Britain Princess
-
Trooping the Colour: ప్రజల ముందుకు కేట్ మిడిల్టన్
లండన్: క్యాన్సర్‌తో బాధపడుతూ బాహ్య ప్రపంచానికి దూరంగా గడుపుతున్న బ్రిటన్ యువరాణి, యువరాజు విలియం భార్య కేట్ మిడిల్టన్ చాలా నెలల తర్వాత ప్రజల ముందుకు వచ్చారు. బ్రిటన్ రాజు ఛార్లెస్–3 జన్మ దినోత్సవాల్లో భాగంగా లండన్‌లో శనివారం అధికారికంగా సైనిక పరేడ్ నిర్వహించారు. ‘ట్రూపింగ్ ది కలర్’ పేరిట జరిగే ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజకుటుంబ సభ్యులంతా హాజరయ్యారు. ప్రఖ్యాత బకింగ్‌హామ్ ప్యాలెస్ బాల్కనీలో భర్త విలియం, పిల్లలతో పాటు నిల్చున్న కేట్‌ను చూసేందుకు జనం ఆసక్తిచూపించారు. గత ఏడాది డిసెంబర్ తర్వాత కేట్ బయటకు రావడం ఇదే తొలిసారి. క్యాన్సర్ సోకి చికిత్స చేయించుకుంటున్నట్లు ఈ ఏడాది మార్చి నెలలో కేట్ ప్రకటించాక ఆమె ఆరోగ్యపరిస్థితిపై ఆందోళన వ్యక్తమైన విషయం తెల్సిందే. ఆమె కోమాలోకి వెళ్లారని, రాచరిక విధులు నిర్వర్తించలేరని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల కేట్ ఎట్టకేలకు ప్రజల ముందుకు రావడంతో బ్రిటన్ రాజకుటుంబ అనుకూల వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. చికిత్స నుంచి మెల్లిగా కోలుకుంటున్నానని, శనివారం జరిగే జన్మదిన వేడుకలకు హాజరవుతానని కేట్ శుక్రవారమే ప్రకటించారు. -
Kate Middleton: నేను కేన్సర్‌తో పోరాడుతున్నా..
బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్/కేథరిన్ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్‌తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు. పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్‌తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales) ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజు ఛార్లెస్(75) సైతం కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్ యువరాణి కేట్ సైతం కేన్సర్ బారిన పడిందన్న విషయం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్‌తో కేట్ మిడిల్టన్ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం. అప్పటి నుంచి.. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది. దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది. కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా ఇదిలా ఉంటే.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్ను వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. -
బ్రిటన్ యువరాణి డయానాది హత్యా?
లండన్: బ్రిటన్ యువరాణి డయానా కారు ప్రమాదంలో మరణించలేదా? ఆమెను పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య చేశారా? అందులో ఆ దేశ మిలటరీ పాత్ర కూడా ఉందా? ఈ అనుమానాలకు అవకాశమిస్తున్న ఒక సమాచారంపై బ్రిటన్‌కు చెందిన స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 1997 ఆగస్టు 31న డయానా, ఆమె ప్రియుడు అల్ఫాయెద్తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదానికి గురై మరణించిన విషయం తెలిసిందే. అది ప్రమాదం కాదని, ఆమెను హత్య చేశారని అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. వాటిపై రెండు సార్లు విచారణ జరిపిన ప్రభుత్వం.. అది ప్రమాదమేనని తేల్చింది. కానీ, ఈ సారి మాత్రం అప్పట్లో సైన్యంలో పనిచేసిన ఓ అధికారి.. ‘డయానాను హత్యచేసేందుకు మా యూనిట్ ఏర్పాట్లు చేసింది. అందువల్లే దానిని దాచాల్సి వచ్చింది’ అని తన భార్యతో పేర్కొన్నట్లుగా తెలిసింది. ఈ వివరాలను పేర్కొంటూ ఆ సైనికుడి అత్త, మామ కమాండింగ్ అధికారికి లేఖ రాశారు. ఈ సమాచారంలో విశ్వసనీయతను పరిశీలిస్తున్నామని స్కాట్లాండ్ యార్డ్ సీనియర్ పోలీసు అధికారి బెర్నార్డ్ హోగన్ చెప్పారు.