వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వచ్చే వారం భారత్ ను సందర్శించనున్నారు. ఈ మేరకు అగ్రదేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29 న జాన్ కెర్రీ బంగ్లాదేశ్ లో పర్యటించిన అనంతరం ఇండియా చేరుకుంటారు. ఆయన అగస్టు 31 వరకు ఇండియాలో పర్యటిస్తారు.
ఇరుదేశాల ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై చర్చించనున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిట్జ్కర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేయగలదని అమెరికా తెలిపింది.