buckingham palace
-
Trooping the Colour: ప్రజల ముందుకు కేట్ మిడిల్టన్
లండన్: క్యాన్సర్‌తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 జన్మ దినోత్సవాల్లో భాగంగా లండన్‌లో శనివారం అధికారికంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ‘ట్రూపింగ్ ది కలర్’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో భర్త విలియం, పిల్లలతో పాటు నిల్చున్న కేట్‌ను చూసేందుకు జనం ఆసక్తిచూపించారు. గత ఏడాది డిసెంబర్ తర్వాత కేట్ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన విషయం తెల్సిందే. ఆమె కోమాలోకి వెళ్లారని, రాచరిక విధులు నిర్వర్తించలేరని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కేట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రావడంతో బ్రిటన్ రాజకుటుంబ అనుకూల వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చికిత్స నుంచి మెల్లిగా కోలుకుంటున్నానని, శనివారం జరిగే జన్మదిన వేడుకలకు హాజరవుతానని కేట్ శుక్రవారమే ప్రకటించారు. -
బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్.. ప్యాలెస్ కీలక ప్రకటన
లండన్: బ్రిటన్ రాజు ఛార్లెస్-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. వివరాల ప్రకారం.. బ్రిటన్ రాజు ఛార్లెస్-3కి క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బకింగ్‌హం ప్యాలెస్ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీంతో, కింగ్ ఛార్టెస్ సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్ వివరించింది. కాగా, క్యాన్సర్‌కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది. A statement from Buckingham Palace: https://t.co/zmYuaWBKw6 📷 Samir Hussein pic.twitter.com/xypBLHHQJb — The Royal Family (@RoyalFamily) February 5, 2024 మరోవైపు.. వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారని చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని ప్యాలెస్ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022సెప్టెంబరులో తన తల్లి క్వీన్ ఎలిజబెత్-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్-3 బ్రిటన్ రాజుగా ఎన్నికయ్యారు. దేశాధినేతల స్పందన.. ఛార్లెస్-3 క్యాన్సర్ బారిన పడడంపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీరు తిరిగి వస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం మీ వేగవంతమైన రికవరీని కోరుకుంటుంది’ అంటూ రాసుకొచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోతో పాటు బ్రిటన్ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్ కూడా ఎక్స్ వేదికగా రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. Wishing His Majesty a full and speedy recovery. I have no doubt he’ll be back to full strength in no time and I know the whole country will be wishing him well. https://t.co/W4qe806gmv — Rishi Sunak (@RishiSunak) February 5, 2024 -
ఇంతకంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి లేదు! ముఖేష్ అంబానీ యాంటిలియా దీని తరువాతే..
ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏదంటే, చాలామంది ముంబైలోని యాంటిలియా పేరు చెబుతారు. దీని కంటే ఖరీదైన ప్యాలెస్ మరొకటి ఉందంటే నమ్మడానికి కొంత సమయం పట్టొచ్చు, కానీ ఇది నిజం. ఈ ఖరీదైన ప్యాలెస్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. బిలియనీర్ ముఖేష్ అంబానీ యాంటిలియా కంటే ఖరీదైన భవనం 'బకింగ్‌హామ్ ప్యాలెస్'. ఇది ప్రస్తుతం కింగ్ చార్లెస్ III నేతృత్వంలోని బ్రిటన్ రాజకుటుంబ నివాసం. 1703లో నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రపంచంలో అత్యంత ఖరీదైనదిగా కీర్తి పొందుతోంది. 19వ శతాబ్దంలో క్వీన్ విక్టోరియా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రాజభవనాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. ఆ తరువాత కూడా చాలా సంవత్సరాలు ఇది కొన్ని కొన్ని మార్పులు పొందుతూనే ఉంది. ప్రస్తుతం బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో 775 గదులు ఉన్నాయి. ఇందులో 19 స్టేటురూమ్‌లు, రాయల్స్, అతిథుల కోసం 52 బెడ్రూమ్లు, సిబ్బందికి 188 బెడ్రూమ్లు, 92 ఆఫీసులు, 78 బాత్రూమ్లు ఉన్నాయి. ఇదీ చదవండి: సినిమాలకు దూరంగా హీరోయిన్.. అయినా కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొనేసింది! ఈ భవనం విక్రయిస్తే 4.9 బిలియన్ల కంటే ఎక్కువ డబ్బు రావొచ్చని అంచనా. ముఖేష్ అంబానీ విలాసవంతమైన యాంటిలియా ధర కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ. బ్రిటీష్ వారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలను పాలించినప్పటి నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్ అత్యంత విలువైన ఆభరణాలకు, సంపదకు నిలయంగా విరాజిల్లింది. ముఖేష్ అంబానీకి చెందిన యాంటిలియా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రెండవ ప్యాలెస్. దీని విలువ రూ. 15000 కోట్లు కంటే ఎక్కువ. 27 అంతస్తులు కలిగిన ఈ భవనంలో మొదటి ఆరు అంతస్తులలో అంబానీ కుటుంబంలోని వ్యక్తులు ఉన్నారు. మిగిలిన అంతస్తుల్లో ఎన్నెన్నో విలాసవంతమైన సదుపాయాలు ఉన్నట్లు సమాచారం. -
కింగ్ చార్లెస్ పట్టాభిషేకం వేళ అనూహ్య ఘటన..గుర్రం అదుపు తప్పి..
బ్రిటన్ రాజుగా చార్లెస్-3 పట్టాభిషేకం లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ అబేలో అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ వేడుకలో ఓ సైనికుడి గుర్రం నియంత్రణ కోల్పోయి ఓ గుంపుపైకి దూసుకపోయింది. అయితే ఆ సమయంలో చార్లెస్ 3 వెస్ట్మిన్స్టర్ అబ్బే నుంచి బకింగ్‌హామ్ ప్యాలెస్‌కి తిరిగి వెళ్లిపోయిన తదుపరి ఈ ఘటన చోటు చేసుకుంది. రాయల్ హౌస్‌హోల్డ్‌లోని మౌంటెడ్ సభ్యుడిని గుర్రం దాదాపు ఢీ కొట్టిందని న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. సమీపంలో ఓ మెటల్ బారీకేడ్ని ఢీ కొట్టి మరీ గుంపుపైకి దూసుకుపోయింది. రాజు, రాణి వెళ్తున్న గోల్డస్టేట్ కోచ్‌కు కేవలం గజం దూరంలో ఈ ప్రమాదం జరిగింది. దీంతో అప్రమత్తమైన సైనిక సిబ్బంది గాయాలను ఊహించి సంఘటన స్థలానికి స్ట్రెచర్‌ను తీసుకువచ్చారు. అదృష్టవశాత్తు భయపడేంతగా ఎవరికి గాయాలు కాలేదు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. During today's coronation of the British King Charles the Third, an agitated horse, which was part of the royal procession, ran into the audience watching the event on the streets of London pic.twitter.com/29RXPOwK2e — Spriter (@Spriter99880) May 6, 2023 (చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం.. 70 ఏళ్ల తర్వాత తొలిసారి) -
London: పట్టాభిషేకం వేళ లండన్‌లో కలకలం
లండన్: కింగ్ ఛార్లెస్ పట్టాభిషేకానికి ముహూర్తం దగ్గర పడుతున్న వేళ.. లండన్ బకింగ్హమ్ ప్యాలెస్ వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. భారత కాలమానం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ప్యాలెస్ గేటు వద్దకు చేరుకున్న ఓ వ్యక్తి.. ప్యాలెస్ మైదానంలోకి కొన్ని వస్తువులను విసిరేశాడు. అందులో తుపాకీ మందుగుండు shotgun cartridges కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన కింగ్ ఛార్లెస్III పట్టాభిషేకం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల అధినేతలు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. గుర్తు తెలియని ఓ వ్యక్తి.. భారీ భద్రతను దాటుకుని గేట్ వద్దకు చేరుకున్నాడు. తన బ్యాగులో ఉన్న వస్తువులను ప్యాలెస్ వైపు విసరడం ప్రారంభించాడు. అయితే అవి ప్యాలెస్ గ్రౌండ్లో పడిపోయాయి. సకాలంలో గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ చీఫ్ వెల్లడించారు. అయితే ఆ బ్యాగులో ఓ ఆయుధం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాల్పులు లాంటి పరిణామాలు చోటు చేసుకోలేదని, ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు? అలా చేశాడనే దానిపై స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. ఆగంతకుడి దాడి సమయంలో.. ఛార్లెస్(74), ఆయన భార్య కామిల్లా(75) ప్యాలెస్‌లోనే ఉన్నారా? అనేదానిపై బకింగ్హమ్ ప్యాలెస్ వర్గాలు స్పందించ లేదు. శనివారం జరగబోయే పట్టాభిషేక మహోత్సవం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ప్యాలెస్‌కు వెళ్లే దారులను జల్లెడ పడుతూ.. కొన్ని మాల్స్‌ను తాత్కాలికంగా మూయించేస్తున్నారు. దాదాపు 70 ఏళ్ల తర్వాత మళ్లీ బ్రిటన్‌లో పట్టాభిషేకం జరుగుతోంది. కిందటి ఏడాది క్వీన్ ఎలిజబెత్-2 మరణించగా.. ఆమె తనయుడు ఛార్లెస్(Charles 3)ని రాజుగా ప్రకటించింది రాజప్రసాదం. అయితే పట్టాభిషేకం మాత్రం దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు జరుగుతోంది. సెంట్రల్ లండన్ మీదుగా నో-ఫ్లై జోన్‌ను ప్రకటించడంతో పాటు రూఫ్‌టాప్ స్నిపర్, రహస్య అధికారులు, అలాగే ఎయిర్పోర్ట్-స్టైల్ స్కానర్లు, స్నిఫర్ డాగ్‌లతో గట్టి భద్రతను ఏర్పాటు చేశారు. ఇదీ చదవండి: 18 ఏళ్లుగా ఒక్క మరక కూడా లేకుండా.. -
చార్లెస్–3 పట్టాభిషేకంలో... విశేషాలెన్నో!
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్–3కి మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆయనకు 74 ఏళ్లు. ఇప్పటిదాకా బ్రిటన్ ఏలికలుగా పట్టాభిషేకం చేసుకున్న వారిలో అత్యంత పెద్ద వయస్కుడు చార్లెసే! ఆయన వయసు మొదలుకుని కార్యక్రమపు ఖర్చు, అన్ని మతాల పెద్దలను భాగస్వాములను చేయడం దాకా ఎన్నో విశేషాలకు పట్టాభిషేక కార్యక్రమం వేదిక కానుంది... ► చారిత్రక వెస్ట్ మినిస్టర్స్ అబేలో పట్టాభిషేకం జరుగుతుంది. గత వెయ్యేళ్లుగా ఈ వేడుక ఇక్కడే జరుగుతూ వస్తోంది. ► ఉదయం 11కు కార్యక్రమం మొదలవుతుంది. ► చార్లెస్–3 సతీసమేతంగా బకింగ్‌హాం ప్యాలెస్ నుంచి చారిత్రక డైమండ్ జూబ్లీ రథంలో అట్టహాసంగా బయల్దేరతారు. రాణి ఎలిజబెత్–2 పాలనకు 60 ఏళ్లయిన సందర్భంగా 2012లో ఈ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఐదు దశల్లో... ► కార్యక్రమం ఐదు దశల్లో జరుగుతుంది. తొలుత ఆర్చిబిషప్ ఆఫ్ కాంటర్బరీ ముందుగా రాజును ప్రజలకు పరిచయం చేస్తారు. అనంతరం ‘గాడ్ సేవ్ కింగ్ చార్లెస్’ అంటూ ఆహూతుల ద్వారా గీతాలాపన జరుగుతుంది. ► మత గ్రంథంపై చార్లెస్ ప్రమాణం చేస్తారు. అనంతరం ఆయనను రాజుగా ప్రకటిస్తారు. ► తర్వాత కింగ్ ఎడ్వర్డ్ కుర్చీపై చార్లెస్ ఆసీనులవుతారు. పట్టాభిషేకానికి ఉపయోగించే ఈ కుర్చీ ఏకంగా 700 ఏళ్ల నాటిది. కింగ్ ఎడ్వర్డ్ నుంచి ఇప్పటిదాకా 26 మంది బ్రిటన్ ఏలికలు దీనిపై కూర్చునే పట్టం కట్టుకున్నారు. శిథిలావస్థకు చేరిన ఈ కుర్చీని పూర్తిస్థాయిలో రిపేరు చేశారు. ► తర్వాత అనూచానంగా వస్తున్న రాజ లాంఛనాలను ఒక్కొక్కటిగా చార్లెస్ అందుకుంటారు. ► వీటిలో కొన్నింటిని హిందూ, సిక్కు, ఇస్లాం తదితర మత పెద్దలు ఆయనకు అందజేయనుండటం విశేషం. హిందూ మతం తరఫున లార్డ్ నరేంద్ర బాహుబలి పటేల్ (84) చార్లెస్‌కు రాజముద్రిక అందజేస్తారు. ► తర్వాత కీలక ఘట్టం వస్తుంది. సంప్రదాయం ప్రకారం ప్రత్యేక వస్త్రపు ఆచ్ఛాదనలో ఆర్చిబిషప్ చేతుల మీదుగా చార్లెస్‌కు కిరీట ధారణ జరుగుతుంది. కిరీటం పరిమాణాన్ని చార్లెస్‌కు సరిపోయేలా ఇప్పటికే సరిచేశారు. ► ఈ ప్రత్యేక వస్త్రంపై భారత్‌తో పాటు కామన్వెల్త్ దేశాలన్నింటి పేర్లుంటాయని బకింగ్‌హాం ప్యాలెస్ ప్రకటించింది. ► తర్వాత యువరాజు విలియం రాజు ముందు మోకరిల్లుతారు. విధేయత ప్రకటిస్తూ ఆయన ముంజేతిని ముద్దాడతారు. ► తర్వాత సాదాసీదా కార్యక్రమంలో చార్లెస్ భార్య కెమిల్లాను రాణిగా ప్రకటించే తంతు ముగుస్తుంది. ► భారత మూలాలున్న హిందువు అయిన ప్రధాని రిషి సునాక్ ఈ సందర్భంగా పవిత్ర బైబిల్ పంక్తులు పఠించనుండటం విశేషం! ► చివరగా హిందూ, సిక్కు, ముస్లిం, బౌద్ధ, యూదు మత పెద్దల నుంచి చార్లెస్ శుభాకాంక్షలు అందుకుంటారు. రూ.1,000 కోట్ల ఖర్చు ► పట్టాభిషేక మహోత్సవానికి దాదాపు రూ.1,000 కోట్ల దాకా వెచ్చిస్తున్నారు. సంప్రదాయం ప్రకారం ఈ ఖర్చంతటినీ బ్రిటన్ ప్రభుత్వమే భరిస్తోంది. దేశం మాంద్యం కోరల్లో చిక్కి అల్లాడుతున్న వేళ ఎందుకీ ఆడంబరమంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే కార్యక్రమ ప్రత్యక్ష ప్రసార హక్కులు తదితరాల ద్వారా అంతకంటే ఎక్కువే తిరిగొస్తుందని సమాచారం. ఈ కార్యక్రమం దేశ పర్యాటకానికి ఎంతో ఊపునిస్తుందని సర్కారు ఆశ పడుతోంది! ► బ్రిటన్ పౌరుల్లో ఏకంగా 52 శాతం మంది ఈ రాచరికపు సంప్రదాయం కొనసాగింపును వ్యతిరేకించినట్టు ఇటీవలి సర్వేలో తేలింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బకింగ్‌హాం ప్యాలెస్ రేసిజం ఉదంతం: నేనూ రేసిజం బాధితున్నే.. రిషి సునాక్
లండన్: జాత్యహంకార భూతం తననూ బాధించిందని బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ వెల్లడించారు. భారత మూలాలున్న ఆయన బ్రిటన్‌లోనే పుట్టి పెరగడం తెలిసిందే. ‘‘బాల్యంలో, పెరిగి పెద్దవుతున్న దశలో నేను రేసిజాన్ని ఎదుర్కొన్నా. అయితే ఈ సామాజిక సమస్యను ఎదుర్కొనే విషయంలో నాటితో పోలిస్తే బ్రిటన్ ఇప్పుడు ఎంతో ప్రగతి సాధించింది’’ అని అభిప్రాయపడ్డారు. బకింగ్‌హాం ప్యాలెస్‌లో తాజాగా రేసిజం ఉదంతం వెలుగులోకి రావడం తెలిసిందే. దివంగత రాణి ఎలిజబెత్ 2 సన్నిహితురాలు, ప్రిన్స్ విలియం గాడ్‌మదర్ లేడీ సుసాన్ హసీ ప్యాలెస్‌లో పని చేస్తున్న ఒక ఆఫ్రికన్ ఉద్యోగిని పదేపదే ఆమె స్వస్థలం గురించి గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. ‘‘నేను బ్రిటిషర్నే అని ఎన్నిసార్లు చెప్పినా ఆఫ్రికాలో ఎక్కడి నుంచి వచ్చానంటూ సుసాన్ నన్ను పదేపదే నిలదీసింది. నా జుట్టును పక్కకు తోసి మరీ నా నేమ్ బ్యాడ్జ్‌ను పట్టి పట్టి చూసింది. ఇది నన్నెంతో బాధించింది’’ అంటూ సదరు ఉద్యోగి ట్వీట్ చేయడంతో వివాదం రేగింది. చివరికి సుసాన్ క్షమాపణలు చెబుతూ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది చాలా బాధపడాల్సిన విషయమని బకింగ్‌హాం ప్యాలెస్ పేర్కొంది. జాత్యహంకారానికి బ్రిటిష్ సమాజంలో స్థానం లేదంటూ ప్రిన్స్ విలియం దంపతులు కూడా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రిషి మీడియాతో మాట్లాడుతూ తన వ్యక్తిగత అనుభవాన్ని వివరించారు. ‘‘రేసిజం ఎక్కడ కన్పించినా తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. దాన్ని తుదముట్టించే దిశగా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. గతం నుంచి పాఠాలు నేర్చుకుంటూ మెరుగైన భవిష్యత్తు దిశగా సాగాలి’’ అన్నారు. -
‘కోహినూర్’పై బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీక్ష.. భారత్‌కు అప్పగిస్తారా?
లండన్: బ్రిటన్ మహారాణి ధరించే కిరీటంపై ఉండే 105 క్యారెట్ల కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని ఎప్పటి నుంచో డిమాండ్లు ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్ 2 మరణానంతరం ఆ డిమాండ్లు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే క్వీన్ కెమెల్లా పార్కర్ బౌల్స్, కింగ్ ఛార్లెస్ 3 పట్టాభిషేకంపై ప్రధానంగా చర్చ జరుగుతోంది. అయితే, కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన కాలం నాటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసినట్లవుతుందని బీజేపీ హెచ్చరికల నేపథ్యంలో బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో చర్చ జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2023, మే 6న జరగనున్న పట్టాభిషేకంలో క్వీన్ కామెల్లా.. కోహినూర్ వజ్రం ఉన్న కిరీటాన్ని ధరించాలా వద్దా అనే అంశంపై బకింగ్‌హామ్ ప్యాలెస్ అధికారులు పునఃసమీక్షిస్తున్నట్లు వార్తా సంస్థ టెలిగ్రాఫ్ పేర్కొంది. అత్యంత విలువైన కోహినూర్ వజ్రం భారత్‌కు చెందిందని, దానిని వినియోగించటాన్ని బీజేపీ వ్యతిరేకిస్తూ వస్తోంది. ‘పట్టాభిషేకంలో రాణి కెమెల్లా కోహినూర్ డైమండ్‌ను ధరించటం ద్వారా వలస పాలన నాటి చేదు జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. గత పాలన జ్ఞాపకాలను భారతీయులు ఇప్పుడిప్పుడే చెరిపివేస్తున్నారు. ఐదు శతాబ్దాలకుపైగా 5-6 తరాల భారతీయులు విదేశీ పాలనలో మగ్గిపోయారు. ఇటీవలి సందర్భాలైన క్వీన్ ఎలిజబెత్ 2 మరణం, క్వీన్ కెమెల్లా పట్టాభిషేకంలో కోహినూర్ పై చర్చ జరిగి బ్రిటీష్ పాలనలోకి భారతీయులను తీసుకెళ్లింది.’ అని బీజేపీ అధికార ప్రతినిధి ఒకరు టెలిగ్రాఫ్ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. మరోవైపు.. రాణి కిరీటం నుంచి కోహినూర్ వజ్రాన్ని తొలగించి దాని స్థానంలో మరో వజ్రాన్ని ఏర్పాటు చేసి ఉపయోగించాలని భావిస్తున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. బ్రిటన్‌లోని ప్రవాస భారతీయుల వీసా అంశంపై యూకే హోంశాఖ మంత్రి బ్రేవర్‌మ్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన క్రమంలో భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్టీఐ)పైనా నీలినీడలు కమ్ముకున్నాయి. ఇదీ చదవండి: రాజుగా చార్లెస్ ప్రమాణం -
బ్రిటన్ రాణి సమాధి ఫోటోలు వైరల్
లండన్: క్విన్ ఎలిజబెత్ ఇకలేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేక పలువురు ఆమెతో గడిపిన మధుర క్షణాలను జ్ఞప్తికి తెచ్చుకుంటూ భావోద్వేగం చెందారు. ఆమెకు అంతిమ వీడ్కోలు ఇచ్చేందుకు ప్రపంచ దిగ్గజ నాయకులు కదలి వచ్చారు. ఎంతో అట్టహాసంగా ఆమె అంత్యక్రియలు జరిగాయి. యావత్తు బ్రిటన్ దేశం ఆమెకు కన్నీటి వీడ్కోలు పలికింది. ఈ మేరకు బకింగ్‌హామ్ ప్యాలెస్ క్వీన్ ఎలిజబెత్ సమాధి ఫోటోలను విడుదల చేసింది. ఆమె సమాధిని కింగ్ జార్జ్ 6 మెమోరియల్ చాపెల్‌లో ఏర్పాటు చేశారు. మొత్తం సమాధిని బెల్జియన్ బ్లాక్ స్టోన్ రూపొందించిన లెడ్జర్ స్టోన్‌తో నిర్మించారు. అలాగే ఆ సమాధిపై బ్రిటన్ రాణి పేరు, ఆమె భర్త ఫిలిప్ తోపాటు, రాణి తల్లిదండ్రుల పేర్లను కూడా లిఖించారు. అంతేగాదు కింగ్ జార్జ్ 6 ఎవరో కాదు బ్రిటన్ రాణి తండ్రే. ఆయన విశ్రాంతి సమాధి వద్ద ఆమె సమాధిని కూడా ఏర్పాటు చేశారు. 1962లో ఈ మెమోరియల్ చాపెల్లోనే జార్జ్ 6 సమాధి ఏర్పాటు చేశారు. క్వీన్ ఎలిజబెత్ సెప్టెంబర్ 8న 96 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆమె తన ముత్తాతను వెనక్కినెట్టి 70 ఏళ్లపాటు సుదీర్ఘకాలం పాలించిన బ్రిటన్ రాణీగా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం దివగంత బ్రిటన్ రాణి పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్ 3 బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. (చదవండి: ఉక్రెయిన్‌కి హ్యాండ్ ఇచ్చిన ఇజ్రాయెల్...షాక్‌లో జెలెన్ స్కీ) -
రాణి తుది వీడ్కోలు.. ఆహ్వానం లేనిది వీళ్లకే!
లండన్: రాణి ఎలిజబెత్-2 మృతదేహం లండన్ వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఉంది. సోమవారం(19న) ఉదయం 6.30 గంటల వరకు ఉంటుందని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉదయం 11 గంటలకు రాణి అధికారిక అంత్యక్రియల కార్యక్రమం ప్రారంభమవుతుందని బకింగ్హమ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ దేశాల అధినేతలు, ప్రధానులు, ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై ఘన నివాళి అర్పించనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన సతీమణి జిల్ బైడెన్.. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రోన్, టర్కీ ఎర్డోగన్, బ్రెజిల్ జైర్ బోల్సోనారో, బ్రెగ్జిట్ పరిణామంతో సంబంధం లేకుండా యూరోపియన్ యూనియన్, యూరోపియన్ మండలి ప్రతినిధులకు సైతం ఆహ్వానం పంపింది రాజప్రసాదం. వీళ్లతో పాటు 56 దేశాల కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు సైతం హాజరు కానున్నారు. అయితే.. రాణి అంత్యక్రియలకు అధికారిక ఆహ్వానం అందనిది ఎవరికో తెలుసా?.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు. అవును.. ఉక్రెయిన్‌పై దురాక్రమణ నేపథ్యంలో ఆయనపై యూకే కూడా ఆంక్షలు, ట్రావెల్ బ్యాన్ విధించింది. అందుకే ఆయనకు క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు ఆహ్వానం అందించలేదు. అయితే రష్యా నుంచి ఏ ప్రతినిధిని ఆహ్వానించకపోవడంపై ఆ దేశ విదేశాంగ శాఖ నొచ్చుకుంది. ఈ చర్య అనైతికమంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక సిరియా, వెనిజులా, తాలిబన్ల పాలనలో ఉన్న అఫ్గనిస్తాన్‌కు అసలు ఆహ్వానం పంపలేదు. బెలారస్, మిలిటరీ పాలనలో ఉన్న మయన్మార్‌కు ఆహ్వానం పంపించలేదు యూకే. అలాగే కొన్ని చిన్నచిన్న దేశాలనూ కూడా మినహాయించింది. నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ పాలనలోని ఉత్తరకొరియా, నికారాగువా, ఇరాన్‌ల నుంచి దౌత్యవేత్త స్థాయి వాళ్లకు మాత్రమే ఆహ్వానం ఉంటుందని స్పష్టం చేసింది. భర్త సమాధి పక్కనే.. ఇక సోమవారం జరగబోయే అంత్యక్రియల కార్యక్రమం.. బ్రిటన్ వ్యాప్తంగా రెండు నిమిషాలు మౌనం పాటించడంతో ముగుస్తుంది. అనంతరం రాణి పార్ధివ దేహం ఉంచిన శవపేటికను వెస్ట్‌మినిస్టర్ అబేకు తరలిస్తారు. ఉదయం 8 గంటలకు వెస్ట్‌మినిస్టర్ అబే తలుపులు తెరుస్తారు. అక్కడ జరిగే కార్యక్రమాల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా వివిధ దేశాధినేతలు, ప్రతినిధులు 500 మంది హాజరవుతారు. రాణి శవపేటికను వెస్ట్ మినిస్టర్ అబే నుంచి విండ్సర్ క్యాజిల్ సమీపంలోని సెయింట్ జార్జ్ చాపెల్ వద్ద జరిగే కార్యక్రమం కోసం తరలిస్తారు. ఇక్కడ సాయంత్రం 4 గంటలకు రాయల్ వాల్ట్‌లోకి శవపేటికను దించుతారు. ఆర్చ్ బిషప్ ఆఫ్ కాంటెర్బరీ జస్టిన్ ఆశీర్వచనాల మధ్య అక్కడ చేరిన వారంతా ‘గాడ్ సేవ్ ది కింగ్’గీతాన్ని ఆలపిస్తారు. రాత్రి 7.30 గంటలకు జరిగే కార్యక్రమంలో భర్త ఫిలిప్ సమాధి పక్కనే రాణి పార్థివ దేహాన్ని ఖననం చేస్తారు. ఇదీ చదవండి: చావు నుంచి మళ్లీ పుట్టుక వైపు! -
‘ముద్ద ముట్టని పెంపుడు కుక్కలు’, ప్రిన్స్ ఛార్లెస్ ఫంక్షన్‌కు ‘రతన్ టాటా’ డుమ్మా!
అత్యధిక కాలం బ్రిటన్ను పరిపాలించిన రాణి ఎలిజబెత్-2 అస్తమయం కావడంతో యూకే రాజుగా ఆమె కుమారుడు, ప్రిన్స్ ఛార్లెస్ నియమితులు అయ్యారు. తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి యాక్సెషన్ కౌన్సిల్ శనివారం ఉదయం లండన్‌లోని చారిత్రక సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో సమావేశమై ఆయన్ను రాజుగా నియమిస్తున్నట్టు లాంఛనంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో బ్రిటన్ రాజుగా ప్రిన్స్ ఛార్లెస్, రాణి హోదాలో ఆయన భార్య కెమెల్లా పార్కర్ బౌల్స్ (75)లు అధికారికంగా సంతకాలు చేశారు. ఈ సందర్భంగా మనదేశానికి చెందిన నెటిజన్లు, వ్యాపార దిగ్గజాలు బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్, దేశీయ దిగ్గజం రతన్ టాటా'ల స్నేహాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 2018లో పెంపుడు కుక్కల విషయంలో రతన్ టాటా - ప్రిన్స్ ఛార్లెస్‌తో జరిగిన సంభాషణల్ని నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. రతన్ టాటా దాతృత్వానికి గుర్తింపుకు గాను ఆయనను లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించాలని 2018 ఫిబ్రవరి 6న ప్రిన్స్ ఛార్లెస్.. లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హమ్ ప్యాలెస్‌లో అవార్డుల ప్రదానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఆ అవార్డుల ప్రధానోత్సవానికి రతన్ టాటా హాజరు కాలేదు. ఎందుకో తెలుసా? రెండు పెంపుడు కుక్కల వల్ల. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఇది అక్షరాల నిజం. ఇదే అవార్డుల ప్రధానోత్సవానికి హాజరైన కాలమిస్ట్, వ్యాపార వేత్త సుహెల్ సేథ్ నాటి మధుర స్మృతుల్ని సోషల్ మీడియాతో పంచుకున్నారు. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ రతన్ టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు. రతన్ టాటాకు లైఫ్ టైమ్ అవార్డును ప్రధానం చేసేందుకు లండన్ రాయల్ రెసిడెన్సీ బంకింగ్ హమ్ ప్యాలెస్‌ను సర్వం సిద్ధం చేశారు. ‘‘ 2018 ఫ్రిబవరి 2,3 తేదీలలో బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈవెంట్ కోసం నేను లండన్‌కు చేరుకున్నాను. లండన్ ఎయిర్ పోర్ట్ దిగిన తర్వాత టాటా నుండి సుమారు 11 మిస్డ్ కాల్లు రావడంతో షాకయ్యా. వెంటనే నా బ్యాగ్‌లను తీసుకొని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వస్తూ ఆయనకు కాల్ చేశా. టాంగో, టిటో (రతన్ టాటా కుక్కలు ) అనారోగ్యానికి గురయ్యాయి. తిండి తినడం లేదు. నీళ్లు తాగడం లేదు. నేను వాటిని వదిలి రాలేను అని’’ తనతో చెప్పినట్లు సుహెల్ సేథ్ గుర్తు చేసుకున్నారు. ప్రిన్స్ చార్లెస్ ఈవెంట్‌కు టాటా వచ్చేలా నేను ప్రయత్నించా. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. టాటా తన అవార్డును స్వీకరించేందుకు రాలేదు. ఈ సందర్భంగా అవార్డుల కార్యక్రమానికి రతన్ టాటా ఎందుకు రాలేదో తెలుసుకున్న ప్రిన్స్ ఛార్లెస్.. టాటాపై ప్రశంసల వర్షం కురిపించారు.‘‘మనసున్న మారాజు..అతడే రతన్ టాటా ” అని ప్రిన్స్ చార్లెస్ అన్నట్లు సేథ్ తెలిపారు. -
బిన్నీ మిల్స్ సమ్మె
1920లలో మద్రాసులో బి అండ్ సి మిల్లుగా ప్రసిద్ధి చెందిన బకింగ్‌హామ్ అండ్ కర్నాటిక్ మిల్స్‌లో పని చేసే కార్మికులు సమ్మెకు నోటీసు ఇచ్చిన రోజు ఇది (జూన్ 20, 1921). ఆ ఏడాది జూన్ నుంచి అక్టోబర్ వరకు సాగిన కార్మికుల సమ్మె కారణంగా.. ఆ మిల్లు మాత్రమే కాకుండా, మొత్తం మద్రాసు ఆర్థిక పరిస్థితే దెబ్బతింది! జీతాలను పెంచాలని డిమాండ్ చేస్తూ కంపెనీ స్పిన్నింగ్ విభాగంలోని కార్మికులు మొదట మే 20న అకస్మాత్తుగా పని ఆపేశారు. యాజమాన్యం వారి డిమాండ్లకు తలొగ్గకపోవడంతో సరిగ్గా నెల రోజులకు సమ్మెను అధికారికంగా ప్రకటించారు. వారి సమ్మెకు కాంగ్రెస్ నాయకుడు కల్యాణసుందరం మొదలియార్ నాయకత్వం వహించారు. కార్మికులు దిగిరాకపోవడంతో మిల్లు అధికారులు నిర్దయగా వ్యవహరించారు. పోలీసులను పిలిపించారు. కార్మికులు ఆగ్రహావేశాలకు లోనయారు. అప్పుడు జరిగిన పోలీసు కాల్పుల్లో ఆరుగురు కార్మికులు మరణించారు. నాటి జస్టిస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా కలిసి కార్మికుల పక్షాన నిలిచారు. చివరికి ద్రవిడ ఉద్యమనేత నటేష మొదలియార్ మధ్యవర్తిత్వంతో సమ్మె ముగిసింది. అయితే ఎంపిక చేసిన కొంత మంది కార్మికులను మాత్రమే యాజమాన్యం తిరిగి పనిలోకి తీసుకుంది. 1996లో మిల్లు మూతపడింది. ప్రస్తుతం అక్కడ సినిమా షూటింగులు జరుగుతున్నాయి. (చదవండి: శతమానం భారతి విదేశీ వాణిజ్యం) -
అమ్మను చంపేశారు.. తనను కూడా వదలరా?: హ్యారీ
లండన్: ‘‘అమ్మ అంత్యక్రియల నాడు నాకు వినిపించిన గుర్రాల గిట్టల శబ్దం నుంచి.. కారులో నేను అమ్మతో ప్రయాణిస్తుండగా.. మమ్మల్ని వెంటాడిన ఫోటోగ్రాఫర్ల వరకు ప్రతి జ్ఞాపకం నన్ను ఇంకా వెంటాడుతూనే ఉంది.. అమ్మను కోల్పోయిన బాధ ఇప్పటికి నన్ను కలచివేస్తూనే ఉంది’’ అంటూ ప్రిన్స్ హ్యారీ భావోద్వేగానికి గురయ్యారు. ఇక అమ్మలాగే.. నా భార్యను కూడా కోల్పోతాననే భయంతోనే రాచకుంటుంబాన్ని విడిచిపెట్టి వెళ్లానని తెలిపాడు హ్యారీ. ఒక కొత్త టీవీ డాక్యుమెంటరీ సిరీస్ ది మీ యూ కాన్ట్ సీలో తన మనోవేదనను వెల్లడించారు హ్యారీ. హ్యారీ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మ తెల్ల జాతీయుడు కానీ మరో వ్యక్తితో రిలేషన్లో ఉన్న నాటి నుంచి.. ఆమె మరణం వరకు ఫోటోగ్రాఫర్లు తనను వెంబడిస్తూనే ఉన్నారు. చివరకు ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆమె మరణించిన తర్వాత కూడా వదల్లేదు. ఇప్పుడు తను(మేఫన్) చనిపోయే వరకు కూడా ఆగరు.. చరిత్ర పునరావృతం చేయాలని మీరు భావిస్తున్నారా’’ అంటూ ఆవేదనకు గురయ్యాడు. ఇది ఇలానే కొనసాగితే.. నా జీవితంలో మరో స్త్రీని కోల్పోయే అవకాశం ఉంది. అందుకే రాజ కుటుంబం నుంచి బయటకు వచ్చాను’’ అన్నాడు హ్యారీ. హ్యారీ, అతని అమెరికన్ భార్య మేఘన్ మార్కెల్ గురించి బ్రిటిష్ పత్రికలలో జాత్యహంకార వార్తలు వెలువడ్డాయి. అలానే సోషల్ మీడియాలో కూడా ఆమె గురించి తప్పుడు ప్రచారం జరిగింది. ఇక మేఘన్ మొదటిసారి గర్భవతిగా ఉన్నప్పుడు బ్రిటన్‌లో ఆమెకు ఎదురైన చేదు అనుభవాల వల్ల ఆత్మహత్య చేసుకోవాలని భావించిందని తెలిపాడు హ్యారీ. ఈజిప్టుకు చెందిన తన ప్రియుడు డోడి ఫయేద్‌తో కలిసి ప్రయాణిస్తున్న కారును ఛాయాచిత్రకారులు వెంబడించడంతో పారిస్‌లో జరిగిన ప్రమాదంలో యువరాణి డయానా 1997 లో 36 ఏళ్ళ వయసులో మరణించింది. ఆ సమయంలో హ్యారీకి 12 సంవత్సరాలు. ఈ డాక్యుమెంటరీలో, హ్యారీ తన సోదరుడు విలియం, తండ్రి ప్రిన్స్ చార్లెస్, మామ చార్లెస్ స్పెన్సర్‌తో కలిసి లండన్ వీధుల గుండా డయానా శవపేటిక వెనుక నడుస్తున్న నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘‘నేను ఆ దారి వెంబడి నడుస్తున్నాను.. నాకు గుర్రాల గిట్టల శబ్దం వినిపిస్తుంది.. నేను నా శరీరాన్ని విడిచిపెట్టి.. బయటకు వచ్చినట్లు అనిపించింది. ఉక్కిరిబిక్కిరి అయ్యాను’’ అంటూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నాడు హ్యారీ. ‘‘ఈ బాధను నేను దాదాపు 20 ఏళ్ల పాటు అణిచిపెట్టుకున్నాను.. తాగుడుకు అలవాటు పడ్డాను. కెమరాలు చూస్తే నాకు చాలా కోపం వస్తుంది. వీరు ఓ నిస్సహాయ మహిళను ఆమె తన కారు వెనక సీటులో మరణించే వరకు వెంటాడారు. ఆ సమయంలో నేను నా తల్లికి సాయం చేయలేకపోయాను.. మా అమ్మకు న్యాయం జరగలేదు.. నా బాల్యంలో మా అమ్మ విషయంలో ఏదైతే జరిగిందో.. దాని గురించి నాకు ఇప్పటికి కోపం వస్తుంది. ఇప్పుడు నాకు 36 ఏళ్లు.. కానీ ఇప్పుడు కెమరాలు చూసినా.. వారు నన్ను వెంటాడుతున్నట్లు ఆందోళనకు గురవుతాను. కెమరాల క్లిక్, ఫ్లాష్ చూస్తే.. నా రక్తం మరిగిపోతుంది’’ అన్నాడు హ్యారీ. ‘‘మేఘన్‌ను కలిసే వరకు నేను ఈ బాధ అనుభవించాను. ఆ తర్వాతే నేను థెరపీ తీసుకోవడం ప్రారంభించాను. ఇక మా బంధం కొనసాగితేనే.. నేను నా గతాన్ని ఎదుర్కోగలనని అనిపించింది. అందుకే తనను వివాహం చేసుకున్నాను అన్నాడు. ఈ విషయాలన్నింటిని హ్యారీ తన మీ యూ కాన్ట్ సీ సిరీస్‌లో తెలిపారు. అమెరికన్ టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేతో కలిసి హ్యారీ నిర్మించిన "మీ యూ కాన్ట్ సీ" సిరీస్ ఆపిల్ టీవీ + లో శుక్రవారం విడుదలైంది. చదవండి: మేఘన్ జాతివివక్ష ప్రకంపనలు -
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
-
ప్రిన్స్ ఫిలిప్ కన్నుమూత
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్–2 భర్త, ప్రిన్స్ ఫిలిప్ 99 ఏళ్ల వయసులో శుక్రవారం ఉదయం కన్నుమూశారు. నూరవ పుట్టిన రోజు వేడుకని మరో రెండు నెలల్లో చేసుకోవాల్సిన డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ రాణితో 73 ఏళ్ల సహచర్యాన్ని వీడి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని రాణి తరఫున బంకింగ్çహామ్ ప్యాలెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ‘‘విండ్సర్ కేజల్‌లో శుక్రవారం ఉదయం డ్యూక్ ఆఫ్ ఎడిన్బర్గ్ ప్రిన్స్ ఫిలిప్ ప్రశాంతంగా కన్ను మూశారు. బాధాతప్తమైన హృదయంతో రాణి తన భర్త మరణవార్తని ప్రపంచానికి వెల్లడించారు’’అని ఆ ప్రకటన పేర్కొంది. జూన్ 10న ఫిలిప్ శతవసంత వేడుకల్ని వైభవంగా నిర్వహించడానికి రాజకుటుంబం ఏర్పాట్లు చేస్తూ ఉన్న సమయంలో ఆయన మరణ వార్త వినడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఇటీవల ఆయన గుండెకు శస్త్రచికిత్స నిర్వహించిన విషయం తెలిసిందే. ఫిలిప్ మరణవార్త తెలుసుకోగానే ప్రపంచం నలుమూలల నుంచి సంతాప సందేశాలు వెల్లువెత్తాయి. ఎంతో మంది యువత జీవితాల్లో ఆయన స్ఫూర్తిని నింపారని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. యూకేతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొన్ని తరాల వారి ప్రేమాభిమానాలను ఆయన చూరగొన్నారని కొనియాడారు. ప్రిన్స్ మరణవార్త విని విండ్సర్ కేజల్‌కి జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చి గేటు బయటే పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిస్తున్నారు. ఫిలిప్, ఎలిజెబెత్ దంపతులకు ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ అన్నె, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ నలుగురు పిల్లలు. ఎనిమిది మంది మనవలు, మనవరాళ్లు, 10 మంది మునిమనవలు ఉన్నారు. మోదీ సంతాపం ప్రిన్స్ ఫిలిప్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. మిలటరీలో అద్భుతమైన కెరీర్‌తో పాటు, సామాజిక సేవలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్టుగా ట్వీట్ చేశారు. భారత్ పర్యటన వివాదాస్పదం రాణి ఎలిజెబెత్‌తో కలిసి ఫిలిప్ మూడుసార్లు భారత్ పర్యటనకు వచ్చారు. 1961, 1983, 1997లో ఆయన భారత్‌ని సందర్శించారు. 1961లో భారత్ పర్యటనకు వచ్చినప్పుడు ఫిలిప్ పులిని వేటాడడం వివాదాస్పదమైంది. జైపూర్ రాజ దంపతులతో కలిసి రాణి ఎలిజెబెత్, ఫిలిప్ వారి దగ్గర చనిపోయి పడి ఉన్న పులి ఫోటో అప్పట్లో ప్రకంపనలు సృష్టించింది. పర్యావరణ, జంతు ప్రేమికుడిగా అప్పటికే ఆయనకు ఒక గుర్తింపు ఉంది. వరల్డ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ యూకే అధ్యక్షుడిగా ఆయన ఆ ఏడాది నియమితులు కావడంతో పులిని కాల్చడం వివాదాన్ని రేపింది. అయితే ఆ తర్వాత ఆయన పర్యావరణ పరిరక్షణకు చేసిన కృషిని ఇప్పటికీ అందరూ గుర్తు చేసుకుంటారు. రాణికి కొండంత అండ గ్రీకు వంశంలో పుట్టిన ఫిలిప్.. యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడానికి తన రాచరిక హోదాలన్నీ వదులకున్నారు. ఆమె బ్రిటన్ సింహాసనం ఎక్కాక నీడలా వెన్నంటే ఉంటూ పాలనలో పూర్తిగా సహకరించారు. బ్రిటన్‌లో రాజ్యాంగబద్ధమైన హోదా ఏమీ లేకపోయినా రాణి పరిపాలనలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నో కార్యక్రమాల్లో రాణి వెనకాలే అడుగులో అడుగులు వేసుకుంటూ నడిచినప్పటికీ బ్రిటన్ రాచకుటుంబంలో ప్రతీ చోటా ఆయన ముద్ర కనిపిస్తూనే ఉంటుంది. రాజకుటుంబంలో ఆయన మాటే శాసనంగా మారింది. అందుకే రాణి ఎలిజెబెత్ తమ 50వ వివాహ వేడుకల్లో ‘‘నా భర్తే నాకు కొండంత బలం’’అంటూ తన ప్రేమని బహిరంగంగానే చాటుకున్నారు. భార్య చాటు భర్తలా మిగిలిపోకూడదని తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకోవడానికి సామాజిక సేవలోనే ఎక్కువ భాగం గడిపారు. ఎన్నో చారిటీలను నడిపారు. యువతరం బాగుంటేనే దేశ భవిష్యత్ బాగుంటుందని నమ్మిన ఫిలిప్ వారిని అన్ని విధాలుగా సంస్కరించాలని చూసేవారు. రాజకుటుంబంలో బూజుపట్టిన సంప్రదాయాల్ని విడనాడి ఆధునీకరణ విధానాలను ప్రవేశపెట్టాలని చూశారు కానీ అవి కుదరలేదు. ప్రిన్స్ ఫిలిప్ గొప్ప సాహసి. బ్రిటన్ నేవీ కమాండర్‌గా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో యుద్ధ నౌకలో సేవలందించారు. ఫిలిప్‌ది ముక్కు సూటి మనస్తత్వం. మనసులో అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తారు. ఆ మనస్తత్వమే ఆయనను చాలా సార్లు ఇబ్బందుల్లో పడేసింది. గ్రీకు వీరుడు, ఎలిజెబెత్ రాకుమారుడు ► జూన్ 10,1921: గ్రీకు రాజ కుటుంబంలో జననం ► 1939: బ్రిటిష్ రాయల్ నేవీలో కమాండర్‌గా ఉద్యోగం ► 1942: మొదటి లెఫ్ట్‌నెంట్‌గా అపాయింట్మెంట్ ► 1947: యువరాణి ఎలిజెబెత్‌ను పెళ్లాడడం కోసం గ్రీక్ డానిష్ రాయల్ టైటిల్స్‌ని వదులుకున్నారు ► నవంబర్ 20, 1947: ఎలిజెబెత్‌తో వివాహం ► 1951: నేవీ కెరీర్‌ను వదులుకొని ఎలిజెబెత్‌కు అండదండలు ► 2017: ప్రజా జీవితం నుంచి పదవీ విరమణ ► 2019: కారు ప్రమాదానికి లోనుకావడంతో డ్రైవింగ్‌ను వదిలేశారు, ఇదే ఏడాది ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి ► ఫిబ్రవరి 17 2021: ఆస్పత్రిలో చేరిక ► మార్చి 4 2021 : గుండెకు విజయవంతంగా చికిత్స ► మార్చి 16 2021 : ఆస్పత్రి నుంచి ప్యాలెస్‌కి ► ఏప్రిల్ 9: ప్రశాంతంగా తుది శ్వాస -
ప్రిన్స్ ఫిలిప్ మృతి: అంత్యక్రియలకైనా వస్తాడా.. లేదా?
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ (99) శుక్రవారం ఉదయం మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని బకింగ్‌హామ్ ప్యాలెస్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రిన్స్ ఫిలిప్ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ క్రమంలో ప్రస్తుతం బ్రిటన్ పౌరులతో పాటు ప్రపంచవ్యాప్తంగా రాజకుంటుంబాన్ని అభిమానించే వారి మదిలో ఒకటే ప్రశ్న మెదులుతుంది. ప్రిన్స్ ఫిలిప్ మనవడు ప్రిన్స్ హ్యారి తాతను కడసారి చూడటానికి అయినా వస్తాడా.. లేదా అనే దాని మీదే చర్చ జరుగుతోంది. అంతరంగిక విబేధాల వల్ల ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు గత కొద్ది కాలంగా రాచ కుటుంబానికి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గత నెలలో ప్రఖ్యాత అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే టాక్ షోలో ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కెల్లు తాము అంతఃపురంలో అనుభవించిన కష్ట నష్టాల గురించి ప్రపంచానికి వెల్లడించారు. జాతి వివక్షను ఎదుర్కొన్నానని.. మీడియా తనపై తప్పుడు కథల ప్రచారం చేసిందని.. ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని భావించినట్లు మేఘన్ తెలిపారు. ఇక వీరి ఇంటర్వ్యూ ప్రసారానికి ముందే ప్రిన్స్ ఫిలిప్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాతను పరామర్శించాల్సిందిగా బకింగ్‌హామ్ ప్యాలేస్ హ్యారీకి సందేశం పంపింది. కారణాలు తెలియదు కానీ ప్రిన్స్ హ్యారీ మాత్రం తాతగారిని చూడటానికి రాలేదని సమాచారం. మరి ఇప్పుడు అంత్యక్రియలకు అయినా హాజరవుతాడా లేదా అనే ప్రశ్న బ్రిటన్ జనాలను తొలచివేస్తుంది. అయితే దీని గురించి రెండు నెలల క్రితమే ది రాయల్ అజ్బర్వర్ అనే పత్రిక ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ప్రచురించడం గమనార్హం. ప్రస్తుతం హ్యారీ-మేఘన్ మార్కెల్లు అమెరికాలో నివాసం ఉంటున్నారు. చదవండి: వివక్షపై యుద్ధారావం ఆ ఇంటర్వ్యూ -
రాణిగారి అరుదైన ఫొటోలు..తీసింది ఎవరంటే!
ఇంతవరకు వెలుగులోకి రాని క్వీన్ ఎలిజబెత్ ఫొటోలు ఇవి. ఒక నేరస్థుడు తీసినవి! తొలిసారి బయట పడినవి. క్వీన్ ఎలిజబెత్ సింహాసనం మీద కూర్చున్న నిలువెత్తు తైలవర్ణ చిత్రం గీయడానికి తనే స్వయంగా దగ్గరుండి మరీ ఆ నేరస్థుడు రాణిగారి ఫొటోలు తీయించాడు. అతడు చనిపోయాక అతడి గదిలో ఆ ఫొటోలు ఇప్పుడు బయటపడ్డాయి. కోటలోకి అతడికి ప్రవేశం ఎలా లభించింది? అతడు గీసిన రాణిగారి చిత్ర పటానికి ఎలాంటి గౌరవం లభించింది? కర్టిస్ హ్యూపర్ ఆర్టిస్టుగా మారిన స్టాక్ బ్రోకర్. క్రూరుడైన తండ్రి. బలవంతపు వసూళ్ల నేరస్థుడు. ఆమెరికన్. 1986లో పోలీసుల కన్నుకప్పి తప్పించుకుని తిరుగుతూ బ్రిటన్ బకింహ్యాప్ ప్యాలెస్ లో దూరాడు. పరారీలో ఉన్న నేరస్థుడు కనుక ‘దూరాడు’ అనొచ్చు. అయితే ఆనాడు అతడు ఆర్టిస్టుగా అనుమతి పొంది రాణిసౌధంలోకి ప్రవేశించాడు. పెద్ద పోర్ట్రయిట్గా క్వీన్ ఎలిజబెత్ తైలవర్ణ చిత్రాన్ని గీయడానికి ‘ఫొటో షూట్’ చేశాడు. అతడు ఆ ఫొటోలు తీసినట్లు.. వాటిని చూస్తూ సింహాసనం మీద ఉన్నట్లుగా రాణిగారి చిత్ర పటాన్ని గీసినట్లు ఆయనకు, బ్రిటన్ ప్యాలెస్‌కు, బెర్ముడాలోని హామిల్టన్ సిటీ హాల్ నిర్వాహకులకు తప్ప తక్కిన ప్రపంచానికి తెలియదు. గత ఏడాది తన 75 ఏళ్ల వయసులో కర్టిస్ హూపర్ చనిపోయాడు. రాణిగారి బొమ్మ గీస్తున్న కర్టిస్ హ్యూపర్ (1986) రాణిగారి చిత్రాన్ని పెయింట్ చేసినందుకు అతడికి లభించిన మొత్తం ఇప్పటి విలువలో కోటీ ఎనభై లక్షల రూపాయలు! ఆ డబ్బు ఏమైందో తెలియదు. ముప్పై నాలుగేళ్లలో ఖర్చయిపోకుండా ఉంటుందా? తండ్రి ఎంత క్రూరుడైనా కావచ్చు. అతడు చనిపోయినప్పుడు బిడ్డలకు ఆ క్రూరత్వం గుర్తుకు రాదు. జేసన్‌కి కూడా కూడా గుర్తు రాలేదు. అతడికి ఇప్పుడు యాభై ఏళ్లు. ఫ్లోరిడా లో ఉంటున్నాడు. తండ్రి మరణించినప్పుడు కన్నీరు మున్నీరయ్యాడు. ఏడాది గడిచింది. తండ్రి జ్ఞాపకాల కోసం ఫ్లోరిడాలోని ఆయన గదిని తడుముతున్నప్పుడు జేసన్‌కు రాణిగారి పోర్ట్రయిట్ కోసం తీసిన కొన్ని ఫొటోలు, వాటిని చూస్తూ వేసినట్లుగా ఒక తైలవర్ణ చిత్రం కనిపించింది. ఆ ఫొటోలు క్వీన్ ఎలిజబెత్వి. క్వీన్ ముఖం, క్వీన్ చేతులు, క్వీన్ నడుము పైభాగం, క్వీన్ సైడ్ యాంగిల్స్, క్వీన్ సింహాసనం.. వాటన్నిటినీ వేర్వేరుగా తీసి ఉన్న ఫొటోలు అవి. చిత్రాన్ని గీస్తున్నప్పుడు అవసరమయ్యే సూక్ష్మ వివరాల కోసం క్లోజ్ అప్‌లో తీసుకున్న క్వీన్ కలర్ ఫొటోలు అవన్నీ. వాటితోపాటు ఒక చేతిగుడ్డ. ఆ గుడ్డపై రాణిగారు అద్దిన పెదవులు! పెయింటింగ్‌లో పెదవులకు రంగు కోసం రాణి గారి నుంచి ఆ ముద్దు వస్త్రాన్ని తీసుకున్నట్లున్నాడు తన తండ్రి. జేసన్ ఆశ్చర్యపోయాడు. క్వీన్ వ్యక్తిగత కార్యదర్శి రాబర్ట్ ఫెల్లోస్ నుంచి, బ్రిటన్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ కూతురు శారా నుంచి తన తండ్రికి వచ్చిన కొన్ని టెలిగ్రామ్‌లు కూడా ఆ గదిలో జేసన్‌ను ఆశ్చర్యపరిచాయి. తన తండ్రి ఎంత గొప్పవాడు అనుకున్నాడు. అప్పటి వరకు అతడికి తెలిసింది తన తండ్రిలోని స్టాక్ బ్రోకరు, నేరస్థుడే. ఈ ఫొటోలన్నీ బయటికి తీసి, లండన్‌లోని డెయిలీ మెయిల్ టీవీ ప్రతినిధిని పిలిపించి విషయాన్ని వెల్లడించాడు జేసన్. ఇప్పటి వరకు ఈ ఫొటోలను ప్రపంచం చూడలేదు. పోర్ట్రయిట్ మాత్రం బ్రిటన్ భూభాగం అయిన బెర్ముడాలోని హామిల్టన్ సిటీ హాల్లో ఉంది. అక్కడ తగిలించడం కోసం రాబర్ట్ ఫెల్లోస్ హూపర్ చేత వేయించిన చిత్రమే అది. రాణిగారు సింహాసనం మీద కూర్చున్న ఆ పెయింటింగ్ హామిల్టన్ సిటీ హాల్ లో ఉంటే, ఆ చిత్రానికి ఆధారం అయిన రాణిగారి ఫొటోలు ఫ్లోరిడాలో హూపర్ గదిలో బయటపడ్డాయి. హూపర్కి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆయన కూడా గత ఏడాది మరణించారు. హూపర్ రాణిగారితో కలిసి భోజనం చేసేవారని, రాణిగారి పెయింటింగ్‌ను వేసి ఇచ్చాక, మరో పెయింటింగ్ వేసేందుకు 2018 లో హూపర్కు ఆఫర్ వచ్చిందని ఆ స్నేహితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హూపర్లోని మహా చిత్రకారుడిని కొద్దిసేపు పక్కన పెడితే.. సొంత కొడుకునే (జే సన్) కిడ్నాప్ చేసి తన రెండో భార్య దగ్గర ఉంచి, మొదటి భార్య నుంచి డబ్బును గుంజేవాడని అతడి గురించి డైలీ మెయిల్ ప్రతినిధి జోష్ బోస్వెల్ కొంత సమాచారాన్ని రాబట్టారు. రెండేళ్ల తర్వాత పోలీసుల చిన్నారి జేసన్‌ను తండ్రి హూపర్ చెర నుంచి విడిపించి అసలు తల్లి దగ్గర కు చేర్చారు. ఆ తర్వాత కూడా కొడుకు పెంపకం కోసం అతడు డబ్బేమీ పంపలేదని అతడిపై ఫిర్యాదుఉంది. సమాజంలోని కొందరు సుప్రసిద్ధులైన వారి భార్యలను తన తండ్రి ప్రేమ పేరు తో మోసం చేసి, వారి భర్తల దగ్గర్నుంచి డబ్బును ఆశించేవాడని కూడా జేసన్ ఇప్పుడే ఫొటోలతో పాటు బయటపెట్టాడు. తనకు పిల్లలు లేరని తన స్నేహితులతో చెప్పేవారట హూపర్! జేసన్‌తో పాటు అతడికి ఒక కూతురు కూడా ఉంది. ఆమె చనిపోతే అంత్యక్రియలకు కూడా హూపర్ వెళ్లలేదట! జేసన్‌కి ఇప్పటికీ అర్థం కాని విషయం ఒక్కటే. తన తండ్రికి బకింVŠ హామ్ ప్యాలెస్‌లోకి అసలు చోటు ఎలా లభించిందన్నది! రాబెర్ట్ ఫెల్లోస్ను బయట ఎక్కడో పరిచయం అయినట్లున్నాడు హూపర్. అది చాలదా! అయితే రాణిగారి పెయింటింగ్స్ వేసేటప్పటికి అతడిపై అరెస్ట్ వారెంట్ ఉన్నట్లు ప్యాలెస్ అధికారులకు తెలియకుండా ఉందా అన్నది సమాధానం లేని ప్రశ్న. -
ప్రిన్సెస్ గౌరమ్మ
స్వేచ్ఛను కోరుకునే మనసు ప్రేమలోనైనా బందీగా ఉండలేదు. బ్రిటన్ కుటుంబంలో రాణిలానూ ఉండిపోలేదు. భర్త నుంచి డయానా, బకింగ్ హామ్ ప్యాలెస్ నుంచి మేఘన్.. ఇద్దరూ స్వేచ్ఛను కోరుకున్న వాళ్లే. ఆ స్వేచ్ఛ కోసమే వాళ్లు తమ రెక్కల్ని తెంపుకున్నారు! వాళ్లిద్దరికంటే ముందు ఆ అంతఃపురంలో గౌరమ్మ అనే బాలిక.. ‘ప్రిన్సెస్’ గా స్వేచ్ఛ కోసం పెనుగులాడింది. తన కన్నా ముప్పై ఏళ్లు పెద్దవాడైన భర్తలోని తండ్రి ప్రేమను భరించలేక, క్వీన్ విక్టోరియా కనురెప్పల కింద భద్రంగా జీవించలేక పారిపోవాలని అనుకుంది. సాధ్యం కాలేదు. ప్రేమకు, భద్రతకు బందీగా 23 ఏళ్ల వయసులోనే కన్నుమూసింది! ఎవరీ ప్రిన్సెస్ గౌరమ్మ? ప్యాలెస్‌లోకి ఎలా దారి తప్పింది? మేఘన్ రాణివాస జీవితానికి పూర్వఛాయలా అనిపిస్తున్న గౌరమ్మ అసలు ఏ ఊరి చిన్నారి?! ఎవరి పొన్నారి? అన్నమూ నీళ్లూ లేకున్నా మనుషులు కొన్నాళ్లు జీవించి ఉండగలరు. ప్రేమ లేని చోట ఒక్కక్షణం కూడా ఉండలేరు. అది పూరిల్లు అయినా, అంతఃపురం అయినా! లేడీ డయానాకు బకింగ్ హామ్ ప్యాలెస్‌లో ప్రేమ లభించలేదు. ఆమె కోరుకున్న ప్రేమ.. ప్యాలెస్ నుంచి కాదు. భర్త నుంచి. చివరికి మానసికంగా భర్తకు, ప్యాలెస్‌కు కూడా దూరం అయ్యారు డయానా. ప్రేమ లేని జీవితం భారమై, దుర్భరమై ప్రేమ కోసం పరుగులు తీస్తూ బతుకునే పోగొట్టుకున్నారు. 1997 ఆగస్టు 31న ప్యారిస్ లో ఆమె ప్రయాణిస్తున్న కారు టన్నెల్ రోడ్డుకు ఢీకొని మరణించారు. బ్రిటన్ ప్యాలెస్ ఎన్నటికీ మరువలేని విషాదం అది. విషాదం కన్నా కూడా విపత్తు. రాజవంశానికి అప్రతిష్టగా మాత్రమే ఆ దుర్ఘటనను ప్యాలెస్ ఆనాడు పరిగణించింది! ∙∙ బ్రిటన్ రాజప్రాసాదం దృష్టిలో అలాంటి అప్రతిష్టనే ఇప్పుడు మేఘన్ మార్కెల్ తెచ్చిపెట్టారు. క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమెరికన్ యువతి మేఘన్. భర్త నుంచి దొరికిన ప్రేమ ఆమెకు అతడి కుటుంబ సభ్యుల నుంచి మాత్రం లభించలేదు. ఉన్నన్నాళ్లు గుట్టుగా ఉన్నారు. ఇంక ఉండలేను అనుకోగానే ప్యాలెస్ నుంచి బయటికి వచ్చేశారు. ప్రిన్స్ హ్యారీ ఆమె వైపు గట్టిగా నిలబడ్డారు కనుకే ఆమె స్వేచ్ఛా వాయువుల్ని పీల్చుకోగలిగారు. ప్యాలñ స్ నుంచి మేఘన్ వెళ్లిపోవడాన్ని పెద్ద విషయంగా లెక్కలోకి తీసుకోని రాణిగారు, తామెందుకని రాచకుటుంబంతో తెగతెంపులు చేసుకుని బయటికి వచ్చారో ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో ఆమె చెప్పడాన్ని మాత్రం తలవంపులుగా భావించారు. ఇప్పుడిక ప్రిన్సెస్ గౌరమ్మ వార్తల్లోకి వచ్చారు. అయితే బ్రిటన్ వార్తల్లోకి కాదు. భారతీయ పత్రికల్లోకి. ‘‘పెళ్లితో ఆ రాజ కుటుంబంలోకి అడుగుపెట్టి నిరాదరణకు గురైన మహిళల్లో డయానా, మేఘన్ మాత్రమే తొలి వ్యక్తులు కారు. పందొమ్మిదో శతాబ్దంలోనే క్వీన్ విక్టోరియా హయాంలో గౌరమ్మ అనే బాలిక ‘ప్రిన్సెస్’గా ఆ బంగారు పంజరంలో చిక్కుకుని బయటికి వచ్చే దారిలేక పారిపోయేందుకు ఆలోచనలు చేసిందని చరిత్రకారులు నాటి సంగతుల్ని మళ్లీ తవ్వి తీస్తున్నారు. ప్రిన్సెస్ గౌరమ్మతో ప్రిన్స్ హ్యారీ భార్య మేఘన్ని పోల్చి చూస్తున్నారు. ఎవరీ గౌరమ్మ?! నిజంగానే బ్రిటన్ రాచ కుటుంబం గౌరమ్మ పట్ల అంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిందా? అది దయలేకపోవడమా లేక కట్టుబాట్లను శిరసావహించమని ఆదేశించడమా? ∙∙ డయానాను పక్కన పెడితే.. బ్రిటన్ రాజకుటుంబంలో వివక్షకు గురైన గోధుమవర్ణ చర్మం గల రెండో మహిళ మేఘన్ మార్కెల్. మొదటి మహిళ ప్రిన్స్ గౌరమ్మ. పదేళ్ల వయసు లో గౌరమ్మ అంతఃపురానికి వచ్చేనాటికి బ్రిటన్ ను క్వీన్ విక్టోరియా పరిపాలిస్తూ ఉన్నారు. గౌరమ్మ తండ్రి కూర్గ్ రాజు చిక్కా వీర రాజేంద్ర. ఈస్ట్ ఇండియా కంపెనీవాళ్లు అతడిని పదవీచ్యుతుడిని చేసి, సంపదను కొల్లగొట్టారు. అందులో కొంత భాగాన్నయినా తిరిగి తనకు దక్కులా చేయమని విన్నవించుకోడానికీ, తన ముద్దుల కూతురు గౌరమ్మను ఆమె రక్షణ కోసం రాణిగారికి దత్తత ఇవ్వడానికి.. ఆ రెండు కారణాలతో.. ఆయన గౌరమ్మను వెంటబెట్టుకుని వెళ్లి రాణిగారిని కలిశారు. అది 1852వ సంవత్సర ఆరం¿¶ కాలం. మొదటి పని కాలేదు. రెండో పని అయింది. విక్టోరియా రాణి గౌరమ్మను దత్తత తీసుకున్నారు. ‘‘నా తల్లి ఇక మీది. తనని మీలో కలిపేసుకున్నా (బాప్తిజం) అభ్యంతరం లేదు’’ అని కూతుర్ని రాణిగారి చేతుల్లో పెట్టి వెనుదిరిగారు వీర రాజేంద్ర. గౌరమ్మ అందంగా ఉంది. ఇకపై మరింత అందంగా మారబోతోంది. అందం మాత్రమే కాదు అలవాట్లు, ఆచారాలు కూడా. 1852 జూన్‌లో విండ్సర్ క్యాజిల్‌లో (మరొక రాజసౌధం) గౌరమ్మకు రాచ కుటుంబం బాప్తిజం ఇప్పించడం ఆనాటి పత్రికల్లో విశేష ప్రచారానికి నోచుకుంది. రాణిగారితో కలిసి ఉన్న గౌరమ్మ ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. ఆనాటి నుంచి గౌరమ్మ ‘ప్రిన్సెస్ గౌరమ్మ’ అయింది. అయితే అది రాణిగారి సంతోషమే కానీ గౌరవ సంతోషం కాదు. ఆ చిన్నారి తన కొత్త పాత్రలో, కొత్త మనుషుల మధ్య, కొత్త ఆచారాల వ్యవహారాలలో ఇమడలేకపోయింది. క్వీన్ విక్టోరియా ఆమెను అమితంగా ఇష్టపడేవారు. అదే ఆ పసిదానికి కష్టాలను తెచ్చిపెట్టింది. చుట్టూ పరిచారకులు ఉండేవారు. తన ఇష్టానుసారం కాలూ చెయ్యి ఆడనిచ్చేవారు కాదు. రాణిగారితో మాటొస్తుందని వారి భయం. అసలు కష్టం ప్రిన్స్ గౌరమ్మకు తన 16వ యేట వచ్చింది. గౌరమ్మను మహారాజా దులీప్ సింగ్‌కు ఇచ్చి చేయాలని రాణి గారు తలపోయడమే ఆ కష్టం. గౌరమ్మ కన్నా పదహారేళ్లు పెద్దవాడు దులీప్‌సింగ్. గౌరమ్మకూ పెళ్లంటే ఇష్టం లేదు. ఎప్పుడు ఆ బంధనాల్లోంచి పారిపోదామా అన్నట్లు ఉండేదా అమ్మాయి. అది గమనించాడు దులీప్‌సింగ్. తనకు ఆమెతో పెళ్లి ఇష్టం లేదన్నాడు. అలా ఆ కష్టాన్ని అతడే తప్పించాడు. అయితే గౌరమ్మకు నిజమైన కష్టం తండ్రిని కలవనివ్వకుండా కట్టడి చెయ్యడం! కలిస్తే మళ్లీ పాతబుద్ధులే వస్తాయని రాణిగారు ఆందోళన చెందేవారట. ‘‘ఎక్కడికైనా పారిపోయి, పనిమనిషిగానైనా బతికేందుకు గౌరమ్మ సిద్ధపడింది’’ అని క్వీన్ విక్టోరియా ఆంతరంగిక కార్యదర్శి ఆ తర్వాతి కాలంలో బహిర్గతం చేసినట్లు చరిత్రకారులు రాశారు. మొత్తానికి ఇప్పుడు మేఘన్‌కు అయినట్లే, అప్పుడు గౌరమ్మ కు అయింది. ఒక్కరైనా ఆమెను పట్టించుకోలేదు. స్వేచ్ఛ కోసం పరితపిస్తున్న ఆ మనసును తెలుసుకోడానికి ప్రయత్నించలేదు. ఏ ప్రయత్నమూ లేకుండా తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి కల్నల్ జాన్ కాంప్‌బెల్. ప్రిన్స్ గౌరమ్మ కొత్త పరిచారిక లేడీ లోజిన్ సోదరుడే జాన్ కాంప్‌బెల్. ∙∙ కాంప్‌బెల్.. గౌరమ్మ కన్నా 30 ఏళ్లు పెద్ద. వాళ్లిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు అక్కడికి రాకపోకలు సాగిస్తుండే దులీప్ సింగ్ గమనించి, రాణిగారికి ఆ విషయాన్ని చేరవేయడంతో క్షణమైనా ఆలస్యం చేయకుండా ఇద్దరికీ వివాహం జరిపించారు. లేడీ లోజిన్ నిర్ఘాంతపోయారు. గౌరమ్మ తమ ఆడపడుచు అవడం లోజిన్కు ఇష్టం లేదు. కానీ రాణిగారి నిర్ణయం! 1861లో ప్రిన్స్ గౌరమ్మకు ఇరవై ఏళ్ల వయసులో ఆడబిడ్డ పుట్టింది. ఆ పాపకు ఎడిత్ విక్టోరియా కాంప్‌బెల్ అని పేరు పెట్టారు. తర్వాత మూడేళ్లకు ప్రిన్స్ గౌరమ్మ 1864లో తన ఇరవై మూడవ యేట చనిపోయింది. ఆమె మరణానికి కారణం ఏమిటన్నది మాత్రం చరిత్రలో నమోదు అవలేదు! కుటుంబ సభ్యుల ప్రేమ కోసం, స్వేచ్ఛ కోసం పెనుగులాడిన లేడీ డయానా, మేఘన్ మార్కెల్‌ల జీవితంలోనూ నమోదు కానీ, నమోదు అయ్యే అవకాశం లేని వ్యక్తిగత విషయాలు ఉంటే ఉండొచ్చు. ఓప్రా విన్ ఫ్రేకు ఇచ్చిన ఇటీవలి ఇంటర్వ్యూలో ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్ మార్కెల్ -
ప్యాలెస్‌లో ఉండగా చనిపోవాలనిపించింది: మేఘన్
వాషింగ్టన్: అమెరికన్ టీవీ హోస్ట్ ఓప్రా విన్ఫ్రే నిర్వహించే ఇంటర్వ్యూలంటే ప్రపంచ వ్యాప్తంగా జనాలు తెగ ఆసక్తి కనబరుస్తారు. ఎందుకంటే ఆమె ఇంటర్వ్యూలు సాధరణంగా ఉండవు.. వచ్చిన అతిథులు మనసు విప్పి మాట్లాడేలా చేసే శక్తి ఓప్రా సొంతం. ఈ క్రమంలో తాజాగా రెండు రోజుల క్రితం శనివారం ప్రసారం అయిన ఇంటర్వ్యూ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు జనాలు. ముఖ్యంగా బ్రిటన్ ప్రజలు. ఎందుకంటే ఈ సారి ఓప్రా ఇంటర్వ్యూ చేసింది.. రాజకుటుంబం నుంచి వేరు పడిన ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్ని. కనుక ఈ ఇంటర్వ్యూ పట్ల అధిక ఆసక్తి కనబరిచారు. ఇక యువరాజు హ్యారీ దంపతులు ఓప్రా విన్ఫ్రేకు ఇచ్చిన ఇంటర్వ్యూ శనివారం ప్రసారమయ్యింది. తన క్యారక్టర్‌పై మీడియా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తోందని మండిపడి మేఘన్ మార్కెల్.. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తమ వివాహం జరిగిన తీరు, ఆ సమయంలో జరిగిన సంఘటనలను మేఘన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. రాజకుటుంబం అధికారికంగా వివాహం నిర్వహించడానికి మూడు రోజుల ముందే తాము రహస్యంగా పెళ్లిచేసుకున్నట్టు తెలిపారు. ఈ విషయం ఎవరికీ తెలియదు, కానీ, ఆర్చ్‌బిషప్‌ను పిలిచి తామే ఆయనతో చెప్పామన్నారు మేఘన్. ‘‘ఈ విషయం, ఈ దృశ్యం ప్రపంచం కోసం, కానీ మా ఇద్దరి మధ్య బంధం ముడిపడిపోయింది’’ అని ఆర్చ్‌బిషప్‌తో చెప్పినట్టు వివరించారు. హ్యారీ, మేఘన్ మార్కెల్‌కు అధికారికంగా 2018 మే 19న బెర్క్‌షైర్ కౌంటీలోని విన్సర్ పట్టణంలోని రాజ భవనం విన్సర్ క్యాజిల్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. గాసిప్‌లతో సుదీర్ఘకాలం పోరాటం చేయాల్సి వచ్చిందని, ఇదే రాజకుటుంబంతో సంబంధాల్లో మలుపు తిప్పిందని అన్నారు. ఇది నిజం కాదని అక్కడ ప్రతి ఒక్కరికీ తెలుసు, కానీ ప్రచారం మాత్రం రివర్స్‌లో జరిగిందన్నారు. ఇంటర్వ్యూలోని ఆసక్తికర అంశాలు.... మేఘన్-హ్యారీకి తొలుత కుమారుడు జన్మించిన సంగతి తెలిసిందే. అయితే పుట్టిన బిడ్డ విషయంలో రాజ కుటుంబం దారుణంగా ప్రవర్తించిందని.. ప్రొటోకాల్ ప్రకారం తమ బిడ్డకు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వలేదని.. పైగా బిడ్డ రంగు గురించి మాట్లాడుకున్నారని తెలిపారు మేఘన్. ప్యాలెస్‌లో ఉన్నప్పుడు చాలా సార్లు తాను ఒంటిరిగా ఫీలయ్యానని.. చాలా సార్లు చనిపోవాలనిపించింది అన్నారు మేఘన్. తమ వివాహ సమయంలో తోటి కోడలు కేట్ ఏడ్చిందనే వార్తలను మేఘన్ ఖండించారు. ఈ విషయంలో రివర్స్‌లో ప్రచారం జరిగిందని.. వాస్తవానికి ఏడ్చింది తాను అన్నారు మేఘన్. తన డ్రెస్ విషయంలో కేట్ తనపై కేకలు వేసిందని.. అది తనను చాలా బాధించిందని తెలిపారు. ఈ పరిణామం తర్వాత మీడియాతో తన సంబంధాలు పూర్తిగా మారిపోయాయి అన్నారు. తమ కుటుంబ సభ్యులను కాపాడుకోవడం కోసం ప్యాలెస్‌లోని వారు ఎన్ని అబద్దాలు ఐనా చెప్తారన్నారే మేఘన్. తాము రాజ కుటంబం నుంచి విడిపోయి.. ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి విడిగా బతకాలని వెల్లడించినప్పటి నుంచి ప్యాలెస్ నుంచి తమకు డబ్బు రావడం ఆగిపోయిందని తెలిపారు హ్యారీ. తన తల్లి డయానా తన కోసం దాచిన సొమ్ముతోనే ప్రస్తుతం కుటుంబాన్ని పోషిస్తున్నానని తెలిపారు. సెక్యూరిటీని కూడా తొలగించారన్నారు. మేఘన్ వల్లనే తాను కుటుంబం నుంచి విడిపోయాననే వార్తల్ని హ్యారీ ఖండించారు. మేఘన్ నా జీవితంలోకి రాక ముందు నుంచే నేను ఈ చట్రం నుంచి బయటపడాలని భావించాను. ఇక్కడ ప్రతి ఒక్కరు ట్రాప్ చేయబడ్డారు. నా తండ్రి, సోదరుడు అందరు ట్రాప్ చేయబడ్డారు.. కానీ వారు బయటపడలేరు.. వారిని చూస్తే నాకు జాలేస్తుంది’’ అన్నారు. అన్నదమ్ములిద్దరి మధ్య ప్రస్తుతం గ్యాప్ వచ్చిందని.. కానీ కాలమే అన్నింటిని నయం చేస్తుందని తెలిపారు హ్యారీ. ‘‘విలియమ్ అంటే నాకు చాల ప్రేమ.. తను నా సోదరుడు. మేం మా అభిప్రాయలను ఒకరితో ఒకరం పంచుకుంటాము. కానీ మేం ఇద్దరం వేర్వేరు మార్గాల్లో పయనిస్తున్నాం’’ అన్నారు. అంతేకాక త్వరలోనే తమకు ఆడపిల్ల పుట్టబోతుంది అని తెలిపారు. చదవండి: ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు మీడియా ఒత్తిళ్లు తట్టుకోలేకపోయా -
ప్రిన్స్ ఫిలిప్ ఆఖరి చూపుకైనా వస్తారా..?
జీసస్! ప్రిన్స్ ఫిలిప్ (99) ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. ఆయన్ని లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ సెవన్ హాస్పిటల్ నుంచి అత్యవసరంగా లండన్ లోనే ఉన్న సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి తరలించారు. ‘తాత గారికి గుడ్ బై చెప్పడం కోసం స్టార్ట్ ఇమీడియట్లీ‘ అని యూఎస్‌లో ఉంటున్న ప్రిన్స్ హ్యారీకి కబురు వెళ్లింది. అయ్యో దేవుడా.. బ్రిటన్ రాచకుటుంబం కోసం పొంచి ఉన్న విపత్తు ఇదొక్కటే కాదు. ఈ నెల 7 న ప్రిన్స్ హ్యారీ (36), మేఘన్ (39) దంపతుల తొంభై నిముషాల ఓప్రా విన్ ఫ్రే ‘టెల్–ఆల్’ ఇంటర్వ్యూ అమెరికన్ టీవీ ఛానెల్ సి.బి.ఎస్.లో ప్రసారం కాబోతోంది! ఆ ప్రసారాన్ని రద్దు చేయించమని, కనీసం వాయిదా వేయించమని రాయల్ ఫ్యామిలీ హ్యారిస్ ను కోరుతోంది. ‘అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం.. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం..’ అని ఏడాది క్రితం రాణిప్రాసాదం వీడి వెళ్లిన హ్యారీ.. తాతగారిని చూడ్డానికి భార్య సహా వస్తారా? ఓప్రా ఇంటర్వ్యూ ఆగిపోతుందా? అందులో ఈ దంపతులు ఏం చెప్పి ఉంటారు? తన భార్యను సరిగా ట్రీట్ చేయనందుకే హ్యారీ తనకా రాచరికం, రాజసౌధం వద్దనుకున్నారా? పెద్దాయన ప్రిన్స్ ఫిలిప్ పరిస్థితి ఏమీ బాగోలేదు! 99 ఏళ్ల వయసులో ఇంకేం బాగుంటుంది అనుకోడానికి మనసు రానంతగా బ్రిటన్ ప్రజలు వారసత్వంగా ఆ కుటుంబంతో బలమైన ఒక ఆత్మీయ బంధాన్ని ఏర్పచురచుకుని ఉన్నారు కనక ఆసుపత్రి నుంచి ఆయన త్వరగా కోలుకుని రావాలని ప్రార్థనలు చేస్తున్నారు. ఆ ప్రార్థనలో అంతర్లయగా మరొక ప్రార్థన కూడా కలిసి ఉంది! కొన్ని నెలల క్రితం బ్రిటన్ రాజ ప్రాసాదాన్ని శాశ్వతంగా వీడి వదిలిపోయిన ప్రిన్స్ హ్యారీ.. దాదాపుగా మరణశయ్యపై ఉన్న తన తాతగారు ప్రిన్స్ ఫిలిప్‌ను ఆఖరి చూపైనా చూసేందుకు వచ్చేవిధంగా ఆయన మనసు మార్చాలని రాజసౌధంతోపాటు, దేశ ప్రజలూ దేవుణ్ని కోరుకుంటున్నారు. వస్తే ఆయన ఒక్కరే రారు. తన భార్య మేఘన్ మార్కెల్‌ను వెంటపెట్టుకుని రావలసిందే. ఆమె రాక కనుక క్వీన్ ఎలిజబెత్‌కు అసహనాన్ని కలిగించే అవకాశం ఉందని తెలిస్తే కనుక ప్రిన్స్ హ్యారీ బ్రిటన్‌కు రాకపోవచ్చు. అయితే ఆయన భార్య పేరెత్తకుండా బకింగ్‌హామ్ ప్యాలెస్ ఆంతరంగిక కార్యదర్శులు ‘వెంటనే వచ్చి తాతగారిని చూసి వెళ్లండి’ అని ప్రిన్స్ హ్యారీకి వర్తమానం పంపించారు. అది ఏమాత్రం అస్పష్టంగా లేని వర్తమానం! ‘లండన్ వచ్చి ప్రిన్స్ ఫిలిప్‌కి ‘గుడ్‌బై’ చెప్పవలసిందిగా సూచిస్తున్నాం’ అని వారు తెలియజేశారు. ప్రిన్స్ ఫిలిప్ క్వీన్ ఎలిజబెత్ (94) భర్త. ఫిబ్రవరి 16న ఆయన ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి లండన్‌లోని కింగ్ ఎడ్వర్డ్ సెవెన్ ఆసుపత్రికి మార్చారు. ఆరోగ్యంలో కనీసస్థాయి మెరుగుదల కూడా కనిపించకపోవడంతో మార్చి 1న లండన్‌లోనే మరొకటైన సెయింట్ బర్తోలోమ్యూ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం అక్కడే ఆయనలోని ఇన్ఫెక్షన్లకు చికిత్స జరుగుతోంది. అక్కడే ఆయన్ని వైద్య నిపుణుల పరిశీలనలో ఉంచారు. ఈలోపే ప్రిన్స్ హ్యారీ రమ్మని కబురు వెళ్లడంతో.. ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యంపై అనుమానాలు బ్రిటన్‌ని కమ్మేశాయి. మొన్నటి వరకు ప్రిన్స్ ఫిలిప్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందిన రాజకుటుంబం ఇప్పుడు.. తాతగారిని చూడ్డానికి ప్రిన్స్ హ్యారీ వస్తారా రారా అని ఆందోళ చెందుతోందని బ్రిటన్ టాబ్లాయిడ్లు అదే పనిగా ముఖచిత్ర కథనాలను రాస్తున్నాయి. ఆ టాబ్లాయిడ్లే తమను బ్రిటన్ నుంచి తరిమికొట్టాయిని అమెరికాకు మారిన కొత్తలో ప్రిన్స్ హ్యారీ దంపతులు ఆరోపించినప్పటికీ.. రాణిగారి కుటుంబంలో తన సతీమణికి గౌరవ మర్యాదలు లభించడం లేదన్న ఆవేదనతోనే ప్రిన్స్ హ్యారీ తన వంశవృక్షంతో తెగతెంపులు చేసుకున్నారని ఆ కుటుంబానికి సన్నిహితులైన కొందరి నోటి ద్వారా ఏనాడో బహిర్గతం అయింది. క్వీన్ ఎలిజబెత్, మనవడు ప్రిన్స్ హ్యారీ ముఖాముఖి మాట్లాడుకుని కూడా నెలలు అవుతోంది. గతంలో క్రిస్మస్లకు కలుసుకున్న సందర్భంలోనూ ఒకరితో ఒకరు ముభావంగానే ఉండిపోయినట్లు పత్రికలు రాశాయి. ఇప్పుడు ప్రిన్స్ హ్యారీ తన తాతగారిని చూసేందుకు బ్రిటన్‌కు వస్తారా రారా అనే ఆలోచన కంటే కూడా.. మార్చి 7న అమెరికన్ టీవీ ఛానెల్ సీబీఎస్ ప్రసారం చేయబోతున్న ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కెల్‌ల ఇంటర్వ్యూ ప్రసారం కాకుండా చేయడం ఎలాగన్న దాని గురించే రాణిగారు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ విషయమై ఇప్పటికే రాణిగారి ప్రత్యేక ప్రతినిధి ఒకరు హ్యారీతో మాట్లాడి, ఇంటర్వ్యూను అసలే ప్రసారం కాకుండా చేసేందుకు ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకు తగిన కారణమే ఉంది. సీబీఎస్ ఛానల్ కోసం ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ మార్కెల్లను ఇంటర్వ్యూ చేసినవారు ఓప్రా విన్ ఫ్రే. ఆమె ఇంటర్వ్యూ చేయడం మామూలుగా ఉండదు. అంతరంగాల్లోకి వెళతారు. ఒకలాటి హృదయోద్వేగ స్థితిని కల్పించి లోపలిదంతా బయటికి లాగేస్తారు. అసలే ఇప్పుడు హ్యారీ, మార్కెల్ తమకు ఏ మాత్రం అలవాటు లేని ఒంటరి జీవితాన్ని కలిసికట్టుగా గడుపుతున్నారు. పైగా మార్కెల్ ఇప్పుడు గర్భిణి. రెండో బిడ్డ కోసం ఆమె సిద్ధంగా ఉన్నారు. ఈ ఫిబ్రవరి 14న వాళ్లే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు కూడా. ఈ స్థితిలో ఓప్రా ఇంటర్వ్యూలో రాజసౌధ అహంకార రహస్యాలు ఏవైనా బయట పెడితే కనుక ఆ వృద్ధ ప్రాణం.. ప్రిన్స్ ఫిలిప్.. ఆవేదన చెందే ప్రమాదం ఉందని క్వీన్ ఆందోళన పడుతున్నారు. అందుకోసమే ఇంటర్వ్యూను ఆపించమని విజ్ఞప్తి చేయిస్తున్నారు. ఆ విజ్ఞప్తిని సీబీఎస్ టీవీ మన్నిస్తుందా, ఒకవేళ సీబీఎస్ మన్నించినా.. ప్రిన్స్ హ్యారీ.. గో ఎహెడ్ అంటారా అన్నది మరొక సందేహం. బ్రిటన్‌లో ప్రిన్స్ హ్యారీపై కోపగిస్తున్నవారూ ఉన్నారు. పరదేశీ పిల్లను (అమెరికా) చేసుకోవడమే కాకుండా, రాజకుటుంబ నియమాలను గౌరవించని భార్యను ఆయన వెనకేసుకొస్తున్నారని వారి విమర్శ. మరోవైపు బకింగ్‌హామ్ ప్యాలెస్, ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ‘‘అంత్యక్రియలకు హాజరైనప్పుడు ప్రిన్స్ హ్యారీని బ్రిటన్ ప్రజలు బహిరంగంగానే తూలనాడే ప్రమాదాన్ని నివారించడం కోసం హ్యారీని, ఆయన భార్యను ఎక్కడ కూర్చోబెట్టాలన్న దానిపైన కూడా సమాలోచనలు జరుగుతున్నాయి’’ అని ‘ది రాయల్ అబ్జర్వర్’ పత్రిక రాసింది. మంచిని ఆలోచిస్తున్న పత్రికలు కూడా కొన్ని ఉన్నాయి. తాతగారి ఆఖరిశ్వాసకు ముందరే వచ్చి ప్రిన్స్ హ్యారీ ఆయన్ని సంతోషపరుస్తారనీ, ఓప్రా విన్ఫ్రే కుటుంబ విలువలకు గౌరవం ఇచ్చే మనిషి కనుక తాత్కాలికంగానే అయినా ఇంటర్వ్యూను ఆపేస్తారని ఆ పత్రికలు ఆశిస్తున్నాయి. ఎవరైనా కోరుకునేది మంచే జరగాలని, ఆ కుటుంబానికి కాస్త ఎక్కువ మంచి జరగాలని. బకింగ్‌హామ్ ప్యాలెస్ నిర్మాణమై ఉన్నది లండన్‌లోనే అయినా, మూడు వందల ఏళ్లకు పైగా ఆ భవంతిలో ఉంటున్న రాజ కుటుంబాలు ఉంటూ వస్తున్నది మాత్రం బ్రిటన్ ప్రజల గుండెల్లోనే. ప్రిన్స్ ఫిలిప్ ఎవరీయన?! ప్రస్తుత బ్రిటన్ మహారాణి రెండో ఎలిజబెత్ భర్తే ప్రిన్స్ ఫిలిప్ అన్న సంగతి తెలిసిందే. అదొక్కటే ఆయన గుర్తింపు కాదు. ఎడిన్‌బరో సామంత రాజు (డ్యూక్). యూకె అధీనంలో ఉన్న స్కాట్లాండ్ దేశపు రాజధానే ఎడిన్‌బరో. క్వీన్ ఎలిజబెత్‌తో ఆయనకు 1947లో వివాహం అయింది. ప్రిన్స్ చార్ల్స్, ప్రిన్సెస్ యాన్, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ వీరి సంతానం. ఈ నలుగురిలోకీ పెద్దవారైన ప్రిన్స్ చార్ల్స్ కొడుకే ప్రిన్స్ హ్యారీ. ప్రిన్స్ ఫిలిప్ గ్రీసు, డెన్మార్క్‌ల రాచకుటుంబీకుడు. క్వీన్ ఎలిజబెత్ బ్రిటన్ దేశస్థురాలు. ప్రిన్స్ ఫిలిప్ బ్రిటిష్ రాయల్ నేవీలో చేరేనాటికే ఉమ్మడి బంధుత్వాల ద్వారా ఒకరికొకరు పరిచయం. క్వీన్‌కి 13 ఏళ్ల వయసులో ఆయనపై ప్రేమ అంకురించినట్లు, ఆ ప్రేమ.. వివాహానికి దారి తీసినట్లు ఈ దంపతులపై వచ్చిన అనేక డాక్యుమెంటరీ చిత్రాలను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత రాణి గారు కూడా ప్రిన్స్ ఫిలిప్పై తన ప్రేమ విషయాన్ని నిర్థారించారు. -
ప్రిన్స్ హ్యారీ మళ్లీ రాచ విధుల్లోకి రారు
లండన్: ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మెఘన్ మార్కెల్ బ్రిటన్ రాజ కుటుంబంలోకి క్రియాశీల సభ్యులుగా తిరిగి రారని బకింగ్ హామ్ ప్యాలెస్ శుక్రవారం ప్రకటించింది. హ్యారీ నానమ్మ, రాణి ఎలిజబెత్–2(94) తరఫున విడుదల చేసిన ఆ ప్రకటనలో..‘డ్యూక్ ఆఫ్ సస్సెక్స్ ప్రిన్స్ హ్యారీ(36), ఆయన భార్య డచెస్ ఆఫ్ సస్సెక్స్ మెఘన్ మార్కెల్(39) ఏడాదిలోగా తిరిగి క్రియాశీల విధుల్లోకి చేరతామంటూ చేసిన ప్రకటన గడువు పూర్తి కావస్తోంది. దీంతో నిర్ణయం తెలపాల్సిందిగా రాణి వారికి లేఖ రాశారు. తాము తిరిగి రామంటూ హ్యారీ దంపతులు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ విధులన్నీ తిరిగి రాణికే దఖలు పడ్డాయి. వాటిని ఆమె కుటుంబంలోని ఇతరులు తిరిగి పంపిణీ చేయనున్నారు’అని ఆమె వివరించింది. ఆర్థికంగా స్వతంత్రంగా జీవించేందుకు వీలుగా రాజకుటుంబం క్రియాశీలక విధుల నుంచి వైదొలుగుతున్న ప్రిన్స్ హ్యారీ దంపతులు గత ఏడాది మార్చిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిప్పుడు అమెరికాలో నివాసం ఉంటున్నారు. -
శుభవార్త చెప్పిన మేఘన్ మార్కెల్
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి తొందర్లోనే మరో వారసుడు రానున్నాడు. బ్రిటన్ రాజకుమారుడు హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని బంకింగ్ హమ్ ప్యాలెస్ ప్రతినిధి వాలెంటైన్స్‌డే రోజున ప్రకటించారు. కాగా, 2018 పెళ్లి బంధంతో ఒక్కటైన హ్యారీ, మార్కెల్ దంపతులకు ఇప్పటికే ఆర్చి జన్మించాడు. కాగా, రాజకుటుంబానికి చెందిన కొన్ని ఆంక్షలు, విభేదాల కారణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఈ జంట ఉత్తర అమెరికాలోని నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ జంట కాలిఫోర్నియాలోని శాంటా బార్బారాలో ఒక ఇల్లును కూడా కొనుగొలు చేశారు. ఇదిలా ఉండగా.. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా 2020లో మార్కెల్‌కు గర్భస్రావం అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. తండ్రితో ఉన్న విభేదాల కారణంగా మార్కెల్ తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారని, ఆ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం దెబ్బతిని గర్భస్రావానికి దారి తీసినట్టు తెలిసింది. -
బ్రిటన్ రాణి దంపతులకు కోవిడ్ టీకా
లండన్ : బ్రిటన్ రాణి ఎలిజెబెత్, ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్‌కు కోవిడ్–19 వ్యాక్సిన్ ఇచ్చారు. విండ్సర్ కేజల్‌లో ఉంటున్న రాణి దంపతులకు ఫ్యామిలీ డాక్టర్ శనివారం నాడు కరోనా టీకా మొదటి డోసు ఇచ్చినట్టుగా బకింగ్çహామ్ ప్యాలెస్ వర్గాలు వెల్లడించాయి. రాణి, రాజు వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించిన అంశాలను బయట ప్రపంచానికి వెల్లడించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఎలాంటి ఊహాగానాలకు తావుండ కూడదని తామిద్ద్దరికీ వ్యాక్సిన్ ఇచ్చినట్టుగా మహారాణియే స్వయంగా ప్రజలందరికీ వెల్లడించమన్నారని ఆ వర్గాలు తెలిపాయి. ఎలిజెబెత్ వయసు 94 కాగా, ఫిలిప్ వయసు 99 సంవత్సరాలు. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్‌తో వణికిపోతున్న బ్రిటన్‌లో ఇప్పటివరకు 15 లక్షల మందికి కరోనా టీకా మొదటి డోసు ఇచ్చారు. బ్రిటన్‌లో 80 ఏళ్లు పైబడిన వారికి తొలి ప్రాధాన్యంగా టీకా ఇస్తున్నారు. అయితే రాణి దంపతులకి ఏ కంపెనీ వ్యాక్సిన్ ఇచ్చారో తెలియలేదు. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ వ్యాక్సిన్, ఆక్స్ఫర్డ్– ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్లు ప్రస్తుతం బ్రిటన్‌లో ఇస్తున్నారు. -
బ్రిటన్ రాణికి కరోనా కష్టాలు!
లండన్: కరోనా మహమ్మారి ప్రభావం బ్రిటన్ రాణి ఎలిజబెత్–2పైనా పడింది. కరోనా వైరస్ వ్యాప్తి, లాక్డౌన్ వల్ల సందర్శకుల రాక తగ్గిపోవడంతో ఎలిజబెత్ కుటుంబం 35 మిలియన్ పౌండ్ల(45 మిలియన్ డాలర్లు) ఆదాయం కోల్పోనున్నట్లు రాజకుటుంబం మనీ మేనేజర్ మైఖేల్ స్టీవెన్స్ చెప్పారు. ఎలిజబెత్ కుటుంబ వార్షిక ఆదాయ వ్యయాల వివరాలను ప్రకటించారు. బ్రిటన్‌లో రాజ కుటుంబానికి ఎన్నో ప్యాలెస్‌లను సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వచ్చేవారు. వీరి ద్వారా ఫీజుల రూపంలో అందే మొత్తం ఎలిజబెత్ ఖాతాలోకే చేరేది. కరోనాతో ఈ ఆదాయానికి భారీగా గండి పడింది. మరోవైపు రాణి నివసించే ప్రఖ్యాత బకింగ్హమ్ ప్యాలెస్‌కు మరమ్మతులు చేయాల్సి ఉంది. చివరిసారిగా రెండో ప్రపంచ యుద్ధం కొన్నాళ్లకు ఈ ప్యాలెస్‌కు మరమ్మతులు చేశారు. ఇప్పుడు నిధులు లేవని మరమ్మతులు ఆపేస్తే ప్యాలెస్ శిథిలావస్థకు చేరుతుందని ఆందోళన చెందుతున్నారు. కరోనా కష్టకాలంలో నిధులు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని రాణి కోరబోరని స్టీవెన్స్ చెప్పారు. ఉన్న నిధులనే సర్దుబాటు చేసుకుంటామన్నారు. ప్యాలెస్ సిబ్బందికి ఇప్పటికే íజీతాలు చెల్లించడం నిలిపి వేశారు. గత ఆర్థిక సంవత్సరం బ్రిటన్ ప్రభుత్వం రాజ కుటుంబానికి 69.4 మిలియన్ పౌండ్లు అందజేసింది. అంతకుముందు నాటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 2.4 మిలియన్ పౌండ్లు అధికం కావడం గమనార్హం. -
ఫొటో 1 తరాలు 4
లండన్: కొత్త దశాబ్దం ప్రారంభం సందర్భంగా బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ శనివారం తన వారసులతో కలసి దిగిన ఫొటోను విడుదల చేశారు. అందులో రాణి సహా నాలుగు తరాల రాజరికం ఉంది. గతంలో 2016లో ఆమె 90వ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వారసులతో కలసి ఫొటో దిగగా, ఇప్పుడు విడుదల చేసింది రెండో ఫొటో కావడం గమనార్హం. ఇప్పటి ఫొటోలో కూడా రాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్, మనవడు ప్రిన్స్ విలియం, ముని మనవడు ప్రిన్స్ జార్జ్‌లు ఉన్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్రిస్మస్ పండుగకు వారంముందు ఈ ఫొటోను తీశారు. ఇందులో రాణి తెలుపు గౌన్ ధరించారు. ఆమెకు ఇరు వైపులా రాజకుమారులు ఉన్నారు.