Visit India
-
భారత్‌కు బ్రిటన్ రాజ దంపతులు
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్–3, కెమిల్లా దంపతులు మరోసారి భారత్ రానున్నారు. 2025 ప్రారంభంలో వారు భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి వారు ఈ మేరకు సమాచారమిచ్చారు. సింహాసనాన్ని అధిష్టించాక చార్లెస్–3కు భారత్‌లో ఇదే తొలి అధికారిక పర్యటన కానుంది. 2019లో యువరాజు హోదా లో ఆయన భారత్‌లో చివరిసారి అధికారికంగా పర్యటించారు. గత అక్టోబర్‌లో రాజ దంపతులు బెంగళూరులో పర్యటించినా అది పూర్తిగా వ్యక్తిగతంగా సాగింది. గత ఫిబ్రవరిలో చార్లెస్‌కు కేన్సర్ నిర్ధారణ అయినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. అందుకు చికిత్సలో భాగంగా వారు భారత్ వచ్చినట్టు వార్తలొచ్చాయి. బెంగళూరులో వెల్నెస్ రీట్రీట్‌లో రాజ దంపతులు నాలుగు రోజులు గడిపారు. వారిద్దరూ 2022 లోనే భారత్‌లో పర్యటించాల్సింది. క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో ఆ పర్యటన రద్దయ్యిన సంగతి తెలిసిందే. -
సబర్మతీకి డొనాల్డ్ ట్రంప్!
ఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో గుజరాత్‌లోని సబర్మతీ నది తీరాన్ని సందర్శించనున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ వెల్లడించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నార్త్ ఢిల్లీలోని శాస్త్రి నగర్ ఎన్నికల ప్రచారంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన హామీ మేరకు ఆసియాలోనే సబర్మతీ నదిని అత్యంత పరిశుభ్రమైన నదిగా మార్చారని వెల్లడించారు. ఇంతకముందు భారత పర్యటనకు వచ్చిన జపాన్, ఇజ్రాయెల్ ప్రధానులు సబర్మతీ నది తీరాన్ని సందర్శించారని గుర్తుచేశారు.(ఫిబ్రవరి 21న భారత్‌కు రానున్న ట్రంప్!) ఈసారి భారత పర్యటనకు రానున్న ట్రంప్ సబర్మతీ నదీ తీరాన్ని సందర్శించనున్నారని.. కానీ ఆయన పర్యటన తేదీలు ఇంకా ఖరారు కాలేదని విజయ్ రూపానీ తెలిపారు. కాగా ట్రంప్ పర్యటనకు సంబంధించిన వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. వచ్చే నెల 24-26 మధ్య ట్రంప్ భారత్‌కు రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ట్రంప్ పర్యటనలో ప్రధానంగా ఇరు దేశాల మధ్య వాణిజ్య అంశాలపై పలు కీలక ఒప్పందాలు జరగనున్నాయి. 2019 గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా డొనాల్డ్ ట్రంప్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల ట్రంప్ అప్పట్లో హాజరుకాలేకపోయారు. -
ఆ వేడుకలకు గోవా రానున్న ఐర్లాండ్ ప్రధాని
పనాజీ: భారత దేశానికి పలు దేశాల అధ్యక్షులు, ప్రధానులు పర్యటిస్తుంటారు. కాని తాజాగా భారతదేశాన్ని పర్యటించనున్న ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్కి ఓ ప్రత్యేకత ఉంది. ఆయన భారతమూలాలు ఉన్న ఐర్లాండ్ ప్రధాని. గోవా సముద్రతీర ప్రాంతంలో నిర్వహించే 2020 నూతన సంవత్సర వేడుకల్లో తన కుటుంబ సభ్యులతో పాల్గొనడానికి భరత్ వస్తున్నట్లు సోమవారం గోవా రాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే ప్రధాని లియో వరద్కర్ భారత పర్యటన వ్యక్తిగతమైందని.. ఈ పర్యటనలో భాగంగా లియో ఎటువంటి అధికారిక కార్యక్రమాలకు హాజరుకారని ఆ రాష్ట్ర సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. జనవరి 1 వరకు ప్రధాని లియో వరద్కర్ తన కుంటుంబ సభ్యులతో గోవాలో గడుపుతారని ఆయన పేర్కొన్నారు. జనవరి 1 మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో తిరిగి ఐర్లాండ్ వెళతారని ఆ పోలీసు అధికారి తెలిపారు. వరద్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రలోని తీరప్రాంత సింధుదుర్గ్ జిల్లాలో ఉన్న తన పూర్వీకుల గ్రామమైన వరద్ను ఆదివారం సందర్శించనున్నారు. ‘2017 లో నేను ఐర్లాండ్ ప్రధానిగా ఎన్నుకోబడ్డాడు. నా తండ్రి ఒక వైద్యుడు. ఆయన 1960లో ఇంగ్లాండ్ వెళ్లారు. నా పూర్వికుల గ్రామమైన వరద్ను సందర్శించటం ఇదే మొదటిసారి. ఇప్పుడు వరద్ గ్రామంలో మూడు తరాలకు చెందిన నా కుటుంబ సభ్యులను కలుసుకోవడం చాలా ప్రత్యేకం’ అని లియో వరద్కర్ తెలిపారు. ప్రధాని వరద్కర్ వరద్గ్రామ పర్యటనలో భాగంగా గ్రామ దేవతను దర్శించుకోనున్నారు. అదేవిధంగా వరద్ గ్రామ ప్రజలు ప్రధాని వరద్కర్‌ను సత్కరించన్నుట్లు తెలుస్తోంది. -
దీపావళిని మధురంగా మార్చే ప్రాంతాలివే!
సాక్షి, హైదరాబాద్: భారతదేశంలో జరుపుకొనే ముఖ్య పండుగలలో ఒకటి దీపావళి. ఈ పండుగ దేశమంతటా జరుపుతున్నప్పటికీ, కొన్ని నగరాలలో అత్యంత వైభవంగా జరుపుతారు. ప్రపంచ నలు మూలల నుంచి ఈ పండగ వెలుగులను చూడటానికి యాత్రికులు వస్తుంటారు. ఈ దీపావళి ఎక్కడ జరుపుకోవాలా ? అని మీరు ఆలోచిస్తున్నట్లయితే... కింది ప్రదేశాలు తప్పక మధురానుభూతులను అందిస్తాయి. కోల్‌కతా : దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం సర్వసాధారణం. ఇందుకు భిన్నంగా కోల్‌కతాలో కాళికా దేవిని పూజిస్తారు. దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి, ప్రమిదలను వెలిగించి అమ్మవారిని పూజిస్తారు. బాణసంచా కాలుస్తూ కాళికా దేవి రూపాలను ఊరేగిస్తారు. నగరమంతా దీపాలతో, మిరుమిట్లుగొలుపుతూ కాంతులీనే పలు రకాల బాణసంచా పేలుస్తారు. నగరమంతా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. చెన్నై: ఇతర ప్రాంతాలకు భిన్నంగా చెన్నైలో దీపావళి రోజున కుబేరుని పూజిస్తారు. ఆయనకు తేనె, బెల్లం సమర్పించి దీవించమని ప్రార్థిస్తారు. ఆరోగ్యానికి అధిపతిగా ఉన్న ధన్వంతరిని కూడా ఈరోజున పూజిస్తారు. ఇళ్లను శుభ్రపరచుకోవడం ఈ పండుగలో ఒక భాగం. అమృత్సర్ : దీపావళి నాడు పెద్ద పెద్ద విందు భోజనాలకు అమృత్సర్ పెట్టింది పేరు. దీపావళిని మొఘల్ చెర నుంచి హరగోబింద్ సాహిద్ విడుదలైన రోజుగా సిక్కులు భావిస్తారు. స్వర్ణ దేవాలయమంతా వేలాది విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. నది పక్కనే వెలుగుతున్న దీపాలు, దేవాలయానికి మరింత శోభను తెస్తాయి. పట్టణమంతా బాణసంచా శబ్ధాలతో హోరెత్తుతుంది. వారణాసి : ఇతర ఏ ప్రాంతంలో లేని విధంగా ఈ పట్టణంలో దీపావళి పక్షం రోజుల పాటు కొనసాగుతుంది. ఫోటోగ్రఫీని ఇష్టపడేవారికి ఈ పట్టణం స్వర్గధామంలా అనిపిస్తుంది. వారణాసిలో ఈ పండుగను దేవతల దీపావళిగా అభివర్ణిస్తారు. రవిదాస్, రాజ్ ఘాట్ల వద్ద స్వామీజీలు ప్రార్థనలు నిర్వహించి దేవతలను ఆహ్వానిస్తారు. గంగా నదిలో స్నానం చేయడానికి దేవతలు దిగివస్తారన్నది వారి నమ్మకం. గోవా: సంవత్సరాంత పార్టీలకు, అందమైన సముద్ర తీరాలకు గోవా పెట్టింది పేరు. అయినప్పటికీ దీపావళి పండుగ గోవాకు దేశమంతట నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. పల్లెటూర్లలో ప్రజలంతా తమ ఇళ్ల వద్ద ప్రమిదలను వెలిగిస్తారు. -
వచ్చేవారం భారత్ లో జాన్ కెర్రీ పర్యటన
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ వచ్చే వారం భారత్ ను సందర్శించనున్నారు. ఈ మేరకు అగ్రదేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నెల 29 న జాన్ కెర్రీ బంగ్లాదేశ్ లో పర్యటించిన అనంతరం ఇండియా చేరుకుంటారు. ఆయన అగస్టు 31 వరకు ఇండియాలో పర్యటిస్తారు. ఇరుదేశాల ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలపై చర్చించనున్నారు. అమెరికా వాణిజ్య కార్యదర్శి పెన్నీ ప్రిట్జ్కర్ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో పలు వాణిజ్య ఒప్పందాలపై చర్చించనున్నారు. ఇరుదేశాల వ్యూహాత్మక, వాణిజ్య ఒప్పందాలను ఈ పర్యటన మరింత బలోపేతం చేయగలదని అమెరికా తెలిపింది. -
అమెరికాతో ఒప్పందాలకు తుదిరూపు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన సందర్భంగా.. ఇరు దేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరే దిశగా అధికారులు కసరత్తును ముమ్మరం చేశారు. ఉగ్రవాద సంబంధిత సమాచార మార్పిడి, నకిలీ కరెన్సీ నోట్ల సరఫరాను అడ్డుకోవడంలో సహకారం, వ్యాపారవేత్తలకు సులభ వీసా.. మొదలగు ఒప్పందాలపై ఒబామా భారత్‌లో ఉండగానే సంతకాలు జరిగేలా చూడాలని అధికారులు పట్టుదలతో ఉన్నారు. పాక్‌లో తయారై చలామణి అవుతున్న భారత నకిలీ కరెన్సీ సమస్యను అధిగమించేందుకు భారత్ అమెరికా సాయం కోరుకుంటోంది. భారత్, అమెరికా అణు ఒప్పందం అమలులో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఇరుదేశాల అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా రెండు దేశాల మధ్య పరిపాలనాపరమైన, అణు పరిహారానికి సంబంధించిన అంశాలు ఈ ఒప్పందం అమలులో పీటముడులయ్యాయి. ఏడేళ్ల నాటి అణు ఒప్పందం అమలు కోసం రెండు దేశాల అధికారులతో ఏర్పాటైన ఉన్నతస్థాయి బృందం బుధవారం సమావేశం కానుంది. అందులో రక్షణ సంబంధ అంశాలకు తుది రూపం ఇచ్చేందుకు పెంటగాన్ ఉన్నతాధికారి ఫ్రాంక్ కెండల్ కూడా బుధవారం ఢిల్లీ వస్తున్నారు. ఒబామా భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనడంతో పాటు, భారత ప్రధాని మోదీతో చర్చల్లో పాల్గొంటారు. ఆగ్రా నుంచి అమెరికాకే.. జనవరి 27న తాజ్‌మహల్ దర్శనానంతరం ఒబామా.. ఆగ్రా నుంచి నేరుగా అమెరికా వెళ్లే అవకాశాలున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి. గణతంత్ర దినోత్సవ వేడుకల వేదిక వద్దకు ఒబామా తన అధికారిక వాహనం బీస్ట్’లోనే వస్తారు. ఆ వాహనం కూడా రాష్ట్రపతి కాన్వాయ్‌లోనే భాగంగా ఉంటుంది. లాడెన్‌ను అంతమొందించిన నేవీ సీల్స్‌లో భాగమైన 8 బెల్జియన్ మాలినోయిస్ శునకాలు అమెరికా అధ్యక్షుడి భద్రతలో భాగంగా భారత్‌కు చేరుకున్నాయి. ‘ఒబామా పర్యటననను బహిష్కరించండి’ రాయ్‌పూర్: ఒబామా భారత పర్యటనను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు ఛత్తీస్‌ఘడ్‌లో కరపత్రాలు ముద్రించారు. ఒబామా పర్యటనను బహిష్కరించాలని, ఈ పర్యటనకు నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ చేపట్టాలని మావోలు పిలుపునిచ్చారు. ఒబామా పర్యటన ఇదీ.. జనవరి 25 వేకువజామున 4.45కు ఢిల్లీకి రాక ఉదయం 10.10 గంటలు: రాష్ట్రపతి భవన్‌కు 10.40: రాజ్‌ఘాట్‌కు రాక, 11.20: హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ, 1.50: ఇరువురు నేతల మీడియా సమావేశం, సాయంత్రం: రాష్ట్రపతి భవన్లో విందు జనవరి 26: ఉదయం 9.25: రాష్ట్రపతి భవన్‌కు రాక, 10.00: గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు, 12.40-3.10: సీఈవో సదస్సులో ప్రసంగం, సాయంత్రం 5.45: ప్రధాని మోదీతో కలసి మౌర్యా షెరటాన్‌లో సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశం, 6.50-7.20: రౌండ్‌టేబుల్ భేటీలో ప్రసంగం, రాత్రి: ప్రధానితో విందు జనవరి 27: ఉదయం 10.40: ఢిల్లీలోని సిరి కోటకు రాక, 12.20-1.30: హోటల్లో మధ్యాహ్న భోజనం, 3.05-4.05: తాజ్‌మహల్ సందర్శన, సాయంత్రం 4.35: పాలం ఎయిర్‌పోర్టుకు, 5.50 గంటలు: అమెరికాకు తిరుగు పయనం -
పాకిస్ధాన్‌కు అమెరికా వార్నింగ్