Trooping the Colour: ప్రజల ముందుకు కేట్‌ మిడిల్టన్‌ | Trooping the Colour: Princess of Wales Kate Middleton makes first public appearance in 7 months | Sakshi
Sakshi News home page

Trooping the Colour: ప్రజల ముందుకు కేట్‌ మిడిల్టన్‌

Published Sun, Jun 16 2024 5:19 AM | Last Updated on Sun, Jun 16 2024 5:19 AM

Trooping the Colour: Princess of Wales Kate Middleton makes first public appearance in 7 months

లండన్‌: క్యాన్సర్‌తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్‌ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్‌ మిడిల్టన్‌ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌–3 జన్మ దినోత్సవాల్లో భాగంగా లండన్‌లో శనివారం అధికారికంగా సైనిక పరేడ్‌ నిర్వహించారు. ‘ట్రూపింగ్‌ ది కలర్‌’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్‌ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. 

ప్రఖ్యాత బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ బాల్కనీలో భర్త విలియం, పిల్లలతో పాటు నిల్చున్న కేట్‌ను చూసేందుకు జనం ఆసక్తిచూపించారు. గత ఏడాది డిసెంబర్‌ తర్వాత కేట్‌ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్‌ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్‌ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన విషయం తెల్సిందే. 

ఆమె కోమాలోకి వెళ్లారని, రాచరిక విధులు నిర్వర్తించలేరని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కేట్‌ ఎట్టకేలకు ప్రజల ముందుకు రావడంతో బ్రిటన్‌ రాజకుటుంబ అనుకూల వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చికిత్స నుంచి మెల్లిగా కోలుకుంటున్నానని, శనివారం జరిగే జన్మదిన వేడుకలకు హాజరవుతానని కేట్‌ శుక్రవారమే ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement