కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న రేగా కాంతారావు
- టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగా కాంతారావు
పినపాక : ప్రజా సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేదలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం యంత్రాంగం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. గ్రామాల్లో అర్హులైన వారికి ఫింఛన్లు రావడం లేదని, తాగునీరు అందే పరిస్థితి లేదన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రచార ఆర్భాటాలు ఎక్కువగా చేసుకోవడం ప్రభుత్వం ఆనవాయితీగా మారిందని ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయాన్ని ఏడూళ్లబయ్యారం క్రాస్‌రోడ్‌లో రేగా కాంతారావు ప్రారంభించారు. అనంతరం సభలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కు వెంకట నర్సారెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు పొనుగోటి భద్రయ్య, మణుగూరు ఎంపీపీ అంజమ్మ, కాంగ్రెస్ నాయకులు కంది సుబ్బారెడ్డి, బోలిశెట్టి నర్సింహారావు, రావుల సోమయ్య, రవివర్మ, సత్యనారాయణ, మీరాసాహెబ్, పడిగె నాగయ్య, వారా నర్సింహారావు, హైమద్‌హుస్సేన్, కొమరం రాంబాబు, పినపాక సర్పంచ్ బొర్రా సావిత్రి, వెన్నా కాశిరెడ్డి, పోశం నర్సింహారావు, శంకర్, తదితరులు పాల్గొన్నారు.