Trooping the Colour ceremony
-
Trooping the Colour: ప్రజల ముందుకు కేట్ మిడిల్టన్
లండన్: క్యాన్సర్‌తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 జన్మ దినోత్సవాల్లో భాగంగా లండన్‌లో శనివారం అధికారికంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ‘ట్రూపింగ్ ది కలర్’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో భర్త విలియం, పిల్లలతో పాటు నిల్చున్న కేట్‌ను చూసేందుకు జనం ఆసక్తిచూపించారు. గత ఏడాది డిసెంబర్ తర్వాత కేట్ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన విషయం తెల్సిందే. ఆమె కోమాలోకి వెళ్లారని, రాచరిక విధులు నిర్వర్తించలేరని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కేట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రావడంతో బ్రిటన్ రాజకుటుంబ అనుకూల వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చికిత్స నుంచి మెల్లిగా కోలుకుంటున్నానని, శనివారం జరిగే జన్మదిన వేడుకలకు హాజరవుతానని కేట్ శుక్రవారమే ప్రకటించారు. -
కవాతు చేస్తూ కుప్పకూలాడు..
లండన్: చేతిలో తుపాకులు, ముఖాన్ని కప్పేసే నల్లటి గొర్రెబొచ్చు టోపీలు, ఒంటిపై బరువైన ఎరుపు రంగు దుస్తులు, పైన ఎర్రటి ఎండ. ఎంగిలి పడ్డాడోలేదో పాపం ఆ గార్డ్స్ మన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 90వ పుట్టినరోజు సందర్భంగా జరుగుతోన్న అధికారిక వేడుకల్లో ఈ ఘటన జరిగింది. లండన్ లోని హార్స్ గార్డ్స్ పరేడ్ లో శనివారం జరిగిన రిహార్సల్స్ లో ఓ గార్డ్స్ మన్ కుప్పకూలిపోగా, సహచరులు అతణ్ని స్ట్రెచర్ పై మోసుకెళ్లి ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం కూడా సరిగ్గా ఇలాంటి సంఘటనే జరిగింది. అతిథులతో కలిసి రాణిగారు వేంచేయడానికి కొద్ది నిమిషాల ముందు.. ఆమెకు వందనం సమర్పించేందుకు ఎదురుచూస్తోన్న గార్డుల్లో ఒకరు స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతణ్ని ఆసుపత్రికి తరలించారు. 2014, 2011ల్లో జరిగిన రాణిగారి పుట్టినరోజు వేడుకల్లోనూ ఇలా గార్డులు పడిపోయిన సంఘటనలున్నాయి. సుబ్బి పెళ్లి ఎంకి చావుకు వచ్చిందన్నట్లు.. రాణిగారి పుట్టినరోజు వేడుకల్లో గార్డ్స్ మన్లను ఇలా కఠిన పరీక్షలు ఎదుర్కోవలసి వస్తోంది. అయినాసరే మా రాణిగారికోసం ఎన్ని ఇబ్బందులకైనా రెడీ అంటున్నారు బ్రిటన్ భటులు!