బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ వేడుకలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయి ఓ గుంపుపైకి దూసుకపోయింది. అయితే ఆ సమయంలో చార్లెస్ 3 వెస్ట్‌మిన్‌స్టర్ అబ్బే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి తిరిగి వెళ్లిపోయిన తదుపరి ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ హౌస్‌హోల్డ్‌లోని మౌంటెడ్ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది.
సమీపంలో ఓ మెటల్ బారీకేడ్‌ని ఢీ కొట్టి మరీ గుంపుపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తున్న గోల్డస్టేట్ కోచ్‌కు కేవలం గజం దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సైనిక సిబ్బంది గాయాలను ఊహించి సంఘటన స్థలానికి స్ట్రెచర్‌ను తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు భయపడేంతగా ఎవరికి గాయాలు కాలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
During today's coronation of the British King Charles the Third, an agitated horse, which was part of the royal procession, ran into the audience watching the event on the streets of London pic.twitter.com/29RXPOwK2e
— Spriter (@Spriter99880) May 6, 2023
(చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి)
Comments
Please login to add a commentAdd a comment