
బంగ్లాదేశ్‌లో హింసకు బలవుతున్న హిందువులను రక్షించాల్సిన బాధ్యత భారత్‌పై ఉన్నదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులను లక్ష్యంగా చేసుకున్నారంటూ వస్తున్న వార్తలపై మోహన్ భగవత్ స్పందించారు.
అక్కడ నివసిస్తున్న హిందువులను అకారణంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడున్న హిందువులకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత మన దేశంపై ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యాలయంలో జెండాను ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఇతరులకు సహాయం చేసే సంప్రదాయం భారతదేశంలో ఉందన్నారు. గత కొన్నేళ్లుగా భారత్ ఎవరిపైనా దాడి చేయలేదని, అందుకు బదులుగా కష్టాల్లో ఉన్న వారికి సహాయం అందించామన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న అస్థిరత, అరాచకాల వల్ల అక్కడున్న హిందువులు అవస్థల పాలవుతున్నారని అన్నారు. అందుకే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు.