ఢాకా: బంగ్లాదేశ్‌లో ఇటీవలి కాలంలో హిందువులపై దాడుల ఘటనలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా ఇస్కాన్ పుండరీక్ ధామ్ అధ్యక్షుడు చిన్మయ్ కృష్ణన్ దాస్‌ను చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్ట్‌కు వ్యతిరేకంగా హిందూ సంఘాలు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపాయి.
ఇంతలో బీఎన్‌పీ, జమాత్ కార్యకర్తలు హిందువులపై దాడికి దిగారు. ఈ దాడిలో దాదాపు 50 మంది గాయపడ్డారు. చిన్మయ్ కృష్ణన్ దాస్ అరెస్టును వ్యతిరేకిస్తూ హిందువులు మౌల్వీ బజార్‌లో ‘జై సియా రామ్’, ‘హర్ హర్ మహాదేవ్’ అని నినాదాలు చేస్తూ భారీ టార్చ్ ర్యాలీ నిర్వహించారు. ఈ నేపధ్యంలోనే వారిపై దాడులు చోటుచేసుకున్నాయి. ఇదేవిధంగా షాబాగ్‌లో చిట్టగాంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కుశాల్ బరన్‌పై కూడా దాడి జరిగింది. గాయపడిన ఆందోళనకారులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు దాడుల తీవ్రతను తెలియజేస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ఈ సంఘటనలను ఖండించారు. చిన్మయ్ ప్రభు అరెస్టు అన్యాయమని, దీనిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని, వెంటనే చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల హక్కుల కోసం చిన్మయ్ ప్రభు నిరంతరం పోరాడుతున్నారని సుకాంత్ మజుందార్ ట్విట్టర్‌లో రాశారు. ఆయన అరెస్టు దరిమిలా బంగ్లాదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Fighting between colleges have started in US-backed Noble Laureate ruled Bangladesh. Students carrying weapons attacking each other. Many casualties. Chaos at campuses. Situation grim pic.twitter.com/EwQbmKMPBM
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 25, 2024
బంగ్లాదేశ్ పోలీసులు ఢాకా విమానాశ్రయంలో చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని అరెస్టు చేశారు. పోలీసు డిటెక్టివ్ బ్రాంచ్ ప్రతినిధి రెజౌల్ కరీమ్ తెలిపిన వివరాల ప్రకారం చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే అరెస్టు జరిగింది. తదుపరి చర్యల కోసం చిన్మయ్ దాస్‌ను సంబంధిత పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. ఈ ఘటనలు బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీల భద్రతపై పలు సందేహాలను లేవనెత్తుతున్నాయి.
ఇది కూడా చదవండి: 11 గంటలు లేటుగా వందేభారత్.. ప్రయాణికుల ఆందోళన
Comments
Please login to add a commentAdd a comment