King Charles III
-
భారత సంతతి ప్రముఖులకు బ్రిటన్ గౌరవ పురస్కారాలు
లండన్: నూతన సంవత్సరం సందర్భంగా బ్రిటన్ రాజు చార్లెస్–3 అందించే గౌరవ పురస్కారాల జాబితాలో 30 మందికి పైగా భారత సంతతి వారికి చోటు లభించింది. క్రీడలు, ఆరోగ్య సంరక్షణ, విద్యారంగం, స్వచ్ఛంద సేవ సహా పలు రంగాల్లో ఆదర్శంగా నిలిచిన 1,200 మందిని జాబితాలో చేర్చారు. ‘‘వీరంతా సాధారణ వ్యక్తులే. అయినా అసాధారణ రీతిలో ప్రజా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు’’అని బ్రిటన్ ప్రధాని కియర్ స్టార్మర్ ప్రశంసించారు. వారి అద్భుత సేవలను గుర్తించడాన్ని గౌరవంగా తమ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ‘‘వీరిలో చాలామంది ఓవైపు ఉద్యోగాలు చేస్తూనే సంఘ సేవను కొనసాగిస్తున్నారు. వీరిలో 12 శాతం మందిది మైనారిటీ నేపథ్యం’’అంటూ కేబినెట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. జాబితాలో పలు రంగాల వారు శ్రీలంక, భారత మూలాలున్న బ్రిటన్ ఎంపీ రణిల్ మాల్కమ్ జయవర్ధనేకు రాజకీయ, ప్రజాసేవ రంగాల్లో నైట్‌హుడ్ దక్కనుంది. విద్యారంగంలో సేవలకు సత్వంత్ కౌర్ డియోల్ ‘కమాండర్స్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్’గౌరవం దక్కించుకున్నారు. న్యాయరంగంలో సేవలకు చార్లెస్ ప్రీతమ్ సింగ్ ధనోవా, ఆరోగ్యం, శాస్త్ర సాంకేతిక రంగాల నుంచి ప్రొఫెసర్ స్నేహ ఖేమ్కా కూడా గౌరవ పురస్కారాలు అందుకోనున్నారు. జాబితాలో లీనా నాయర్, మయాంక్ ప్రకాశ్, పూరి్ణమ మూర్తి తణుకు, కార్డియాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్ ఆర్య, ప్రొఫెసర్ నందినీ దాస్, తర్సేమ్ సింగ్ ధలీవాల్, జాస్మిన్ దోతీవాలా, మోనికా కోహ్లి, శౌర్య మజుందార్, సీమా మిశ్రా, ఉష్మా మన్హర్ పటేల్, గ్యాన్ సంగ్ పవర్, శ్రావ్యా రావ్, మన్దీప్ కౌర్ సంఘేరా, సౌరజ్ సింగ్ సిద్ధూ, స్మృతీ శ్రీరామ్, టెక్ నిపుణుడు దలీమ్ కుమార్ బసు, నర్సింగ్ చీఫ్ మారిమౌత్ కౌమరసామి, రుమటాలజిస్ట్ ప్రొఫెసర్ భాస్కర్ దాస్‌గుప్తా, పీడియాట్రిక్ హెమటాలజిస్ట్ ప్రొఫెసర్ అజయ్ జైకిషోర్ వోరా, కమ్యూనిటీ వర్కర్లు సంజీబ్ భట్టాచార్య, జగ్రూప్ బిన్నీ, పోస్టల్ వర్కర్ హేమంద్ర హిందోచా, స్వచ్ఛంద కార్యకర్త జస్వీందర్ కుమార్, సంగీతకారుడు బల్బీర్‌సింగ్ ఖాన్పూర్ భుజాంగీ తదితరులకూ జాబితాలో చోటు దక్కింది. -
భారత్‌కు బ్రిటన్ రాజ దంపతులు
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్–3, కెమిల్లా దంపతులు మరోసారి భారత్ రానున్నారు. 2025 ప్రారంభంలో వారు భారత్‌లో పర్యటించనున్నారు. బ్రిటన్ విదేశాంగ కార్యాలయానికి వారు ఈ మేరకు సమాచారమిచ్చారు. సింహాసనాన్ని అధిష్టించాక చార్లెస్–3కు భారత్‌లో ఇదే తొలి అధికారిక పర్యటన కానుంది. 2019లో యువరాజు హోదా లో ఆయన భారత్‌లో చివరిసారి అధికారికంగా పర్యటించారు. గత అక్టోబర్‌లో రాజ దంపతులు బెంగళూరులో పర్యటించినా అది పూర్తిగా వ్యక్తిగతంగా సాగింది. గత ఫిబ్రవరిలో చార్లెస్‌కు కేన్సర్ నిర్ధారణ అయినట్లు బకింగ్‌హామ్ ప్యాలెస్ వెల్లడించింది. అందుకు చికిత్సలో భాగంగా వారు భారత్ వచ్చినట్టు వార్తలొచ్చాయి. బెంగళూరులో వెల్నెస్ రీట్రీట్‌లో రాజ దంపతులు నాలుగు రోజులు గడిపారు. వారిద్దరూ 2022 లోనే భారత్‌లో పర్యటించాల్సింది. క్వీన్ ఎలిజబెత్–2 మరణంతో ఆ పర్యటన రద్దయ్యిన సంగతి తెలిసిందే. -
కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!
కింగ్ చార్లెస్, కెమిల్లా దంపతులు ఇటీవల బెంగూరులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ నేపథ్యంలోనే రాజ దంపతులు వ్యక్తిగత పర్యటన నిమిత్తం కేరళలోని సౌక్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ సెంటర్‌ని కూడా సందర్శించారు. అక్కడ దాదాపు ముప్పై ఎకరాల్లో ఉండే వెల్నెస్ రిట్రీట్‌లో మూడు రోజులు గడిపారు. అంతేగాదు అక్కడ జరిగే యోగా సెషన్లు, ధ్యానం, ఆయుర్వేద ప్రకృతి వైద్య చికిత్సలన్నింటిలోనూ పాల్గొన్నారు. ఆ సందర్భంగా కింగ్ చార్లెస్ అక్కడి వంటకాలకు ఎంతగానో ఫిదా అయ్యారు. అక్కడ ఆయన రెండు కేరళ వంటకాలను అమిత ఇష్టంగా తిన్నట్లు సమాచారం. అవేంటో చూద్దామా..కింగ్ చార్లెస్ కేరళ సంప్రదాయ కోడి గుడ్డు కూర, ఇడియప్పం ఎంతో ఇష్టంగా తిన్నారు. అవే కూరలు మరుసటి రోజు కూడా వడ్డించమని కోరారట. కింగ్ చార్లెస్ మనుసును దోచుకున్న రెండు రెసీపీల తయారీ విధానం, వాటి చరిత్ర గురించి సవివరంగా చూద్దామా..!.సాంప్రదాయ కేరళ గుడ్డు కూర..ఎర్రగా ఆకర్షణీయంగా కనిపించే ఈ కూరని కేరళ పాకశాస్త్ర నిపుణులు చాలా ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. కొబ్బరిపాలు, కొబ్బరి నూనె, కొద్దిపాటి మసాల దినుసుల వేసి.. విలక్షణమైన రుచితో అందిస్తారు. ఇడియప్పం..ఇక ఇడియప్పం క్రీస్తూ శకం ఒకటొవ శతాబ్ద కాలం నుంచి గొప్ప చరిత్ర కలిగిన వంటకం. బియ్యం పిండిని న్యూడిల్స్ మాదిరిగా సతాంగై అనే ప్రత్యేక పరికరంలో ప్రెస్ చేసి ఆవిరిపై ఉడికిస్తారు. ఈ వంటకం సరిహద్దులు దాటి శ్రీలంక, మలేషియా, సింగపూర్ వంటకాల్లోకి కూడా ప్రవేశించడం విశేషం. అంతలా ఈ వంటకం ఎందరో ఆహరప్రియుల మనసులను గెలుచుకుంది. కాగా, కింగ్ చార్లెస్ దంపతులు అక్కడ క్యూరేటెడ్ వెల్నెస్ డైట్‌ని అనుసరించారు. గతంలో 2019లో ఇదే వెల్నెస్ రిట్రీట్‌లో కింగ్ చార్లెస్ 71 పుట్టిన రోజు జరుపుకున్నారు. అప్పటి నుంచే రాజ దంపతులు ఇక్కడ వంటకాలపై ప్రత్యేక అభిమానాన్ని పెంచుకున్నట్లు తెలుస్తోంది. (చదవండి: ఇదేం జైలు రా సామీ..! ఏకంగా నీటి నడిబొడ్డున..) -
బెంగళూరులో కింగ్ చార్లెస్–3
బెంగళూరు: బ్రిటన్ రాజు చార్లెస్–3 సతీసమేతంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో రహస్యంగా పర్యటించారు. రాజదంపతులు సమోవా దేశంలో కామన్వెల్త్ సమావేశంలో పాల్గొన్న తర్వాత యునైటెడ్ కింగ్డమ్(యూకే)కు వెళ్తూ మధ్యలో బెంగళూరులో ఆగినట్లు బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు ధ్రువీకరించాయి. వారిద్దరూ నగరంలోని ప్రముఖ వెల్నెస్ కేంద్రంలో చికిత్స పొందినట్లు తెలిసింది. వైట్‌ఫీల్డ్ సమీపంలోని సౌఖ్య ఇంటర్నేషనల్ హోలిస్టిక్ హెల్త్ సెంటర్లో రాజు చార్లెస్–3, రాణి కెమిల్లా మూడు రోజులపాటు బస చేశారు. యోగా, ధ్యానంతోపాటు ఇతర థెరపీలకు ఈ హెల్త్ సెంటర్ పేరుగాంచింది. శరీరం, మనసు అలసిపోయినప్పుడు పునరుత్తేజం పొందడానికి ఇక్కడ నిపుణులు ప్రకృతిసిద్ధమైన చికిత్స అందిస్తుంటారు. డాక్టర్ ఐజాక్ మథాయ్ నిర్వహిస్తున్న ఈ హెల్త్ సెంటర్‌కు చార్లెస్–3 రావడం ఇదే మొదటిసారి కాదు. 2019లో ఆయన ఇక్కడే 71వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. ‘మనసుకు స్వాంతన లభించే యోగా క్రియల్లో బ్రిటన్ రాజ దంపతులు పాల్గొన్నారు. కోడిగుడ్లతోపాటు కేవలం శాకాహారం తీసుకున్నారు. ధ్యానం చేశారు. చార్లెస్–3 ఆయుర్వేద, హోమియోపతి, నేచురోపతితో కూడిన వెల్‌నెట్ ట్రీట్మెంట్ తీసుకున్నారు’’ అని సౌఖ్య హెల్త్ సెంటర్ ప్రతినిధులు చెప్పారు. రాజదంపతులకు ప్రత్యేక మర్యాదలేవీ చేయలేదని, ఇతర అతిథుల తరహాలోనే వారికి చికిత్స అందించామని వెల్లడించారు. హెల్త్ సెంటర్లో మూడు రోజులపాటు ఉన్న చార్లెస్–3 దంపతులు ఇక్కడ సాగవుతున్న ఆర్గానిక్ పంటలను పరిశీలించారు. ఔషధాల గార్డెన్‌ను సందర్శించారు. గోవుల మధ్య కలియతిరిగారు. ప్రకృతికి దగ్గరగా జీవించారు. పర్యావరణ హిత పద్ధతులు పాటించారు. రాజదంపతులు బుధవారం ఉదయమే హెల్త్‌సెంటర్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. -
కింగ్ చార్లెస్3కి షాక్.. ‘నువ్వు మా రాజువి కావంటూ’ నినాదాలు
కాన్ బెర్రా : బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్ట్రేలియా పార్లమెంట్లో అవమానం జరిగింది. పార్లమెంట్లో ఆయన ప్రసంగిస్తుండగా ఆస్ట్రేలియా మహిళా సేనేటర్ లిడియా థోర్ప్ ఆయనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నువ్వు మా రాజు కాదు అంటూ వలసవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘నువ్వు మా రాజు కాదు. నువ్వు మారణ హోమానికి పాల్పడ్డావు. మా భూమిని, మా నుండి దోచుకున్న వాటిని మాకు ఇవ్వండి’ అని ఆరోపించారుఆస్ట్రేలియా రాజుగా ఈ ఏడాది తొలిసారి కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియాలో ఐదురోజుల పాటు పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంట్లో ప్రసంగించారు. కింగ్ చార్లెస్ ప్రసంగ సమయంలో పక్కనే ఉన్న థోర్ప్ విమర్శలు గుప్పించారు. థోర్ప్ తీరుపై ఆస్ట్రేలియా ప్రజాప్రతినిధులు ఖండించారు. మాజీ ప్రధాన మంత్రి టోనీ అబాట్ సైతం థోర్ప్ ఇలా వ్యవహరించడం దురదృష్టకరం అని అన్నారు. కాగా, రాచరికానికి వ్యతిరేకంగా సేనేటర్ లిడియా థోర్ప్ గతంలో పలు మార్లు ఇలాగే వ్యవహరించారు. -
ముందస్తు ఎన్నికలకు సునాక్
లండన్: ముందస్తు ఎన్నికలపై జోరుగా సాగిన ఊహాగానాలే నిజమయ్యాయి. పలురకాలుగా సాగిన ఊహాగానాలకు తెరదించుతూ జూలై 4న బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని ప్రధానమంత్రి రిషి సునాక్ బుధవారం ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని రాజు చార్లెస్–3కి తెలిపానని, పార్లమెంట్ రద్దుకు ఆయన అనుమతించారని వెల్లడించారు. వేసవిలో ఆరు వారాల్లో ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పారు. అధికారిక నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్‌లో కేబినెట్ భేటీ అనంతరం భారతీయ సంతతి బ్రిటన్ ప్రధాని సునాక్ ముందస్తు ఎన్నికల ప్రకటన చేశారు. షెడ్యూల్ ప్రకారమైతే 2025 జనవరిలోగా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉంది. 10 డౌనింగ్ స్ట్రీట్ బయట ఎన్నికల ప్రకటన చేస్తూ.. తన పదవీకాలంలో సాధించిన విజయాలను సునాక్ వివరించారు. ‘మీకు వీలైనంత భద్రత ఇవ్వడానికి నా అధికార పరిధికి లోబడి చేయగలిగినంతా చేస్తాను. ఇది నా హామీ. బ్రిటన్ తన భవిష్యత్తును ఎంచుకోవాల్సిన తరుణమిది’ అని రిషి సునాక్ దేశ ప్రజలనుద్దేశించి అన్నారు. సునాక్ కన్జర్వేటివ్ పారీ్టకి ఓటమి తప్పదని, లేబర్ పార్టీకి విస్పష్ట మెజారిటీ కనిపిస్తోందని చాలా ఒపీనియన్ పోల్స్ స్పష్టం చేశాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికలు, స్థానిక ఎన్నికల్లో వరుసబెట్టి లేబర్ పారీ్టయే గెలుస్తూ వచ్చింది. ఈ తరుణంలో రిషి సునాక్ ముందస్తు ఎన్నికలకు వెళ్లే సాహసం చేయడం గమనార్హం. అంతకుముందు బుధవారమే పార్లమెంటులో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సునాక్ బదులిస్తూ ఈ ఏడాది ద్వితీయార్థంలో ఎన్నికలుంటాయని చెప్పారు. అయితే ఆకస్మింగా కేబినెట్ భేటీని ఏర్పాటు చేయడంతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆకస్మిక కేబినెట్ భేటీ కోసం విదేశాల్లో ఉన్న మంత్రులు సైతం అర్ధంతరంగా తమ పర్యటనలు ముగించుకొని స్వదేశానికి చేరుకున్నారు. చివరికి కేబినెట్ సమావేశం అనంతరం సునాక్ జూలై 4న ఎన్నికలుంటాయని ప్రకటించారు. -
కృతజ్ఞతలు తెలిపిన బ్రిటన్ కింగ్ చార్లెస్-3
లండన్: బ్రిటన్ కింగ్ చార్లెస్-3కి ఇటీవల క్యాన్సర్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే చార్లెస్-3 ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి ఆయన త్వరగా కోలుకోవాలని దేశ వ్యాప్తంగా ప్రజలు, ప్రముఖులు ఆకాక్షించారు. కాన్సర్ నిర్ధారణ అయిన తొలిసారి చార్లెస్-3 స్పందించారు. ‘ఇటీవలి కాలంలో నా ఆరోగ్యం బాగుండాలని ఎంతో మంది మిత్రులు, శ్రేయోభిలాషులు, ప్రజలు సందేశాలు పంపారు. వారు పంపిన అన్ని సందేశాలు నాకు చేరాయి. వారందరికీ నా ఆరోగ్యంపై చూపిన ప్రేమకు హృదయాపూర్వకమైన కృతజ్ఞతలు. క్యాన్సర్ బారినపడినవారికి తెలుసు.. అభిమానం, ప్రేమ చూపించేవారి దయతో కూడిన పార్థనలు, ఆలోచనలే తమకు గొప్ప ఓదార్పు, ప్రోత్సాహం’ అని కింగ్ చార్లెస్-3 ఓ ప్రకటనలో తెలిపారు. ‘మెడికల్ ప్రొఫెషనల్స్, క్యానర్స్ చారిటీలు చూపిన అంకితభవం మరువలేనిది. నేను స్వయంగా వారి సేవలు పొందాను. అందుకే వారి మీద ఆరాధనభావం మరింత పెరిగింది’ అని ను రాజు చార్లెస్-3 ప్రశంసించారు. సోమవారం 75 ఏళ్లు ఉన్న రాజు చార్లెస్‌కు కాన్సర్ నిర్ధారణ అయినట్లు బకింగ్‌హం ప్యాలేస్ ఓ ప్రకటన వెల్లడించిన విషయం తెలిసిందే. చార్లెస్-3.. బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం చేసిన 18 నెలలో కాన్సర్ గురికావటం గమనార్హం. ఆయన కాన్సర్ సంబంధించి చికిత్స తీసుకుంటున్నారని స్థానిక మీడియా పేర్కొంటోంది. చదవండి: కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..? -
కింగ్ చార్లెస్‌కి కేన్సర్..ఆయన జీవనశైలి ఎలా ఉంటుందంటే..?
బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కేన్సర్‌తో బాధపడుతున్న బకింగ్‌హామ్ ప్యాలెస్ పేర్కోంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్ ప్రెస్ ప్రకారం ఆయన కెరిర్లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్‌స్టైల్ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ సందర్భంగా ఆయన ఆహార అలవాట్లు ఎలా ఉండేవి? రోజూవారి దినచర్య ఎలా ఉంటుంది తదితర విశేషాల గురించి తెలుసుకుందామా!. ఆయన ఒకసారి మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బిజీ షెడ్యూల్‌కు ఆటంకం కలిగించే భోజనం లగ్జరీ లాంటిదని విశ్వసిస్తానని అన్నారు. అంతేగాదు ఆయన సమతుల్యమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం వంటివి చేస్తారని అధికారిక వర్గాల సమాచారం. 2018లో కార్లెస్ హౌస్‌లో తన 70వ పుట్టిన రోజు పురస్కరించుకుని తనకు సంబంధించిన 70 వాస్తవాల జాబితాలో తాను రోజుకు రెండుసార్లు మాత్రమే ఆహారం తీసుకుంటానని అదికూడా అల్పహారం, రాత్రి భోజనం మాత్రమేనని చెప్పుకొచ్చారు. అంతేగాదు వారంలో రెండు రోజులు పూర్తిగా శాకాహారం భోజనం తింటానని, పాల ఉత్పత్తులకు కూడా దూరంగా ఉంటానని చెప్పుకొచ్చారు. ఆరోగ్యంగా ఉండేందుకు ఎక్కువుగా మొక్కల ఆధారిత ఆహారమే ఎక్కువగా తీసుకుంటానని చెప్పుకొచ్చారు. అల్పాహారంలో ఎక్కువగా చీజ్, ఉడకబెట్టిన గుడ్లు, పాలు, తేనేతో కూడిన డార్జిలింగ్ టీ తదితరాలే తీసుకుంటారని రాయల్ డైట్ పేర్కొంది. ఆయన ఎక్కువగా సేంద్రీయ ఉత్పత్తులనే ఇష్టపడతారని రాయల్ చెఫ్‌లు చెబుతున్నారు. ఇక ఫిట్నెస్ విషయానికి వచ్చేటప్పటికీ క్రమం తప్పకుండా వ్యాయమాలు చేస్తారని ప్యాలెస్ పేర్కొంది. అలాగే కెనడియన్ ఎయిర్‌ఫోర్స్‌కి సంబంధించిన ఐదు ప్రాథమిక వ్యాయమాలను రోజుకు రెండుసార్లు చేస్తారని తెలిపింది. ముఖ్యంగా రెండు నిమిషాల స్ట్రెచింగ్ ఒక నిమిషం సిట్ అప్లు, మరో నిమిషం బ్యాక్ లెగ్ రైజ్‌లు పుష్ అప్లు 11 నిమిషాలు చేస్తారని వెల్లడించింది. వాటన్నింటి తోపాటు ఆరు నిమిషాల పాలు రన్నింగ్, ప్రతి 75 అడుగులకు డేగ జంప్‌లు చేయడం, వాతావరణం బాగుంటే ఎక్కువ సేపు బహిరంగ ప్రదేశంలో గడపడం వంటివి చేస్తారని రాయల్ ప్యాలెస్ పేర్కొంది. ఇంతలా పిట్‌నెస్‌గా ఉంటూ మంచి ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించనప్పటికీ కొన్ని రకాల వ్యాధులు ఎందుకు దాడి చేస్తాయనేది ఎవ్వరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న. నిజం చెప్పాలంటే వ్యాధికి రాజు, పేద అనే తారతమ్యం ఉండదేమో రావాలి, వేదన అనుభవించాలి అని ఉంటే టైంకి వచ్చి దాని ప్రభావం చూపించేస్తుందేమో కదూ!. View this post on Instagram A post shared by The Royal Family (@theroyalfamily) (చదవండి: శిల్పాశెట్టి చెప్పే తిరగలి తిప్పే భంగిమ..ఎన్ని ప్రయోజనాలో తెలుసా!) -
బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్.. ప్యాలెస్ కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. వివరాల ప్రకారం.. బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బకింగ్‌హం ప్యాలెస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీంతో, కింగ్ ఛార్టెస్ సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. కాగా, క్యాన్సర్‌కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది. A statement from Buckingham Palace: https://t.co/zmYuaWBKw6 📷 Samir Hussein pic.twitter.com/xypBLHHQJb — The Royal Family (@RoyalFamily) February 5, 2024 మరోవైపు.. వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారని చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికయ్యారు. దేశాధినేతల స్పందన.. ఛార్లెస్-3 క్యాన్సర్ బారిన పడడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీరు తిరిగి వస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం మీ వేగవంతమైన రికవరీని కోరుకుంటుంది’ అంటూ రాసుకొచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్ కూడా ఎక్స్ వేదికగా రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Wishing His Majesty a full and speedy recovery. I have no doubt he’ll be back to full strength in no time and I know the whole country will be wishing him well. https://t.co/W4qe806gmv — Rishi Sunak (@RishiSunak) February 5, 2024 -
కోర్టు బోనెక్కి సాక్ష్యం చెప్పనున్న ప్రిన్స్ హ్యారీ
లండన్: బ్రిటన్ రాజు చార్లెస్ –3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సాక్ష్యం ఇవ్వడానికి వచ్చే వారంలో కోర్టుకు హాజరుకానున్నారు. రాజకుటుంబానికి చెందినవారు ఇలా కోర్టు బోనెక్కడం 130 ఏళ్లలో ఇది తొలిసారి. డైలీ మిర్రర్, సండే మిర్రర్ వంటి వార్తా పత్రికల ప్రచురణ సంస్థ మిర్రర్ గ్రూప్ న్యూస్‌పేపర్స్ (ఎంజీఎన్) సెలిబ్రిటీల వ్యక్తిగత అంశాలను సేకరించడం కోసం చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడిందన్న ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై 100 మంది సెలిబ్రిటీలతో పాటు ప్రిన్స్ హ్యారీ కూడా మిర్రర్ గ్రూప్‌పై కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసును విచారిస్తున్న లండన్ హైకోర్టులో ప్రిన్స్ హ్యారీ హాజరై ఫోన్ ట్యాంపింగ్‌పై సాక్ష్యం ఇవ్వనున్నారు. గతంలో 1870లో ఎడ్వర్డ్–7 ఒక విడాకుల కేసులో సాక్ష్యమిచ్చారు. -
రాజు చుట్టూ ని‘బంధనాలు’.. ప్రతి రోజూ రాజభోగాలే అనుకుంటే పొరపాటే!
బ్రిటన్ రాజుగా చార్లెస్ 3 పట్టాభిషిక్తుడయ్యాడు. ఒక దేశానికి రాజుగా కిరీటధారణ జరిగితే ఇక ప్రతి రోజూ రాజభోగాలు అనుభవించడమే అనుకుంటే పొరపాటే. విందు వినోదాలు, చుట్టూ వందిమాగధులు, ఏ చిన్న పనికైనా జీ హుజూర్ అనే సేవకులు ఇవన్నీ ఉన్నప్పటికీ మరిన్ని ఆంక్షల చట్రంలో బతకాల్సి ఉంటుంది. రాజు ప్రాణం ప్రజలకు ఎంతో విలువైనది. అందుకే భద్రతా కారణాలు, తరతరాలుగా వస్తున్న సంప్రదాయాలతో కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పా టించాలి. ఒక రకంగా బంగారు పంజరంలో బంధించినట్టుగా స్వేచ్ఛను కోల్పోవలసి ఉంటుంది. 70 ఏళ్ల క్రితం రాణి ఎలిజæబెత్ నాటి నిబంధనలే ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. కింగ్ చార్లెస్ అవి ఇష్టం ఉన్నా లేకపోయినా పాటించి తీరవలసిందే. కానుకల స్వీకరణ తప్పనిసరి బ్రిటన్ రాజ సంప్రదాయం ప్రకారం వారికొచ్చే కానుకల్ని తప్పనిసరిగా స్వీకరించాలి. దేశంలో వివిధ ప్రాంతాలు సందర్శించినప్పుడు ఇతర దేశాల పర్యటనలకి వెళ్లినప్పుడు రాజుపై గౌరవంతో చాలా మంది రకరకాల కానుకలు ఇస్తారు. వాటిని రాజు తప్పకుండా తీసుకోవాలి. ఒకవేళ ఆ కానుకలు ఏదైనా ప్రత్యుపకారం పొందడం కోసం ఇస్తూ ఉంటే మాత్రం రాజకుటుంబం వారు కానుకల్ని తిరస్కరించే అవకాశం కూడా ఉంది. ఆ సమయంలో వారి మనోభావాలు దెబ్బ తినకుండా చూసుకోవాలి. విలియంతో ప్రయాణించలేరు బ్రిటన్ రాజుతో పాటు వారసుడు కూడా ము ఖ్యమే. కింగ్ చార్లెస్ తర్వాత సింçహాసనం అధిష్టించే వారసత్వపు హక్కు కలిగిన ప్రిన్స్ విలి యమ్‌తో కలిసి ఆయన ఎక్కడికీ ప్రయాణించకూడదు. ఇద్దరూ వేర్వేరు విమానాలు, వాహనాల్లోనే వెళ్లాలి. ఎందుకంటే ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇద్దరి ప్రాణాలకు ముప్పు ఉండకూడదన్న భావనతో ఈ నిబంధన తీసుకువచ్చారు. వస్త్రధారణ రాజు ధరించే వస్త్రధారణకి కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. దౌత్యపరంగా అనుకూలంగా ఉండే డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. రాజు ఏ దేశానికి వెళితే ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే దుస్తులే ధరిస్తారు. ఇక రాజు తనతో పాటు ఎప్పుడూ నలుపు రంగు వస్త్రాలు తీసుకువెళతారు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అనుకోని పరిస్థితుల్లో అంత్యక్రియలకి హాజరుకావాల్సి వస్తే అప్పుడు వేసుకోవడం కోసం నల్ల బట్టలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. షెల్ ఫిష్ తినలేరు రాజుతో సహా బ్రిటన్ రాచకుటుంబీలు అందరూ షెల్ఫిష్కు దూరంగా ఉండాలి. ఫుడ్ పాయిజనింగ్‌కి అవకాశం ఉన్న తినకూడదన్న నిబంధనలైతే ఉన్నాయి. ఇక రాజు భద్రతే అత్యంత కీలకం కాబట్టి అపరిచితులు ఇచ్చే ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. ఓటుకి దూరం బ్రిటన్ రాజు ఎప్పుడూ రాజకీయాల్లో తటస్థ వైఖరి అవలంబించాలి. ఏ పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేకంగా కానీ మాట్లాడకూడదు. అయితే పలు సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించవచ్చు. రాజ్యాంగం ప్రకారం ఓటు హక్కు ఉన్నప్పటికీ రాచ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఓటింగ్‌కి కూడా దూరంగా ఉంటారు. డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు ఎన్ని రకాల ఆంక్షలున్నా బ్రిటన్ రాజు ఒక్కరికే ఉన్న సదుపాయం ఒకటుంది. అదే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం. కారు డ్రైవ్ చేయాలని అనుకుంటే ఆయనకు లైసెన్స్ అక్కర్లేదు. పాస్‌పోర్ట్ లేకుండా ఏ దేశానికైనా ప్రయాణించవచ్చు. సెల్ఫీలు ఆటోగ్రాఫ్‌లు ఉండవు ప్రజలెవరైనా రాజుతో కలిసి సెల్ఫీ దిగాలని ముచ్చట పడితే అది కుదిరేపని కాదు. ఎవరికీ ఆటోగ్రాఫ్‌లు ఇవ్వకూడదు. అలా ఇస్తే రాజు సంతకం ఫోర్జరీ చేస్తారన్న భయం ఉంది. సెల్ఫీలు దిగకూడదు. రాజు కుటుంబ సభ్యులందరికీ ఇదే వర్తిస్తుంది. అయితే ప్రోటోకాల్స్‌లో ఈ నిబంధనని అధికారికంగా ఇంకా చేర్చలేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మారాజు’లు.. ప్రపంచంలో ఇంకా రాచరికమున్న దేశాలివే..
ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు నేర్పించిన బ్రిటన్ దేశపు రాణి ఎలిజిబెత్–2 మరణం, ఛార్లెస్–3 పట్టాభిషేకం నేపథ్యంలో.. రాచరికానికి సంబంధించిన పలు ప్రశ్నలు సమాజంలో వస్తున్నాయి. ప్రపంచంలోని పలు దేశాల పార్లమెంట్లకు తల్లిలాంటిది బ్రిటన్ పార్లమెంట్. ప్రజాస్వామ్యానికి నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్న బ్రిటన్ ప్రజలకు రాచరికం పట్ల అంతులేని ఆకర్షణ ఉందని ఇటీవల ప్రస్ఫుటమయింది. మరణించిన రాణి ఎలిజబెత్ తర్వాత రాజుగా సింహాసనం ఎక్కిన ఛార్లెస్–3 కేవలం బ్రిటన్‌కే కాకుండా, మరో 14 దేశాలకూ రాజుగా (దేశాధినేతగా) ఉన్నారనే విషయం ఆశ్చర్యం కలిగించే అంశమే. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని దేశాల్లోనూ రాచరికమే ఉంది. కొన్ని దేశాల్లో రాజే సర్వాధికారి. మరికొన్ని దేశాల్లో పాక్షిక అధికారాలను కలిగి ఉంటారు. బ్రిటన్ పాలించిన వలస దేశాలను కామన్వెల్త్ దేశాలుగా పిలుస్తారు. మొత్తం 56 కామన్వెల్త్ దేశాలు ఉన్నాయి. వీటిలో 14 దేశాలు బ్రిటన్ రాజు/రాణినే తమ దేశ రాజు/రాణిగా అంగీకరిస్తాయి. మిగిలిన దేశాల్లో 36 పూర్తి గణతంత్ర రాజ్యాలుగా ఉన్నాయి. మిగిలిన దేశాలకు సొంత రాచరికాలు ఉన్నాయి. బ్రిటన్ రాజునే తమ రాజుగా అంగీకరిస్తున్న 14 దేశాలు 1. కెనడా, 2. ఆస్ట్రేలియా, 3. న్యూజిలాండ్, 4. యాంటిగు అండ్ బాబోడ, 5. ది బహామస్, 6. బెలీజ్, 7. గ్రెనాడ, 8. జమైకా, 9. పాపువా న్యూ గీని, 10. సెయింట్ కిట్స్ అండ్ నెవస్, 11. సెయింట్ లూసియా, 12. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీస్, 13. సోలోమన్ ఐలండ్స్, 14. తువాలు మొత్తం 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ప్రపంచవ్యాప్తంగా 43 దేశాల్లో ఇప్పటికీ రాచరికమే ఉంది. యూకేతో కలిపి మొత్తం 15 దేశాలకు రాజుగా బ్రిటన్ రాజు వ్యవహరిస్తున్నారు. రాచరిక వ్యవస్థ ఉన్న దేశాల్లో అభివృద్ధి చెందిన దేశాలూ ఉండటం గమనార్హం. బలమైన ఆర్థిక వ్యవస్థలుగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానికి నిలయాలుగా ఉన్న దేశాలూ ఉన్నాయి. యూకే, జపాన్, కెనడా, డెన్మార్క్, స్పెయిన్ తదితర దేశాలే ఇందుకు ఉదాహరణలు. వెనుకబడిన సమాజం ఆనవాళ్లకు రాచరిక వ్యవస్థ గుర్తుగా ఉందనే వాదన చాలా దేశాలకు వర్తించడంలేదని ఆయా దేశాలు వివిధ రంగాల్లో పురోగమిస్తున్న తీరు చెబుతోంది. రాచరిక వ్యవస్థ 3 రకాలు ఆయా దేశాల సంస్కృతి, భాషను బట్టి రాచరికంలో దేశాధినేతను రాజు, రాణి, అమీర్, సుల్తాన్ వంటి హోదాలతో వ్యవహరిస్తున్నారు. రాచరిక స్వభావం, వాటికున్న అధికారాలను బట్టి 3 రకాలుగా విభజించవచ్చు. రాజ్యాంగపరమైన రాచరికం కేవలం రాజ్యాంగ విధులు (సెరిమోనియల్ డ్యూటీస్) నిర్వర్తించడానికి మాత్రమే రాచరికం పరిమితమవుతుంది. రాజకీయ అధికారాలు ఏమీ ఉండవు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే నిజమైన అధికారాన్ని అనుభవిస్తుంది. ఇలాంటి రాచరికం బ్రిటన్ (యూకే), జపాన్, డెన్మార్క్ దేశాల్లో ఉంది. పూర్తి రాచరికం దేశంలో రాజుదే పూర్తి అధికారం. చట్టాలను రూపొందించే, సవరించే, తిరస్కరించే అధికారం రాజు/రాణికి ఉంటుంది. విదేశీ వ్యవహారాలను కూడా రాజే పర్యవేక్షిస్తారు. రాజకీయ నేతలను నామినేట్ చేస్తారు. సౌదీ అరేబియా, వాటికన్ సిటీ, యస్వటినీ తదితర దేశాలు ఈ కోవలోకి వస్తాయి. మిశ్రమ రాచరికం కొన్ని అంశాల్లో సంపూర్ణ అధికారాలను వినియోగించుకుంటూనే, కొన్ని అంశాల్లో ప్రజా ప్రభుత్వాలు స్వేచ్ఛగా విధులు నిర్వర్తించే అవకాశం ఉంటుంది. ఇలాంటి జాబితాలో జోర్డాన్, మొరాకో, లిక్టన్స్టైన్ తదితర దేశాలు ఉన్నాయి. - (ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి) ఇది కూడా చదవండి: అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం -
కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ వేడుకలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయి ఓ గుంపుపైకి దూసుకపోయింది. అయితే ఆ సమయంలో చార్లెస్ 3 వెస్ట్మిన్స్టర్ అబ్బే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి తిరిగి వెళ్లిపోయిన తదుపరి ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ హౌస్‌హోల్డ్‌లోని మౌంటెడ్ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. సమీపంలో ఓ మెటల్ బారీకేడ్ని ఢీ కొట్టి మరీ గుంపుపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తున్న గోల్డస్టేట్ కోచ్‌కు కేవలం గజం దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సైనిక సిబ్బంది గాయాలను ఊహించి సంఘటన స్థలానికి స్ట్రెచర్‌ను తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు భయపడేంతగా ఎవరికి గాయాలు కాలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. During today's coronation of the British King Charles the Third, an agitated horse, which was part of the royal procession, ran into the audience watching the event on the streets of London pic.twitter.com/29RXPOwK2e — Spriter (@Spriter99880) May 6, 2023 (చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి) -
King Charles III: కింగ్ చార్లెస్-3 పట్టాభిషేకం.. కిరీటధారిగా బ్రిటన్ రాజు (ఫొటోలు)
-
అంగరంగ వైభవంగా..చార్లెస్ పట్టాభిషేకం
లండన్: రవి అస్తమించినా అలనాటి రాజ వైభవానికి, అట్టహాసాలకు, ఆడంబరానికి మాత్రం ఏ లోటు లేని రీతిలో బ్రిటన్ రాజ సింహాసనంపై చార్లెస్ 3 కొలువుదీరారు. వెయ్యేళ్లకు పైగా కొనసాగుతున్న సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం బ్రిటన్ 40వ రాజుగా పట్టాభిషిక్తుడయ్యారు. పలువురు దేశాధినేతలు, ముఖ్య నేతలు తదితరుల సమక్షంలో లాంఛనంగా కిరీటధారణ చేశారు. దాంతో బ్రిటన్‌కు లాంఛనప్రాయ అధినేతగా చార్లెస్ అధికారికంగా పూర్తిస్థాయిలో పగ్గాలు చేపట్టినట్టయింది. లండన్ వీధుల గుండా భార్యాసమేతంగా బంగారు రథంలో ఊరేగుతూ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన పట్టాభిషేకానంతరం దారి పొడవునా ప్రజలు, అభిమానుల అభినందనలు స్వీకరిస్తూ బకింగ్‌హాం రాజప్రాసాదానికి చేరుకున్నారు. అనంతరం చారిత్రక బాల్కనీ నుంచి రాజ దంపతులు మరోసారి అందరికీ అభివాదం చేయడంతో కార్యక్రమం ముగిసింది. అత్యంత లేటు వయసులో బ్రిటన్ సింహాసనాన్ని అధిష్టించిన రికార్డును కూడా 74 ఏళ్ల చార్లెస్ సొంతం చేసుకున్నారు! ఆయనతో పాటు భార్య కెమిల్లా (75)కు కూడా రాణిగా పట్టాభిషేకం జరిగింది. 2022 సెప్టెంబర్‌లో తన తల్లి, బ్రిటన్ రాణి ఎలిజబెత్–2 మరణానంతరం బ్రిటన్ రాజుగా చార్లెస్ బాధ్యతలు స్వీకరించడం తెలిసిందే. 70 ఏళ్ల తర్వాత... అప్పుడెప్పుడో 70 ఏళ్ల కిందట, అంటే 1953లో బ్రిటన్ రాణిగా ఎలిజబెత్–2కు పట్టాభిషేకం జరిగింది. తర్వాత మళ్లీ ఇంతకాలానికి జరిగిన పట్టాభిషేక క్రతువు అందరినీ ఎంతగానో ఆకర్షించింది. అప్పట్లాగే శనివారం కూడా కార్యక్రమం ఆసాంతం వాన పడటం విశేషం. దేశ విదేశాల్లో లక్షలాది మంది కార్యక్రమాన్ని అత్యంత ఆసక్తిగా వీక్షించారు. మరోవైపు ఈ ప్రజాస్వామిక యుగంలోనూ ఇంకా ఈ కాలం చెల్లిన రాచరికపు పోకడలు ఏమిటంటూ జోరుగా విమర్శలు కూడా వచ్చాయి. వందలాది నిరసనకారులు రాజ దంపతుల ఊరేగింపు మార్గంలో బారులు తీరి నినాదాలకు దిగారు. ముందుజాగ్రత్తగా వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. సునాక్ బైబిల్ పఠనం ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ సమక్షంలో మొదలైన కార్యక్రమం రాజుగా చార్లెస్‌ను గుర్తించడం, ప్రమాణం, ప్రకటన, కిరీటధారణ, పట్టాభిషేకం... ఇలా ఐదు దశల్లో 2 గంటలపాటు సాగింది. ముందుగా చార్లెస్‌ను సభికులందరికీ ఆర్చిబిషప్ పరిచయం చేశారు. చార్లెస్ అందరికీ కన్పించేలా నాలుగు దిక్కులకూ తిరిగారు. తర్వాత చట్టాన్ని కాపాడుతూ న్యాయంగా, దయతో పాలిస్తానని, ఇంగ్లండ్ చర్చికి విధేయుడైన క్రైస్తవునిగా ఉంటానని చార్లెస్ రెండు ప్రమాణాలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం కెమిల్లాకు చార్లెస్ ఉంగరం తొడిగారు. తద్వారా రాజ దంపతులు లాంఛనంగా మళ్లీ పెళ్లాడారు. అనంతరం బ్రిటన్ తొలి హిందూ ప్రధాని రిషి సునాక్ ప్రభుత్వ సారథి హోదాలో బైబిల్ పంక్తులు చదివి వినిపించారు! హిందూ, ముస్లిం, సిక్కు, బౌద్ధ, యూదుమత ప్రతినిధులను కూడా తొలిసారిగా కార్యక్రమానికి ఆహ్వానించారు. హిందూ ప్రతినిధి రాజ చిహ్నాన్ని చార్లెస్‌కు అందజేశారు. అనంతరం బంగారు అంగవస్త్రం ధరించి దాదాపు 800 ఏళ్ల నాటి సింహాసనాన్ని అధిష్టించారు. దాని కింది అరలో స్కాట్లాండ్ నుంచి తెప్పించిన పవిత్ర శిలనుంచారు. చార్లెస్‌పై తెరచాటుగా చాతి, చేతులు, ముఖంపై జెరూసలేం నుంచి ప్రత్యేకంగా తెప్పించిన పవిత్ర తైలం చిలకరించారు. చార్లెస్‌కు తెరచాటు కోసం ఉపయోగించిన వస్త్రంపై 56 కామన్వెల్త్ దేశాలకు ప్రతీకగా 56 ఆకులతో కూడిన చెట్టును చిత్రించారు. తర్వాత శిలువతో కూడిన గోళాకారపు బంగారు రాజముద్ర, రాజదండాన్ని ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్ అందుకున్నారు. వేలికి రాజముద్ర తొడిగాక చివరగా అతి ప్రధాన ఘట్టంలో 360 ఏళ్ల నాటి సెయింట్ ఎడ్వర్డ్ స్వర్ణ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. దీన్ని ఆయన మరింకెప్పుడూ ధరించబోరు. ఆ వెంటనే గాడ్ సేవ్ ద కింగ్ గీతాలాపనతో, గంటల మోతతో వెస్ట్ మినిస్టర్ అబే మారుమోగింది. అనంతరం చార్లెస్ రాజఖడ్గం చేబూని 1937లో క్వీన్ ఎలిజబెత్ దంపతులు పట్టాభిషేకానికి వాడిన సింహాసనంపై ఆసీనులయ్యారు. ఆర్చిబిషప్‌తో పాటు చార్లెస్ పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం మోకాళ్లపై కూర్చుని ఆయన కుడిచేతిని ముద్దాడారు. తర్వాత నిరాడంబరంగా కెమిల్లాకు రాణి కిరీటధారణ జరిగింది. ఆహూతుల కళ్లెదుట రాణిపై పవిత్ర తైలం చిలకరించారు. తర్వాత 1911లో క్వీన్ మేరీ ధరించిన 2,200 వజ్రాలు పొదిగిన కిరీటాన్ని ఆమె ధరించారు. కోహినూర్ సహా మూడు పెద్ద వజ్రాలతో ఈ కిరీటం మెరిసిపోయేది. వివాదాలకు తావు లేకుండా ఇటీవల కోహినూర్‌ను కిరీటం నుంచి తొలగించారు. అనంతరం ఎడ్వర్డ్ కిరీటాన్ని తీసేసి అధికారిక రాజ కిరీటాన్ని చార్లెస్ ధరించారు. రాణితో కలిసి దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ బంగారు రథంలో బకింగ్‌హాం ప్యాలెస్‌కు తిరిగి వెళ్లారు. ప్యాలెస్ బాల్కనీ నుంచి పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియం దంపతులతో కలిసి చార్లెస్ దంపతులు ప్రజలకు దర్శనమివ్వడంతో పట్టాభిషేక కార్యక్రమానికి తెరపడింది. చివరగా రాయల్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు విన్యాసాలతో అలరించాయి. వర్షం కారణంగా చాలా కార్యక్రమాలను కుదించి త్వరగా ముగించారు. బంగారు ఆకుల డిజైన్లలో బైబిల్ చార్లెస్ ప్రమాణస్వీకారం కోసం వాడిన బైబిల్‌ను ఆక్స్ఫర్డ్ ప్రెస్‌లో ప్రత్యేకంగా తయారు చే యించారు. బంగారు ఆకులు తదితర డిజైన్లతో తీర్చిదిద్దారు. అందులో దాదాపు 350 అచ్చు తప్పులను సరిచేసి మరీ కార్యక్రమం కోసం సిద్ధం చేశారు. అచ్చం 1611 నాటి కింగ్ జేమ్స్ బైబిల్లా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రాజు వెడలె... లండన్‌లోని వెస్ట్ మినిస్టర్స్ అబేలో శనివారం చార్లెస్ 3 పట్టాభిషేక కార్యక్రమం కన్నులపండువగా జరిగింది. 1066లో విలియం ద కాంకరర్కి ఇక్కడే పట్టాభిషేకం జరిగింది. నాటి నుంచీ ఈ కార్యక్రమం ఇక్కడే జరుగుతోంది. చార్లెస్, కెమిల్లా దంపతులు ఉదయం 11 గంటలకు బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి ప్రత్యేక బంగారు రథంలో ఊరేగింపుగా వెస్ట్ మినిస్టర్స్ అబేకు తరలి వెళ్లారు. ఈ రథాన్ని 1831 నుంచి ప్రతి పట్టాభిషేక వేడుకకూ ప్రత్యేకంగా వాడుతున్నారు. సైనిక సిబ్బంది గుర్రాలపై, కాలి నడకన రథాన్ని అనుసరించారు. వేలాదిగా ప్రజలు సెంట్రల్ లండన్ వీధుల నిండా బారులు తీరి రాజ దంపతులకు చేతులూపుతూ కన్పించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 2,200 మంది పై చిలుకు ఆహూతులు అబే వద్ద రాజ దంపతులకు స్వాగతం పలికారు. భారత్ తరఫున ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ ఖడ్ దంపతులు పాల్గొన్నారు. వారు కామన్వెల్త్ దేశాధినేతల వరుసలో కూర్చున్నారు. దూరదూరంగా హారీ రాచరికాన్ని వదులుకుని రాజ కుటుంబానికి దూరమైన చార్లెస్ రెండో కుమారుడు హారీ పట్టాభిషేక కార్యక్రమంలో అంటీ ముట్టనట్టుగా పాల్గొన్నారు. 10 వరుసల ఆవల మౌనంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయన భార్య మెగన్ మార్కెల్, ఇద్దరు పిల్లలు కార్యక్రమానికి రాకుండా అమెరికాలోనే ఉండిపోయారు. శనివారమే నాలుగో పుట్టినరోజు జరు పుకున్న కుమారుడు ఆర్చీ కోసం కార్యక్రమం ముగియగానే హారీ అమెరికా పయనమయ్యా రు. రాజ దంపతులు, అన్న విలియం తనను ఎన్నడూ సరిగా చూడలేదంటూ ఇటీవలి ఆత్మకథలో ఆయన తూర్పారబట్టడం తెలిసిందే. చార్లెస్ తమ్ముడు కూడా... రాచరిక హోదాను కోల్పోయిన చార్లెస్ తమ్ముడు ఆండ్రూ కూడా దూరంగా కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించడానికే పరిమితమయ్యారు. లైంగిక వేధింపుల కేసు తదితరాల్లో చిక్కడంతో ఆండ్రూ రాచరికపు హోదాలను తల్లి ఎలిజబెత్ తొలగించారు. 𝐓𝐡𝐞 𝐂𝐫𝐨𝐰𝐧𝐢𝐧𝐠 𝐨𝐟 𝐓𝐡𝐞 𝐊𝐢𝐧𝐠 The Archbishop of Canterbury places St Edward’s Crown on The King’s anointed head. The clergy, congregation and choir all cry ‘God Save The King’.#Coronation pic.twitter.com/kGrV3W0bky — The Royal Family (@RoyalFamily) May 6, 2023 look at camilla she can’t believe what her and charles have gotten away with and that smirk says it all #Coronation pic.twitter.com/gtQ9rIGiEj — ᴀᴅᴇʏᴇᴍɪ 🚩 (@LE4NDROAI) May 6, 2023 చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ -
రాజుగా చార్లెస్–3 పట్టాభిషేకం.. మేఘన్-హ్యారీ రాకపై కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అయితే, చార్లెస్–3 పట్టాభిషేకం సందర్బంగా అందరి ఫోకస్ రాజకుటుంబం మీదే ఉంది. ఈ నేపథ్యంలో, రాచరికాన్ని వదులుకున్న చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ ఈ కార్యక్రమానికి వస్తారా..? లేదా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాగా, ఈ విషయంపై బకింగ్ హామ్ ప్యాలెస్ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. పట్టాభిషేక మహోత్సవానికి హ్యారీ వస్తున్నట్లు తెలిపింది. అయితే మేఘన్ మాత్రం హాజరుకావడం లేదని అధికారికంగా ప్రకటించింది. ‘రాజు పట్టాభిషేక మహోత్సవానికి డ్యూక్ ఆఫ్ ససెక్స్ ప్రిన్స్ హ్యారీ హాజరవుతారు.. కానీ, ప్రిన్స్ ఆర్కీ, ప్రిన్సెస్ లిలిబెట్‌తో కలిసి డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ కాలిఫోర్నియాలోనే ఉండిపోతారు అని ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది’. ఇదిలా ఉండగా.. మేఘన్-హ్యారీ దంపతులకు ఇద్దరు సంతానం. ఆర్కీ, లిలిబెట్. అయితే, రాజు సింహాసనాన్ని అధిష్టించే వారసుల జాబితాలో ఆర్కీ ఆరోస్థానంలో ఉన్నారు. కింగ్ చార్లెస్ పట్టాభిషేకం రోజునే ఆ చిన్నారికి నాలుగేండ్లు పూర్తవుతాయి. ఇక, రాజకుటుంబంతో విభేధాల కారణంగా చార్లెస్ రెండో కుమారుడు ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్కెల్ రాజరికాన్ని వదులుకున్నారు. ఈ క్రమంలో బ్రిటన్ రాజకుటుంబంతో ప్రిన్స్ హ్యారీకి విభేధాలు వచ్చిన విషయం తెలిసిందే. భార్య ప్రేమ, వివాహ బంధం కోసం రాచరికాన్ని వదులుకున్న ప్రిన్స్ హ్యారీ బ్రిటన్ రాజకుటుంబానికి దూరమయ్యారు. ప్రస్తుతం అతను భార్య, పిల్లలతో అమెరికాలో స్థిరపడ్డారు. మరోవైపు.. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. Prince Harry will be attending the #coronation today, but Meghan Markle has remained in California with their children.https://t.co/LfDJkI6e7i pic.twitter.com/PQYLkr68tI — Newsweek (@Newsweek) May 6, 2023 ఇది కూడా చదవండి: వీడియో: రష్యా ప్రతినిధి కవ్వింపు.. ఉక్రెయిన్ ఎంపీ పంచ్‌ల వర్షం -
పట్టాభిషేకం వేడుకకు గుర్తుగా..రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు
లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌లో శనివారం కింగ్ చార్లెస్ 3కి పట్టాభిషేకం అట్టహాసంగా జరగనుంది. ఈ చారిత్రాత్మక వేడుకలో బ్రిటన్ రాజు దాదాపు రూ. 4 లక్షల కృతజ్ఞతా బహుమతులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఆ బహుమతులను పట్టాభిషేక పతకాల రూపంలో అందించనున్నారు. వీటిని యూకే ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ పట్టాభిషేకంలో సహకరించి, విజయవంతంగా పూర్తి అయ్యేలా మద్దతు ఇచ్చే ప్రతి ఒక్కరికి ఇవ్వనున్నట్లు బ్రిటన్ పేర్కొంది. తమ దేశంలో అత్యవసర సమయంలో సేవలందించే.. ఆర్మీ, పోలీసు, అగ్నిమాపక సిబ్బంది తదితర శాఖలకు సంబంధించిన సిబ్బందికి అందజేయనున్నట్లు భారత మూలాలు ఉన్న యూకే హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్మాన్ అన్నారు. తమ కొత్త రాజు పట్టాభిషేక మహోత్సవం సందర్భంగా..తమ దేశంలోని అత్యవసర సేవలందించే సిబ్బంది పాత్రను గుర్తించడమే గాక ఆ వేడుకకు గుర్తుగా ఈ కృతజ్ఞతా పతకాలను అందజేస్తున్నట్లు బ్రేవర్మాన్ అన్నారు. ఈ మేరకు బ్రేవర్మాన్ మాట్లాడుతూ..సాయుధ దళాలు, ఇతర ప్రభుత్వ ఉద్యోగుల అంకితభావం, నిస్వార్థ సేవ లేకుండా ఈ పట్టాభిషేకం విజయవంతం కాదని అన్నారు. ఈ పతకం వారి సేవకు, కృషికి గుర్తింపుగా దేశం తరుఫున కృతజ్ఞతా బహుమతి అని అన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి అందజేస్తారని చెప్పారు. ఈ పతకం ముందు భాగంలో రాజు, రాణి డబుల్ పోర్ట్రెయిట్ ఉంటుంది. దీన్ని మార్టిన్ జెన్నింగ్స్ రూపొందించారు. ఈ పతకాలను బర్మింగ్‌హామ్‌లోని వోర్సెస్టర్షైర్ మెడల్ సర్వీస్ లిమిటెడ్ తయారు చేసింది. ఈ పతకం మా సాయుధ దళాలు, చక్రవర్తి మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి అద్దంపడుతుందన్నారు బ్రిటన్ రక్షణ కార్యదర్శి బెన్ వాలెస్. పట్టాభిషేకమహోత్సవ పతకాల సంప్రదాయం 1603 లో కింగ్జేమ్స్ హయాం నాటిదని చెప్పారు. ఈ వేడుకలో మొత్తం 4 లక్షల మందికి ఈ పట్టాభిషేక పతకాలు అందుకుంటారని బెన్ వాలెస్ చెప్పారు. ఈ మహోత్సవానికి ప్రపంచ దేశాల నుంచి అతిరథమహారథులకే గాక నిస్వార్థపూరితంగా పనిచేసి ఆయా విభాగాల్లో పేరుగాంచిన ప్రముఖులకు సైతం బ్రిటన్ ఆహ్వానం పలికింది. (చదవండి: యూకే ‘స్థానికం’లో అధికార పక్షానికి ఎదురుదెబ్బ) -
నేడే చార్లెస్–3 పట్టాభిషేకం
లండన్: చరిత్రాత్మక ఘట్టానికి తెరలేచింది. బ్రిటన్ రాజుగా చార్లెస్–3 పట్టాభిషేక సంబరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో శనివారం ఆయనకు సంప్రదాయబద్ధంగా కిరీటధారణ చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. బీబీసీలో ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. ఎలిజబెత్–2 మృతితో ఆయన తనయుడు చార్లెస్–3 బ్రిటన్ రాజుగా ఇప్పటికే బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు లాంఛనంగా పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నారు. 74 ఏళ్ల చార్లెస్–3, 75 ఏళ్ల ఆయన భార్య కెమిల్లా శనివారం ఉదయమే గుర్రాలు పూన్చిన ప్రత్యేక బంగారు రథంలో బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెస్ట్‌మినిస్టర్ అబేకు చేరుకుంటారు. అక్కడ లాంఛనప్రాయంగా జరిగే కార్యక్రమాలు ముగిసిన అనంతరం రాజుకు, రాణికి కిరీటధారణ చేస్తారు. సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని చార్లెస్–3, సెయింట్ మేరీస్ కిరీటాన్ని కెమిల్లా ధరిస్తారు. ఈసారి కోహినూర్ వజ్రాన్ని ఈ కిరీటంలో చేర్చడంలేదు. కిరీటధారణ తర్వాత చరిత్రాత్మక కుర్చీలో రాజు, రాణి ఆసీనులవుతారు. 1953లో జరిగిన క్వీన్ ఎలిజబెత్–2 పట్టాభిషేక మహోత్సవానికి 8,000 మందిని ఆహ్వానించారు. చార్లెస్–3 పట్టాభి షేకానికి కేవలం 2,200 మందికి ఆహ్వానం పంపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితి దిగజారడం, జీవన వ్యయం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో రాజు పట్టాభిషేకం జరగడం సంప్రదాయంగా వస్తోంది. ఈసారి కొంత ఆధునికతను జోడించారు. ఇతర మతాలకు సైతం చోటు కల్పించారు. వివిధ మతాల గురువులు, పెద్దలు రాజును ఆశీర్వదించనున్నారు. హిందూమతం తరపున నరేంద్ర బాబూభాయి పటేల్ రాజుకు ఉంగరం అందజేస్తారు. బ్రిటన్ తొలి హిందూ ప్రధానమంత్రి రిషి సునాక్ బైబిల్ సూక్తులు చదివి వినిపిస్తారు. చార్లెస్–3 పట్టాభిషేక వేడుకలో పాల్గొనేందుకు వివిధ దేశాల అధినేతలు, దేశ విదేశీ అతిథులు లండన్‌కు చేరుకుంటున్నారు. భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ దంపతులు శుక్రవారం లండన్‌కు చేరుకున్నారు. బ్రిటిష్ ఎంపైర్ మెడల్(బీఈఎం) స్వీకరించినవారిని ఈ పట్టాభిషేకానికి ఆహ్వానించారు. ఇలా ఆహ్వానం అందుకున్న వారిలో భారత సంతతికి చెందిన పాకశాస్త్ర ప్రవీణురాలు మంజు మాల్హీ కూడా ఉన్నారు. పట్టాభిషేకం సందర్భంగా జరిగే సైనిక పరేడ్‌లో బ్రిటిష్ సైనికులతోపాటు కామన్వెల్త్ దేశాల జవాన్లు కూడా పాల్గొంటారు. 7,000 మంది జవాన్లతో జరిగే కవాతు కనువిందు చేయనుంది. -
బ్రిటన్‌లో రాజుగారి ఏలుబడి!
మరికొన్ని గంటల్లో బ్రిటన్ రాజుగా ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జి మౌంట్‌బాటన్ (చార్లెస్–3) పట్టాభిషిక్తుడు కాబోతున్నారు. ఒకప్పుడు ‘రవి అస్తమించని సామ్రాజ్యం’గా ప్రపంచపటంలో ధగ దగలాడిన బ్రిటన్ నేడు తానున్న యూరప్ ఖండంలో కూడా ఒంటరి పయనం సాగించడాన్ని ఎంచుకున్న చిన్న దేశంగా మిగిలిపోయింది. ఆ దేశంలో 18వ శతాబ్దంలోనే రాచరికం నామమాత్రంగా మిగిలి సర్వాధికారాలూ పార్లమెంటుకు బదిలీ అయ్యాయి. మరో మూడు శతాబ్దాలు గడి చినా అది తన గత వైభవానికీ, అగమ్యగోచరమైన భవిష్యత్తుకూ మధ్య ఊగిసలాడుతూనే ఫ్యూడల్ అవశే షమైన సంప్రదాయాలనూ, లాంఛనాలనూ వదులుకోవటానికి ఏమాత్రం సిద్ధపడటంలేదని శనివారంనాటి పట్టాభిషేకం రుజువుచేయబోతోంది. ఆరు గుర్రాలు పూన్చిన రథంలో ముందే నిర్దే శించిన సెంట్రల్ లండన్ వీధులగుండా వెస్ట్ మినిస్టర్ అబీగా పిలిచే సెయింట్ పీటర్ చర్చిలో ఉదయం 11 గంటలకల్లా చార్లెస్ ప్రవేశించి ఏడువందల ఏళ్లనాటి సింహాసనాన్ని అధిష్టిస్తారు. ‘గాడ్ సేవ్ ద కింగ్ చార్లెస్’ అనే ఆశీర్వచనంలాంటి నినాదం మార్మోగుతుండగా మణులు, మాణిక్యాలు, కెంపులు, గోమేధికాలు, గరుడపచ్చలు పొదిగిన దాదాపు నాలుగు వందల ఏళ్లనాటి బంగారు కిరీటం ఆయన శిరస్సును అలంకరిస్తుంది. ఈ పట్టాభిషేక తంతులో కాలం గడిచేకొద్దీ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు మొత్తంగా చర్చి ఆఫ్ ఇంగ్లండ్ ఆధిపత్యమే ఉండే ఆ కార్యక్రమంలో ఇప్పుడు భిన్న మతవిశ్వాసాల ఆచార్యులుంటున్నారు. కేవలం సంపన్నులకూ, దేశా ధినేతలకూ మాత్రమే ప్రవేశముండే ఆ కార్యక్రమంలో సాధారణ పౌరులకు కూడా చోటుదక్కుతోంది. దాంతోపాటే ఒకనాడు పట్టాభిషేక సందర్భంలో ఇంటింటా పండుగ వాతావరణం కనబడిన చోటే ‘ఎందుకిదంతా?’ అనే ప్రశ్నలు మొలకెత్తడం కూడా మొదలైంది. రాచ రికాన్ని వదుల్చుకుంటే తప్ప బ్రిటన్ సంపూర్ణ ఆధునికతను సంతరించుకోదన్న వాదనలు కూడా వినబడుతున్నాయి. ఫ్యూడల్ చిహ్నమైన రాచరికం స్థానంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయ్యే రాజ్యాధినేత ఉండటం వర్తమాన అవసరమని అటువంటివారు వాదిస్తున్నారు. ‘రాచరికంలోకి ఒక్కసారి తొంగి చూశామా.. దాన్ని కీర్తించటం అసాధ్యం’ అని బ్రిటన్ రాజ్యాంగనిపుణుడు వాల్లర్ బాజెట్ ఒకప్పుడు అననే అన్నారు. అయితే ప్రపంచంలో బ్రిటన్ రాచరికం ఏకాకి కాదు. మరో 28 దేశాల్లో కూడా ఆ వ్యవస్థలే వర్థిల్లుతున్నాయి. అందులో పూర్తి స్థాయి నియంత్రణాధికారాలుండే రాజులు మొదలుకొని సగం సగం అధికారాలతో సరిపెట్టుకొనేవారూ, పూర్తి అలంకారప్రాయంగా మిగిలిపోయినవారూ కూడా ఉన్నారు. అలాగే తిరుగులేని సంపదలతో తులతూగేవారూ, ప్రభుత్వాలు దయతో ఇచ్చే జీతభత్యా లతో సరిపుచ్చుకునే రాజులు కూడా ఉన్నారు. లాంఛనప్రాయపు హోదాయే కావొచ్చుగానీ చార్లెస్ ఒక్క బ్రిటన్‌కు మాత్రమే కాదు... మరో 14 దేశాలకు సైతం రాజ్యాధిపతిగా కొనసాగుతారు. ప్రపంచంలోని ఇతర దేశాల మాట అటుంచి సంపన్న దేశాల క్లబ్ అయిన జీ–7లో కూడా బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ నాసిరకమైనదే. అక్కడ ప్రస్తుతం ‘జీవన వ్యయ సంక్షోభం’ రాజ్యమేలుతోంది. తడిసిమోపడయ్యే వడ్డీ రేట్లతో, భరింపశక్యంకాని ద్రవ్యోల్బణంతో, ఆకాశాన్నంటే ఇంధన ధరలతో అక్కడి జనం ఈసురోమంటున్నారు. గత ఇరవైయ్యేడేళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వడ్డీరేట్లు పెరిగిపోయాయి. ఈ ఏడాది ఆఖరువరకూ అది కోలుకునే అవకాశం లేదని ఆర్థిక నిపుణులంటున్నారు. ప్రస్తుతం నిరుద్యోగిత 3.9 శాతం. దాదాపు 13 లక్షలమంది పౌరులు ఉపాధి కోల్పోయారని జాతీయ గణాంకాల విభాగం గత నెలలో తెలిపింది. సగటున ప్రతి అయిదుగురు బ్రిటన్ పౌరు ల్లోనూ ఒకరు పేదరికంలో కూరుకుపోయారని గణాంకాలు కోడై కూస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. చాలీచాలని ఆదాయాలతో అర్థాకలితో నెట్టుకొచ్చే కుటుంబాలూ.. దాతృత్వ సంస్థల సాయంతో, చర్చిల ఆధ్వర్యంలో నడిచే ఫుడ్ బ్యాంకులపై ఆధారపడుతున్న కుటుంబాలూ ఎక్కువేనని ఒక అంచనా. అందుకే కాబోలు ఈసారి పట్టాభిషేక మహోత్సవ కార్య క్రమంలో అట్టహాసాలు తగ్గించాలని నిర్ణయించారు. కార్యక్రమం నిడివి బాగా తగ్గిపోగా, అతిథుల జాబితా కూడా చిన్నబోయింది. అయితే ఈ కార్యక్రమానికయ్యే మొత్తం వ్యయం ఎంతో చెప్పటం వెంటనే సాధ్యం కాకపోయినా అది ఎలా చూసినా 12.5 కోట్ల డాలర్లకు తగ్గకపోవచ్చని మీడియా లెక్కలేస్తోంది. వర్తమాన చేదు వాస్తవాలనూ, సంక్లిష్టతలనూ పరిగణనలోకి తీసుకోకుండా భూత కాలం చూరుపట్టుకుని వేళ్లాడటం ఇంకా ఎన్నాళ్లని పలువురు ప్రశ్నించటానికి ఇలాంటి కథనాలు కారణం కావొచ్చు. నెపోలియన్‌తో సాగిన వరస యుద్ధాల పరంపరలో గెల్చామన్న సంబరంతో బ్రిటన్ 1821లో నాలుగో జార్జి పట్టాభిషేకాన్ని కనీవినీ ఎరుగనంత ఘనంగా జరుపుకుంది. దానిపై విమర్శకులు విరుచుకుపడటంతో మరో పదేళ్లకు 1831లో అతని వారసుడు నాలుగో విలియం మాత్రం అతి నిరాడంబరంగా, క్లుప్తంగా పట్టాభిషేకం తంతు ముగించారు. మొత్తానికి ఏడుపదుల కాలం తర్వాత బ్రిటన్‌లో పట్టాభిషేక మహోత్సవం జరగబోతోంది. రాచరికంపై దేశ పౌరుల్లో ఉండే వ్యతిరేకత కనుమరుగు కావటం, కనీసం అభ్యంతరాలు వ్యక్తం కాకపోవటం అనేవి చార్లెస్ వ్యవహారశైలిపై ఆధారపడివుంటాయి. ఆయన శనివారం ధరించబోయే కిరీటం బరువు 5 పౌండ్లు (సుమారు 2.27 కిలోలు). కానీ ‘మూడో చార్లెస్’గా ఆయనపై ఉండ బోయే బాధ్యతల బరువు అంతకన్నా అనేక రెట్లు ఎక్కువ. దాన్ని ఆయన సమర్థవంతంగా నిర్వహించగలిగితే చరిత్రలో ఆయన స్థానం పదిలంగా ఉంటుంది. -
కింగ్ చార్లెస్ పట్టాబిషేకం కోసం ముంబై డబ్బావాలాలు గిఫ్ట్‌లు కొనుగోలు!
సాక్షి, ముంబై: ముంబైలోని డబ్బావాలాల సేవలు గురించి అందరికీ తెలిసిందే. వారు కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు, స్కూల్‌కి వెళ్లే పిల్లలకు లంచ్ బాక్స్‌లు అందిస్తుంటారు. వారికి బ్రిటన్ రాజు చార్లెస్ పట్టాభిషేక మహోత్సవానికి ఆహ్వానం అందడం విశేషం. అందుకోసం అని వారు పుణెగిరి పగడి, వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను కొనుగోలు చేశారు. పుణేగిరి పగడి అనేది తలపాగా. దీన్ని పూణేలో గౌరవ చిహ్నంగానూ, గర్వంగానూ భావిస్తారు. అంతేగాదు ఇక్కడి తలపాగాకి భౌగిళిక హోదా లభించింది కూడా. ఇక్కడి ముంబై డబ్బావాలాలకు బ్రిటీష్ ఎంబసీ ద్వారా ఆహ్వానాలు అందినట్లు మీడియాకి తెలిపారు. ఈ మేరకు ముంబై డబ్బావాలాస్ ప్రతినిధి విష్ణు కల్డోక్ మాట్లాడుతూ.. తమలోని ఇద్దరు డబ్బావాలాలకు ఆహ్వానం అందిందన్నారు. అదీగాక బ్రిటీష్ రాయల్టీతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అతను రాజు కాబోతున్నాడు కాబట్టి కింగ్ చార్లెస్‌కి పుణేరి పగడి తోపాటు వార్కారీ కమ్యూనిటీకి చెందిన శాలువాను గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాం అని డబ్బావాలా ప్రతినిధి విష్ణు కల్డోక్ అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. కాగా, ఈ ముంబైలోని డబ్బావాలాలు నగరంలో లంచ్‌బాక్స్ డెలివరీ చేయడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచారు. #WATCH | Maharashtra: Mumbai's Dabbawalas purchase gifts - Puneri Pagadi & a shawl of the Warkari community - for Britain's King Charles III, ahead of his coronation ceremony on May 6. They say that they have been sent invitations by British Consulate, British Embassy. pic.twitter.com/88RlOhxidQ — ANI (@ANI) May 2, 2023 (చదవండి: శరద్ పవార్ రాజీనామా: పారిశుధ్య కార్మికుడి విజ్ఞప్తి.. సుప్రియా సూలే ఆసక్తికరమైన వీడియో) -
London: పట్టాభిషేకం వేళ లండన్‌లో కలకలం
లండన్: కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ.. లండన్ బకింగ్హమ్ ప్యాలెస్ వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ప్యాలెస్ గేటు వద్దకు చేరుకున్న ఓ వ్యక్తి.. ప్యాలెస్ మైదానంలోకి కొన్ని వస్తువులను విసిరేశాడు. అందులో తుపాకీ మందుగుండు shotgun cartridges కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన కింగ్ ఛార్లెస్III పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుర్తు తెలియని ఓ వ్యక్తి.. భారీ భద్రతను దాటుకుని గేట్ వద్దకు చేరుకున్నాడు. తన బ్యాగులో ఉన్న వస్తువులను ప్యాలెస్ వైపు విసరడం ప్రారంభించాడు. అయితే అవి ప్యాలెస్ గ్రౌండ్లో పడిపోయాయి. సకాలంలో గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. అయితే ఆ బ్యాగులో ఓ ఆయుధం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు లాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు? అలా చేశాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ఆగంతకుడి దాడి సమయంలో.. ఛార్లెస్(74), ఆయన భార్య కామిల్లా(75) ప్యాలెస్‌లోనే ఉన్నారా? అనేదానిపై బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు స్పందించ లేదు. శనివారం జరగబోయే పట్టాభిషేక మహోత్సవం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్‌కు వెళ్లే దారులను జల్లెడ పడుతూ.. కొన్ని మాల్స్‌ను తాత్కాలికంగా మూయించేస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రిటన్‌లో పట్టాభిషేకం జరుగుతోంది. కిందటి ఏడాది క్వీన్ ఎలిజబెత్-2 మరణించగా.. ఆమె తనయుడు ఛార్లెస్(Charles 3)ని రాజుగా ప్రకటించింది రాజప్రసాదం. అయితే పట్టాభిషేకం మాత్రం దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు జరుగుతోంది. సెంట్రల్ లండన్ మీదుగా నో-ఫ్లై జోన్‌ను ప్రకటించడంతో పాటు రూఫ్‌టాప్ స్నిపర్, రహస్య అధికారులు, అలాగే ఎయిర్పోర్ట్-స్టైల్ స్కానర్లు, స్నిఫర్ డాగ్‌లతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: 18 ఏళ్లుగా ఒక్క మరక కూడా లేకుండా.. -
చార్లెస్–3 పట్టాభిషేకంలో... విశేషాలెన్నో!
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది... ► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది. ► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది. ► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఐదు దశల్లో... ► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది. ► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. ► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు. ► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్‌కు రాజముద్రిక అందజేస్తారు. ► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు. ► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. ► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు. ► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది. ► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం! ► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు. రూ.1,000 కోట్ల ఖర్చు ► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది! ► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Prince Harry: మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోని విభేధాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. మే 6వ తేదీన జరగబోయే కింగ్ ఛార్లెస్ Charles III పట్టాభిషేకం కోసం ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలో.. ప్రిన్స్ హ్యారీ రాక గురించి ఆసక్తి నెలకొంది. అయితే అయిష్టంగానే ఆయన ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారని తెలుస్తోంది. తండ్రి ఛార్లెస్ పిలుపు మేరకు ప్రిన్స్ హ్యారీ పట్టాభిషేకానికి హాజరు అవుతారని, కానీ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతారని రాజకుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తులు చెబుతున్నారు. ప్రిన్సెస్ డయానా దగ్గర బట్లర్‌గా పని చేసిన పాల్ బరెల్.. ప్రస్తుతం రాజకుటుంబంలోని వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఆయన తాజా పరిణామాలపై స్పందించారు. ఛార్లెస్, విలియమ్-హ్యారీల మధ్య సయోధ్య ఇప్పట్లో జరగకపోవచ్చు. పట్టాభిషేక కార్యక్రమంలో వాళ్ల మధ్య కనీసం మాటలు కూడా ఉండకపోవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు. తండ్రిపై గౌరవంతో.. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ హోదాలో కేవలం ముఖం చూపించేందుకు మాత్రమే హ్యారీ అక్కడికి వెళ్లే అవకాశం ఉంది. అంతేగానీ ఆ కుటుంబంలో మళ్లీ కలిసిపోవడానికి ఎంత మాత్రం కాదు అని పేర్కొన్నారు పాల్. ఇక మూడు రోజులు పాటు జరిగే పట్టాభిషేక మహోత్సవంలో కేవలం సింహాసనాన్ని అధిష్టించే కార్యక్రమం నాడు మాత్రమే ప్రిన్స్ హ్యారీ హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు 24 గంటలు గడవక ముందే ఆయన యూకేను విడిచి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాదు పట్టాభిషేక సమయంలో ముందు వరుసలో కాకుండా.. దూరంగా ఎక్కడో పదో వరుసలో ఆయన కూర్చుంటారని సమాచారం. అయితే ఆయన భార్య మేఘన్ మార్కే హాజరుపై మాత్రం స్పష్టత లేదు. క్వీన్ ఎలిజబెత్-2 మరణం అనంతరం రాజుగా పగ్గాలు చేపట్టిన ఛార్లెస్-3.. ఇప్పుడు ఎనిమిది నెలల తర్వాత పట్టాభిషేకం జరుపుకోబోతున్నారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి ఆయన 40వ చక్రవర్తి. ఆయన రెండో భార్య క్యామిల్లా యూకే రాణిగా బాధ్యతలు చేపట్టనుంది. అయితే.. పూర్తిస్థాయి మహారాణి హోదా కాదు. ఆ తరహా హోదాతో కూడిన క్వీన్ కాన్సోర్ట్ మాత్రమే. అంటే నామమాత్రపు మహారాణిగా బకింగ్హమ్ ప్యాలెస్‌లో ఆమె నివసించనున్నారు. రాజకుటుంబంలో ఏం జరిగింది? భార్యలు రాజేసిన చిచ్చు భగ్గున మండి.. -
ఆస్ట్రేలియా కరెన్సీపై బ్రిటిష్ రాజరికం కనుమరుగు
కాన్బెర్రా: ఆస్ట్రేలియా మరో బ్రిటిష్ వలసపాలన తాలూకు గుర్తును చెరిపేసుకుంటోంది. అక్కడి 5 ఆస్ట్రేలియా డాలర్ల కరెన్సీ నోటుపై ఇన్నాళ్లూ బ్రిటిష్ రాణి ఎలిజబెత్ ముఖచిత్రాన్ని ముద్రించారు. రాణి ఎలిజబెత్ అస్తమయం తర్వాత రాజుగా పగ్గాలు చేపట్టిన కింగ్ ఛార్లెస్ ముఖచిత్రాన్ని 5 డాలర్ల కరెన్సీ నోటుపై ముద్రించాలని భావించట్లేదని ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్ తాజాగా ప్రకటించింది. అయితే, ఛార్లెస్ ఫొటో ఉండే కొత్త నాణేలను మాత్రం ఈ ఏడాది చివరిలోపు చలామణిలోకి తీసుకురానున్నారు. ఇన్నాళ్లూ ఒక్క 5 డాలర్ల నోటుపైనే బ్రిటిష్ రాజరిక ఆనవాళ్లు ఉండేవి. ఎలిజబెత్ ఫొటో తొలగింపుతో నోట్లపై నామరూపాలు పోయినట్లే. ఈ మార్పుపై ప్రభుత్వంతో చర్చించాకే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్ వెల్లడించింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్ రాజరికమే అత్యున్నత పరిపాలన హోదాలో ఉంది. కానీ మారిన వర్తమాన రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఆ రాజరికం కేవలం అలంకారప్రాయంగా తయారైంది. ‘కొత్త నోటుకు ఒకవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్, మరో వైపు ఆస్ట్రేలియా తొలితరం స్థానికుల లేదా దేశ అద్భుత ప్రకృతి అందాల ఫొటోను పొందుపరుస్తాం’ అని ఆర్థిక మంత్రి జిమ్ చామర్స్ అన్నారు. కరెన్సీపై రాజరికాన్ని వదలుకోవడంపై అక్కడి రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గణతంత్రదేశంగా ఆవిర్భవించే ప్రయత్నం చేస్తోందని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు. -
నా అన్న కాలర్ పట్టి కొట్టాడు: ప్రిన్స్ హ్యారీ
శాక్రమెంటో: బ్రిటన్ రాజకుటుంబంలో కుటుంబ కలహాలు సమసిపోయి అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో.. మరో పరిణామం చోటు చేసుకుంది. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, ప్రిన్స్ హ్యారీ సంచలనాలకు తెర తీశాడు. తన ఆత్మకథ ‘స్పేర్’ ద్వారా బయటి ప్రపంచానికి రాజ‘కుటుంబ’ కలహాలను పూసగుచ్ఛినట్లు వివరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన అన్న, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన విలియమ్ తనపై భౌతిక దాడికి దిగాడని, అందుకు తన భార్య మేఘన్ మార్కెల్ కారణమని చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడు. ది గార్డియన్ కథనం ప్రకారం.. స్పేర్ ఆత్మకథలోని ఆరో పేజీలో ప్రిన్స్ హ్యారీ ఈ విషయాన్ని తెలియజేశాడు. మేఘన్ మార్కెల్ విషయంలో తన అన్నతో తనకు వాగ్వాదం జరిగిందని, పట్టరాని కోపంతో విలియమ్ తనపై దాడికి దిగాడని హ్యారీ అందులో పేర్కొన్నాడు. మేఘన్ స్వభావాన్ని ఉద్దేశించి విలియమ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. తన భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆమెకు మద్దతుగా హ్యారీ ఏదో సర్ది చెప్పబోయాడట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన విలియమ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ గల్లా పట్టుకుని.. మరో చేత్తో మెడలో గొలసును లాగిపడేశాడు. హ్యారీని నేలకేసి కొట్టాడు. కింద.. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. కష్టంగానే పైకి లేచిన ప్రిన్స్ హ్యారీ.. బయటకు వెళ్లిపోమని విలియమ్ మీదకు అరిచాడు. కోపంగానే విలియమ్ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతా చాలా వేగంగానే జరిగింది. ఈ ఘటనలో హ్యారీ వీపునకు అయిన గాయం మానడానికి నెలలు పట్టింది అని ఆ కథనం ఆ పేజీ సారాంశాన్ని తెలిపింది. ఇంకా ఈ బుక్.. ఎన్నో ఆసక్తికరమైన, రాజకుటుంబం నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తేనుందని గార్డియన్ కథనం పేర్కొంది. జనవరి 10వ తేదీన స్పేర్ మార్కెట్లోకి రీలీజ్ కానుంది. గత సెప్టెంబర్‌లో తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం, ఈ మే నెలలో తండ్రి కింగ్ ఛార్లెస్-3కి పట్టాభిషేకం దరిమిలా.. మధ్యలో ఈ అన్నదమ్ముల ఘర్షణ గురించి వెలుగులోకి రావడం, అదీ హ్యారీ ఆత్మకథ ద్వారా కావడం ఇక్కడ గమనార్హం. కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను.. ఆ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోంది!. 2020లో రాజరికాన్ని, బ్రిటన్ వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. ఆ సమయం నుంచే ఆ అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే.. 2021లో ఈ ఆలుమగలు ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించడం ద్వారా రాజకుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ల వాళ్ల భార్యల మధ్య కలహాలు వెలుగులోకి రావడం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి కూడా. -
బ్రిటన్ రాజుకు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ మంగళవారం బ్రిటన్ రాజు చార్లెస్–3తో ఫోన్లో మాట్లాడారు. వాతావరణ మార్పులు, జీవవైవిధ్య పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగంలో వినూత్న ఆవిష్కరణలు వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో)తెలిపింది. 27న ప్రధాని మోదీ ‘పరీక్షా పే చర్చా’ ఈ నెల 27వ తేదీన వార్షిక ‘పరీక్షా పే చర్చా కార్యక్రమం జరగనుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో మోదీ మాట్లాడనున్నారు. ఢిల్లీలోని తల్కటోరా ఇండోర్ స్టేడియంలో 6వ విడత పరీక్షా పే చర్చా జరగనుందని కేంద్ర విద్యాశాఖ మంగళవారం ట్వీట్ చేసింది. ఇదీ చదవండి: నెతన్యాహుకు ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ -
కింగ్ చార్లెస్-3 ఫొటోతో కొత్త కరెన్సీ నోట్లు.. ఫొటోలు వైరల్..
లండన్: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్-III ఫొటోలతో కూడిన కొత్త కరెన్సీ నోట్లను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మంగళవారం విడుదల చేసింది. ప్రస్తుతం వీటి ముద్రణ జరుగుతోంది. 2024 జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి. అయితే చార్లెస్ ఫొటో ఉన్న కొత్త 5, 10, 20, 50 యూరో నోట్లు క్షణాల్లోనే సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈయన ఫొటోతో ఒక నాణేన్ని కూడా విడుదల చేశారు. దాదాపు 70 ఏళ్లు బ్రిటన్ రాణిగా ఉన్న క్వీన్ ఎలిజబెత్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. దీంతో ఆయన కుమారుడు చార్లెస్-3 కొత్త రాజు అయ్యారు. బ్రిటన్‌లో రాజు లేదా రాణి ఫొటోలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తారు. కొత్త నోట్లు అందుబాటులోకి వచ్చాక పాత నోట్లు కూడా చెల్లుతాయని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ స్పష్టం చేసింది. రాణి ఫొటోలు ఉన్న కరెన్సీ నోట్లు మొత్తం బ్యాంకులకు చేరుకునేందుకు సమయం పడుతుందని చెప్పింది. కొత్త నోట్లపై కింగ్ చార్లెస్ ఫొటో మాత్రమే మారింది. మిగతా డిజైన్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
వీడియో: బ్రిటన్ రాజు చార్లెస్-3కు చేదు అనుభవం.. ఇలా జరిగిందేంటి?
King Charles III.. ఏడు దశాబ్దాల పాటు బ్రిటన్ను పాలించిన క్వీన్ ఎలిజిబెత్-2 మరణంలో ఇటీవలే బ్రిటన్ నూతన రాజుగా చార్లెస్-3 బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా బ్రిటన్ రాజు చార్లెస్-3కి చేదు అనుభవం ఎదురైంది. నిరసనకారులు చార్లెస్-3 పైకి కోడిగుడ్లు విసిరారు. వివరాల ప్రకారం.. చార్లెస్- 3 ఉత్తర ఇంగ్లాండ్‌లోని యార్క్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన భార్య కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడకకు హాజరైన వారిని కలిసి అక్కడ కొందరితో చార్లెస్-3 షేక్ హ్యాండ్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో చార్లెస్-3కి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. అక్కడే జన సమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనపైకి కోడి గుడ్లు విసిరాడు. దీంతో, ఒక్కసారిగా చార్లెస్ దంపతులు షాకయ్యారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు.. చార్లెస్-3ని కవర్‌చేశారు. అనంతరం.. నిరసనకారుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, కోడిగుడ్లు చార్లెస్ చేతికి తగిలాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక, చిన్న చిన్న విషయాలకే ఆగ్రహం వ్యక్తం చేసే ప్రిన్స్ చార్లెస్.. ఈ ఘటన సందర్భంగా మాత్రం ప్రశాంతంగా కనిపించడం విశేషం. King Charles III and Camilla, Queen Consort, were visiting the city of York on Wednesday when a protester hurled at least three eggs at them while shouting “this country was built on the blood of slaves.” https://t.co/mMIuTG2JKZ pic.twitter.com/KiqLDnz63x — The Washington Post (@washingtonpost) November 9, 2022 -
బ్రిటన్‌లో అమర్ అక్బర్ ఆంటోనీ..! మూడు పదవుల్లో ఆ ముగ్గురు
లండన్: మందిరం, మసీదు, చర్చి.. మత సామరస్యం వెల్లి విరిసేలా ఈ మూడు పక్క పక్కనే ఉంటే ఎంతో హృద్యంగా ఉంటుంది కదా. ఇప్పుడలాంటి దృశ్యమే బ్రిటన్‌లో ఆవిష్కృతమైంది. ఒక్కో మతానికి చెందిన వారు ఒక్కో పదవిలో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాను తలపిస్తున్నారు. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్–3 క్రిస్టియన్. లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ముస్లిం. 2016లో నగర తొలి ముస్లిం మేయర్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన బస్సు డ్రైవర్ కుమారుడైన సాదిక్ లండన్ లా వర్సిటీ నుంచి న్యాయవాద పట్టా తీసుకొని దశాబ్దానికి పైగా మానవ హక్కుల లాయర్‌గా పనిచేశారు. ఇప్పుడు భారతీయ మూలాలున్న హిందువు రిషి ప్రధాని అయ్యారు. హిందువునని చెప్పుకోవడానికి గర్విస్తానని రిషి ప్రకటించుకున్నారు. మూడు మతాలకు చెందిన ముగ్గురు బ్రిటన్‌లో కీలక హోదాల్లో ఉండటం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. మళ్లీ హోం మంత్రి బ్రేవర్మన్ ప్రధాని కాగానే సునాక్ తన కేబినెట్‌కు టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. భారతీయ మూలాలున్న సుయెల్లా బ్రేవర్‌మాన్‌ను మళ్లీ హోం మంత్రిగా నియమించారు. ఆర్థికమంత్రి జెరేమీ హంట్‌ను కొనసాగించనున్నారు. తనకు సానుకూలంగా కాకపోయినా విదేశాంగ మంత్రి జేమ్స్ క్లవర్లీనీ కొనసాగిస్తున్నారు. జాన్సన్ హయాంలో ఉపప్రధాని, న్యాయ మంత్రిగా పనిచేసిన డొమినిక్ రాబ్‌ను అవే పదవుల్లో నియమించనున్నారు. మంత్రిత్వ శాఖ వ్యవహారాలు చూసే భారతీయ మూలాలున్న ఎంపీ అలోక్ మిశ్రా తన పదవి నుంచి తప్పుకుంటున్నారు. చదవండి: ముందున్నది ముళ్లదారే.. రిషికి అంత ఈజీ కాదు..! -
Rishi Sunak: బ్రిటన్ కొత్త ప్రధానిగా రిషి సునాక్
యూకే అధికారిక పార్టీ కన్జర్వేటివ్ తరపున ప్రధానిగా రిషి సునాక్ నియమితులయ్యారు. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నాం బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ 3తో భేటీ అనంతరం.. 10 డౌనింగ్ స్ట్రీట్ వద్ద రిషి సునాక్ ప్రసంగించారు. అంతకు ముందు లిజ్ ట్రస్.. కింగ్ ఛార్లెస్‌ను కలిసి ప్రధాని పదవికి(ఆపద్ధర్మ) తన రాజీనామాను సమర్పించారు. ప్రధానిగా తనకు మద్దతు ఉందని, కాబట్టి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని రిషి సునాక్, కింగ్ ఛార్లెస్-3ని కోరారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రిషిని కింగ్ ఛార్లెస్ ఆహ్వానించారు. దీంతో రిషి సునాక్‌ను బ్రిటన్ ప్రధానిగా నియమిస్తున్నట్లు కింగ్ ఛార్లెస్ తెలిపారు. ప్రధానిగా ట్రస్ తన వంతు ప్రయత్నం చేశారు. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తా. బ్రిటన్ ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టకుంటా. సంక్షోభం నుంచి బయటపడేందుకు కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు. మనం అద్భుతాలు సాధించగలం అంటూ బ్రిటన్ కొత్త ప్రధాని రిషి మీడియా ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. -
లండన్‌లో నిరసనలు...కింగ్ చార్లెస్ ముఖంపై కేక్ విసిరి...
లండన్‌లో ఆయిల్ స్టాప్ అంటూ నిరసనలు వెలువెత్తాయి. ఈ నిరసనల నేపథ్యంలోనే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లోని కింగ్ చార్లెస్ 3 మైనపు విగ్రహాన్ని ఇద్దరు వాతావరణ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం లండన్ ప్రభుత్వం కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లు అనుమతివ్వడంపై పలు ప్రాంతాల్లో వాతావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఇద్దరు వాతావరణ కార్యకర్తలు తాము ధరించిన నల్లని చొక్కాలను తీసేసి ...జస్ట్ స్టాప్ ఆయిల్ అని రాసి ఉన్న టీ షర్ట్‌లను ధరించి కింగ్ చార్లెస్ మైనపు విగ్రహం ముంఖంపై చాక్లెట్ కేక్ విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. అంతేగాదు ఆ నిరసకారులు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ....ప్రభుత్వం ఆదేశించిన అన్ని కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు దీంతో ఈ ఘటనపై స్పందించిన మెట్రోపాలిటన్ పోలీసులు నిరసకారులు నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇటీవల గత కొద్ది రోజులుగా లండన్‌లో పలు చోట్ల ఈ జస్ట్ స్టాప్ ఆయిల్ నిరసనలు అధికమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. 🎂 BREAKING: JUST STOP OIL CAKES THE KING 🎂 👑 Two supporters of Just Stop Oil have covered a Madame Tussauds waxwork model of King Charles III with chocolate cake, demanding that the Government halts all new oil and gas licences and consents.#FreeLouis #FreeJosh #A22Network pic.twitter.com/p0DJ8v3XVB — Just Stop Oil ⚖️💀🛢 (@JustStop_Oil) October 24, 2022 (చదవండి: అమెరికా వైట్‌హౌస్‌లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్) -
ప్రిన్స్ మీ వయసెంత...చార్లెస్‌ని ప్రశ్నించిన చిన్నారి: వీడియో వైరల్
సామాజిక శ్రేయస్సును ప్రోత్సహించే ప్రజల సంస్థ అయిన జీరో వాల్తామ్స్టోవ్ను సందర్శించడానికి చార్లెస్ 3 తూర్పు లండన్‌కి వెళ్లారు. అక్కడ ఆయన బార్న్ క్రాఫ్ట్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులను కలిశారు. వారితో రాజు కాసేపు ఆనందంగా ముచ్చటించాడు. చార్లెస్ ఆ విద్యార్థులతో సెలవులు గురించి, లంచ్ సమయం గురించి కొన్ని కుశల ప్రశ్నలు వేశారు. ఆ చిన్నారుల్లో ఒకరు ప్రిన్స్ అంటూ జెండా ఊపుతూ చార్లెస్‌ని ఉత్సహాపరిచాడు. మరో చిన్నారి చార్లెస్‌ని మీ వయసు అంతా అని ముద్దుగా అడిగింది. ఆ చిన్నారి చిలిపి ప్రశ్నతో అక్కడ ఉన్న టీచర్లు, చార్లెస్ ముఖాల్లో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. దీనికి చార్లెస్ తనదైనా శైలిలో గెస్ చేయండి అని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇలాంటి చమత్కర ప్రశ్నలకు తనదైన హాస్యాని చార్లెస్ పండించడం మొదటిసారి కాదు. ఇంతకుముందు కామెన్వెల్త్ గేమ్ 2022 ప్రారంభోత్సవ వేడుకల్లో ఒక వ్యక్తి మనం బీర్ వద్దకు వెళ్లగలమా అని ప్రశ్నిస్తే ఇలానే హాస్యాన్ని పండించాడు. ఈ మేరకు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. First joint engagement for the King and Queen Consort in London with a visit to youth organisation @ProjectZeroWF1 King Charles keen to have a quick chat with primary school children about school lunches and school holidays on the way in pic.twitter.com/6fWx0iXV7P — Rhiannon Mills (@SkyRhiannon) October 18, 2022 (చదవండి: చికెన్ బిర్యానీ కోసం ఏకంగా రెస్టారెంట్‌ని తగలెట్టేశాడు) -
‘కోహినూర్’పై బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా?
లండన్: బ్రిటన్ మహారాణి ధరించే కిరీటంపై ఉండే 105 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానంతరం ఆ డిమాండ్లు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే క్వీన్ కెమెల్లా పార్కర్ బౌల్స్, కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన కాలం నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసినట్లవుతుందని బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023, మే 6న జరగనున్న పట్టాభిషేకంలో క్వీన్ కామెల్లా.. కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించాలా వద్దా అనే అంశంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు పునఃసమీక్షిస్తున్నట్లు వార్తా సంస్థ టెలిగ్రాఫ్ పేర్కొంది. అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారత్‌కు చెందిందని, దానిని వినియోగించటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘పట్టాభిషేకంలో రాణి కెమెల్లా కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. గత పాలన జ్ఞాపకాలను భారతీయులు ఇప్పుడిప్పుడే చెరిపివేస్తున్నారు. ఐదు శతాబ్దాలకుపైగా 5-6 తరాల భారతీయులు విదేశీ పాలనలో మగ్గిపోయారు. ఇటీవలి సందర్భాలైన క్వీన్ ఎలిజబెత్ 2 మరణం, క్వీన్ కెమెల్లా పట్టాభిషేకంలో కోహినూర్ పై చర్చ జరిగి బ్రిటీష్ పాలనలోకి భారతీయులను తీసుకెళ్లింది.’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరోవైపు.. రాణి కిరీటం నుంచి కోహినూర్ వజ్రాన్ని తొలగించి దాని స్థానంలో మరో వజ్రాన్ని ఏర్పాటు చేసి ఉపయోగించాలని భావిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లోని ప్రవాస భారతీయుల వీసా అంశంపై యూకే హోంశాఖ మంత్రి బ్రేవర్‌మ్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఐ)పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి: రాజుగా చార్లెస్ ప్రమాణం -
ప్లీజ్.. ఒక్కసారి కలవాలి: కింగ్ ఛార్లెస్‌కు మేఘన్ లేఖ
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణం తర్వాత.. అంత్యక్రియల సమయంలో జరిగిన ఆసక్తికర చర్చల్లో డచ్చెస్ ఆఫ్ సస్సెక్స్ మేఘన్ మార్కెల్ ఎపిసోడ్ కూడా హైలైట్ అయ్యింది. క్వీన్ ఎలిజబెత్-2 రెండో మనవడు ప్రిన్స్ హ్యారీ తన భార్య మేఘన్‌తో కలసి రాయల్ డ్యూటీస్‌కు దూరంగా కాలిఫోర్నియాలో స్థిరపడిన విషయం తెలిసిందే. అయితే.. రాణి-మేఘన్‌కు, ప్రిన్స్ సోదరుడు విలియం భార్య క్యాథరిన్ ఎలిజబెత్ మిడిల్టన్-మేఘన్‌కు మధ్య గిట్టని పరిస్థితుల్లోనే ప్రిన్స్హ్యారీ రాజహోదాకు దూరమైనట్లు ఒక ప్రచారం ఉంది. అంతేకాదు.. బ్రిటన్ను వీడాక.. బకింగ్హమ్ ప్యాలెస్‌లో తమకు ఎదురైన పరిస్థితులపై సంచలన ఆరోపణలే చేశారు ఆ భార్యాభర్తలు. ఈ నేపథ్యంలో.. క్వీన్ అంత్యక్రియలకు మేఘన్ దూరంగా ఉంటుందని, అసలు రాజకుటుంబం ఆమెను ఆహ్వానించకపోవచ్చని అంతా భావించారు. అయితే ఆ అంచనాలు తలకిందులు చేస్తూ.. మేఘన్ మార్కెల్ క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు హాజరైంది కూడా. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో కుటుంబ కలహాలకు పుల్‌స్టాప్ పడాలని మేఘన్ భావిస్తోంది. అందుకే ఆమె బ్రిటన్ రాజు కింగ్ ఛార్లెస్-3(ప్రిన్స్ హ్యారీ తండ్రి)ని ప్రైవేట్‌గా కలిసి చర్చించాలని ఓ లేఖ రాసింది. కాలిఫోర్నియాకు వెళ్లే ముందు.. రాజకుటుంబానికి చెందిన కీలక విషయాలు చర్చించాల్సి ఉందని కింగ్ ఛార్లెస్-3 అపాయింట్మెంట్ కోరుతూ ఆమె రాజప్రసాదానికి అభ్యర్థన లేఖ రాసిందని, ఇది అభినందించదగ్గ సాహసోపేత నిర్ణయమంటూ రాజకుటుంబ వ్యవహరాల విశ్లేషకుడు నెయిల్ సీన్ తన యూట్యూబ్‌లో ఓ వీడియో అప్లోడ్ చేశాడు. రాజకుటుంబంలోని పొరపచ్చాల్ని తొలగించుకునేందుకు ఇదే మంచి సందర్భమని ఆమె అనుకుంటున్నట్లు అక్కడి మీడియా విశ్లేషిస్తోంది. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్-2తో పాటు ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ కేథరిన్ మిడెల్టన్(ప్రిన్స్ విలియం భార్య)పై మేఘన్ ఆరోపణలు గుప్పించింది గతంలో. కానీ, కింగ్ ఛార్లెస్‌తో పాటు ఆయన సతీమణి క్యామిల్లాకు, మేఘన్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆ ఇద్దరూ తనను ఒక కూతురిలా భావిస్తారని తరచూ మేఘన్ చెప్తుండేవారు. అంతెందుకు రాజప్రసాదంపై విమర్శల తర్వాత.. కొడుకుకొడలిని మన్నిస్తానని కింగ్ ఛార్లెస్ ఒక ఇంటర్వ్యూలో సైతం తెలిపారు కూడా. ఈ తరుణంలో.. తమ మధ్య చర్చల ద్వారా కుటుంబ కలహాలకు చెక్ పెట్టాలని మేఘన్ భావిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. ఇదీ చదవండి: ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్ -
ఎలిజబెత్-2 అంత్యక్రియల్లో ప్రిన్స్ హ్యరీ తీరుపై నెటిజన్ల ఫైర్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 అంత్యక్రియలు సోమవారం అశ్రునయనాల మధ్య జరిగిన విషయం తెలిసిందే. రాజకుటుంబంలోని సభ్యులందరితో పాటు 2,000 మంది అతిథులు, విదేశీ ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే రాణి అంత్యక్రియల్లో ఆమె మనవడు, కింగ్ చార్లెస్-3 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ వ్యవహరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. రాణి భౌతికకాయం వెస్ట్‌మినిస్టర్ అబెలో ఉన్నప్పుడు ఆమెకు నివాళిగా అందరూ జాతీయ గీతం 'గాడ్ సేవ్ ద కింగ్'ను ఆలపించారు. అయితే డేగ కళ్లున్న కొందరు ఈ సమయంలో ప్రిన్స్ హ్యారీని వీడియో తీశారు. ఆయన పెదాలు కదపనట్లు, జాతీయ గీతం ఆలపించనట్లు అందులో కన్పించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేయగా నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. Prince Harry not singing the national anthem 👀 #queensfuneral pic.twitter.com/laNk5JMZ6R — Kieran (@kierknobody) September 19, 2022 ప్రిన్స్ హ్యారీ.. రాణికి మీరిచ్చే మర్యాద ఇదేనా? అని ఓ యూజర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరొకొందరు మాత్రం ప్రిన్స్ హ్యారీకి మద్దతుగా నిలిచారు. ఆయన జాతీయ గీతాన్ని ఆలపించారని, పెదాలు కదిలాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొకరేమో.. జాతీయ గీతం మారింది కాబట్టి ఆయనకు కష్టంగా అన్పించిందేమో ఓ సారి అవకాశం ఇచ్చిచూద్దాం అన్నాడు. మరో నెటిజన్.. ఈ కార్యక్రమంలో ఇంకా చాలా మంది ప్రిన్స్ హ్యారీలాగే ప్రవర్తించారని, కింగ్ చార్లెస్ కూడా పెదాలు కదపలేదన్నారు. వాళ్లను పట్టించుకోకుండా ఈయనపైనే ఎందుకుపడ్డారని ప్రశ్నించాడు. మరికొందరు మాత్రం తీవ్రమైన బాధలో ఉన్నప్పుడు నోట మాటరాదని, అందుకే ప్రిన్స్ హ్యారీ జాతీయ గీతాన్ని ఆలపించలేకపోయి ఉండవచ్చని ఆయనకు అండగా నిలిచారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదని చెప్పుకొచ్చారు. దీన్ని సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. చదవండి: బ్రిటన్ రాణి అంత్యక్రియలు పూర్తి.. ప్రపంచ దేశాల అధినేతలు హాజరు -
కింగ్ చార్లెస్‌ని కలిసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము... సంతాప పుస్తకంలో..
లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలు సెప్టంబర్ 19న సోమవారం 11 గంటలకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. భారత్ తరుఫున క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరైందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లండన్‌కి చేరుకున్నారు కూడా. ఆ తర్వాత బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలోని లాంకాస్టర్ హౌస్‌లో ముర్ము ముందుగా కింగ్ చార్లెస్‌ని కలిశారు. తదనంతరం క్వీన్ ఎలిజబెత్2 జ్ఞాపకార్థం ద్రౌపది ముర్ము సంతాప పుస్తకంపై సంతకం చేశారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ట్విట్టర్లో పేర్కొంది. అంతేకాదు ముర్ము వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉన్న బ్రిటన్ రాణి శవపేటిక వద్ద క్వీన్ ఎలిజబెత్‌కి నివాళులర్పించారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత్ తరుపున సంతాపం తెలియజేసేందుకు ఆమె సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు బ్రిటన్ అధికారిక పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన నిమిత్తం ముర్ము విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రాతో సహా తన పరివార సభ్యులతో కలిసి లండన్‌లోని గ్యాట్రిక్ విమానాశ్రయానకి చేరుకుని అక్కడ నుంచి బస చేసే హోటల్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంకు చేరకున్న ద్రౌపది ముర్ముకు బ్రిటన్‌లోని భారత హై కమిషనర్ ఘన స్వాగతం పలికారు. ద్రౌపది ముర్ము వెస్ట్‌మినిస్టర్ అబ్బేలోని వెస్ట్గేట్లో జరిగే క్వీన్ ఎలిజబెత్2 అంత్యక్రియలకు హాజరయ్యి, తదనంతరం బ్రిటన్ కామన్వెల్త్ అభివృద్ధి వ్యవహారాల కార్యదర్శి జేమ్స్ క్లీవర్లీ నిర్వహించే రిసెప్షన్‌కి హాజరవుతారు. President Droupadi Murmu signed the Condolence Book in the memory of Her Majesty the Queen Elizabeth II at Lancaster House, London. pic.twitter.com/19udV2yt0z — President of India (@rashtrapatibhvn) September 18, 2022 (చదవండి: రాణి ఎలిజబెత్2 అంత్యక్రియలు.. లండన్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము) -
బ్రిటన్ రాజు బాడీగార్డులకు నకిలీ చేతులు! నెటిజన్ల అయోమయం
లండన్: బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ బాడీగార్డులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు బాడీగార్డులు కృత్రిమ చేతులు ఉపయోగిస్తున్నారా? అనే అయోమయానికి గురౌతున్నారు. వాళ్ల అసలు చేతులను కోటు లోపల దాచుకుని ఫేక్ చేతులను బయటకు ప్రదర్శిస్తున్నారా? అని చర్చ జరుగుతోంది. ప్రముఖులకు భద్రత కల్పించే బాడీగార్డులు క్షణం ఏమరపాటుగా ఉన్నా దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే వారు కూడా కొన్ని టెక్నిక్స్ పాటిస్తూ తమ యజమానుల కోసం ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ కల్పిస్తుంటారు. ఇలాంటి టెక్నిక్స్‌లో ఫేక్ చేతులు ధరించడం కూడా ఒకటి కావడం గమనార్హం. అయితే ఫేక్ చేతుల విషయం కొత్తదేమీ కాదు. 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సీక్రెట్ సర్వీస్ బాడీగార్డు తన చిటికెన వేలుని వింతగా పట్టుకున్నప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అది కృత్రిమ చేతి అయి ఉంటుందని అంతా అనుమానించారు. బాడీగార్డులు ఇలా కృత్రిమ చేతులు ధరించినప్పుడు కోట్ లోపల అసలు చేతులతో ఆటోమేటిక్ గన్ పట్టుకుని సిద్ధంగా ఉంటారని చెబుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఎఫ్ఎన్-పీ90 గన్ను ఊపయోగిస్తారట. ఎవరికీ అనుమానం రాకుండా కోటు లోపల పెట్టుకుని భద్రత కల్పించేందుకు ఇది అనువుగా ఉంటుందట. క్లారీటీ లేదు.. అయితే బ్రిటన్‌లో బాడీగార్డులు ఆయుధాలు కలిగిఉండటానికి వీల్లేదు. అందుకే కింగ్ చార్లెస్ బాడీగార్డులు కోటు లోపల చేతులతో గన్స్ పట్టుకునే అవకాశం లేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు మాత్రం నెటిజన్లను అయోమయానికి గురి చేస్తున్నాయి. అసలు బాడీగార్డులు కృత్రిమ చేతులు నిజంగానే ధరించారా? అనే విషయంపై స్పష్టత రావడంలేదు. కొందరేమో కింగ్ చార్లెస్ బాడీగార్డులు కచ్చితంగా కృత్రిమ చేతులు ధరించారు అంటుంటే.. మరికొందరేమే ఇవి ఫేక్ చేతుల్లా లేవని అంటున్నారు. అయితే ఈ విషయంపై బాడీగార్డులు కూడా నిజాన్ని చెప్పే అవకాశం లేదు. అసలు విషయం తెలిస్తే కింగ్ చార్లెస్ భద్రతకు ముప్పు ఉంటుందని వారు భావిస్తారు. చదవండి: చైనాలో ఘోర ప్రమాదం.. బస్సు బోల్తాపడి 27మంది దుర్మరణం -
ఐ హేట్ దిస్.. బ్రిటన్ రాజు చార్లెస్ చికాకు
డబ్లిన్: బ్రిటన్ రాజు చార్లెస్-3 మరోసారి తన చికాకును ప్రదర్శించారు. తన తల్లి, క్వీన్ ఎలిజబెత్-2 మరణాంతరం ఆయన ఇలా ప్రవర్తిస్తూ మీడియాకు చిక్కడం ఇది రెండోసారి. మంగళవారం ఉత్తర ఐర్లాండ్‌కు వెళ్లిన ఆయన.. అక్కడ విజిటర్స్ బుక్‌లో సంతకం చేసే టైంలో పెన్ను లీకైందన్న అసహనాన్ని తీవ్రంగా ప్రదర్శించారు. తన తల్లి క్వీన్ ఎలిజబెత్ కోసం సంతాపాన్ని తెలియజేసేందుకు యునైటెడ్ కింగ్డమ్ పర్యటనలో ఆయన ఉన్నారు. ఈ క్రమంలో.. ఉత్తర ఐర్లాండ్‌ను సందర్శించిన చార్లెస్.. ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. అయితే.. బెల్ఫాస్ట్ సమీపంలోని హిల్స్‌బరో క్యాజిల్(కోట)కు చేరుకున్న ఆయన.. సందర్శకుల పుస్తకంపై సంతకం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఛార్లెస్ తన చేతిలోని పెన్ను లీక్ కావడంతో నిరాశతో చెందారు. ‘‘ఓహ్ గాడ్ ఐ హేట్ దిస్ (పెన్)!’’ అంటూ చార్లెస్ లేచి నిలబడి చేతిని తుడుచుకుంటూ ఆ పెన్నును తన భార్య, క్వీన్ కన్సార్ట్ కెమిల్లాకు అందజేశాడు. ఆపై ఆ ఫ్రస్ట్రేషన్లో తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడాయన. I LOVE this pic.twitter.com/cL1KpFA5gI — Rupert Myers (@RupertMyers) September 13, 2022 ఇదిలా ఉంటే.. చార్లెస్ రాజుగా ప్రమాణం చేయడానికి ముందు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఒకరు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఛార్లెస్ చాలా సరదాగా ఉంటారు. కానీ, ఆయనకు షార్ట్‌టెంపర్. అదీ ఇదీ కావాలని అడుగుతుంటారు కూడా’’ అని వెల్లడించారు. నాలుగేళ్ల వయసులో ఛార్లెస్ ఇదిలా ఉంటే.. శనివారం లండన్‌లో పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు, టేబుల్‌పై ఉన్న పెన్ హోల్డర్ అడ్డుతగలడంతో విసుగు చెందిన చార్లెస్.. సహాయకులకు సహాయం చేయమని సైగ చేయడం, తన అసహనాన్ని ప్రదర్శించడం తెలిసే ఉంటుంది. స్వతహాగానే ఆయన ప్రవర్తన అలా ఉంటుందని కొందరు అంటుంటే.. 73 ఏళ్ల ఛార్లెస్ వయసురిత్యా అలా ప్రవర్తించి ఉంటారని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. క్వీన్ ఎలిజబెత్ శవపేటిక బకింగ్‌హామ్ ప్యాలెస్‌కు చేరుకుంది. video courtesy: Daily Mail -
బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం(సెప్టెంబర్ 8న) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె అదే రోజు చనిపోతుందని ముందుగానే ఊహించాడు ఓ వ్యక్తి. ఈ ఏడాది జులైలోనే అతను ఈమేరకు ట్వీట్ చేశాడు. లోగన్ స్మిత్(@logan_smith526) అనే పేరుతో ఉన్న ఇతని ట్విట్టర్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్‌కు అత్యధిక కాలం మహారాణిగా ఉన్నవారు సెప్టెంబర్ 8, 2022న మరణిస్తారు అని అతను ట్వీట్లో పేర్కొన్నాడు. రాణి మరణించిన క్షణాల్లోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోగన్ స్మిత్ ట్వీట్‌ను వేలమంది రీట్వీట్ చేశారు. అయితే అతడు తన ట్వీట్లో రాణి మరణించే తేదీతో పాటు కొత్త రాజు ఎప్పుడు చనిపోతాడనే విషయాన్ని కూడా చెప్పడం బ్రిటన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కింగ్ చార్లెస్ 2026 మార్చి 28న మరణిస్తారని అతడు అంచనావేయడమే ఇందుకు కారణం. ఈ ట్వీట్‌ను ట్విట్టర్లో ఎక్కువమంది రీట్వీట్ చేస్తుండటంతో లోగన్ స్మిత్ తన ఖాతాను ప్రైవేటుగా మార్చుకున్నాడు. దీంతో అతని పాత ట్వీట్లు సాధారణ యూజర్లకు కన్పించడంలేదు. అయితే పాత ట్వీట్ స్క్రీన్ షాట్లనే చాలా మంది యూజర్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. మరికొందరు లోగన్ స్మిత్ ప్రెడిక్షన్ చూసి షాక్‌కు గురవుతున్నారు. ఓ యూజర్ అయితే లోగన్ నువ్వు జాగ్రత్త.. బ్రిటిష్ ప్రజలు నీకోసం వస్తారు అని హెచ్చరించాడు. మరో యూజర్ స్పందిస్తూ ఇప్పటికే రాణి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాం, అలా చెప్పొద్దు అని రాసుకొచ్చాడు. మరొక యూజర్ స్పందిస్తూ.. కింగ్ చార్లెస్ 2026లో చనిపోతారనే అంచనా కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో నిర్ణయించేది ఆ భగవంతుడే అని రాసుకొచ్చాడు. ఎలిజబెత్ 2 మరణానంతరం ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ 3 వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
రాణి బొమ్మతో ఉన్న కరెన్సీ నోట్ల మార్పు! విలువెంతంటే..
లండన్: బ్రిటిష్ కరెన్సీ నోట్లపై క్వీన్ ఎలిజబెత్-2 బొమ్మ ఇంతకాలం ఒక హుందాగా ఉండిపోయింది. నోట్లే కాదు.. నాణేలు, పోస్టల్ స్టాంపులుగా యూకేవ్యాప్తంగా అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు.. పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లలోనూ రాజముద్ర కనిపించేంది. అయితే.. ఆమె మరణంతో ఇప్పుడు పరిస్థితి ఏంటన్న దానిపై అక్కడ జనాల్లో ఒక గందరగోళం నెలకొంది. కరెన్సీ నోట్లపై ఇక నుంచి ఆమె చిత్రాన్ని ముద్రిస్తారా? రద్దు చేస్తారా? చేస్తే తమ దగ్గరున్న కరెన్సీ మాటేంటని ఆరాలు తీస్తున్నారు. ఈ తరుణంలో.. యూకే కేంద్ర బ్యాంక్ ‘బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్’ సమాధానం ఇచ్చింది. బ్యాంక్ నోట్లతో పాటు రాణి ముఖచిత్రం ఉన్న కాయిన్లు ప్రస్తుతానికి చెల్లుతాయని స్పష్టత ఇచ్చింది. అంతేకాదు.. సంతాప దినాలు ముగిశాక బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ బ్యాంక్, నోట్ల విషయంలో మరో ప్రకటన చేయనుంది. అయితే ప్రస్తుతానికి కరెన్సీ చెల్లుబాటు అయినా.. కరెన్సీ నోటుపై రాణి చిత్రాన్ని తప్పనిసరిగా మార్చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే.. నేషన్స్ బ్యాంక్ నుంచి కరెన్సీ నోట్స్, రాయల్ మింట్ నుంచి కాయిన్స్ ముద్ర అవుతాయి అక్కడ. ఇంగ్లాండ్‌లో బ్యాంక్ నోట్లపై చిత్రం ప్రచురితమన మొదటి రాణిగా ఎలిజబెత్‌కు గుర్తింపు దక్కింది. కానీ స్కాటిష్,నార్త్ ఐరిష్ బ్యాంకు నోట్లపై మాత్రం ఆ రాణి బొమ్మ ఉండదు. ఆమె వారసుడిగా రాజ్యాధికారం దక్కించుకున్న రాజు ఛార్లెస్-3 చిత్రాలను కరెన్సీ నోట్లు, కాయిన్లపై భర్తీ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ ముందు ఇప్పుడు పెద్ద పనే ఉంది. రాజు బొమ్మతో ఉన్న నోట్లు, కాయిన్లు ముద్రించాల్సి ఉంటుంది బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్. యూకే వ్యాప్తంగా రాణి చిత్రం ఉన్న దాదాపు 95 బిలియన్ అమెరికన్ డాలర్లు(ఒక బిలియన్ డాలర్లు అంటే.. ఏడున్నర వేల కోట్ల రూపాయలకు పైనే విలువ)తో కూడిన కరెన్సీనోట్లు, 29 బిలియన్ల నాణేలు ఉన్నట్లు యూకే కేంద్ర బ్యాంక్ చెబుతోంది. రాణి బొమ్మలతో ఉన్న నోట్లు, కాయిన్లు క్రమక్రమంగా కనుమరుగై.. రాజు బొమ్మతో కొత్తగా రానున్నాయి. రాజు బొమ్మతో ఎలాగంటే.. కింగ్ ఛార్లెస్-3 బొమ్మతో ఉన్న కాయిన్లు, కరెన్సీ నోట్లపై ఇప్పటి నుంచే కసరత్తులు మొదలయ్యాయి. కరెన్సీ నోట్ల సంగతి మాటేమోగానీ.. నాణేలపై రాజవంశస్తుల బొమ్మల్ని 17వ శతాబ్దం నుంచి ముద్రిస్తున్నారు. కింగ్ ఛార్లెస్-2 హయాం నుంచి ఇది మొదలైంది. సాధారణంగా.. ఒక తరం వాళ్ల బొమ్మను కుడి వైపు, మరో తరంవాళ్లను ఎడమవైపు ముద్రిస్తూ వస్తున్నారు. ఎలిజబెత్ రాణి బొమ్మ కాయిన్లకు కుడివైపు ఉండేది. కాబట్టి, ఛార్లెస్ బొమ్మను ఎడమవైపే ముద్రించడం ఖాయమైంది. ఇక పాస్‌పోర్ట్, ఇతర డాక్యుమెంట్లు పని చేసినా.. అందులో రాణికి సంబంధించిన ప్రస్తావన బదులు, రాజుకు సంబంధించిందిగా మారనుంది. ఇదీ చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం
లండన్: బ్రిటన్ రాజు హోదాలో కింగ్ ఛార్లెస్–3 పార్లమెంట్లో తొలి ప్రసంగం చేశారు. సోమవారం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉభయ సభల సభ్యులనుద్దేశిస్తూ మాట్లాడారు. ‘‘దివికేగిన ప్రియమైన మాతృమూర్తి నిస్వార్థ సేవకు ప్రతిరూపం. ప్రజాసేవకు అంకితమైన రాణి ఎలిజబెత్ బాటలో నడుస్తూ రాజ్యాంగబద్ధ అత్యున్నత పాలనా ప్రమాణాలను కొనసాగిస్తా. ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనమైన బ్రిటన్ పార్లమెంట్లో క్వీన్ ఎలిజబెత్ సేవను మరోసారి స్మరించుకుందాం. దేవుడి, మీ పరిపూర్ణ సహకారంతో నా బాధ్యతలు నిర్వరిస్తా’’ అని అన్నారు. అస్తమయం చెందిన రాణి ఎలిజబెత్–2కు ఎంపీలు సహా దాదాపు 900 మంది ఘనంగా నివాళులర్పించారు. మరోవైపు, రాణి పార్థివదేహాన్ని మంగళవారం స్కాట్లాండ్ నుంచి లండన్‌కు వాయు మార్గంలో తీసుకురానున్నారు. ఇదీ చదవండి: చనిపోయే ముందు వాళ్లకు రాణి గ్రీటింగ్స్!! -
ఎడింబర్గ్‌కు రాణి భౌతికకాయం.. రాకుమారుల ఐక్యత!
లండన్: రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. శవపేటికతో కూడిన వాహన కాన్వాయ్ వారి నివాళుల మధ్య ఆరు గంటల పాటు ప్రయాణించి ఎడింబర్గ్ చేరింది. రాణి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం దాకా ఎడింబర్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్‌కు తరలిస్తారు. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో నాలుగు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం 19న అంత్యక్రియలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. రాకుమారుల ‘ఐక్యత’ విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్‌మినిస్టర్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు. ఇదీ చదవండి: కడసారి చూపునకు కూడా రానివ్వలేదా? -
బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల విలువ తెలుసా?
లండన్: రాజవంశస్థులు అంటేనే కోట్ల ఆస్తులకు వారసులు. అత్యంత సంపన్నులు. మరి బ్రిటన్ రాజకుటుంబం అంటే ఈ లెక్కలు ఇంకాస్త ఎక్కువగానే ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణంతో ఆమె వ్యక్తిగత ఆస్తుల విలువ, రాజకుటుంబం నికర ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయం చర్చనీయాంశమైంది. ఆ వివరాలు మొత్తం ఈ ఫొటోలో చూడండి. నూతన రాజముద్రిక రాజకిరీటం, దానికింద సీఆర్ అంటూ పొడి అక్షరాలతో కింగ్ చార్లెస్–3 నూతన రాజముద్రిక రూపుదిద్దుకుంది. సీ అంటే చార్లెస్, ఆర్ అంటే రెక్స్ (లాటిన్లో రాజు) అని అర్థం. రాజుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తన టై మీద ఆయన దీన్ని తొలిసారిగా ధరించారు. చార్లెస్ పాలన సాగినంత కాలం బ్రిటన్‌తో పాటు ఇతర కామన్వెల్త్ దేశాల కరెన్సీ నోట్లు, నాణాలు, పాస్‌పోర్టులు, సైనిక దుస్తులు, అధికారిక స్టాంపులు తదితరాలన్నింటి మీదా ఇకపై ఈ ముద్రే కన్పించనుంది. ఎలిజబెత్ హయాంలో రాజముద్రికపై ఈఆర్ (ఎలిజబెత్ రెజీనా) అని ఉండేది. సవరణ బ్రిటన్ రాజకుటుంబం ఆస్తుల గ్రాఫ్‌లో కార్న్‌వాల్ ఎస్టేట్ విలువ 1,300 కోట్ల డాలర్లు, బకింగ్‌హాం ప్యాలెస్ విలువ 4,900 కోట్ల డాలర్లు అని పొరపాటుగా వచ్చింది. వాటిని 130 కోట్ల డాలర్లు, 490 కోట్ల డాలర్లుగా చదువుకోగలరు. చదవండి: బ్రిటన్ రాణి మరణానికి ముందు ఇంత జరిగిందా? -
రాజుగా చార్లెస్ ప్రమాణం
లండన్: బ్రిటన్ కొత్త రాజుగా 73 ఏళ్ల చార్లెస్–3 నియుక్తులయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించింది. ప్యాలెస్ బాల్కనీ నుంచి నియామక ప్రకటనను బహిరంగంగా చదివి విన్పించింది. భేటీలో పాల్గొన్న ముఖ్య అతిథులంతా ‘గాడ్ సేవ్ ద కింగ్’ అంటూ తమ అంగీకారం తెలిపారు. అనంతరం చార్లెస్–3 రాజుగా ప్రమాణ చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాజ ప్రకటన పత్రం తాలూకు రెండు ప్రతులపై తన కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ కానుకగా ఇచ్చిన ఇంక్ పెన్నుతో సంతకం చేశారు! ఆ వెంటనే కింగ్స్ ట్రూప్స్ 41 తుపాకులతో వందన సమర్పణ చేశాయి. రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్ (75), నూతన యువరాజుగా విలియం తదితరులు రాజ ప్రకటన పత్రంపై సాక్షి సంతకాలు చేశారు. బ్రిటన్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటికీ ఇకపై చార్లెస్–3 అధినేతగా వ్యవహరిస్తారు. నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆరుగురు బ్రిటన్ మాజీ ప్రధానులతో పాటు కొత్త ప్రధాని లిజ్ ట్రస్, విపక్ష నేతలు కూడా పాల్గొన్నారు. చార్లెస్–3 నిర్ణయం మేరకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని తొలిసారిగా పత్య్రక్ష ప్రసారం చేశారు. బ్రిటన్ను రికార్డు స్థాయిలో 70 ఏళ్లపాటు పాలించిన ఆయన తల్లి క్వీన్ ఎలిజబెత్–2 గురువారం 96వ ఏట కన్నుమూయడం తెలిసిందే. ‘‘అనంతమైన ప్రేమ, నిస్వార్థ సేవ, తిరుగులేని అంకితభావాలతో నా తల్లి పాలన అన్ని విషయాల్లోనూ సాటిలేనిదిగా సాగింది. ఆమె అస్తమయం అత్యంత దుఃఖమయమైన విషయం. నాపై ఎంతటి భారీ బాధ్యతలున్నాయో తెలుసు. ఆమె నెలకొల్పిన ప్రమాణాలను కొనసాగిస్తా. అందుకు నా జీవితాన్ని ధారపోస్తా’’ అంటూ తన తొలి ప్రసంగంలో కింగ్ చార్లెస్–3 ప్రతిజ్ఞ చేశారు. తల్లిని తలచుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ‘‘ప్రియాతి ప్రియమైన అమ్మా! దివంగతుడైన నాన్నను కలుసుకునేందుకు మహాప్రస్థానానికి బయల్దేరిన నీకు నేను చెప్పగలిగింది ఒకటే. మన కుటుంబం పట్ల నీ ప్రేమకు, అంకితభావానికి థాంక్యూ’’ అంటూ నివాళులర్పించారు. నూతన రాజుకు విధేయులుగా ఉంటామంటూ ప్రధాని ట్రస్, ఆమె మంత్రివర్గ సభ్యులంతా హౌజ్ ఆఫ్ కామన్స్‌లో ప్రతిజ్ఞ చేశారు. భర్త సమాధి పక్కనే... రాణి అంత్యక్రియలు సెప్టెంబర్ 19న ఉదయం చారిత్రక వెస్ట్ మినిస్టర్ అబేలో పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. బకింగ్‌హాం ప్యాలెస్ ఈ మేరకు ప్రకటన చేసింది. రాణి పార్థివ దేహాన్ని ఆమె మృతి చెందిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం ఉదయం రోడ్డు మార్గాన ఎడింబరోలోని హోలీ రుడ్‌హౌజ్ కోటకు తరలిస్తారు. మంగళవారం అక్కడినుంచి విమానంలో లండన్‌కు తీసుకెళ్తారు. సెప్టెంబర్ 14 నుంచి 4 రోజులు ప్రజల సందర్శనార్థం వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంచుతారు. 19న సోమవారం విండ్సర్ క్యాజిల్‌లోని సెయింట్ జార్జ్ చాపెల్‌లో భర్త చార్లెస్ సమాధి పక్కనే ఖననం చేస్తారు. కార్యక్రమానికి వస్తున్న మాజీ ప్రధానులు థెరిసా మే, జాన్ మేజర్, గార్డన్ బ్రౌన్, టోనీ బ్లెయిర్, డేవిడ్ కామెరాన్, బోరిస్ జాన్సన్ -
రాణి కడసారి చూపునకు... మెగన్‌ను రానివ్వలేదు!
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్‌లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్ రావడానికి వీల్లేదని చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్‌లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్ మిడిల్టన్ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్‌కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్ లండన్‌లోనే ఉండిపోయారు. ముందునుంచీ విభేదాలే విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది. రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్ ఫిలిప్ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్‌ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది. -
రాజుగా ఛార్లెస్-3.. పట్టాభిషేకానికి ఆలస్యం ఎందుకంటే..
లండన్: క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో.. ఆమె తనయుడు ఛార్లెస్-3 అధికారికంగా యునైటెడ్ కింగ్డమ్కు రాజు అయ్యారు. శనివారం.. ప్రవేశ మండలిAccession Council అధికారికంగా ఆయన పేరును ప్రకటించింది. బ్రిటన్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. ఈ ప్రకటన కార్యక్రమాన్ని టెలివిజన్ ప్రసారం చేసింది కౌన్సిల్. సాధారణంగా.. సింహాసనంపై ఉన్నవాళ్లు మరణిస్తే.. వారసులే ఆటోమేటిక్‌గా తదుపరి బాధ్యతలు స్వీకరిస్తారు. అంతర్గతంగా ఆ కార్యక్రమం ఉంటుంది. కానీ, బ్రిటన్ రాజరికంలో తొలిసారి ఇలా టీవీ టెలికాస్టింగ్ ద్వారా ప్రకటించడం విశేషం. భారత కాలమానం ప్రకారం.. శనివారం మధ్యాహ్నాం సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో ఈ కార్యక్రమం జరిగింది. 73 ఏళ్ల ఛార్లెస్ అధికారికంగా బాధ్యతలు చేపడుతూ.. ‘అనితరమైన సార్వభౌమాధికారానికి సంబంధించిన బాధ్యతలు తనకు తెలుస’ని ప్రమాణం చేశారు. ► వందల కొద్దీ ప్రైవేట్ కౌన్సిలర్లు.. అందులో బ్రిటన్ తాజా ప్రధాని లిజ్ ట్రస్, క్వీన్ ఎలిజబెత్-2 వారసులు, ఛార్లెస్ భార్య క్యామిల్లా, పెద్ద కొడుకు..తదుపరి వారసుడు విలియమ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా ఛార్లెస్ లేని ప్రత్యేక ఛాంబర్లో ఆయన్ని అధికారికంగా రాజుగా ప్రకటించింది యాక్సెషన్ కౌన్సిల్. ► అనంతరం.. ఆయన సమక్షంలోనే మరోసారి ‘ప్రిన్స్ ఛార్లెస్ ఫిలిప్ ఆర్థర్ జార్జ్’ ఇకపై యూకేకు సార్వభౌమాధికారి.. రాజు అంటూ ప్రకటించింది. ఆ వెంటనే ఆయన ప్రమాణం చేసి.. రాజపత్రాలపై సంతకం చేశారు. ఇక లోపలి కార్యక్రమం పూర్తికాగానే.. మధ్యాహ్నం 3గం.30ని. ప్రాంతంలో ట్రంపెట్ ఊది ఛార్లెస్-3ను అధికారికంగా బాహ్యప్రపంచానికి రాజుగా ప్రకటించింది మండలి. అయితే.. ► బ్రిటన్ రాజుగా ఛార్లెస్-3ని ప్రకటించినప్పటికీ ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంది. అదే మహారాజుగా ఆయనకు జరగాల్సిన పట్టాభిషేకం. తల్లి మరణించిన వెంటనే ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన ఛార్లెస్.. రాజు హోదా దక్కించుకున్నారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 మరణంతో సంతాప సమయం ముగిశాకే.. ఆయనకు అంగరంగ వైభవంగా పట్టాభిషేకం నిర్వహిస్తారు. ► బ్రిటన్ రాజరికాన్ని గమనిస్తే ఇంతకు ముందు.. 1952 ఫిబ్రవరి 6వ తేదీన జార్జ్-6 మరణించారు. ఆ సమయంలో వారసురాలు ప్రిన్స్ ఎలిజబెత్-2 రాణిగా ప్రకటించబడ్డారు. అయితే.. క్వీన్ ఎలిజబెత్-2 పట్టాభిషేకం మాత్రం 1953, జూన్ 2న జరిగింది. అయితే ఆమె భర్త ఫిలిప్.. ఆ తర్వాతి కాలంలోనూ ప్రిన్స్‌గానే కొనసాగారు. ► ఇవాళ జరిగిన.. ప్రవేశ వేడుక(ceremony of Accession), తర్వాత జరగబోయే పట్టాభిషేక వేడుక(ceremony of Coronation) మధ్య తేడా ఏంటంటే.. ప్రవేశ వేడుకలో కేవలం అధికారిక ప్రకటన, ప్రమాణం ఉంటుంది. కానీ, పట్టాభిషేకం అనేది కాంటర్బరీ ఆర్చ్‌బిషప్ నిర్వహించిన మతపరమైన వేడుక. లండన్‌లోని వెస్ట్మిన్స్టర్ అబ్బేలో గత 900 సంవత్సరాలుగా పట్టాభిషేక సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ► సింహాసనంపై ఉన్నవాళ్లు మరణించాక.. తదనంతర రాజు/రాణికు వైభవంగా పట్టాభిషేకం నిర్వహించేందుకే అంత గ్యాప్ తీసుకుంటారు. ► పట్టాభిషేక సమయంలో సదరు వ్యక్తి రాజు/రాణి.. చట్టం ప్రకారం పాలించడం, దయతో న్యాయం చేయడం, చర్చ్ ఆఫ్ ఇంగ్లండ్‌ను నిర్వహించడం లాంటి ప్రమాణాలు చేస్తారు. ► అనంతరం ఆర్చ్‌బిషప్ సమక్షంలో.. కింగ్ ఎడ్వర్డ్ సింహానం మీద అధిరోహిస్తారు. ఆపై సెయింట్ ఎడ్వర్డ్ కిరీటాన్ని రాజు/రాణి తలపై ఉంచుతారు ఆర్చిబిషప్. భర్త ప్రిన్స్ ఫిలిప్‌తో క్వీన్ ఎలిజబెత్-2 ► 1626 నుంచి బ్రిటన్ సింహాసనం విషయంలో ఈ కార్యక్రమం జరుగుతూ వస్తోంది. ► బ్రిటన్ పట్టాభిషేక కార్యక్రమానికి.. రాజరిక వంశస్థులతో పాటు చట్ట సభ్యులు, చర్చ్ సభ్యులు, కామన్వెల్త్ దేశాలకు చెందిన ప్రధానులు.. ప్రతినిధులు, ఇతర దేశాలకు చెందిన ప్రతినిధులూ హాజరవుతారు.