రాణి గారి కోటలోకి వెళ్లే ప్రయత్నంలో.. | Man arrested after scaling fence at Buckingham Palace | Sakshi

రాణి గారి కోటలోకి వెళ్లే ప్రయత్నంలో..

Aug 9 2016 8:32 PM | Updated on Sep 4 2017 8:34 AM

రాణి గారి కోటలోకి వెళ్లే ప్రయత్నంలో..

రాణి గారి కోటలోకి వెళ్లే ప్రయత్నంలో..

బ్రిటన్లోని బకింగ్ హామ్ ప్యాలెస్(బ్రిటన్ రాణి భవనం)లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

లండన్: బ్రిటన్లోని బకింగ్ హామ్ ప్యాలెస్(బ్రిటన్ రాణి భవనం)లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ప్యాలెస్కు దగ్గరలో ఉన్న భద్రతా కంచె దాటే ప్రయత్నాన్ని అతడు చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. అయితే, ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదుల అలికిడి ఎక్కువగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ దృశ్యం చూసి తొలుత ఉలిక్కిపడిన భద్రతా సిబ్బంది అనంతరం అతడికి ఉగ్రవాదానికి సంబంధం లేదని నిర్ధారించారు.

క్రోడాన్ ప్రాంతానికి చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు బకింగ్ హామ్ ప్యాలెస్కు రక్షణగా ఏర్పాటుచేసిన భద్రతా కంచెను ఎక్కి లోపలికి దూకే ప్రయత్నం చేస్తుండగా సీసీటీవీలో అది గమనించి భద్రతా సిబ్బంది అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం సెంట్రల్ లండన్‌ లోని పోలీస్ స్టేషన్లో బంధించి విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement