటుకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోంది. వీటితోపాటు పెట్టుబడిదారులకు తగు ప్రతిç ఫలం కూడా దక్కేలా చూస్తోంది. అందుకే భారత్ లో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోండి’ అని కోరారు. ‘ఎన్నో ఏళ్లుగా వెనుకబాటుకు గురైన జమ్మూకశ్మీర్‌లో పెట్టుబడులకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి యువతకు ఉపాధి కల్పించేందుకు, అభివృద్ధికి అనుకూల వాతావరణం కల్పించాం. భారత్ అభివృద్ధికి కశ్మీర్ ప్రాంతం చోదకశక్తిగా మారనుంది. ప్రపంచంలోనే అతిపెద్ద పర్యాటక ప్రాంతంగా మారేందుకు కూడా జమ్ము, కశ్మీ ర్, లదాఖ్‌లకు ఎన్నో అవకాశాలున్నాయి. అక్కడి కి రావాలని ఆహ్వానిస్తున్నా’ అని మోదీ పేర్కొన్నా రు. ఖలీజ్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370తో కొందరు మాత్రమే లాభపడ్డారు. అక్కడి యువతపై తీవ్రవాద భావాలను నూరిపోశారు. ఉగ్రవాదం, హింసాత్మక చర్యలకు పాల్పడేలా తయారు చేశారు.’ అని తెలిపారు. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు మేం తీసుకున్న చర్యలకు యూఏ ఈ ప్రభుత్వం మద్దతు ప్రకటించిందన్నారు . బహ్రెయిన్ చేరుకున్న మోదీ శుక్రవారం యూఏఈ చేరుకున్న ప్రధాని మోదీ అక్కడి పర్యటన ముగించుకుని శనివారం సాయం త్రం బహ్రెయిన్ చేరుకున్నారు. రాజప్రసాదంలో రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫా మోదీకి ఘనస్వాగతం పలికారు. ప్రధానమంత్రి ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్‌తో భేటీ అయి ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై మోదీ చర్చలు జరిపారు. అంతరిక్ష విజ్ఞానం, సౌరశక్తి, సాంస్కృతిక సంబంధాలపై రెండు దేశాలు పలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. ఇస్రోతో బహ్రెయిన్ నేషనల్ స్పేస్ సైన్స్ ఏజెన్సీ పరస్పర సహకారం వీటిల్లో ఒకటి. కాగా, భారత ప్రధాని ఒకరు బహ్రెయిన్ దేశంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఆదివారం ఆయన గల్ఫ్ ప్రాంతంలోనే అతిపురాతన శ్రీనాథ్జీ ఆలయ పునర్నిర్మాణ పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మోదీ ఇక్కడి నుంచి తిరిగి ఫ్రాన్సు రాజధాని పారిస్‌లో జరిగే జీ–7 సమ్మిట్‌లో పాల్గొనేందుకు వెళ్లనున్నారు. -
ఒక్క బుల్లెట్ తగిలినా మసే
టెహ్రాన్/వాషింగ్టన్: అమెరికా, ఇరాన్ ఇంకా మాట లు తూటాలు విసురుకుంటూనే ఉన్నాయి. ఇరాన్‌పైకి యుద్ధ విమానాలు పంపించి మరీ ఆఖరి నిముషంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో ఇరాన్ ఘాటుగా స్పందించింది. తమపై యుద్ధంప్రకటిస్తే మధ్యప్రాచ్య దేశాలన్నీ ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. ‘ఇరాన్‌కి ఒక్క బుల్లెట్ గాయమైనా ఈ ప్రాంతంలో అమెరికా, దాని మిత్రదేశాల ప్రయోజనాలన్నీ మంటల్లో కలుస్తాయి‘‘ అని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ హెచ్చరించారు. ‘‘మా శత్రువులు ఎవరైనా ముఖ్యంగా అమెరికా, దాని మిత్ర పక్షాలు ఈ ప్రాంతంలో సైనికచర్యలకు దిగితే ఈ ప్రాంతం అంతా మండిపోతుంది‘‘ అని అన్నారు. గత ఏడాది ఇరాన్‌తో అణు ఒప్పందా న్ని అమెరికా ఏకపక్షంగా రద్దు చేసుకోవడంతో పాటు వివిధ దేశాలపై ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు వద్దంటూ ఆంక్షలు విధించిన దగ్గర్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా డ్రోన్‌ని ఇరాన్ కూల్చి వేసిన అవి మరింత పెరిగిపోయాయి. ఇరాన్‌పైకి యుద్ధ విమానాల్ని పంపించిన అధ్యక్షుడు ట్రంప్ 150 మంది ప్రాణాలు కోల్పోతారని తెలిసే ఆఖరి క్షణంలో వెనకడుగు వేశారని కథనాలు వెలువడ్డాయి. అమెరికా సిబ్బందికి భద్రత పెంపు అమెరికా, ఇరాన్ ఒకరికొకరు కవ్వింపు చర్యలకు దిగుతూ ఉండడంతో ఇరాక్ కూడా అప్రమత్తమైంది. ఇరాక్‌లోని అతి పెద్ద వైమానిక స్థావరం బాలాద్లో అమెరికా సిబ్బందికి భద్రతను పెంచింది. రాత్రి పూట నిఘా పెంచింది. తనిఖీలు చేపడుతోంది. ఇరాన్‌కు ప్రాణస్నేహితుడినవుతా: ట్రంప్ ఇరాన్ అణ్వాయుధాలను త్యజిస్తే గొప్ప దేశంగా మారుతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘అణ్వాయుధాలను వదిలిస్తే ఇరాన్‌కు ప్రాణ స్నేహితుడిని అవుతా. ఇదే జరిగితే ఇరానియన్లు ధనవంతులుగా మారి సంతోషంగా ఉంటారు. ఇరాన్‌ను మళ్లీ గొప్పగా చేద్దాం’ అని చెప్పారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలుండటాన్ని అంగీకరించబోమన్నారు. యుద్ధపిపాసి అన్న వారే తనను ఇప్పుడు శాంతి కపోతంగా అభివర్ణిస్తున్నారని ట్రంప్ వ్యాఖ్యానించారు. విమానాలు దారి మళ్లిస్తున్న భారత్ న్యూఢిల్లీ: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో భారత్ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఇరాన్ గగనతలంలోకి మన దేశానికి చెందిన విమానాలు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించారు. ఆ విమానాలన్నింటినీ దారి మళ్లిస్తున్నట్టు తెలిపారు. ‘‘అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి. ఏ క్షణంలో ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. అందుకే అన్ని విమానయాన సంస్థలు కేంద్ర పౌర విమానయాన శాఖతో నిరంతరం సంప్రదింపులు జరపాలి. ప్రయాణికుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ విమానాలను దారి మళ్లిస్తాం‘‘ అని ట్వీట్ చేశారు. బాలాకోట్ దాడుల తర్వాత ఇప్పటికే పాకిస్తాన్ గగనతలం మీదుగా మన విమానాలేవీ ప్రయాణించడం లేదు. ఇప్పుడు ఇరాన్ మీదుగా వెళ్లకుండా నియంత్రణలు విధిస్తే అమెరికా, యూరోప్ దేశాలు, మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల పరిస్థితి గందరగోళంలో పడుతుందని ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని లోహాని వ్యాఖ్యానించారు. -
వ్యవసాయ ఎగుమతుల పెంపుపై దృష్టి
న్యూఢిల్లీ: వ్యవసాయ ఎగుమతుల పురోగతిపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ దిశలో రాష్ట్రాలకు రవాణా సబ్బిడీని అందించాలని యోచిస్తోంది. వాణిజ్య శాఖ మంత్రి సురేశ్ ప్రభు గురువారం ఈ విషయం తెలిపారు. అంతకుముందు వాణిజ్యం, అభివృద్ధి వ్యవహారాల మండలి సమావేశం జరిగింది. కర్ణాటక, పంజాబ్, తమిళనాడుసహా పలు రాష్ట్రాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ ఎగుమతుల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశం చర్చించినట్లు ప్రభు తెలిపారు. ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న రుణ సంబంధ సమస్యలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ, ఫైనాన్స్ వ్యవహారాల కార్యదర్శి ఈ అంశంపై బ్యాంకర్లతో చర్చిస్తారని పేర్కొన్నారు. ఎగుమతుల రంగానికి రుణాన్ని ప్రాధాన్యతాపరమైనదిగా పరిగణించాలని డిమాండ్ ఉంది. అంతర్జాతీయ చట్టాలను ఏ విధంగానూ ఉల్లంఘించకుండా, ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు నెరపడానికి ప్రయత్నం చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. భారత్–చైనాల మధ్య వాణిజ్య సంబంధాలు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. 2018–19 ఏప్రిల్–అక్టోబర్ మధ్య భారత్ వ్యవసాయ ఎగుమతుల విలువ 48 బిలియన్ డాలర్లు. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 43.11 బిలియన్ డాలర్లు. -
భారత్ – చైనా ప్రచ్ఛన్నయుద్ధం?
న్యూయార్క్: భారత్, చైనాల మధ్య సంబంధాల్లో ప్రచ్ఛన్న యుద్ధ వాతావరణం కనిపిస్తోందని అమెరికా మాజీ దౌత్యాధికారిణి అలిసా ఐర్స్ అన్నారు. చైనాను నిలువరించే క్రమంలో అమెరికా నేతృత్వంలోని కూటమిలో భారత్ చేరే అవకాశాలు లేవన్నారు. దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాల విభాగంలో పనిచేసిన అలిసా ప్రస్తుతం విదేశీ వ్యవహారాల కౌన్సిల్లో సభ్యురాలిగా ఉన్నారు. ఆమె రాసిన పుస్తకం ‘అవర్ టైం హాజ్ కమ్: హౌ ఇండియా ఈజ్ మేకింగ్ ఇట్స్ ప్లేస్ ఇన్ ది వరల్డ్’ విడుదల సందర్భంగా న్యూయార్క్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. చైనాతో పటిష్టమైన వాణిజ్య సంబంధాలు కొనసాగుతున్నప్పటికీ భారత్ సంతృప్తి చెందటం లేదన్నారు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెంచుకోవటం, ముఖ్యంగా డిజిబౌటిలో సైనిక స్థావరం ఏర్పాటును భారత్ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. పాక్, శ్రీలంకలతో చైనా సన్నిహితంగా మెలుగుతూ పెట్టుబడులు పెట్టడం భారత్‌కు ఇబ్బంది కలిగిస్తోందన్నారు. స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు ప్రాధాన్యమిచ్చే వాతావరణం ప్రపంచమంతటా ఉండాలని భారత్ ఆకాంక్షిస్తోందని ఆమె చెప్పారు. 2008 ముంబై దాడుల వంటివి పునరావృతమైతే భారత్ ఉదాసీన వైఖరితో ఉంటుందని భావించలేమన్నారు. నిర్ణయాత్మకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని అంచనా వేశారు. గతేడాది పాక్ భూభాగంపై భారత్ సర్జికల్ దాడులను ఇందుకు ఉదాహరణగా చెప్పారు. 2018లో ప్రపంచంలో ఐదో ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు భారత్ ముందడుగు వేస్తోందని చెప్పారు. -
అందమూ.. బంధమూ!
ఇస్తాంబుల్ ఎంతో ప్రత్యేకం సంస్కృతి, ప్రగతిలో పోలిక అదే బాటలో భాగ్యనగరి పయనం ఘన చరిత్ర, సంస్కృతి, వారసత్వం ఆ నగరాల సొంతం. ఇస్లామిక్ వాస్తురీతులు, కట్టడాలకు ప్రసిద్ధి చెందిన నగరాలవి. ఆధునికత ను సంత రించుకొని... సేవ, వ్యాపార, వాణిజ్య రంగాలతోపాటు అభివృద్ధిలోనూ శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి. ఆ రెండు నగరాల్లో టర్కీ దేశంలో అతి పెద్దదైన ఇస్తాంబుల్ ఒకటి కాగా.. మరొకటి మన హైదరాబాద్. ఇస్తాంబుల్ తరహాలో గ్రేటర్‌లోని పర్యాటక, చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లకుండా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ సీఎం కేసీఆర్ తరచూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఇస్తాంబుల్-హైదరాబాద్ నగరాల చారిత్రక బంధం... అక్కడి విశేషాలపై ప్రత్యేక కథనం. - సాక్షి, సిటీబ్యూరో ఇస్తాంబుల్‌కు హైదరాబాద్‌కు మధ్య శతాబ్దాలుగా చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. హైదరాబాద్ నగర నిర్మాతలు, గోల్కొండను ఏలిన కుతుబ్ షాహీల పూర్వీకులు టర్కీకి చెందినవారే. నిజాం ప్రభువు మేనకోడళ్లు నిలోఫర్, దుర్రేషహర్ కూడా టర్కీకి చెందినవారే. ఇస్తాంబుల్ తరహా అభివృద్ధి అంటే... ఇస్తాంబుల్‌లో రహదారుల విస్తరణ, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టినపుడు చారిత్రక, వారసత్వ కట్టడాలకు నష్టం వాటిల్లకుండా అక్కడి ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది. దీంతో విదేశీ పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. వాస్తు, శిల్పం, డిజైన్లు, కళాకృతుల వంటి అంశాలపై ఆసక్తి కలిగిన వారెందరో ఆ నగరాన్ని సందర్శిస్తున్నారు. మార్కెట్లలో ప్రత్యేకంగా లభించే దుస్తులు, ఆభరణాలను కొనుగోలు చేసే పర్యాటకుల సంఖ్యా పెరుగుతోంది. చారిత్రక కట్టడాల్లో హోటళ్లు, రెస్టారెంట్ల ఏర్పాటుతో వాణిజ్య కార్యకలాపాలూ పెరిగాయి. విదేశీ పర్యాటకులను ఆకర్షిం చడం ద్వారా వాణిజ్యం, టూరిజం, రవాణా రంగాల పురోభివృద్ధికి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఇది ఎంతో అవసరమని చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు. ఇదీ విశిష్టత టర్కీలో అతిపెద్ద నగరం ఇస్తాంబుల్. విశ్వనగరంగా ప్రసిద్ధి చెందిన ఈ సిటీ ఆ దేశ ఆర్థిక, సాంస్కృతిక, చారిత్రక సంపదకు నిలువెత్తు నిదర్శనం. దీని విస్తీర్ణం 5,343 చదరపు కిలోమీటర్లు. జనాభా 1.41 కోట్లు. ప్రపంచంలోనే ఆరోఅతిపెద్ద నగరం. పూర్వకాలంలో ఈ నగరాన్ని కాన్స్టెంట్ నోపుల్ అని పిలిచేవారు. రోమన్, బైజాంటియన్, ఒట్టోమాన్ చక్రవర్తులకు రాజధానిగా నిలిచింది. సిల్క్‌రోడ్, యురోపియన్ నగరాలకు అధునాతన రైలు సౌకర్యం, మధ్య ప్రాచ్య దేశాలతో రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు దీని ప్రత్యేకత. 2012లో ఈ నగరాన్ని 11.6 మిలియన్ల విదేశీయులు సందర్శించారు. పర్యాటక పరంగా ప్రపంచంలో ఐదో స్థానాన్ని దక్కించుకుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు పొందింది. ప్రముఖ టర్కిష్ కంపెనీలు, మీడియా సంస్థలకు ఇది కేంద్రం. దేశ స్థూల జాతీయోత్పత్తిలో దీని వాటా మూడోవంతు. ఐదుసార్లు ఒలింపిక్ క్రీడలకు వేదికైంది. వ్యాపార, వాణిజ్యం ఆలివ్ ఆయిల్, పొగాకు, రవాణా వాహనాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కేంద్రాలకు హబ్. ఇస్తాంబుల్ కేంద్రంగా పనిచేస్తున్న అనేక సంస్థలు ఏటా 41.4 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తున్నాయి. మూడు పోర్టుల ద్వారా విదేశీ వాణిజ్యం సాగుతోంది. ఇందులో హైడాస్పరా, అంబ్రాలీ, జేటిన్బుర్నులు విశ్వవిఖ్యాతి చెందాయి. 1461 నుంచి కొనసాగుతున్న గ్రాండ్ బజార్ లో సంప్రదాయ, ఆధునిక అలంకరణ వస్తువులన్నీ లభ్యమవుతాయి. మహమూత్ పాషా బజార్, ఈజిప్షియన్ బజార్లు ఖ్యాతి పొందాయి. ప్రముఖ కట్టడాలివే.. హయా సోఫియా మసీదు, బాసిలికా సిస్టర్న్ కళాత్మక కట్టడం, తోప్కాపీ ప్యాలెస్, బ్లూ మాస్క్, ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియం, టర్కిష్ అండ్ ఇస్లామిక్ ఆర్ట్స్ మ్యూజియం, సులేమానీ మాస్క్, కోరా చర్చ్, గలాటా టవర్లు విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇస్తాంబుల్‌లో 17 రాజసౌధాలు, 64 మసీదులు, 49 చర్చిలను వారసత్వ కట్టడాలుగా గుర్తించారు. అతిపురాతన చారిత్రక మ్యూజియం ఈ నగరంలోనే ఉంది. టర్కిష్, యురోపియన్, మధ్య ప్రాచ్య వాస్తురీతులు ఇక్కడి చారిత్రక కట్టడాల్లో కనిపిస్తాయి. ఆర్ట్ మ్యూజియాలు, ఇస్తాంబుల్ మోడ్రన్, పేరా మ్యూజియం, సకిబ్ సబానిక్ మ్యూజియం, సంత్రాల్ స్టాంబుల్ కేంద్రాల్లో తీరైన శిల్ప సంపద కనిపిస్తుంది. స్థానిక పాలన ఇస్తాంబుల్ మెట్రో పాలిటన్ మున్సిపాల్టీ ఆధ్వర్యంలో నగర పాలన సాగుతోంది. దీని పరిధిలో 39 జిల్లాలు ఉన్నాయి. కుర్ధులు, గ్రీకులు, టర్కీలు, ఆర్మేనియన్లు, జ్యూస్‌లు ఇక్కడ నివసిస్తున్నారు. వాస్తు శిల్పాలు.. బైజాంటియన్, ఒట్టోమాన్ వాస్తురీతులకు దర్పణంగా నిలుస్తోంది. ఆరో శతాబ్దంలో బైజాంటియన్ చక్రవర్తి జస్టినియన్ నిర్మించిన హయా సోఫియా మసీదు, యేనిక్యామి మసీదు ప్రసిద్ధి చెందాయి. ప్రజా రవాణా నగరంలో ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్లు ఉన్నాయి. బస్సుల కోసం బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ విధానం, రైళ్ల కోసం సంప్రదాయ రైల్వే ట్రామ్స్, మూడు కారిడార్లలో మెట్రో రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కట్టడాలను పరిరక్షించాలి.. గ్రేటర్లో వారసత్వ కట్టడాలుగా మా సంస్థ అవార్డులు ప్రకటించిన జాబితాలో సుమారు 200 చారిత్రక నిర్మాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ పది కాలాలపాటు పరి రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇస్తాంబుల్‌లో మాస్టర్‌ప్లాన్ అమలులో చారిత్రక కట్టడాల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిచ్చారు. నగరంలోనూ అలాంటి చర్యలే చేపట్టాలి. వాటికి నష్టం వాటిల్లకుండానే ఆధునికీకరణ, రహదారులు, ఫ్లైఓవర్లు, మెట్రో మార్గాలు ఏర్పాటు చేయాలి. - అనూరాధ రెడ్డి, హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీ(ఇన్టాక్) కన్వీనర్ చారిత్రక విలువలను గుర్తించాం.. చారిత్రక ప్రాధాన్యమున్న కట్టడాల విలువను మా ప్రభుత్వం గుర్తించింది. మాస్టర్‌ప్లాన్‌లో వీటి పరిరక్షణకు ప్రత్యేకంగా నిధులు, యంత్రాంగాన్ని కేటాయించింది. వారసత్వ కట్టడాలను వీక్షించేందుకే ఏటా లక్షలాది మంది పర్యాటకులు ఇస్తాంబుల్ వస్తుండడం గర్వకారణంగా ఉంది. చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపద పరిరక్షణ దిశగానే అభివృద్ధి గమనం ఉండాలన్నది టర్కీ ప్రభుత్వ లక్ష్యం. - మురాద్ ఓమెర్గ్లో, టర్కీ కాన్సులేట్ అధికారి, హైదరాబాద్ ఇదీ మన హైదరాబాద్... చారిత్రక కట్టడాలు, ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి ఇస్తాంబుల్‌ను అచ్చు గుద్దినట్లు పోలి ఉండే నగరం హైదరాబాద్ అంటే అతిశయోక్తి కాదు. మన గ్రేటర్ నగరం 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. జనాభా కోటికి చేరువవుతోంది. సమతుల వాతావరణంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులను ఆకర్షిస్తోన్న గ్రేటర్‌లోనూ ఇస్తాంబుల్‌ను పోలిన చారిత్రక కట్టడాలు బోలెడున్నాయి. గోల్కొండకోట, చార్మినార్, ఓయూ, మక్కా మసీదు, కుతుబ్‌షాహీ సమాధులు, ఫలక్‌నుమా ప్యాలెస్, అసెంబ్లీ, మొజంజాహీ మార్కెట్, హుస్సేన్‌సాగర్ ఇలా 200కుపైగా చారిత్రక కట్టడాలకు నెలవిది. ఇటీవల రహదారుల విస్తరణ, మెట్రో ప్రాజెక్టు, మాస్టర్‌ప్లాన్ పనులతో కొన్ని చారిత్రక కట్టడాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. వీటికి ముప్పు వాటిల్లకుండా ప్రభుత్వం యత్నిస్తోంది. మన నగరంలోనూ ఇస్తాంబుల్ తరహాలో మూసీకి ఆవల, ఈవల రెండు ప్రాంతాల్లోనూ భిన్నమైన సంస్కృతి నెలకొంది. పాతనగరంలో చారిత్రక ఆనవాళ్లు బోలెడున్నాయి. ఇక హైటెక్ సిటీ, శివార్ల విషయానికి వస్తే ఆకాశమే హద్దుగా సేవ, వ్యాపార, వాణిజ్య, రియల్టీ రంగాలు విస్తరిస్తున్నాయి.