భారత్‌కు బ్రిటన్‌ రాజ దంపతులు | UK King Charles And Queen Camilla Plan To Visit India In 2025, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

King Charles India Tour: భారత్‌కు బ్రిటన్‌ రాజ దంపతులు

Published Tue, Nov 26 2024 6:09 AM | Last Updated on Tue, Nov 26 2024 8:09 AM

UK King Charles, Queen Camilla Plan Visit To India in 2025

లండన్‌: బ్రిటన్‌ రాజు చార్లెస్‌–3, కెమిల్లా దంపతులు మరోసారి భారత్‌ రానున్నారు. 2025 ప్రారంభంలో వారు భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్‌ విదేశాంగ కార్యాలయానికి వారు ఈ మేరకు సమాచారమిచ్చారు. సింహాసనాన్ని అధిష్టించాక చార్లెస్‌–3కు భారత్‌లో ఇదే తొలి అధికారిక పర్యటన కానుంది. 2019లో యువరాజు హోదా లో ఆయన భారత్‌లో చివరిసారి అధికారికంగా పర్యటించారు.

 గత అక్టోబర్‌లో రాజ దంపతులు బెంగళూరులో పర్యటించినా అది పూర్తిగా వ్యక్తిగతంగా సాగింది. గత ఫిబ్రవరిలో చార్లెస్‌కు కేన్సర్‌ నిర్ధారణ అయినట్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ వెల్లడించింది. అందుకు చికిత్సలో భాగంగా వారు భారత్‌ వచ్చినట్టు వార్తలొచ్చాయి. బెంగళూరులో వెల్‌నెస్‌ రీట్రీట్‌లో రాజ దంపతులు నాలుగు రోజులు గడిపారు. వారిద్దరూ 2022 లోనే భారత్‌లో పర్యటించాల్సింది. క్వీన్‌ ఎలిజబెత్‌–2 మరణంతో ఆ పర్యటన రద్దయ్యిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement