కాన్ బెర్రా : బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో అవమానం జరిగింది. పార్లమెంట్‌లో ఆయన ప్రసంగిస్తుండగా ఆస్ట్రేలియా మహిళా సేనేటర్ లిడియా థోర్ప్ ఆయనకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నువ్వు మా రాజు కాదు అంటూ వలసవాదానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
‘నువ్వు మా రాజు కాదు. నువ్వు మారణ హోమానికి పాల్పడ్డావు. మా భూమిని, మా నుండి దోచుకున్న వాటిని మాకు ఇవ్వండి’ అని ఆరోపించారు
ఆస్ట్రేలియా రాజుగా ఈ ఏడాది తొలిసారి కింగ్ చార్లెస్ ఆస్ట్రేలియాలో ఐదురోజుల పాటు పర్యటన చేపట్టారు. ఈ పర్యటనలో భాగంగా పార్లమెంట్‌లో ప్రసంగించారు. కింగ్ చార్లెస్ ప్రసంగ సమయంలో పక్కనే ఉన్న థోర్ప్ విమర్శలు గుప్పించారు. థోర్ప్ తీరుపై ఆస్ట్రేలియా ప్రజాప్రతినిధులు ఖండించారు. మాజీ ప్రధాన మంత్రి టోనీ అబాట్ సైతం థోర్ప్ ఇలా వ్యవహరించడం దురదృష్టకరం అని అన్నారు. కాగా, రాచరికానికి వ్యతిరేకంగా సేనేటర్ లిడియా థోర్ప్ గతంలో పలు మార్లు ఇలాగే వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment