in public
-
Trooping the Colour: ప్రజల ముందుకు కేట్ మిడిల్టన్
లండన్: క్యాన్సర్‌తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 జన్మ దినోత్సవాల్లో భాగంగా లండన్‌లో శనివారం అధికారికంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ‘ట్రూపింగ్ ది కలర్’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో భర్త విలియం, పిల్లలతో పాటు నిల్చున్న కేట్‌ను చూసేందుకు జనం ఆసక్తిచూపించారు. గత ఏడాది డిసెంబర్ తర్వాత కేట్ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన విషయం తెల్సిందే. ఆమె కోమాలోకి వెళ్లారని, రాచరిక విధులు నిర్వర్తించలేరని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కేట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రావడంతో బ్రిటన్ రాజకుటుంబ అనుకూల వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చికిత్స నుంచి మెల్లిగా కోలుకుంటున్నానని, శనివారం జరిగే జన్మదిన వేడుకలకు హాజరవుతానని కేట్ శుక్రవారమే ప్రకటించారు. -
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగా కాంతారావు పినపాక : ప్రజా సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామాల్లో అర్హులైన వారికి ఫింఛన్లు రావడం లేదని, తాగునీరు అందే పరిస్థితి లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రచార ఆర్భాటాలు ఎక్కువగా చేసుకోవడం ప్రభుత్వం ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో రేగా కాంతారావు ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కు వెంకట నర్సారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు పొనుగోటి భద్రయ్య, మణుగూరు ఎంపీపీ అంజమ్మ, కాంగ్రెస్ నాయకులు కంది సుబ్బారెడ్డి, బోలిశెట్టి నర్సింహారావు, రావుల సోమయ్య, రవివర్మ, సత్యనారాయణ, మీరాసాహెబ్, పడిగె నాగయ్య, వారా నర్సింహారావు, హైమద్హుస్సేన్, కొమరం రాంబాబు, పినపాక సర్పంచ్ బొర్రా సావిత్రి, వెన్నా కాశిరెడ్డి, పోశం నర్సింహారావు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.