శుభవార్త చెప్పిన మేఘన్‌ మార్కెల్‌  | Prince Harry Meghan Markle Expecting Second Child | Sakshi
Sakshi News home page

శుభవార్త చెప్పిన మేఘన్‌ మార్కెల్‌ 

Published Mon, Feb 15 2021 11:52 AM | Last Updated on Mon, Feb 15 2021 12:35 PM

Prince Harry  Meghan Markle Expecting Second Child - Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాజకుటుంబంలోకి తొందర్లోనే మరో వారసుడు రానున్నాడు. బ్రిటన్‌ రాజకుమారుడు హ్యారీ సతీమణి మేఘన్‌ మార్కెల్‌ మరోసారి తల్లి కాబోతున్నారు. ఈ విషయాన్ని బంకింగ్‌ హమ్‌ ప్యాలెస్‌ ప్రతినిధి వాలెంటైన్స్‌డే రోజున ప్రకటించారు. కాగా, 2018 పెళ్లి బంధంతో ఒక్కటైన హ్యారీ, మార్కెల్‌ దంపతులకు ఇప్పటికే ఆర్చి జన్మించాడు. కాగా, రాజకుటుంబానికి చెందిన కొన్ని ఆంక్షలు, విభేదాల కారణంగా అక్కడి నుంచి వెళ్ళిపోయిన ఈ జంట ఉత్తర అమెరికాలోని నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. 

ఇటీవల ఈ జంట కాలిఫోర్నియాలోని శాంటా బార్బారాలో ఒక ఇల్లును కూడా కొనుగొలు చేశారు. ఇదిలా ఉండగా.. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా 2020లో మార్కెల్‌కు గర్భస్రావం అయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి.  తండ్రితో  ఉన్న విభేదాల కారణంగా మార్కెల్‌ తీవ్ర మానసిక సంఘర్షణ ఎదుర్కొన్నారని, ఆ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం దెబ్బతిని గర్భస్రావానికి దారి తీసినట్టు తెలిసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement