డిచ్‌పల్లి: మండలంలోని ధర్మారం(బి) గ్రామాని కి చెందిన దుబ్బాక ఉమా మహేశ్వరి(32) అనే వివాహిత శుక్రవారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. ఉమామహేశ్వరి 13 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన బాలస్వామిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. బాలస్వామి పెయింటర్‌గా, ఉమామహేశ్వరి టైలరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
కొంత కాలంగా ఉమామహేశ్వరి మైగ్రేన్(ఒకవైపు తలనొప్పి)తో బాధపడుతోంది. అలాగే ఆర్థిక సమస్యలు ఉన్నాయి. శుక్రవారం భర్త బయటకు వెళ్లిన సమయంలో ఆమె ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొద్ది సేపటికి ఇంటికి వచ్చిన భర్త విషయం గమనించి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చి మృతదేహాన్ని కిందికి దించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment