బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్/కేథరిన్ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్‌తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు.
పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్‌తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజు ఛార్లెస్(75) సైతం కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్‌హమ్ ప్యాలెస్ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్ యువరాణి కేట్ సైతం కేన్సర్ బారిన పడిందన్న విషయం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్‌తో కేట్ మిడిల్టన్ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం.
అప్పటి నుంచి..
బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది. దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది.
కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా
ఇదిలా ఉంటే.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్‌ను వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment