US Secretary of State (Foreign Minister)
-
Israel-Hamas war: ఇజ్రాయెల్–హమాస్ ఒప్పందం పొడిగింపు
గాజా్రస్టిప్/జెరూసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరొక రోజు పొడిగించేందుకు ఇజ్రాయెల్–హమాస్ గురువారం అంగీక రించాయి. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగిసింది. బందీలంతా ఇంకా విడుదల కాకపోవడం, గాజాలోని పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందాల్సి ఉండడంతో ఒప్పందం పొడిగింపునకే ఇరుపక్షాలు మొగ్గుచూపాయి. గాజాలోని శాంతి కోసం ఇజ్రాయెల్, హమాస్‌పై అంతర్జాతీయ సమా జం నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ బుధవారం రాత్రి ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణలకు తెరదించే దిశగా ఆయన ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నట్లు తెలిసింది. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ మిలిటెంట్లు ఇప్పటిదాకా 73 మంది ఇజ్రాయెలీలను, 24 మంది ఇతర దేశస్తులను విడుదల చేశారు. ఇంకా 126 మంది హమాస్ చెరలో బందీలుగా ఉన్నట్లు అంచనా. జెరూసలేంలో కాల్పులు.. ముగ్గురి మృతి జెరూసలేంలో ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. బుధవారం ఉదయం 7.40 గంటలకు వీచ్మ్యాన్ వీధిలో బస్‌స్టాప్‌లో నిల్చున్న ప్రయాణికులపై ఇద్దరు సాయుధ పాలస్తీనియన్ దుండగులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఇజ్రాయెలీలు మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు దుండుగులు హతమయ్యారు. వారిద్దరూ తూర్పు జెరూసలేంకు చెందిన సోదరులని తెలిసింది. గతంలో ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొని జైలుకు వెళ్లొచ్చారు. -
నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం
బీజింగ్: దాదాపు ఐదేళ్ల తర్వాత చైనాలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ మంత్రితో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య కొన్ని నిర్దిష్టమైన అంశాలపై ఒప్పందం కుదిరిందని జిన్‌పింగ్ ప్రకటించారు. అయితే ఆ ఒప్పందాల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల అమెరికా గగనతలంలో చైనా నిఘా భారీ బెలూన్లు చక్కర్లు కొట్టడం, వాటిని అమెరికా వాయుసేన కూల్చేయడం వంటి ఘటనలతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాల్లో సందిగ్ధత నెలకొన్న విషయం తెల్సిందే. ‘‘ఇటీవల బాలీలో బైడెన్‌తో కుదిరిన ‘కనీస అవగాహన’కు కొనసాగింపుగా చైనా తన వైఖరిని స్పష్టంచేసింది. ప్రత్యేకంగా కొన్ని అంశాల్లో ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాలు ఉమ్మడిగా పురోగతి సాధించాయి. పరస్పర గౌరవం, నమ్మకాల మీదనే చర్చలు సఫలమవుతాయి’’ అని భేటీ తర్వాత జిన్‌పింగ్ వ్యాఖ్యానించారని చైనా అధికార వార్తాసంస్థ సీజీటీఎన్. ‘ బ్లింకెన్ పర్యటనతో ఇరుదేశాల బంధం కీలక కూడలికి చేరుకుంది. అయితే చైనాపై అమెరికా విధిస్తున్న ఏకపక్ష ఆంక్షలను ఎత్తేయాల్సిన అవసరం ఉంది’ అని చైనా విదేశాంగ మంత్రి క్విన్ చెప్పారు. చైనాతో దౌత్య ద్వారాలు ఎప్పటికీ తెరిచే ఉండాలనే లక్ష్యంతో∙బ్లింకెన్ పర్యటన సాగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఉక్రెయిన్‌కు అమెరికా 375 కోట్ల డాలర్ల సాయం
వాషింగ్టన్: రష్యా దండయాత్రతో సతమతమవుతున్న ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి భారీ సాయం ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 375 కోట్ల డాలర్ల మిలటరీ సాయాన్ని అందిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి టోని బ్లింకెన్ శుక్రవారం వెల్లడించారు. అమెరికా రక్షణ శాఖ నుంచి వెను వెంటనే 285 కోట్ల డాలర్ల మిలటరీ సాయం అందుతుందని చెప్పారు. విదేశాంగ శాఖ నుంచి అందే 22.5 కోట్ల డాలర్లు ఉక్రెయిన్ మిలటరీ ఆధునీకరణకు, దీర్ఘకాలంలో ఆ దేశం సాయుధ సంపత్తి పెంచుకోవడానికి కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ సారి అందించే సాయంతో ఇప్పటివరకు అమెరికా ఉక్రెయిన్ చేసిన సాయం 2 వేల కోట్లకు పైగా డాలర్లకు చేరుకుంది. అమెరికా ఈ స్థాయిలో ఏ దేశానికి ఇప్పటివరకు సాయం అందించలేదు. ఉక్రెయిన్‌కు తొలిసారిగా 50 ఎం2–ఏ2 బ్రాడ్లీ సాయుధ వాహనాలను అందిస్తోంది. ఈ సాయుధ వాహనాల్లో పదాతిదళ బెటాలియన్‌కు పూర్తి స్థాయి రక్షణ కవచాలు , యాంటీ ట్యాంకు క్షిపణులు, 2,50,000 రౌండ్ల 25ఎంఎం మారణాయుధాలు ఉంటాయని పెంటగాన్ వెల్లడించింది. అంతేకాకుండా 100ఎం–113 సాయుధ సిబ్బందిని తీసుకువెళ్లే వాహనాలు, 50 మైన్–రెసిస్టెంట్స్, మెరుపుదాడుల్ని ఎదుర్కొనే వాహనాలు కూడా ఉంటాయని వివరించింది. -
అమెరికా వీసాల వేగవంతానికి చర్యలు
వాషింగ్టన్: అమెరికా వీసాల కోసం భారతీయులు దీర్ఘకాలం వేచి ఉండే పరిస్థితులకు కరోనా మహమ్మారియే కారణమని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ నిందించారు. కొద్ది నెలల్లోనే సమస్యను పరిష్కరిస్తామని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు హామీ ఇచ్చారు. వాషింగ్టన్లో మంగళవారం బ్లింకెన్‌తో జై శంకర్ భేటీ అయ్యారు. వీసా అపాయింట్మెంట్ల కోసం రెండేళ్లకు పైగా ఎదురు చూడాల్సిన పరిస్థితులున్నట్టు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కరోనా సంక్షోభంతో 2020 మార్చి నుంచి కొద్ది నెలల పాటు వీసా ప్రక్రియ నిలిపివేయడంతో వేచి చూసే సమయం పెరిగిపోయిందని, వీసాల త్వరితగతి మంజూరు కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని బ్లింకెన్ స్పష్టం చేశారు. ‘‘కరోనా కారణంగా మా దౌత్య కార్యాలయాల్లో సిబ్బందిని తగ్గించాం. ఇప్పుడు మళ్లీ సిబ్బందిని పెంచడానికి ఒక ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడతాం. మరి కొద్ది నెలల్లోనే వీసాల జారీ వేగవంతం అవుతుంది’’ అని బ్లింకెన్ స్పష్టం చేశారు. వీసా ప్రక్రియ వేగవంతం చేయడం ఇరుదేశాలకూ ప్రయోజనకరమని జైశంకర్ అన్నారు. వీసాల జారీలో అడ్డంకుల్ని అధిగమించాలన్నారు. -
శ్రీలంక సంక్షోభానికి అదే కారణమై ఉండొచ్చు!: యూఎస్
Russian Aggression May Have Contributed To Sri Lanka Crisis: శ్రీలంక సంక్షోభానికి గల కారణం రష్యా 'దురాక్రమణ యుద్ధమే' అని యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదీగాక ఇటీవలే ఆంటోని బ్లింకెన్ ఉక్రెయిన్ నుంచి దాదాపు 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని విడిచిపెట్టాలని రష్యాకు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ ఆహార ఉత్పత్తుల ఎగుమతులపై రష్యా విధించిన ఆంక్షలే.. ఒకరకంగా శ్రీలంక సంక్షోభానికి కారణమై ఉండోచ్చని ఆంటోని బ్లింకెన్ అన్నారు. ప్రస్తుతం శ్రీలంక ఆహారం, ఇంధన కొరత, విదేశీ మారక నిల్వలు వంటి సంక్షోభాలతో అతలాకుతలమౌతున్న సంగతి తెలిసిందే. ఈ రష్యా ఉక్రెయిన్‌పై సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోందంటూ.. బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాదు ఇంతవరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆహార అభద్రత ఇప్పుడు మరింత పెరుగుతోందన్నారు. ఈ యుద్ధం కారణంగా అదికాస్త గణనీయంగా పెరిగిందని చెప్పారు. ముఖ్యంగా థాయ్‌లాండ్ వంటి శక్తిమంతమైన దేశం పై కూడా ఈ యుద్ధం ప్రభావం మరింతగా ఉంటుందన్నారు. మాస్కో ఆక్రమిత ఉక్రెయిన్ నుంచి 20 మిలియన్ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేసే నౌకలను అడ్డుకోవద్దని రష్యాకి పదేపదే బ్లింకెన్ విజ్ఞప్తి చేశాడు. ఐతే రష్యా మాత్రం నౌకాశ్రయాల్లో ఉక్రెయిన్ పెట్టిన మందుపాతరలను తీసివేస్తే... ఆహార ఉత్పత్తులతో కూడిన ఉక్రేనియన్ నౌకలను విడిచిపెట్టడానికి అనుమతిస్తామని రష్యా చెప్పింది. అందుకు కీవ్ తిరస్కరించడం గమనార్హం. (చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు) -
నాటో’లో ప్రతి అంగుళం కాపాడుకుంటాం
వాషింగ్టన్: తమ భూభాగంలో ప్రతి అంగుళా న్ని కాపాడుకొనేందుకు ‘నాటో’ సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. ఒకవేళ రష్యా దాడికి దిగితే నాటో తగు రీతిలో స్పందిస్తుందన్నారు. రష్యాతో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, ఉక్రెయిన్ వ్యవహారంలో జోక్యం చేసుకోబోమని వెల్లడించారు. నాటో అనేది ఒక రక్షణ కూటమి అని గుర్తుచేశారు. శుక్రవారం బ్రస్సెల్స్‌లో నాటో సభ్యదేశాల విదేశాంగ మంత్రుల సదస్సులో బ్లింకెన్ పాల్గొన్నారు. 30 సభ్యదేశాల రక్షణ బాధ్యత తమపై ఉందని నాటో అధినేత జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ వ్యాఖ్యానించారు. విదేశాంగ మంత్రుల సదస్సు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో పాటు తాజా పరిణామాలపై చర్చించినట్లు చెప్పారు. ఆ రెండు దేశాల మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఘర్షణలో నాటో భాగస్వామి కాదని స్పష్టం చేశారు. (చదవండి: శత్రువుని సైలెంట్‌గా లేపేసే అస్త్రం!.) -
అమెరికా దేనికైనా రెడీ
వాషింగ్టన్: ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ఏ మార్గాౖన్నైనా అనుసరించేందుకు సిద్ధంగా ఉన్నా మని యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ అంథోని బ్లింకెన్ రష్యాకు హెచ్చరిక చేశారు. ఈ మేరకు ఆయన రష్యా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఎలాంటి దారి ఎంచుకోవాలో రష్యానే నిర్ణయించుకోవాలన్నారు. లేఖలో రష్యా చర్యలపై యూఎస్, మిత్రపక్షాల ఆం దోళనను వివరించామని, రష్యా వెలిబుచ్చిన సందేహాలకు సమాధానమిచ్చామని చెప్పారు. సమస్య పరిష్కారానికి తమవద్ద ఉన్న పరిష్కారాలను సూచించామని తెలిపారు. ఉక్రెయిన్ సార్వ భౌమత్వాన్ని కాపాడడం సహా దేశాల హక్కుల పరిరక్షణకు కట్టుబడిఉన్నామని చెప్పారు. రష్యాతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఉక్రెయి న్, యూరప్ మిత్రపక్షాలను సంప్రదించి ఈ లేఖ రాసినట్లు బ్లింకెన్ తెలిపారు. అనంతరం ఆయన ఈ విషయాలను కాంగ్రెస్ లీడర్లకు వివరించారు. నాటో తరఫున రష్యాకు మరో సందేశాన్ని విడిగా పంపినట్లు నాటో సెక్రటరీ జనరల్ జెన్స్స్టాల్టెన్బర్గ్ తెలిపారు. మిలటరీ చర్య నివారణకు అవసరమైన మార్గాలు, ఆయుధ నియంత్రణ, చర్చలు జరపడం తదితర అంశాలను ఇందులో ప్రస్తావించామన్నారు. అయితే ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వకూడదన్న రష్యా అభ్యర్ధనపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అటు బ్లింకెన్, ఇటు జెన్స్ బహిర్గతం చేయలేదు. ఉక్రెయిన్, జార్జియా, మోల్డోవాల్లో మోహరించిన బలగాలను రష్యా ఉపసంహరించుకోవాలని జెన్స్ డిమాండ్ చేశారు. ఫ్రాన్స్ సెపరేటు రూటు ఒకపక్క యూఎస్, నాటో దేశాలు రష్యాకు హెచ్చరికల మీద హెచ్చరికలు చేస్తున్న వేళ ఫ్రాన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తోంది. ఉక్రెయిన్ అంశంలో ఇంకా చర్చలకు అవకాశం ఉందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానియల్ మాక్రాన్ అభిప్రాయపడుతున్నారు. యుద్ధాల కన్నా రష్యాతో చర్చలే మేలంటున్నారు. రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికాకు వంతపాడడాన్ని ఫ్రాన్స్ మానేసింది. పైగా వచ్చే ఏప్రిల్‌లో దేశాధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో యుద్ధమంటే వ్యతిరేకత వస్తుందని మాక్రాన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకు ఫ్రాన్స్ చర్చల పాట పాడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం రష్యా అధినేత పుతిన్‌తో మాక్రాన్ చర్చలు జరపబోతున్నారు. బుధవారం మాక్రాన్ నివాసంలో రష్యా, ఉక్రెయిన్ సలహాదారుల మధ్య సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరో రెండు వారాల్లో మరలా చర్చలు జరపాలని ఇందులో నిర్ణయించారు. తొలినుంచి కూడా రష్యా పట్ల మాక్రాన్ సామరస్య ధోరణినే కనబరుస్తూ వస్తున్నారు. పైగా జోబైడెన్ అధ్యక్షుడైన తర్వాత ఫ్రాన్స్, అమెరికా మధ్య సంబంధాలు వేగంగా క్షీణిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌కు ఎన్ని యూరప్ దేశాలు మద్దతు పలుకుతాయో వేచిచూడాలని నిపుణులు పేర్కొన్నారు. -
అఫ్ఘాన్ బాలికలు విద్యనభ్యసించేలా బలమైన యూఎస్ మద్దతు కావాలి!
Malala Yousafzai Calls US And UN To Support Of Afghan Women Education: నోబ్‌ల్ శాంతి బహుమతి గ్రహిత, మానవ హక్కుల న్యాయవాది మలాలా యూసఫ్‌జాయ్ వాషింగ్టన్ పర్యటన సందర్భంగా అఫ్గాన్ బాలికలకు, మహిళలకు బలమైన యూఎస్ మద్దతు కావాలని తెలిపారు. అంతేకాదు ప్రస్తుతం బాలికలకు సెకండరీ విద్య అందుబాటులో లేని ఏకైక దేశం అఫ్ఘనిస్తాన్ అని, పైగా వారు విద్యనభ్యసించకుండా నిషేధించారంటూ యూఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌తో జరిగిన సమావేశంలో మలాలా తన ఆవేదనను వ్యక్తం చేశారు. (చదవండి: పట్టి తెచ్చాడులే.. నిండు సూర్యుడినే..) ఈ మేరకు ఈ సమావేశంలో మలాల సోటోడా అనే అఫ్గాన్ అమ్మాయి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కి రాసిన లేఖను ప్రస్తావిస్తూ ‘ఇది అఫ్గాన్ బాలికల సందేశం. బాలికలందరికీ సురక్షితమైన మరియు నాణ్యమైన విద్యను పొందగలిగే ప్రపంచాన్ని మేము చూడాలనుకుంటున్నాం’ అని రాసిన లేఖను బ్లింకెన్కి అందజేశారు. అంతేకాదు తమను ఎంతకాలం పాఠశాలలకు, విశ్వవిద్యాలయాలకు దూరం చేస్తారో అంతలా తమ భవిష్యత్తుపై ఆశ చిగురిస్తూనే ఉంటుందని సోటోడా లేఖలో ప్రస్తావించిన విషయాన్ని మలాలా పేర్కొన్నారు. ఈ మేరకు దేశంలో శాంతి భద్రతలను తీసుకురాగలిగే అతి ముఖ్యమైన సాధనం బాలికల విద్య అని, అమ్మాయిలు చదువుకోకపోతే అఫ్ఘాన్ నష్టపోతుందంటూ ఆవేదనగా పేర్కొంది. అయితే అఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి బాలికలు విద్యనభ్యసించకూడదంటూ పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మలాలా యునైటెడ్ స్టేట్స్, యుఎన్‌తో కలిసి అఫ్ఘాన్‌లోని బాలికలు వీలైనంత త్వరగా తమ పాఠశాలలకు తిరిగి వెళ్లేలా చూసేందుకు తక్షణ చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. (చదవండి: అప్పుడే పుట్టిన నవజాత శిశువు పేరు ‘బోర్డర్’..ఎందుకో తెలుసా?) -
కోవిడ్‌తో తొలి ఆఫ్రికన్ అమెరికన్ ఫారిన్ సెక్రటరీ కన్నుమూత
వాషింగ్టన్: అమెరికా మాజీ విదేశాంగ మంత్రి, తొలి నల్లజాతి జాతీయ భద్రతా సలహాదారు కోలిన్ లూథర్ పావెల్ (84) కన్నుమూశారు. కోవిడ్ -19 సంబంధిత సమస్యలతో మరణించినట్లు పావెల్ కుటుంబం సోమవారం ప్రకటించింది. అద్భుతమైన, ప్రేమగల భర్త, తండ్రి, తాతను, గొప్ప అమెరికన్‌ను కోల్పోయామంటూ పావెల్ కుటుంబం ఒక ప్రకటన విడుదల చేసింది. పావెల్ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని కూడా వెల్లడించింది. ఈ సందర్బంగా ఆయనకు చికిత్సఅందించిన వైద్య సిబ్బందికి ఫేస్బుక్ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది. కాగా రిపబ్లికన్ రాజకీయవేత్త అయిన పావెల్ టాప్ మిలిటరీ ఆఫీసర్‌గా పనిచేశారు. 2000లో జార్జ్ డబ్ల్యూ బుష్ ఆధ్వర్యంలో తొలి ఆఫ్రికన్-అమెరికన్ విదేశాంగ కార్యదర్శిగా ఘనతను సాధించారు. బుష్ పరిపాలనలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా 2001-2005 వరకు బుష్ క్యాబినెట్లో పనిచేసిన పావెల్ సెప్టెంబరు 11 ఉగ్ర దాడుల తరువాత గందరగోళ పరిస్థితుల నిర్వహణలో కీలక భూమికను నిర్వహించారు. అయితే ఇరాక్ యుద్ధం సందర్భంగా పావెల్ తీవ్ర విమర్శలపాలయ్యారు. -
భారత్‌కు అమెరికా విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ జే బ్లింకెన్ భారత పర్యటనకు రానున్నారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఆయన దేశ రాజధాని ఢిల్లీ చేరుకుంటారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. అమెరికాలో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక బ్లింకెన్ విదేశాంగ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు స్వీకరించాక మొదటి సారి భారత్‌కు రానున్నారు. ఈ నెల 28న ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ కానున్నారు. అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం ఆయన ప్రధాని మోదీని సైతం కలవనున్నారు. భారత్–అమెరికాల మధ్య దౌత్య సంబంధాలను ఉన్నత స్థాయిలో బలపరచడంతో పాటు భవిష్యత్తులో అవి మరింత ధృఢంగా కొనసాగేలా చర్చలు జరపనున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది. ఈ చర్చల్లో దేశీయ, అంతర్జాతీయ పరిణామాలు కూడా రానున్నాయని తెలిపింది. కోవిడ్–19 మహమ్మారి ప్రస్తావన కూడా ఇందులో రానున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో ఇండో–పసిఫిక్ ప్రాంతం, అఫ్గానిస్తాన్ వ్యవహారం, ఐక్యరాజ్యసమితిలో సహకారం వంటి అంశాలపై చర్చలు సాగనున్నట్లు కేంద్రం తెలిపింది. భారత పర్యటన అనంతరం బ్లింకెన్ కువైట్ వెళ్లనున్నారు. అక్కడ కూడా దేశస్థాయి అధికారులతో సమావేశాలను నిర్వహించనున్నారు. జూలై 26–29 వరకు భారత్, కువైట్‌లను సందర్శించనున్నారంటూ అమెరికా విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. -
అమెరికా విదేశాంగమంత్రిగా బ్లింకెన్!
వాషింగ్టన్: యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్(విదేశాంగ మంత్రిగా) ఆంటోనీ బ్లింకెన్‌ను జోబైడెన్ ఎంచుకోబోతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చాలా కాలంగా బైడెన్‌కు బ్లింకెన్ విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్నారు. జాతీయ సెక్యూరిటీ సలహాదారుగా జేక్ సల్లివాన్ను బైడెన్ నియమించవచ్చని అంచనా. మంగళవారం బైడెన్ తన కేబినెట్ నియామకాలను వెల్లడించనున్నారు. ఒబామా రెండోమారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్లింకెన్ డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వ్యవహరించారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఆదినుంచి బ్లింకెన్ భారత్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. బ్లింకెన్‌ను బైడెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా నియమించే యోచనలో ఉన్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్పోస్ట్, ద డైలీ కథనాలు వెలువరించాయి. మంగళవారం ఈ ప్రకటన అధికారికంగా వెలువడవచ్చన్నాయి. ఈ ఏడాది భారత స్వాతంత్య్ర సంబరాల సమయంలో బైడెన్ బృందం ఏర్పాటు చేసిన ఆన్లైన్ సదస్సులో బ్లింకెన్ భారత్ పక్షాన మాట్లాడారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను బైడెన్ కోరుతున్నారన్నారు. భారత్‌పై అణుపరీక్షల సమయంలో విధించిన ఆంక్షల తొలగింపులో బైడెన్ చేసిన కృషిని గుర్తు చేశారు. అదేవిధంగా ఇరుదేశాల మధ్య సివిల్న్యూక్లియర్ డీల్ కుదరడంలో కూడా బైడెన్ కీలక పాత్ర పోషించారన్నారు. మరోవైపు ఐరాసలో లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్‌ను నియమించాలని బైడెన్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బాధ్యతల బరువు ట్రంప్ హయంలో పలు దేశాలతో యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి ఆయాదేశాలతో సంబంధాలను గాడిన పెట్టాల్సిన పెద్ద బాధ్యత బ్లింకెన్‌పై ఉండనుంది. అలాగే డబ్లు్యహెచ్‌ఓ, పారిస్ ఒప్పందం, ఇరాన్ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగడం పలు దేశాలకు విముఖత కలిగించింది. ఈ పరిస్థితులను బ్లింకెన్ చక్కదిద్దాల్సిఉంటుంది. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా.. ఇతర దేశాలను సహాయ సహకారాలందించడం ద్వారా అమెరికావైపు ఆకర్షిస్తామని బ్లింకెన్ గతంలో చెప్పారు. బైడెన్ బలహీనుడు: చైనా బీజింగ్: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయితే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న భ్రమల నుంచి చైనా బయటకు రావాలని చైనా ప్రభుత్వ సలహాదారు ఒకరు పేర్కొన్నారు. అమెరికా తీసుకునే మరింత కఠిన వైఖరికి సిద్ధం కావాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. షెన్జెన్లోని అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కాంటెంపరరీ చైనా స్టడీస్‌కు డీన్‌గా ఉన్న ఝెంగ్ యొంగ్నియన్ ఇటీవల సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు పేర్కొన్నారు. బైడెన్ చాలా బలహీన అధ్యక్షుడు. అమెరికా సమాజంలో చైనా పట్ల ఉన్న వ్యతిరేకతను అవకాశంగా తీసుకుని, యుద్ధానికీ దిగుతారు’అని ఝెంగ్ విశ్లేషించారు. -
ఢిల్లీ చేరుకున్న పాంపియో
న్యూఢిల్లీ/వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో మంగళవారం ఢిల్లీకి చేరుకున్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ బుధవారం ఆయనతో భేటీ కానున్నారు. రష్యా నుంచి ఎస్400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు, ఉగ్రవాదం, హెచ్1బీ వీసా, వాణిజ్యం, ఇరాన్‌పై ఆంక్షలతో చమురు కొనుగోళ్లపై ప్రభావం వంటి పలు అంశాలు వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. బుధవారం పాంపియో ప్రధాని మోదీతోనూ సమావేశం కానున్నారు. ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగే కార్యక్రమంలో భారత, అమెరికా వాణిజ్యవేత్తలతో పాంపియో మాట్లాడతారు. మోదీతో భేటీ కానున్న ట్రంప్ జపాన్‌లోని ఒసాకాలో 28, 29 తేదీల్లో జరిగే జీ20 దేశాల సమావేశానికి హాజరుకానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోదీసహా పలువురు ప్రపంచ దేశాధినేతలతో సమావేశం కానున్నారు. భారత్, ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానులతో పాటు జర్మనీ చాన్స్‌లర్ మెర్కెల్, చైనా అధ్యక్షులు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్, టర్కీ అధ్యక్షుడు ఎర్దోగన్‌లతో ఆయన సమావేశం కానున్నట్టు యూఎస్ ప్రభుత్వాధికారి ఒకరు సోమవారం విలేకరులకు తెలిపారు. -
ఉ.కొరియాపై ఆంక్షలు యథాతథం
టోక్యో: అణు నిరాయుధీకరణ పూర్తయ్యేదాకా ఉత్తరకొరియాపై ఆంక్షలు కొనసాగుతాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. అమెరికా తీరు గ్యాంగ్‌స్టర్ మాదిరిగా ఉందన్న ఉత్తరకొరియా ఆరోపణలను ఖండించారు. ఉ.కొరియాతో చర్చల వివరాలను జపాన్, దక్షిణ కొరియా విదేశాంగమంత్రులకు వివరించేందుకు టోక్యో వెళ్లిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘చైర్మన్ కిమ్ అంగీకరించిన ప్రకారం ఉత్తర కొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ హామీ నెరవేర్చిందన్న నమ్మకం కుదిరాకే ఆంక్షలను ఎత్తివేస్తాం. ప్యాంగ్యాంగ్ కోరుకుంటున్నట్లు ఆ దేశ రక్షణకు పూచీ ఇవ్వడం ద్వారా నిరాయుధీకరణ కార్యక్రమం సజావుగా సాగేందుకు అమెరికా ప్రయత్నిస్తుంది’ అని స్పష్టం చేశారు. గత నెలలో సింగపూర్‌లో జరిగిన ట్రంప్, కిమ్ భేటీలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రకారం తదుపరి చర్చలు కొనసాగించేందుకు పాంపియో రెండు రోజులపాటు ప్యాంగ్యాంగ్లో ఉన్నారు. ‘ఉత్తరకొరియా నాయకత్వంతో జరిపిన చర్చలు ఫలప్రదంగా సాగాయి. నా ప్రయత్నాల వెనుక అంతర్జాతీయ సమాజం కృషి ఉంది. అమెరికా గ్యాంగ్‌స్టర్ మాదిరిగా ఉందని ఉ.కొరియా భావించిందంటే, ప్రపంచం కూడా గ్యాంగ్‌స్టరే’ అని అన్నారు. ‘అణు నిరాయుధీకరణ అంటూ గ్యాంగ్‌స్టర్ మాదిరిగా షరతులు పెడుతున్న అమెరికా తన వైపు నుంచిæ నిర్మాణాత్మక చర్యలు చేపట్టలేదు’ అని పాంపియోతో చర్చల తర్వాత ఉ.కొరియా ఆరోపించడం తెల్సిందే. తర్వాతి భేటీల్లో పైచేయి సాధించేందుకే ఉ.కొరియా ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. -
ఉగ్ర నిర్మూలనకు అవకాశం
-
ఉగ్ర నిర్మూలనకు అవకాశం
అమెరికా సాయంతో ముందడుగు: సుష్మ స్వరాజ్ న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి విస్తృతమైన అవకాశం ఉందని.. అయితే ఇందుకు మరింత సహకారం అవసరమని భారత్ అభిప్రాయపడింది. భారత్-అమెరికా మధ్య రెండో వ్యూహాత్మక వాణిజ్య చర్చలు (ఎస్ అండ్ సీడీ) మంగళవారమిక్కడ జరిగాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, జాన్ కెర్రీ, వాణిజ్య శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, పెన్నీ ప్రిజ్కర్ ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద నియంత్రణతో పాటు ఇంధన, వాణిజ్య అంశాలపై చర్చించారు. ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని తుదముట్టించవచ్చని.. అయితే ఇందుకు మరింత సహకారం అవసరమని సుష్మా తెలిపారు. ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు బలపడాలంటే కంపెనీల ఆకాంక్షలు, ఆసక్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే అణు సరఫరా బృందం (ఎన్ఎస్జీ)లో సభ్యత్వం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు అమెరికాతో కలిసి ముందుకు సాగుతామన్నారు. సైబర్ ముప్పు నుంచి రక్షించుకొనేందుకు తొలిసారిగా అమెరికాతో కలిసి రూపొందించనున్న కార్యాచరణ తుది రూపునకు వచ్చిందన్నారు. రక్షణ, ఇంధన, సైబర్ భద్రత రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయని కెర్రీ చెప్పారు. భారత్‌లోని ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించే దిశగా పౌర అణు ఇంధన రియాక్టర్లు నెలకొల్పేందుకు సహకారం అవసరమన్నారు. -
జాన్ కెర్రీ ఇండియాకు ఎందుకొచ్చారంటే!
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీకి తాజా భారత పర్యటన కొంత చికాకు తెప్పించి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన సోమవారం రాత్రి న్యూఢిల్లీలో అడుగుపెట్టగానే భారీ వర్షం పలుకరించింది. హస్తినలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ ట్రాఫిక్‌లో సాక్షాత్తు జాన్ కెర్రీ చిక్కుకుపోయారు. దీంతో ఆయన చికాకు పడ్డారో లేదో తెలియదు కానీ ఆయన వెంట ఉన్న మీడియా ప్రతినిధులు మాత్రం తమ చిరాకునంతా ట్విట్టర్లో వెళ్లగక్కారు. మంగళవారానికి అంతా సర్దుకుంది. భారత్‌తో అత్యంత కీలకమైన రక్షణశాఖ ఒప్పందాలను అమెరికా కుదుర్చుకుంది. ఆ టాప్ వివరాలు మీకోసం.. భారత్-అమెరికా మధ్య 'వ్యూహాత్మక-వాణిజ్య సంబంధాలను' పెంపొందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరంభించిన చర్చలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో జాన్ కెర్రీ ఢిల్లీలో అడుగుపెట్టారు. ఆయన బుధవారం ప్రధాని మోదీతో సమావేశమవుతారు. అమెరికా-భారత్ వాణిజ్యాన్ని ఐదురెట్లు పెంచి 500 బిలియన్ డాలర్ల (రూ. 33.52 లక్షల కోట్ల)కు చేర్చే లక్ష్యంతో వీరి మధ్య చర్చలు జరగనున్నాయి. జాన్‌కెర్రీ మంగళవారం విదేశాంగమంత్రి సుష్మాసర్వాజ్ను కలిశారు. సాయంత్రం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు. మరమ్మతులు, సరఫరాల కోసం ఇరుదేశాల సైనిక శిబిరాలు పరస్పరం ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ వాషింగ్టన్లో అమెరికా-భారత్ ఒక ఒప్పందంపై సంతకం చేసిన నేపథ్యంలో జాన్‌కెర్రీ భారత పర్యటనకు వచ్చారు. చైనా తన సైనిక శక్తిని అమేయంగా పెంచుకుంటున్న నేపథ్యంలో దానిని దీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు రక్షణమంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణమంత్రి ఆష్టన్ కార్టర్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇరుదేశాల సంయుక్తంగా, వ్యూహాత్మకంగా ఆర్మీ కార్యకలాపాలు చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని కార్టర్ పేర్కొనగా.. ఈ ఒప్పందం వల్ల భారత భూభాగంలో అమెరికా సైనిక శిబిరాలు ఏర్పాటుచేసేందుకు వీలు ఉండబోదని మనోహర్ పరీకర్ స్పష్టం చేశారు. జాన్ కెర్రీ భారత్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి. ఆయన బుధవారం ఢిల్లీ ఐఐటీలో విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు. కెర్రీ పర్యటన నేపథ్యంలో అణు సరఫరాల గ్రూప్ (ఎన్ఎస్జీ), 48 దేశాల బృందం (జీ 48)లో స్వభ్యత్వం కోసం అమెరికా మద్దతును భారత్ మరింత బలంగా కోరే అవకాశముంది. -
వచ్చేవారం భారత్ లో జాన్ కెర్రీ పర్యటన
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వచ్చే వారం భారత్ ను సందర్శించనున్నారు. ఈ మేరకు అగ్రదేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29 న జాన్ కెర్రీ బంగ్లాదేశ్ లో పర్యటించిన అనంతరం ఇండియా చేరుకుంటారు. ఆయన అగస్టు 31 వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఇరుదేశాల ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై చర్చించనున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిట్జ్కర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేయగలదని అమెరికా తెలిపింది. -
కలసి కృషి చేద్దాం: ఒబామా
వాతావరణ ఒప్పందంపై మోదీకి ఫోన్ వాషింగ్టన్/పారిస్: అంతర్జాతీయ వాతావరణ ఒప్పందంపై భిన్నాభిప్రాయాల నేపథ్యంలో మోదీకి అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ చేసి మాట్లాడారు. సమర్థవంతమైన ఒప్పందం దిశగా కృషి చేద్దామని వారు నిర్ణయించారు. పారిస్ ఐరాస్ వాతావరణ సదస్సులో భాగంగా మంగళవారం కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్‌తో అమెరికా విదేశాంగ మంత్రి కెర్రీ భేటీ అయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజే మోదీకి ఒబామా ఫోన్ చేశారు. ఈ వివరాలను అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణ మార్పులను ఎదుర్కొనేలా వంద బిలియన్ డాలర్ల ఫండ్ ఏర్పాటు ప్రక్రియ పురోగతి సాధించిందంటూ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో-ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఇచ్చిన నివేదికను బ్రెజిల్, ఇండియా, దక్షిణాఫ్రికా, చైనా తప్పుబట్టాయి. -
పేద దేశాలకు రెట్టింపు నిధులు: జాన్ కెర్రీ
పారిస్: శుక్రవారం ముగియనున్న పారిస్ పర్యావరణ సదస్సులో సభ్య దేశాల మంత్రుల సమావేశం తర్వాత ‘సంయుక్త ఒప్పందం’పై ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ ఒప్పందం ముసాయిదాను 48 పేజీల నుంచి 29 పేజీలకు కుదించి సభ్య దేశాలకు పంపించినట్లు ఫ్రాన్స్ తెలిపింది. మరోవైపు, పేద దేశాలు పర్యావరణ పరిరక్షణ దిశగా చేసే ప్రయత్నాలకు ఇచ్చే నిధులను రెట్టింపు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ ప్రకటించారు. అగ్రరాజ్యంగా తమ బాధ్యతను నిర్వర్తిస్తామన్నారు. -
సైకిల్ ప్రమాదంలో కాలు విరగ్గొట్టుకున్న కెర్రీ
జెనీవా: సైకిల్ రైడింగ్‌పై విపరీత మక్కువగల అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీకి ఆదివారం ఫ్రాన్స్‌లో జరిగిన ప్రమాదంలో కాలు విరిగింది. వెంటనే ఆయనను హెలికాప్టర్లో జెనీవా వర్సిటీ ఆస్పత్రికి తరలించారు. కెర్రీకి కుడి తొడ ఎముక విరిగిందని, ప్రస్తుత ఆరోగ్యం స్థిరంగా ఉందని, స్పృహలోనే ఉన్నారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. స్విట్జర్లాండ్ సరిహద్దుకు ఆగ్నేయంగా 40 కి.మీ. దూరంలో ఉన్న ఫ్రాన్స్‌లోని స్కింజైర్ సమీపంలో సైక్లింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. పారామెడికల్ సిబ్బంది, ఒక వైద్యుడు ఆ సమయంలో కెర్రీతో పాటు ఉన్నారు. ఇరాన్ అణు కార్యక్రమంపై ఆదేశ దౌత్యవేత్తలతో చర్చలు జరిపేందుకు కెర్రీ జెనీవా వెళ్లారు. ప్రమాదం కారణంగా మిగిలిన నాలుగు దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. -
టిఫిన్ ఒకచోట, భోజనం మరోచోట..బస వేరే చోట
అహ్మదాబాద్: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, యూఎన్ కార్యదర్శి బాన్ కీ మూన్ ల గుజరాత్ పర్యటనలో అసాధారణ భద్రతా చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. దీనిలో భాగంగా కెర్రీ, మూన్‌ల బస అహ్మదాబాద్ నగరంలో మూడు హోటళ్లలో ఏర్పాట్లు చేసినట్టు వారు పేర్కొన్నారు. జాన్ కెర్రీ రాక గురించి హోటల్ వారికి కూడా చివరి నిమిషం దాకా ఎలాంటి సమాచారం ఇవ్వబోమని చెప్పారు. జాన్ కెర్రీ ఉదయం టిఫిన్ ఒక హోటల్లో, మధ్యాహ్న భోజనం మరో చోట, రాత్రి బస చేసేందుకు మరో హోటల్ బుక్ చేసినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి వివరించారు. యూఎన్ కార్యదర్శి బాన్ కీ మూన్ విషయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెప్పారు.