
వాషింగ్టన్ డీసీ: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై అమెరికా(America) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొంది. ఏ దేశంలోనైనా మైనారిటీలపై జరిగే హింస, అసహనాన్ని తాము వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై నిఘా సారిస్తున్నామని వెల్లడించింది.
మరోవైపు బంగ్లాదేశ్‌లోని ప్రజల భద్రత కోసం అక్కడి తాత్కాలిక ప్రభుత్వంgovernment) తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తున్నామని కూడా అమెరికా పేర్కొంది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై జరుగుతున్న దాడులను నిరంతరం గమనిస్తున్నామని, వీటిని నియంత్రించేందుకు బంగ్లాదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని తాము ఆశిస్తున్నామని పేర్కొంది. బంగ్లాదేశ్‌పై నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్బర్డ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా ప్రశ్నించినప్పుడు అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి టామీ బ్రూస్ ఈ విధంగా స్పందించారు.
బంగ్లాదేశ్(Bangladesh)లో 2024 ఆగస్టు 5న అప్పటి ప్రధాని షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేసినప్పటి నుండి హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. హిందువుల ప్రార్థనా స్థలాలు, మతపరమైన ప్రాంతాలను ధ్వంసం చేస్తున్నారు. హిందువుల ఇళ్లను తగులబెట్టి, ధ్వంసం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనస్ ప్రభుత్వం మౌనం వహిస్తున్నదనే ఆరోపణలున్నాయి.
ఇది కూడా చదవండి: శంభు సరిహద్దులో ఉద్రిక్తత.. రైతులను ఖాళీ చేయించిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment