Prince William
-
Kate Middleton: నేను కేన్సర్‌తో పోరాడుతున్నా..
బ్రిటన్ రాజు ఛార్లెస్ పెద్ద కోడలు, ప్రిన్స్ విలియమ్ సతీమణి.. వేల్స్ యువరాణి కేట్ మిడిల్టన్/కేథరిన్ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్‌తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు. పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది. ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్‌తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం. ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. View this post on Instagram A post shared by The Prince and Princess of Wales (@princeandprincessofwales) ఇదిలా ఉంటే.. బ్రిటన్ రాజు ఛార్లెస్(75) సైతం కేన్సర్ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్హమ్ ప్యాలెస్ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్ యువరాణి కేట్ సైతం కేన్సర్ బారిన పడిందన్న విషయం బ్రిటన్ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్‌తో కేట్ మిడిల్టన్ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం. అప్పటి నుంచి.. బ్రిటన్ యువరాణి కేట్ మిడిల్టన్ డిసెంబర్ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది. దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది. కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా ఇదిలా ఉంటే.. కేట్ మిడిల్టన్ కేన్సర్ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌తో పాటు బ్రిటన్ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్ చిన్న కొడుకు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్ సైతం కేట్ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్ను వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. -
Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే..
బట్టతల వచ్చినందుకు చాలా మంది మగవారు బాధపడుతూ ఉంటారు. తలపై వెంట్రుకలు లేని తమను ఎవరు చూస్తారని చింతిస్తూ ఉంటారు. కానీ బట్టతల ఉన్నవారికీ ఫ్యాన్స్ ఉన్నారు. గూగుల్‌లో బట్టతల అందగాళ్ల కోసం ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. గూగుల్ సెర్చ్ ట్రాఫిక్, శారీరక లక్షణాల ఆధారంగా ఒక కొత్త అధ్యయనం ప్రకారం బ్రిటిష్ ప్రిన్స్ విలియం (Prince William) "2023లో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్"గా ఎంపికయ్యాడు. అమెరికన్ యాక్టర్ విన్ డీజిల్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్లను అధిగమించి టాప్‌లో నిలిచాడు. బట్టతల సెలబ్రిటీలను షర్టు లేకుండా చూడటానికి ఇంటర్నెట్లో ఎంతమంది సెర్చ్ చేస్తున్నారన్న దానిపై రీబూట్ అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులు రూపొందించింది. బట్టతల సెలబ్రిటీల ఎత్తు, నెట్‌వర్త్, ముఖ నిష్పత్తి, బట్టతల మెరుపు తదితర అంశాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఈ "సెక్సీ" స్కోర్‌లో 10కి 9.88 స్కోర్‌తో ప్రిన్స్ విలియం అగ్రస్థానంలో నిలిచాడు. మిర్రర్ కథనం ప్రకారం.. సెలబ్రిటీల వాయిస్ ఫ్రీక్వెన్సీని కూడా ఈ అధ్యయనం పరిశీలించింది. అధ్యయనం మేరకు ప్రిన్స్ విలియం నెట్‌వర్త్ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ.832 కోట్లు), ఎత్తు 1.91 మీటర్లు. ఇక వాయిస్ వియషంలో 10కి 9.91 స్కోర్, బట్టతల మెరుపులో 8.90 స్కోర్ సాధించాడు. మరోవైపు అమెరిన్ యాక్టర్ విన్ డీజిల్ 8.81 టోటల్ స్కోరుతో రెండవ స్థానంలో, జాసన్ స్టాథమ్ 8.51 స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 7.12 స్కోర్‌తో ఐదో స్థానంలో ఉన్నారు. -
డ్రగ్స్ తీసుకున్నా: హ్యారీ
లండన్: బ్రిటన్ రాచ కుటుంబంపై రాజు చార్లెస్–2 చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ సంచలన ఆరోపణల పరంపర కొనసాగుతూనే ఉంది. అన్న ప్రిన్స్ విలియంతో తన బంధం ఎప్పుడూ సమస్యాత్మకంగానే సాగిందంటూ త్వరలో విడుదలవనున్న తన ఆత్మకథలో బయట పెట్టారాయన. ‘‘2021లో ఒకసారి మేమిద్దరం మా నాన్న సమక్షంలోనే తలపడ్డాం. మీరిలా కొట్టుకుని నా చివరి రోజులను దుర్భరంగా మార్చకండంటూ ఆయన మమ్మల్ని విడదీశాడు’’ అని వివరించారు. ‘‘రాచ కుటుంబీకుల పెళ్లిళ్లు జరిగే వెస్ట్‌మినిస్టర్ అబేలోని సెయింట్ పాల్స్ కెథడ్రెల్లో మెగన్, నేను ఒక్కటయ్యేందుకు కూడా విలియం ఒప్పుకోలేదు’’ అన్నారు. రాచరికపు జీవితపు ఒత్తిడిని తట్టుకోలేకు ఒక దశలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డట్టు చెప్పారు! ‘‘17 ఏళ్ల వయసులో తొలిసారిగా కొకైన్ వాడా. అంత థ్రిల్లింగ్‌గా ఏమీ అన్పించలేదు. తర్వాత ఎలన్ కాలేజీలో చదువుతున్న సమయంలో బాత్రూంలో గంజా తాగాను. కాలిఫోర్నియాకు వెళ్లినప్పుడు మ్యాజిక్ మష్రూమ్స్ వంటివి టేస్ట్ చేశా. 17 ఏళ్లప్పుడే వయసులో నాకంటే పెద్దావిడతో తొలి లైంగికానుభవం రుచి చూశా’’ అని వివరించారు. ‘‘12 ఏళ్ల వయసులో నా తల్లి డయానాను ప్రమాదంలో కోల్పోవడం బాధించింది. నిద్ర పోతున్న నన్ను లేపి నాన్న ఆ వార్త చెప్పారు. కానీ కనీసం నన్ను దగ్గరికి కూడా తీసుకుని ఓదార్చలేదు. మరణించిన నా తల్లితో ఎలాగైనా మాట్లాడేందుకు ‘శక్తులున్న’ ఒక మహిళను ఆశ్రయించా’’ అని చెప్పుకొచ్చారు. కెమిల్లాను పెళ్లి చేసుకోవాలని తండ్రి భావించినప్పుడు వద్దని తాను, విలియం బతిమాలామన్నారు. హ్యారీ బయట పెట్టిన ఈ అంశాలపై వ్యాఖ్యానించేందుకు రాజ కుటుంబం తిరస్కరించింది. -
నా అన్న కాలర్ పట్టి కొట్టాడు: ప్రిన్స్ హ్యారీ
శాక్రమెంటో: బ్రిటన్ రాజకుటుంబంలో కుటుంబ కలహాలు సమసిపోయి అంతా సర్దుకుంటుందనుకుంటున్న సమయంలో.. మరో పరిణామం చోటు చేసుకుంది. డ్యూక్ ఆఫ్ సస్సెక్స్, ప్రిన్స్ హ్యారీ సంచలనాలకు తెర తీశాడు. తన ఆత్మకథ ‘స్పేర్’ ద్వారా బయటి ప్రపంచానికి రాజ‘కుటుంబ’ కలహాలను పూసగుచ్ఛినట్లు వివరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో తన అన్న, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అయిన విలియమ్ తనపై భౌతిక దాడికి దిగాడని, అందుకు తన భార్య మేఘన్ మార్కెల్ కారణమని చెబుతూ పెద్ద షాకే ఇచ్చాడు. ది గార్డియన్ కథనం ప్రకారం.. స్పేర్ ఆత్మకథలోని ఆరో పేజీలో ప్రిన్స్ హ్యారీ ఈ విషయాన్ని తెలియజేశాడు. మేఘన్ మార్కెల్ విషయంలో తన అన్నతో తనకు వాగ్వాదం జరిగిందని, పట్టరాని కోపంతో విలియమ్ తనపై దాడికి దిగాడని హ్యారీ అందులో పేర్కొన్నాడు. మేఘన్ స్వభావాన్ని ఉద్దేశించి విలియమ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అయితే.. తన భార్య గురించి తప్పుగా మాట్లాడొద్దంటూ ఆమెకు మద్దతుగా హ్యారీ ఏదో సర్ది చెప్పబోయాడట. ఈ క్రమంలో సహనం కోల్పోయిన విలియమ్ పట్టరాని కోపంతో ఊగిపోయాడు. హ్యారీ గల్లా పట్టుకుని.. మరో చేత్తో మెడలో గొలసును లాగిపడేశాడు. హ్యారీని నేలకేసి కొట్టాడు. కింద.. కుక్కకు భోజనం పెట్టే పాత్ర తగిలి హ్యారీ వీపుకు గాయమైంది. కష్టంగానే పైకి లేచిన ప్రిన్స్ హ్యారీ.. బయటకు వెళ్లిపోమని విలియమ్ మీదకు అరిచాడు. కోపంగానే విలియమ్ గది నుంచి బయటకు వెళ్లిపోయాడు. ఈ పరిణామంతా చాలా వేగంగానే జరిగింది. ఈ ఘటనలో హ్యారీ వీపునకు అయిన గాయం మానడానికి నెలలు పట్టింది అని ఆ కథనం ఆ పేజీ సారాంశాన్ని తెలిపింది. ఇంకా ఈ బుక్.. ఎన్నో ఆసక్తికరమైన, రాజకుటుంబం నుంచి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెలుగులోకి తేనుందని గార్డియన్ కథనం పేర్కొంది. జనవరి 10వ తేదీన స్పేర్ మార్కెట్లోకి రీలీజ్ కానుంది. గత సెప్టెంబర్‌లో తల్లి క్వీన్ ఎలిజబెత్-2 మరణం, ఈ మే నెలలో తండ్రి కింగ్ ఛార్లెస్-3కి పట్టాభిషేకం దరిమిలా.. మధ్యలో ఈ అన్నదమ్ముల ఘర్షణ గురించి వెలుగులోకి రావడం, అదీ హ్యారీ ఆత్మకథ ద్వారా కావడం ఇక్కడ గమనార్హం. కలిసిపోతారనుకున్న అన్నదమ్ములను.. ఆ ఆత్మకథ మరింత దూరం చేసేలా కనిపిస్తోంది!. 2020లో రాజరికాన్ని, బ్రిటన్ వదిలేసి హ్యారీ-మార్కెల్ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది. ఆ సమయం నుంచే ఆ అన్నదమ్ముల మధ్య గ్యాప్ వచ్చింది. అయితే.. 2021లో ఈ ఆలుమగలు ఓప్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలు వెల్లడించడం ద్వారా రాజకుటుంబంలోని అన్నదమ్ములు, వాళ్ల వాళ్ల భార్యల మధ్య కలహాలు వెలుగులోకి రావడం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చనీయాంశంగా మారాయి కూడా. -
Queen Elizabeth 2: ఏడుస్తున్న చిన్నారిని కౌగిలించుకున్న మేఘన్.. వీడియో వైరల్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం మరణించిన తర్వాత ఆమెకు నివాళులు అర్పించేందుకు వేల మంది విండ్సోర్ కాస్టిల్‌కు తరలివెళ్లారు. రాణి మనవడు ప్రిన్స్ హ్యారీ, అతని భార్య మేఘన్ మార్కెల్, మరో మనవడు ప్రిన్స్ విలియమ్, అతని భార్య కేట్ మిడిల్టన్ కలిసి ఈ కోటకు వెళ్లారు. రాణికి సంతాపం తెలిపేందుకు వచ్చినవారికి ధన్యవాదాలు తెలిపి వారితో కాసేపు ముచ్చటించారు. అయితే హ్యారీ భార్య మేఘన్.. కోట బయట ఏడుస్తున్న ఓ టీనేజర్‌ను ఆప్యాయంగా పలకరించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ బాలికతో మేఘన్ మాట్లాడిన తీరును నెటిజన్లు కొనియాడుతున్నారు. ఈ వీడియోలో ప్రిన్స్ హ్యారీ కోట బయట ఉన్నవారితో మాట్లాడుతుండగా.. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న అతని భార్య మేఘన్ ఓ టీనేజర్ దగ్గరకు వెళ్లింది. ఏడుస్తున్న ఆ చిన్నారిని నీ పేరేంటని అడిగింది. అందుకు ఆ బాలిక అమెల్కా అని బదులిచ్చింది. నీపేరు చాలా బాగుందని చెప్పిన మేఘన్.. రాణికి నివాళులు అర్పించేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పింది. మూడు గంటలుగా వారంతా వేచి చూస్తున్నారని తెలిసి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాదు ఏడుస్తున్న అమెల్కాను దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంది. ఈ వీడియోను ఓ వ్యక్తి మొదట టిక్‌టాక్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత అది వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by MEMEZAR • Comedy and Culture (@memezar) 2018లో ప్రేమ పెళ్లి చేసుకున్న హ్యారీ, మేఘన్ దంపతులకు ఇద్దరు పిల్లలు. 2021 మార్చి నుంచి వీరు రాజకుటుంబానికి దూరంగా అమెరికాలోని నివసిస్తున్నారు. రాణి మరణానికి ముందు అనుకోకుండా వారు బ్రిటన్‌లోనే ఉన్నారు. దీంతో కుటంబసభ్యులతో వెళ్లి రాణికి నివాళులు అర్పించారు. రాణి మరణంతో హ్యారీ, మేఘన్ మళ్లీ రాజకుటుంబానికి దగ్గరయ్యే అవకాశాలున్నాయని సన్నిహితవర్గాలు భావిస్తున్నాయి. చదవండి: బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్ -
ఎడింబర్గ్‌కు రాణి భౌతికకాయం.. రాకుమారుల ఐక్యత!
లండన్: రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్‌లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్‌హౌస్ ప్యాలెస్‌కు తరలించారు. ఈ సందర్భంగా తమ రాణిని కడసారి చూసుకునేందుకు ప్రజలు దారికిరువైపులా వేలాదిగా బారులు తీరారు. శవపేటికతో కూడిన వాహన కాన్వాయ్ వారి నివాళుల మధ్య ఆరు గంటల పాటు ప్రయాణించి ఎడింబర్గ్ చేరింది. రాణి భౌతికకాయాన్ని సోమవారం మధ్యాహ్నం దాకా ఎడింబర్గ్‌లో ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం మంగళవారం విమానంలో లండన్‌కు తరలిస్తారు. వెస్ట్‌మినిస్టర్ ప్యాలెస్‌లో నాలుగు రోజుల పాటు ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం 19న అంత్యక్రియలు జరుగుతాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు పలువురు ప్రపంచ దేశాధినేతలు పాల్గొననున్నారు. రాకుమారుల ‘ఐక్యత’ విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. విండ్సర్ ప్యాలెస్ నుంచి నలుగురూ కలిసే బయటికొచ్చారు. బయట రాణికి నివాళులు అర్పించేందుకు గుమిగూడిన ప్రజలతో కాసేపు కలివిడిగా గడిపారు. మరోవైపు, సోమవారం రాజ దంపతులు వెస్ట్‌మినిస్టర్ హాల్లో పార్లమెంటు ఉభయ సభల సమావేశంలో పాల్గొని రాణికి నివాళులర్పిస్తారు. ఇదీ చదవండి: కడసారి చూపునకు కూడా రానివ్వలేదా? -
రాణి కడసారి చూపునకు... మెగన్‌ను రానివ్వలేదు!
లండన్: బ్రిటన్ నూతన రాజు చార్లెస్–3 కుటుంబంలో కొన్నేళ్లుగా నెలకొన్న విభేదాలు రాణి ఎలిజబెత్–2 అస్తమయం సందర్భంగా మరోసారి తెరపైకి వచ్చాయి. చార్లెస్, ఆయన పెద్ద కుమారుడు ప్రిన్స్ విలియంతో చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీకి చాలా ఏళ్లుగా సత్సంబంధాలు లేని విషయం తెలిసిందే. రాజకుటుంబం అభ్యంతరాలను పట్టించుకోకుండా అమెరికా నటి మెగన్ మార్కెల్‌ను హ్యారీ పెళ్లాడటంతో విభేదాలు బాగా ముదిరాయి. తర్వాతి పరిణామాల నేపథ్యంలో హ్యారీ దంపతులు సంచలన రీతిలో రాజరిక హోదానే వదులుకునేందుకు దారితీశాయి. ఈ నేపథ్యంలో గురువారం స్కాట్లండ్‌లోని బాల్మోరల్ కోటలో మృత్యుశయ్యపై ఉన్న రాణిని చూసేందుకు మెగన్ రావడానికి వీల్లేదని చార్లెస్ పట్టుబట్టారట. హ్యారీ దంపతులు గురువారం లండన్‌లోనే ఉన్నారు. రాణి కడసారి చూపుకు వారిద్దరూ బాల్మోరల్ బయల్దేరుతున్నట్టు తెలియగానే చార్లెస్ నేరుగా హ్యారీకి ఫోన్ చేసి, ‘‘అతి కొద్దిమంది రక్త సంబంధీకులం తప్ప ఎవరూ రావడం లేదు. కేట్ మిడిల్టన్ (విలియం భార్య) కూడా రావడం లేదు. కాబట్టి మెగన్ రాక అస్సలు సరికాదు’’ అని చెప్పినట్టు సమాచారం. దాంతో హ్యారీ ఒంటరిగానే వెళ్లి నాయనమ్మకు నివాళులు అర్పించారు. గురువారమే మొదటిసారిగా కొత్త స్కూల్‌కు వెళ్తున్న తన ఇద్దరు పిల్లల కోసం మిడిల్టన్ లండన్‌లోనే ఉండిపోయారు. ముందునుంచీ విభేదాలే విలియం, హ్యారీ సోదరుల మధ్య ఏనాడూ పెద్దగా సఖ్యత లేదు. తండ్రితో, అన్నతో మనస్ఫర్ధలను పలుమార్లు టీవీ ఇంటర్వ్యూల్లో హ్యారీ బాహాటంగానే వెల్లడించారు. అప్పటికే పెళ్లయి విడాకులు తీసుకున్న అమెరికా నటి అయిన మెగన్తో తన ప్రేమాయణం వారికి నచ్చకపోయినా పట్టించుకోలేదు. గొడవల నేపథ్యంలో హ్యారీ దంపతులు రాచరిక హోదాను వదులుకుని రెండేళ్లుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్నారు. 2021లో ప్రఖ్యాత అమెరికా టాక్ షో హోస్ట్ ఓప్రా విన్ఫ్రేకు వారిచ్చిన ఇంటర్వ్యూ పెను సంచలనం సృష్టించింది. రాజ కుటుంబీకుల జాత్యహంకార వ్యాఖ్యలు, ప్రవర్తన తననెంతగానో గాయపరిచాయంటూ మెగన్ తీవ్ర ఆరోపణలు చేసింది. ‘‘పెళ్లికూతురుగా ముస్తాబవుతున్న సమయంలో మిడిల్డన్ నన్ను సూదుల్లాంటి మాటలతో తీవ్రంగా గాయపరిచింది. తట్టుకోలేక ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా’’ అంటూ దుయ్యబట్టింది. ఈ ఆరోపణలు, మొత్తంగా బ్రిటన్ రాచరిక వ్యవస్థపైనే ఆమె ఎక్కుపెట్టిన పదునైన విమర్శలు అప్పట్లో పెను దుమారం రేపాయి. రాజ కుటుంబానికి మాయని మచ్చగా మిగల్చడమే గాక వారి హృదయాల్లో మంటలు రేపాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలను మరింత పెంచాయి. తల్లిదండ్రులుగా చార్లెస్, కెమిల్లా పూర్తిగా విఫలమయ్యారంటూ హ్యారీ కూడా దుయ్యబట్టారు. తండ్రి అయితే తన ఫోన్ కూడా ఎత్తడం మానుకున్నారని ఆరోపించారు. ఒకవైపు రాణి ఎలిజబెత్ భర్త ఫిలిప్ మరణించిన దుఃఖంలో ఉన్న రాజ కుటుంబాన్ని ఈ ఆరోపణలు మరింత కుంగదీశాయి. ఆ సమయంలో నిండుచూలాలిగా ఉన్న మెగన్ ఫిలిప్ అంత్యక్రియల్లో కూడా పాల్గొనలేదు. అయితే హ్యారీతో పాటు మెగన్‌ను కూడా రాణి ఎంతో ఇష్టపడేవారనే చెబుతారు. మెగన్ అమెరికా వెళ్లి రాణి అంత్యక్రియల సమయానికి లండన్ తిరిగొస్తారని సమాచారం. దూరమైన కుటుంబీకులను విషాద సమయాలు దగ్గర చేస్తాయంటారు. బ్రిటిష్ రాజ కుటుంబం విషయంలో అది నిజమవుతుందో లేదో అంత్యక్రియల నాటికి స్పష్టత వస్తుంది. -
అగ్గి రాజేసిన భార్యలు.. ఆ అన్నదమ్ములు మళ్లీ ఒక్కటయ్యేనా?
రాజకుటుంబంలో మునుపెన్నడూ చూడని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఊహించలేనంతగా కుటుంబంలో మనస్పర్థలు తారాస్థాయికి చేరుకున్నాయి. దివంగత ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ డయానాకు పుట్టిన బిడ్డలిద్దరూ.. తిరిగి మునుపటిలా అనోన్యంగా పలకరించుకునే పరిస్థితులు కనిపించడం లేవు. అందుకు కారణం భార్యాలు రాజేసిన చిచ్చే కారణమనే చర్చ నడుస్తోంది అక్కడ. తల్లి ప్రిన్సెస్ డయానా(బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య) చనిపోయి పాతికేళ్లు గడుస్తున్నాయి. ఆమె సంతానం ప్రిన్స్ విలియమ్(40), హ్యారీ(37)ల మధ్య మనస్పర్థలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా సమసిపోవడం లేదు. మెగ్జిట్(రాయల్ డ్యూటీస్ నుంచి ప్రిన్స్ హ్యారీ, ఆయన భార్య మేఘన్ తప్పుకుంటున్నట్లు ప్రకటించడం) తర్వాత ఈ ఇద్దరూ మాట్లాడుకోవడం కనిపించింది లేదు. విలియం.. రాయల్ స్థాపనను స్వీకరించి.. మరిన్ని బాధ్యతలను చేపట్టి హుందాగా ముందుకెళ్తున్నాడు. ఇక హ్యారీ ఏమో కాలిఫోర్నియాలో జీవితం కోసం రాజ సంప్రదాయాలను తిరస్కరించి, భార్యతో కలిసి రాజప్రసాద వ్యవహారాలపై సంచలన ఆరోపణలు చేశాడు. ► అన్నదమ్ముల వైరం చాలా దూరం వెళ్లిందని, వాళ్లు తిరిగి కలుసుకోవడం అనుమానమేనని రాజ కుటుంబ వ్యవహారాలపై తరచూ స్పందించే రిచర్డ్ ఫిట్జ్‌విలియమ్స్ పేర్కొన్నాడు. పరిస్థితులనేవి ఎలా మారిపోయాయో ఆయన పాత సంగతుల్ని గుర్తు చేస్తూ మరీ చెప్తున్నారాయన. ► 1997 ఆగష్టు 31వ తేదీన 36 ఏళ్ల వయసులో డయానా రోడ్డు ప్రమాదంలో మరణించారు. అప్పటికి విలియమ్ వయసు 15, హ్యారీ వయసు 12. ► ఇద్దరూ ఎటోన్ బోర్డింగ్ స్కూల్లో చదువుకున్నారు. విలియమ్ పైచదువులకు యూనివర్సిటీ వెళ్లగా.. హ్యారీ మాత్రం మిలిటరీ ట్రైనింగ్ తీసుకున్నాడు. ► తన ప్రియురాలు కేట్ మిడెల్టన్తో 2011లో విలియమ్ వివాహం జరిగే నాటికి.. ఈ అన్నదమ్ముల అనుబంధం చాలా బలంగా ఉండిపోయింది. ► ఈ అన్నదమ్ముల వల్లే రాజకుటుంబం బలోపేతం అయ్యిందంటూ చర్చ కూడా నడిచింది. కానీ.. ► హ్యారీ 2018లో మేఘన్‌ను వివాహం చేసుకోవడం, భార్య కోసం రాజరికాన్ని వదులుకోవడంతో పరిస్థితులు తారుమారు అయ్యాయి. ► రాజకుటుంబంలో చెలరేగిన అలజడి.. అంతర్గతంగా ఏం జరిగిందో బయటి ప్రపంచానికి ఓ స్పష్టత లేకుండా పోయింది. కానీ, అప్పటి నుంచి ఆ అన్నదమ్ముల మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. ► ఏడాది తర్వాత ఓ ఇంటర్వ్యూలో ‘మా అన్నదమ్ముల దారులు వేరంటూ’ హ్యారీ చేసిన ప్రకటన సంచలనంగా మారింది. ► ఆపై హ్యారీ, మేఘన్‌లు రాజరికాన్ని వదిలేసుకుంటూ.. అమెరికాకు వెళ్లిపోవడంతో ఇంటి పోరు రచ్చకెక్కింది. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో.. మేఘన్, కేట్ మీద సంచలన ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలపై విస్తృత స్థాయిలో చర్చ కూడా నడిచింది. ► తన తల్లి డయానాను వెంటాడిన పరిస్థితులే తన భార్యకూ ఎదురుకావడం ఇష్టం లేదంటూ హ్యారీ చేసిన వ్యాఖ్యలు రాజకుటుంబంలో కలహాల తీవ్రతను బయటపెట్టాయి. ► ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో భార్యాభర్తలిద్దరూ చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ స్పందించాడు. తమదేం రేసిస్ట్ ఫ్యామిలీ కాదంటూ ఆరోపణల్ని ఖండించాడు. ► చాలాకాలం ఎడమొహం పెడమొహం తర్వాత.. 2021 జులైలో కెన్సింగ్టన్ ప్యాలెస్ బయట డయానా విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఈ ఇద్దరు అన్నదమ్ములు హాజరయ్యారు. దీంతో ‘ఒక్కటయ్యారంటూ’ కథనాలు వచ్చాయి. ► అయితే.. ఓఫ్రా విన్ఫ్రే ఇంటర్వ్యూలో సోదరుడు, అతని భార్య చేసిన వ్యాఖ్యలపై ప్రిన్స్ విలియమ్ తీవ్రంగానే నొచ్చుకున్నట్లు ఉన్నాడు. అందుకే ఆ తర్వాత సోదరుడిని కలుసుకున్నప్పటికీ ముఖం చాటేస్తూ వచ్చాడు. ► ఆ ప్రభావం జూన్ 2022 క్వీన్ ఎలిజబెత్ 2 ప్లాటినం జూబ్లీ వేడుకల్లో స్పష్టంగా కనిపించింది. ► ఏ కార్యక్రమంలోనూ ఈ ఇద్దరు అన్నదమ్ములు మాట్లాడుకోలేదు. ► హ్యారీ, మేఘన్‌లు ఈ సెప్టెంబర్‌లో యూకే వెళ్లనున్నారు. రాణి విండ్సోర్ ఎస్టేట్‌లో బస చేయనున్నారు. ఇది ప్రిన్స్ విలియమ్ కొత్త ఇంటికి దగ్గర్లోనే ఉండడం గమనార్హం. ► ఇక ప్రిన్స్ విలియమ్ కూడా ఎర్త్‌షాట్ ప్రైజ్ సమ్మిట్ కోసం సెప్టెంబర్‌లోనే కాస్త వ్యవధితో న్యూయార్క్‌కు వెళ్తున్నాడు. ఆ సమయంలో హ్యారీని కలిసే అవకాశాలు కనిపించడం లేదు. ► అయితే ఈ పర్యటనలోనూ విలియమ్-హ్యారీ కలిసే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఎంత మనస్పర్థలు నెలకొన్నప్పటికీ ఈ ఇద్దరూ కలుస్తారనే ఆశాభావంలో ఉన్నారు రాజకుటుంబ బాగోగులు కోరుకునేవాళ్లు. -
వినీషా పవర్ ఫుల్ స్పీచ్ : మీ తీరు చూస్తోంటే.. కోపం వస్తోంది!
గ్లాస్గో: వాతావరణ మార్పులపై గ్లాస్గోలోని కాప్–26 సదస్సులో భారత్‌కు చెందిన 14 ఏళ్ల వయసున్న టీనేజ్ బాలిక వినీశా ఉమాశంకర్ చేసిన ప్రసంగం ప్రపంచ దేశాధినేతల్ని ఫిదా చేసింది. ఎకో ఆస్కార్ అవార్డులుగా భావించే ఎర్త్ షాట్ ప్రైజ్ ఫైనలిస్ట్ అయిన వినీశ కాప్ ఇతర పర్యావరణ పరిరక్షకులతో కలిసి ప్రిన్స్ విలియమ్ విజ్ఞప్తి మేరకు సదస్సులో మాట్లాడింది. ‘‘మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. ఇక మీరు మాటలు ఆపాలి. చేతలు మొదలు పెట్టాలి. భూమి ఉష్ణోగ్రతల్ని తగ్గించడానికి ఇక కొత్త ఆలోచనలు చేయాలి. మీరు ఏమీ చేయకపోతే ఎర్త్‌షాట్ ప్రైజ్ విజేతలు, ఫైనలిస్టులు చర్యలు తీసుకుంటారు. మా దగ్గర ఎన్నో వినూత్న ప్రాజెక్టులు , పరిష్కార మార్గాలు ఉన్నాయి’ అని చెప్పింది. ప్రధాని మోదీ, బ్రిటన్ ప్రధాని జాన్సన్, అమెరికా అధ్యక్షుడు బైడెన్ల సమక్షంలో తమిళనాడుకి చెందిన వినీశ ధైర్యంగా మాట్లాడింది. ’‘మీరు ఇచ్చిన శుష్క వాగ్దానాలతో మా తరం విసిగిపోయింది. మీ అందరిపైనా ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటోంది. అయినా అవన్నీ ప్రదర్శించడానికి మాకు టైమ్ లేదు. మేము పని చెయ్యాలి. నేను కేవలం భారత్‌కు చెందిన అమ్మాయిని మాత్రమే కాదు. ఈ పుడమి పుత్రికని. అలా చెప్పుకోవడానికే గర్విస్తాను. భూమిని కాపాడుకోవడానికి పాత పద్ధతుల్ని ఇక విడిచిపెట్టండి. సృజనాత్మక ఆలోచనలు చేసే మాకు మద్దతుగా నిలవండి. మీ సమయాన్ని, డబ్బుల్ని మాపై వెచ్చించండి. మా భవిష్యత్‌ని మేమే నిర్మంచుకోవడానికి మద్దతునివ్వండి’’’ అని వినీశ చేసిన ప్రసంగానికి సభ కరతాళ ధ్వనులతో మారుమోగిపోయింది. So incredibly proud of @Vinisha27738476, from Tiruvannamalai, Tamil Nadu. A girl “not just from India, but from Earth”, talking to the world @COP26. She gives us hope!pic.twitter.com/QC05oThLW9 — Oliver Ballhatchet MBE (@oballhatchet) November 3, 2021 -
ఎర్త్‌షాట్ ప్రైజ్ గెలుచుకున్న భారత్
లండన్: క్వీన్ ఎలిజబెత్ II మనవడు ప్రిన్స్ విలియం లండన్‌లో జరిగిన ఎర్త్‌షాట్ ప్రైజ్ అవార్డు వేడుకల్లో కోస్టారికా, ఇటలీ, బహామాస్, భారతదేశాల ఎర్త్‌షాట్ ప్రైజ్‌లను గెలుచుకున్నాయి. వాతావరణ మార్పు గ్లోబల్ వార్మింగ్ నేపథ్యంలో మన భూమిని ఏవిధంగా రక్షించుకోవాలి అనే అంశంలోని సరికొత్త ఆవిష్కరణలకు ఈ వార్షిక అవార్డులను ప్రకటించారు. మొత్త ఐదుగురు ఈ అవార్డులను గెలుచుకున్నారు. పైగా ఒక్కొక్కరిక 1.4 మిలియన్ డాలర్ల్ పౌండ్లు అందజేస్తారు. అంతేకాదు ఈ ఆవిష్కరణలు స్కాంట్లండ్లో జరిగే కాప్56 శిఖరాగ్ర సదస్సుకు ఎంతోగానో ఉపకరిస్తాయని ప్రిన్స్ విలియమ్స్ అన్నారు. (చదవండి: "అంతరిక్షంలో సినిమా షూటింగ్ విజయవంతం") ఈ మేరకు అడవుల రక్షణకు సంబంధించిన పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ విభాగంలో కోస్టారికా రిపబ్లిక్ "ప్రకృతిని రక్షించండి పునరుద్ధరించండి" అనే అవార్డును, భారత్ వ్యవసాయ వ్యర్థాలను ఎరువుగా మార్చే పోర్టబుల్ మెషిన్‌ను సృష్టించినందుకు భారతీయ కంపెనీ తకాచర్ "క్లీన్ అవర్ ఎయిర్" అవార్డును గెలుచుకోగా, బహమాస్ పగడాలకు సంబంధించిన ప్రాజెక్టు విభాగంలోనూ, ఉత్తర ఇటాలియన్ నగరం "ఫుడ్ వేస్ట్ హబ్స్" విభాగంలోనూ, థాయ్ జర్మనీ పరిశుభ్రమైన హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రోలైజర్‌ను ఆవిష్కరించినందుకు అవార్డులను గెలుచుకున్నాయి . ఈ మేరకు మానవ జాతి పరిష్కరించలేని వాటిని కూడా పరిష్కరించగలదు అంటూ విలియమ్స్ ఆవిష్కర్తలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా విలియమ్స్ మాట్లాడుతూ....."మనం పర్యావరణం కోసం తీసుకునే చర్యలు రానున్న పది సంవత్సరాల కాలంలో మనం భూమి మనుగడను నిర్దేశిస్తాయి. మన భవిష్యత్తును మనమే నిర్ధేసించుకోవాలి. మనం అనుకోవాలే గానీ సాధ్యం కానీదంటూ ఉండదు." అని అన్నారు. అయితే విలియం తండ్రి, ప్రిన్స్ చార్లెస్ కూడా దీర్ఘకాల పర్యావరణవేత్తగా ఎన్నో సేవలందించడం విశేషం. ఈ ఎర్త్‌షాట్ ప్రైజ్ వేడుకను గతేడాది అక్టోబర్ నుంచి ప్రారంభించారు. తదుపరి ఎర్తషాట్ ప్రైజ్ వేడుక యూఎస్‌లో జరుగుతుందని విలియమ్స్ ప్రకటించారు. (చదవండి: బలశాలి బామ్మ) -
స్పేస్ టూరిజం.. ప్రిన్స్ విలియమ్ ఘాటు వ్యాఖ్యలు
అంతరిక్ష పర్యాటకం.. ఇప్పుడు దీని మీదే ప్రపంచ అపర కుబేరుల ఫోకస్ ఉంది. వరుస ప్రయోగాలతో ప్రపంచానికి ఈ టూరిజం మీద నమ్మకం కలిగించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఎవరి స్ట్రాటజీలను వాళ్లు ఫాలో అవుతునారు. అయితే ఈ వ్యవహారంపై Duke of Cambridge ప్రిన్స్ విలియమ్ అసహనం వ్యక్తం చేశారు. స్పేస్ టూరిజం మీద రెండో క్వీన్ ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ విలియమ్ మండిపడ్డాడు. వర్జిన్ గెలాక్టిక్, బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు ప్రైవేటు వ్యక్తుల రోదసి యాత్రలను చేపడుతున్న విషయం తెలిసిందే..! ఈ క్రమంలో స్పేస్ టూరిజం దిశగా రిచర్డ్ బ్రాన్సన్, జెఫ్ బెజోస్, ఎలన్ మస్క్ అడుగులు వేస్తున్నారు. అయితే ఈ గొప్ప బుర్రలు ఆకాశం వైపు చూడడం మానేసి.. ముందుకు నేల మీద ఫోకస్ పెట్టాలంటూ ప్రిన్స్ విలియం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇతర గ్రహాల మీదకు వెళ్లడం, అక్కడ బతకడం లాంటి విషయాలపై దృష్టిపెట్టడం కంటే.. ముందు భూమిని పరిరక్షించుకోవడం, భూమి గాయాలను మాన్పించేందుకు ప్రయత్నించాలని ఆయన కోరారు. విలువైన మేధాసంపత్తిని సంపాదన కోసం కాకుండా.. సమాజ హితవు కోసం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే నెలలో సీవోపీ26 క్లైమేట్ సమ్మిట్ జరగనుంది.. ఈ నేపథ్యంలో విలియమ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గురువారం రాత్రి బీబీసీ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు ప్రసారం అయ్యాయి. 90 ఏళ్ల నటుడు షాట్నర్, బ్లూఆరిజిన్ అంతరిక్ష యానం పూర్తి చేసిన కొద్దిగంటలకే ప్రిన్స్ పై వ్యాఖ్యలు చేయడం విశేషం. ఇక అంతరిక్ష యాత్రలతో స్పేస్ టూరిజంను అభివృద్ధిచేస్తున్న ధనికులపై.. మైక్రోసాఫ్ట్ అధినేత ఓ అమెరికన్ షోలో ఘాటు వ్యాఖ్యలను చేశారు. బిల్ గేట్స్ షోలో మాట్లాడుతూ... ‘భూమ్మీద మనం ఎన్నో సమస్యలతో సతమతమౌతుంటే...రోదసీ యాత్రలపై దృష్టి పెట్టడం సరికాదన్నారు. మలేరియా, హెచ్ఐవీ లాంటి వ్యాధులుఇంకా అంతంకాలేదు. నాకు వాటిని భూమ్మీద నుంచి ఎప్పుడు రూపుమాపుతామనే భావన నన్ను ఎప్పుడు వేధిస్తూనే ఉంది. ఈ సమయంలో స్పేస్ టూరిజంపై దృష్టిపెట్టడం సరి కాదని బిల్ గేట్స్ సందేశం ఇచ్చారు. చదవండి: ఆ కంపెనీకి భారీగా నిధులను అందిస్తోన్న బిల్‌గేట్స్, జెఫ్‌బెజోస్..! -
వినీషా సోలార్ ఇస్త్రీ బండి
మన చుట్టూ ఉన్నవారికే కాదు పర్యావరణానికీ మేలు జరిగే పనులను చేయాలన్న తపన గల ఓ స్కూల్ విద్యార్థిని ఆలోచనకు అంతర్జాతీయ పేరు తెచ్చిపెట్టింది. తమిళనాడులోని తిరువణ్ణామలైకి చెందిన 14 ఏళ్ల అమ్మాయి వినీషా ఉమాశంకర్ సౌరశక్తిని ఉపయోగిస్తూ మొబైల్ ఇస్త్రీ బంyì రూపకల్పన చేసింది. బ్రిటన్ యువరాజు విలియమ్ ప్రారంభించిన ఎర్త్‌షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరిగా చోటు దక్కించుకుని వార్తల్లో నిలిచింది. పారిశ్రామిక, వ్యవసాయ వ్యర్థాల రీసైక్లింగ్ థీమ్‌తో పర్యావరణాన్ని కాపాడేవారిని ప్రోత్సహించేందుకుగాను బ్రిటన్ యువరాజు కిందటేడాది నవంబర్‌లో ఎర్త్‌షాట్ ప్రైజ్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నామినేషన్లను పరిశీలించి, ఇప్పుడు ఫైనల్స్ జాబితా విడుదల చేశారు. 15 మంది ఫైనలిస్ట్ జాబితాలో వినీషా ఉమాశంకర్ ’క్లీన్ అవర్ ఎయిర్’ కేటగిరీలో నిలిచింది. సౌరశక్తితో పనిచేసే మొబైల్ ఇస్త్రీ బండిని డిజైన్ చేసినందుకు, తద్వారా రోజూ లక్షలాది మంది ఉపయోగించే బొగ్గుతో నడిచే ఐరన్‌కు ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందించినందుకు ఆమెకు ఈ గౌరవం దక్కింది. మేలైన ప్రయోజనాలు ఎర్త్‌షాట్ ప్రైజ్ విశ్లేషకులు వినిషా సోలార్ పవర్డ్ కార్డ్ సూర్యుడి నుండి వచ్చే శక్తితో బొగ్గును భర్తీ చేస్తుందని గుర్తించారు. చార్జింగ్ పాయింట్ ద్వారా ఐదు గంటల పాటు తీసుకున్న సౌరశక్తితో ఇనుము ఇస్త్రీ పెట్టెను ఆరు గంటలు ఉపయోగించవచ్చు. బొగ్గును వాడనవసరం లేదు కాబట్టి ఇది పర్యావరణానికి ఇది ఎంతో మేలైనది. మొబైల్ బండి విధానం వల్ల ఇంటివద్దనే కాకుండా రోడ్డు పక్కన కూడా ఇస్త్రీ చేసి, వినియోగదారులకు ఇవ్వచ్చు. దీని ద్వారా ఆదాయాన్నీ పొందవచ్చు. ఫోన్ టాప్ అప్, ఛార్జింగ్ పాయింట్లను కూడా దీంట్లో ఏర్పాటుచే సి ఉండటం వల్ల, అదనపు ఆదాయాన్నీ పొందవచ్చు. మొత్తమ్మీద ఈ ఇస్త్రీ బండి ద్వారా 13 మేలైన ప్రయోజనాలను పొందవచ్చు అని విశ్లేషకులు గుర్తించారు. ఫైనల్స్‌కి వెళ్లిన రెండు భారతీయ ప్రాజెక్టులలో ఒకటి వినీషాది కాగా ఢిల్లీ పారిశ్రామిక, వ్యవసాయ వర్థాల రీసైక్లింగ్ కాన్సెప్ట్ కంపెనీ టకాచర్ కో ఫౌండర్ విద్యుత్మోహన్ సృష్టించినది మరొకటి. వీరిద్దరూ ఇక నుంచి ప్రవైట్ రంగ వ్యాపారాల నెట్వర్క్ అయిన ఎర్త్‌షాట్ ప్రైజ్ గ్లోబల్ అలియన్స్ సభ్యుల నుండి తగిన మద్దతు, వనరులను అందుకుంటారు. విజేతలను అక్టోబర్ 17న లండన్‌లోని అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో జరిగే అవార్డుల వేడుకలో ప్రకటిస్తారు. -
పది కోట్ల ప్రైజ్‌మనీ రేసులో మన బిడ్డ
మా వీధి చివర ఒక అంకుల్ రోజూ ఇస్త్రీ బండి మీద బరువైన ఐరన్‌బాక్స్‌తో కష్టపడడం చూశా. రీయూజబుల్ ఎనర్జీతో తయారు చేయడం వల్ల ఆయనలాంటి వాళ్లకు ఈజీగా ఉంటుందనుకున్నా. మనదేశంలో సూర్యుడు దాదాపు 250కిపైగా రోజులు ఉంటాడు. అందుకే ఈ సైకిల్ కార్ట్‌ని తయారుచేశా. పైగా నా ఇన్నొవేషన్ ‘ఇస్త్రీవాలాలకు’లకు ఖర్చు తగ్గించడమే కాదు పర్యావరణానికి సాయం చేస్తుంది కూడా.. అంటోంది స్మార్ట్ ఐరన్ కార్ట్ రూపకర్త వినీషా ఉమాశంకర్. ప్రతిష్టాత్మక యూకే పురస్కార ప్రైజ్‌మనీ రేసులో నిలిచి.. ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించింది ఈ అమ్మాయి. పొల్యూషన్‌ని తగ్గించే ఇన్నోవేషన్స్‌కి ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలో యువ ఆవిష్కరణకర్తలకు అవకాశం కల్పిస్తూ.. 1 మిలియన్ పౌండ్స్ (మనకరెన్సీలో పది కోట్లకు పైనే). ప్రిన్స్ విలియమ్ ‘ఎర్త్‌షాట్ ప్రైజ్’ అందించబోతున్నారు. ఇందుకుగానూ శుక్రవారం స్వయంగా 15 మంది పేర్లను ప్రకటించారు ప్రిన్స్ విలియమ్. ఈ లిస్ట్‌లో 14 ఏళ్ల తమిళనాడు అమ్మాయి, చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్ విన్నర్ వినీషా కూడా ఉంది. వాతావరణాన్ని కలుషితం చేయని ఇస్త్రీపెట్టె బండిని తయారు చేసింది వినీషా, సోలార్ ఎనర్జీతో పనిచేసే ఇస్త్రీపెట్టె బండిని డిజైన్ చేసింది తిరువణ్ణామలైకి చెందిన వినీషా ఉమాశంకర్. విశేషం ఏంటంటే.. లాక్డౌన్ టైంలో చిన్నారి సోలోగా ఆరునెలలు కష్టపడి మరీ ఈ బండిని డెవలప్ చేయడం. ఈ ఇన్నొవేషన్‌ని పరిశీలించిన నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్.. పేటెంట్ హక్కుల విషయంలో ఆమెకి సాయం చేసింది కూడా. అయితే ఈ ఆలోచన బాగుండడంతో స్వీడన్‌కి చెందిన చిల్ట్రన్స్ క్లైమేట్ ఫౌండేషన్ రీసెంట్గా క్లీన్ ఎయిర్ కేటగిరిలో వినీషాకి ‘చిల్డ్రన్స్ క్లైమేట్ ప్రైజ్’ అందించింది. అంతేకాదు స్వీడన్ ఎనర్జీ కంపెనీ ఈ ఐడియాను గ్రౌండ్ లెవల్లోకి తీసుకొచ్చేందుకు 11 వేల డాలర్ల సాయాన్ని వినీషాకి అందించింది. ఖర్చుకి తగ్గ ఫలితం ఇళ్లలో కరెంట్‌తో పని చేసే ఐరెన్ బాక్స్‌లు ఉన్నప్పటికీ.. ఇస్త్రీ చేసేవాళ్లు మాత్రం ఇప్పటికీ ఐదుకేజీల బరువున్న ఇస్త్రీ పెట్టెలు.. వాటిలోకి కర్ర బొగ్గునే వాడుతున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ లెక్కల ప్రకారం.. మనదేశంలో ఇస్త్రీవాలాల సంఖ్య కోటికి పైనే. వీళ్లంతా యావరేజ్‌గా రోజుకి ఐదు కేజీల చార్కోల్(బొగ్గు) ఉపయోగిస్తున్నారు. వీటివల్ల పర్యావరణానికి డ్యామేజ్ జరుగుతోంది. పైగా ఆ పొల్యూషన్ వల్ల వాళ్ల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది. ఇది గమనించిన వినీష ఈ సోలార్ ఐరన్ బండిని డిజైన్ చేసింది. ఈ చక్రాల బండి పైకప్పు మీద సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. వాటికి బ్యాటరీలు ఉంటాయి. సన్‌లైట్‌లో ఐదు గంటలపాటు ఉంటే చాలు ఈ బండి ఛార్జ్ అవుతుంది. ప్యానెల్‌కి ఉన్న ఒక్కో బ్యాటరీ ఆరు గంటలు పని చేస్తుంది. వాటి సాయంతో ఐరన్ బాక్స్ పని చేస్తుంది. అంతేకాదు ఈ బండికి యూఎస్బీ పోర్ట్ ఫెసిటిటీస్ కూడా ఏర్పాటు చేసింది వినీష. అవసరం అనుకుంటే ఈ బండికి జనరేటర్‌ని కూడా సెట్ చేసుకోవచ్చు. ఈ ఐరన్ కార్ట్ ధర రూ. 40 వేలు. అయితే ఇస్త్రీవాలాలు కర్రబొగ్గు మీద చేసే ఖర్చుని ఈ సోలార్ ఇస్త్రీ బండి మాగ్జిమమ్ తగ్గించేస్తుందని చెబుతోంది వినీష. ప్రిన్స్ విలియమ్ కిందటి ఏడాది అక్టోబర్‌లో ఈ ఎర్త్‌షాట్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. ఈ పదిహేనులో(ఒక నగరం కూడా ఉంది).. ఐదుగురికి ప్రైజ్ మనీ పంచుతారు. అక్టోబర్ 17న లండన్ అలెగ్జాండ్రా ప్యాలెస్‌లో విజేతలకు ప్రైజ్ మనీ అందిస్తారు. -
ప్రిన్సెస్ డయానా రాసిన ఆ ఉత్తరాల్లో ఏముంది..?
ప్రిన్సెస్ డయానా మరణించి దాదాపు 24 ఏళ్లు అవుతున్నప్పటికీ తన వ్యక్తిగత జ్ఞాపకాలతో ఇప్పటికీ వార్తల్లో నిలుస్తుండడం విశేషం. క్లోజ్ ఫ్రెండ్స్‌కు డయానా స్వయంగా రాసిన ఉత్తరాలు తాజాగా వెలుగులోకి రానున్నాయి. ఇప్పటివరకు ఎవరూ చదవని రెండు దశాబ్దాల క్రితం నాటి.. దాదాపు 40 ఉత్తరాలను ‘డేవిడ్ లే’ అనే వేలం సంస్థ విక్రయించనుంది. ఈ ఉత్తరాలను డయానా స్నేహితుడు రోజర్ బ్రాంబుల్‌కు 1990 ఆగస్టు నుంచి 1997 మే నెల మధ్యకాలం లో రాశారు. 1997లో ఆమె మరణించిన తరువాత కంట్రీ ఫామ్ హౌస్‌లో ఓ కప్ బోర్డులో ఈ ఉత్తరాలు దొరికాయి. ఇన్నేళ్లు చీకట్లో మగ్గిన ఆ ఉత్తరాలు జన బాహుళ్యంలోకి రానున్నాయి. ప్రిన్స్ చార్లెస్‌తో తన వివాహబంధాన్ని తెంచుకున్న తరువాత రాసిన లెటర్స్ కావడంతో వాటిలో ఏముందోనని ఆసక్తి నెలకొంది. తన కుమారులైన ప్రిన్స్‌విలియం, హ్యారీల గురించి కూడా దీనిలో డయానా ప్రస్తావించారని వేలం నిర్వాహకులు చెబుతున్నారు. ‘‘డయానా ఓ యాక్సిడెంట్లో మరణించినప్పటికీ ఆమె మృతి వెనుక అనేక అనుమానాలు ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని చాలామంది కుతూహలం చూపుతున్నారు. అందుకే ఆమె జీవితానికి సంబంధించిన మరిన్ని నిజాలు తెలుసుకునేందుకు ఉత్తరాలను వేలం వేస్తున్నట్లు’’ వేలం సంస్థ వెల్లడించింది. మార్చి 18న 39 లెటర్స్ ను వేలం వేస్తున్నామని, మరింత సమాచారం కోసం తమ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సంస్థ పేర్కొంది. -
ప్రిన్సెస్ డయానాలో ఉన్న ఆకర్షణ అదే: మాజీ లవర్
ప్రిన్సెస్ డయానా అందమైన మహిళ. బ్రిటన్ రాజకుటుంబ వారసుడు ప్రిన్స్ చార్ల్స్ భార్య. వీరికి ఇద్దరు కొడుకులు. ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ. ఇద్దరికీ పెళ్ళిళ్లు అయ్యాయి. ప్రిన్స్ విలియం- కేట్ మిడిల్టన్ దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమారులు ప్రిన్స్ లూయీస్, ప్రిన్స్ జార్జ్.. ఒక కుమార్తె ప్రిన్సెస్ చార్లెట్. ప్రిన్స్ హ్యారీ- మేఘన్ మోర్కెల్ జంటకు కొడుకు ప్రిన్సెస్ ఆర్చీ ఉన్నాడు. అన్నీ సజావుగా సాగి, డయానా నేడు బతికి ఉంటే ఇంతటి ముచ్చటైన కుటుంబాన్ని చూసి కచ్చితంగా సంతోషపడేవారు. కొడుకులు, కోడళ్లు, మనవళ్లు, మనుమరాలు.. అన్ని బంధాలతో ఆమె జీవితం సంపూర్ణమయ్యేది. కానీ దాంపత్య జీవితంలో చెలరేగిన సంఘర్షణ, భర్తతో విభేదాలు, వ్యక్తిగతంగా మోయలేని నిందలు.. వీటికి తోడు విధి చిన్నచూపు చూడటంతో 1997లో ఫ్రాన్సులో జరిగిన కారు ప్రమాదంలో ప్రిన్సెస్ డయానా దివంగతులయ్యారు. అయితే ఇరవయ్యవ శతాబ్దపు అందగత్తెల్లో ఒకరిగా గుర్తింపు పొందిన డయానా మరణించి రెండు దశాబ్దాలు దాటినా ఆమె జీవితానికి సంబంధించిన విశేషాలతో నేటికీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ప్రిన్సెస్ డయానా మాజీ ప్రియుడిగా పేరొందిన హసంత్ ఖాన్ ఇటీవల డెయిలీ మెయిల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూతో ఆమె గురించి మరోసారి చర్చ మొదలైంది. మమ్మీ.. తను మంచివాడు కాదు.. చనిపోవడానికి రెండేళ్ల ముందు అంటే 1995లో డయానా పనోరమకు ఇచ్చిన ఇంటర్వ్యూ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. తప్పుడు బ్యాంకు పత్రాలు చూపించి బీబీసీ సీనియర్ జర్నలిస్టు మార్టిన్ బషీర్.. డయానాను ఇందుకు ఒప్పించారని ఆమె సోదరుడు ఎర్ల్ స్పెన్సర్ ఇటీవల ఆరోపించారు. రాజభవనంలోని కొంతమంది సిబ్బంది ప్రిన్సెస్ వ్యక్తిగత వివరాలు లీక్ చేస్తున్నారని ఆయన చెప్పినట్లు పేర్కొన్నారు. మార్టిన్‌పై ఆరోపణల నేపథ్యంలో అంతర్జాతీయ వార్తా సంస్థ సుప్రీంకోర్టు మాజీ జడ్జి లార్డ్ డైసన్ నేతృత్వంలో విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హార్ట్ సర్జన్ అయిన హసంత్ ఖాన్(పాకిస్తాన్లో జన్మించారు) మాట్లాడుతూ.. మార్టిన్ తన మాటలతో డయానాను ప్రభావితం చేసి, ఆమె మెదడునంతా చెత్తతో నింపేశాడన్నారు. నైతిక విలువలు వదిలేసి, అడ్డదారులు తొక్కి ఎట్టకేలకు ఆమె ఇంటర్వ్యూ తీసుకున్నాడని ఆరోపించారు. ‘‘మా పెళ్లి సమయంలో మేం ముగ్గురం’’ అని తన చేత చెప్పించాడని పేర్కొన్నారు. ‘‘తనొక మోసగాడు. ప్రిన్సెస్‌ను నేను పెళ్లి చేసుంటానా అంటూ నన్ను అత్యంత వ్యక్తిగత విషయాల గురించి అడిగాడు. బషీర్ చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని నేను ఆమెకు ఎన్నోసార్లు చెప్పాను. అతడితో మాట్లాడవద్దని హెచ్చరించాను కూడా. నిజానికి ఆమెలో ఉన్న అత్యంత ఆకర్షించే గుణం ఏంటో తెలుసా? తన మానసిక బలహీనతే. దానినే మార్టిన్ అవకాశంగా తీసుకున్నాడు. ఆమె మనసును కకావికలం చేశాడు. డయానా భర్త ప్రిన్స్ చార్లీ కారణంగా నానీ టిగ్గీ గర్భవతి అయ్యారని చెప్పాడు. అతడిని ఆమె నమ్మారు. అయితే అప్పటికి టీనేజర్‌గా ఉన్న ప్రిన్స్ విలియం.. ‘‘మమ్మీ.. తను అస్సలు మంచి వ్యక్తి కాదు’’ అని హెచ్చరించేంత వరకు ఇది కొనసాగింది’’ అని చెప్పుకొచ్చారు. కాగా హసంత్ ఖాన్, ప్రిన్సెస్ డయానా రెండేళ్లపాటు రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె అతడిని ముద్దుగా మిస్టర్ వండర్ఫుల్ అని పిలిచేవారట. ఇక హ్యారీ జన్మించిన తర్వాత డయానా- చార్లెస్ వైవాహిక బంధంలో విభేదాలు తారస్థాయికి చేరాయంటూ గతంలో వెలువడిన కథనాలు చెబుతున్నాయి.(చదవండి: డయానాలా మాట్లాడగలనా అని భయం) మిస్టర్ వండర్ఫుల్తో సంభాషణ అంతేగాక దాంపత్య జీవితంలో అసంతృప్తి, భర్త ప్రవర్తన కారణంగానే డయానా అభ్రదతాభావానికి లోనై ఇతరులవైపు ఆకర్షితురాలయ్యారని అంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె కారు ప్రమాదంలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిచ్చింది. అదే విధంగా ఆ సమయంలో భర్త ప్రిన్స్ చార్లెస్, ఇద్దరు కుమారులు విలియమ్, హ్యారీ... స్కాట్లాండ్లో వేసవి సెలవుల్ని గడుపుతుండగా, డయానా ఫ్రాన్స్‌లో ఉండటంపై విపరీతపు కామెంట్లు వినిపించాయి. ఇక ఖాన్‌తో ప్రేమలో ఉన్న సమయంలో తన టెలిఫోన్లు ట్రాప్ చేస్తున్నారన్న భయంతో.. డయానా కోడ్ భాషలో మాట్లాడేవారట. బషీర్‌కు డాక్టర్ జర్మన్, మోల్ అనే ఓ రహస్య పేరుతో అతడు తనను ఇంటర్వ్యూకి ఒప్పించడానికి చేసిన ప్రయత్నాల గురించి తనకు చెప్పినట్లు ఖాన్ వెల్లడించారు. ఇక 1995 నాటి బషీర్ ఇంటర్వ్యూ వల్ల రాజ దంపతుల మధ్య మనస్పర్థలు మరింతగా పెరిగిపోయానని వారి సన్నిహితులు గతంలో పేర్కొన్నారు. -
ఫుడ్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్న రాకుమారి
లండన్: డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ దంపతుల కుమార్తె ప్రిన్సెస్ చార్లెట్ నేడు ఐదో వసంతంలో అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా రాజకుమారికి సంబంధించిన కొన్ని ఫొటోలను రాజసౌధ వర్గాలు సోషల్ మీడియాలో షేర్ చేశాయి. ‘‘పిన్సెస్ చార్లెస్ ఫొటోలను మీతో పంచుకోవడానికి ది డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ క్రేంబ్రిడ్జి సంతోషపడుతున్నారు. ది డచెస్ ఈ ఫొటోలు తీశారు. ఐసోలేషన్‌లో ఉన్న పెన్షనర్లకు ఆహారం అందించేందుకు రాజ కుటుంబం ఆహారపు పొట్లాలు చుట్టి పంపిణీ చేయనుంది’’అని పేర్కొన్నాయి.(కరోనా: అద్భుతమైన వార్త.. మిరాకిల్ బేబీ) ఈ క్రమంలో చార్లెట్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అదే విధంగా.. ఫుడ్ ప్యాకెట్లను కాటన్లలో సర్దుతున్న రాకుమార్తె సేవా గుణాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. కాగా విలియం, కేట్ మిడిల్టన్ జంటకు ఇద్దరు కుమారులు ప్రిన్స్ లూయీస్, ప్రిన్స్ జార్జ్.. ఒక కుమార్తె ప్రిన్సెస్ చార్లెట్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక రాజమాత క్వీన్ ఎలిజబెత్ ఏప్రిల్ 21న 94వ ఏట అడుగుపెట్టిన విషయం విదితమే. అయితే దేశ వ్యాప్తంగా కరోనా సంక్షోభం తలెత్తిన నేపథ్యంలో ఆమె తన జన్మదిన వేడుకలను నామమాత్రంగా జరుపుకొన్నారు. ఇక శనివారం చార్లెట్ బర్త్‌డే సందర్భంగా ఫొటోలు షేర్ చేసి ముని మనుమరాలికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. View this post on Instagram The Duke and Duchess of Cambridge are very pleased to share four new photographs of Princess Charlotte ahead of her fifth birthday tomorrow. The images were taken by The Duchess as the family helped to pack up and deliver food packages for isolated pensioners in the local area. A post shared by Kensington Palace (@kensingtonroyal) on May 1, 2020 at 2:30pm PDT -
ఆ వార్తని కొట్టిపడేసిన హ్యారీ, విలియమ్స్
లండన్ : రాజ కుటుంబంలో విభేదాలు అంటూ ఓ ఇంగ్లాండ్ వార్తా పత్రిక ప్రచురించిన కథనంపై ప్రిన్స్ హ్యారీ, ప్రిన్స్ విలియమ్స్ స్పందించారు. ఆ వార్తా కథనంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చిచెప్పారు. ఈ మేరకు సోమవారం వారు ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రిన్స్ ఆఫ్ ససెక్స్( హ్యారీ), ప్రిన్స్ ఆఫ్ కేంబ్రిడ్జ్(విలియమ్స్) బంధంపై ప్రచురితమైన కథనంలో ఎలాంటి వాస్తవం లేదని, ఒకరిపై ఒకరు ఎంతో ప్రేమను కనబర్చుకునే అన్నదమ్ముల గురించి చెడు వార్తలు రాయటం నేరం, ప్రమాదమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ప్రిన్స్ విలియమ్స్ మోసపూరిత బుద్ధి కారణంగానే రాజ కుటుంబంలో విభేదాలు మొదలయ్యాయని, విలియమ్స్ చేష్టల కారణంగానే హ్యారీ కుటుంబానికి దూరమవుతున్నాడని సదరు పత్రిక కొద్దిరోజుల క్రితం ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. చదవండి : వేర్వేరు దారుల్లో నడుస్తున్నాం: ప్రిన్స్ హ్యారీ మేఘన్ మార్కెల్ కొత్త అవతారం -
ఫొటో 1 తరాలు 4
లండన్: కొత్త దశాబ్దం ప్రారంభం సందర్భంగా బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ శనివారం తన వారసులతో కలసి దిగిన ఫొటోను విడుదల చేశారు. అందులో రాణి సహా నాలుగు తరాల రాజరికం ఉంది. గతంలో 2016లో ఆమె 90వ పుట్టిన రోజు సందర్భంగా ముగ్గురు వారసులతో కలసి ఫొటో దిగగా, ఇప్పుడు విడుదల చేసింది రెండో ఫొటో కావడం గమనార్హం. ఇప్పటి ఫొటోలో కూడా రాణి కుమారుడు ప్రిన్స్ చార్లెస్, మనవడు ప్రిన్స్ విలియం, ముని మనవడు ప్రిన్స్ జార్జ్‌లు ఉన్నారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో క్రిస్మస్ పండుగకు వారంముందు ఈ ఫొటోను తీశారు. ఇందులో రాణి తెలుపు గౌన్ ధరించారు. ఆమెకు ఇరు వైపులా రాజకుమారులు ఉన్నారు. -
‘పాక్ మాకు అత్యంత ముఖ్యమైన దేశం’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తమకు అత్యంత ముఖ్యమైన దేశమని బ్రిటన్ రాజవంశీకుడు ప్రిన్స్ విలియం అన్నారు. పాక్‌లో పెట్టుబడులు పెడుతున్న దేశాల్లో యునైటెడ్ కింగ్డమ్ అగ్ర స్థానంలో ఉందని పేర్కొన్నారు. పాక్, యూకేలు చాలా విషయాల్లో సారూప్యాన్ని కలిగి ఉన్నాయని.. పాకిస్తాన్ మూలాలు ఉన్న సుమారు ఒకటిన్నర మిలియన్ల మంది ప్రజలు తమ దేశంలో నివసిస్తున్నారని పేర్కొన్నారు. బాలికా విద్య, సమానత్వం, వాతావరణ మార్పు తదితర సామాజిక అంశాలపై ప్రిన్స్ విలియం దంపతులు వివిధ దేశాల్లో పర్యటిస్తూ అవగాహన కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా డ్యూక్ ఆఫ్ కేంబ్రిడ్జి ప్రిన్స్ విలియం, డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి కేట్ మిడిల్టన్ ఐదు రోజుల పాటు పాక్ పర్యటనకు బయల్దేరారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, అధ్యక్షుడు అల్విలను రాజ దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక అంశాల అవగాహనకై విలియం దంపతులు చేస్తున్న కృషిని ఇమ్రాన్ ఖాన్ అభినందించారు. యువ పాకిస్తానీలతో రాజ కుటుంబీకులు భేటీ కావడం తమకు సంతోషంగా ఉందన్నారు. ఈ క్రమంలో ప్రిన్స్ డయానాకు పాకిస్తాన్ ప్రజలతో ఉన్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. అదే విధంగా పొరుగుదేశాలైన భారత్, అఫ్గనిస్తాన్‌లతో తమ దేశానికి ఉన్న సంబంధాల గురించి వారికి వివరించారు. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారత్- పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విలియంకు తెలిపారు. అలాగే అఫ్గనిస్తాన్‌తో మైత్రి సాధించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా పాక్ పర్యటన(ఇస్లామాబాద్, లాహోర్, ఖైబర్ పంక్తువా)లో భాగంగా విలియం, కేట్ ఇస్లామాబాద్‌లో ఉన్న మహిళా మోడల్ కాలేజీని సందర్శించారు. యూకే విద్యా విధానాన్ని అనుసరిస్తున్న సదరు కాలేజీ విద్యార్థినులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం మార్గల్లా హిల్స్‌లో నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి బయల్దేరి వెళ్లారు. ఈ సందర్భంగా పాకిస్తాన్లో బ్రిటీష్ హై కమిషనర్ ధామస్ డ్ర్యూ, డ్యూక్ వ్యక్తిగత ప్రధాన కార్యదర్శి సిమన్ కేస్, డ్యూక్ అండ్ డచెస్ కమ్యూనికేషన్ సెక్రటరీ క్రిస్టియన్ జోన్స్ విలియం దంపతుల వెంటే ఉన్నారు. కాగా 2006 తర్వాత బ్రిటన్ రాజ వంశీకులు పాకిస్తాన్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా.. ప్రిన్స్ చార్లెస్, కామిల్లా తర్వాత విలియం, కేట్ పాక్‌లో పర్యటించడాన్ని రిస్క్‌తో కూడిన పర్యటనగా కింగ్స్టన్ ప్యాలెస్ పేర్కొంది. భద్రతా కారణాల దృష్ట్యా పాక్ పర్యటన అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు తెలిపింది. -
బుల్లి యువరాజు హత్యకు కుట్ర..
లండన్: బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్స్, కేట్ మిడిల్డన్ ముద్దుల కొడుకు ప్రిన్స్ జార్జ్ హత్యకు జరిగిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థకు చెంది రషీద్ అనే ఉగ్రవాది ఈ హత్యకు కుట్ర చేశాడు. దీంతో రషీదును అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. తాను బుల్లి యువరాజు జార్జ్ హత్యకు కుట్ర చేసినట్టు రషీదు కోర్టులో అంగీకరించాడు. దీంతో అతనికి 25 ఏళ్ల శిక్షను విధించారు. లండన్‌లోని వూల్విచ్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తులు ఈ తీర్పును వెలవరించారు. టెలిగ్రామ్ ద్వారా ప్రిన్స్ జార్జ్‌ను చంపేందుకు కుట్ర చేసినట్టు తెలుస్తోంది. తన ప్లాన్ విజయవంతం అయితే ఐఎస్ కార్యాకలాపాల్లో పాల్గొనేందుకు సిరియాకు పారిపోవాలనే ప్లాన్ తనకు ఉందని విచారణ సమయంలో రషీద్ కోర్టుకు తెలిపారు. కాగా, జార్జ్‌ను హత్య చేస్తామంటూ గత అక్టోబర్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు సభ్యులు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో బ్రిటన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. జార్జ్ ఫొటోతో సహా మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఉగ్రవాదులు, చంపేస్తామని హెచ్చరించారు. అరబిక్ భాషలో రాసిన ఈ పోస్టులో ‘యుద్ధమనేది వస్తే తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం’ అని తెలిపారు. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
రాజకుటుంబంలో బాబు పుట్టాడోచ్!
లండన్: బ్రిటన్ రాజకుటుంబంలోకి మరో బుల్లి వారసుడు వచ్చాడు. ప్రిన్స్ విలియమ్ సతీమణి కేట్ మిడిల్టన్ సోమవారం పండంటి మగశిశువుకు జన్మనిచ్చారు. లండన్‌లోని సెయింట్ మెరీ ఆస్పత్రిలో కేట్ మూడో బిడ్డను ప్రసవించారు. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని రాయల్ ప్యాలెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రిన్స్, కేట్ దంపతులకు బాబు జార్జ్, పాప చార్లెట్.. ఉన్నారు. మూడో బిడ్డను ప్రసవించే సమయంలో కేట్ పక్కన ప్రిన్స్ కూడా ఉన్నారని మీడియా తెలిపింది. కేట్ తాజాగా జన్మనిచ్చిన శిశువు బ్రిటన్ రాణి క్విన్ ఎలిజబేత్ ఆరో మునిమనవడు కాగా.. బ్రిటన్ సింహాసనం అధిరోహించబోయేవారిలో ఐదో వ్యక్తిగా ఉండనున్నాడు. -
అమ్మాయిలూ... వలలో పడకండి
బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ విలియమ్స్‌కి అమ్మాయిల భద్రత గురించి బెంగ పట్టుకుంది. ‘‘గర్ల్స్.. ఎందుకలా మీరు సోషల్ మీడియాలో అస్తమానం రకరకాల పోజుల్లో కనిపిస్తారు? గుట్టుగా ఉండండి. లోకం ఎంత బూటకంగా ఉందో తెలుసా? మీరు ఏదో ఒక గొడవలో చిక్కుకుపోతారు. జాగ్రత్తగా ఉండండి’’ అని గురువారం లండన్‌లోని బర్లింగ్టన్ డేన్స్ అకాడమీలో మాట్లాడుతూ.. ఆడపిల్లల్ని హెచ్చరించారు ప్రిన్స్. ‘సైబర్ బుల్లీయింగ్’ గురించి ప్రసంగించేందుకు అకాడమీవాళ్లు ప్రిన్స్‌ని ప్రత్యేకంగా ఆహ్వానించిన సందర్భం అది. స్మార్ట్‌ఫోన్‌లో చిక్కుకుపోతే ఎవరికైనా సమస్యలు తప్పవు. అయితే అమ్మాయిలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రిన్స్ ఉద్దేశం. ‘అవసరానికి మించి ఆన్లైన్లో ఉండకండి. బుల్లీయింగ్‌కి (టీజింగ్‌కి) గురికాకండి’ అని ప్రిన్స్ చెబుతున్నప్పుడు మీడియా ఆ పాయింట్‌కి ఎంతో ప్రాముఖ్యం ఇచ్చింది. సభలో ఉన్న మిగతా ప్రముఖులు ప్రిన్స్ ఎంతో అమూల్యమైన సూచన చేశారని అభినందించారు. నిజానికి రాజప్రసాదం కూడా సోషల్ మీడియాకు మొదట్నుంచీ దూరంగానే ఉంటుంది. ప్రిన్స్ విలియమ్స్ తమ్ముడు ప్రిన్స్ హ్యారీతో పెళ్లి ఫిక్స్ కాగానే మేఘన్ మార్కెల్.. సోషల్ మీడియాలోని తన అన్ని అకౌంట్లనూ ఇటీవలే క్లోజ్ చేసేశారు. అమ్మాయిలూ విన్నారు కదా! ఆచరించే వారు చెబితే ఎవరు మాత్రం వినకుండా ఉంటారు? -
యువరాజు హత్యకు కుట్ర
లండన్ : బ్రిటన్ యువరాజు జార్జ్ ఐసిస్ హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రిన్స్ విలియం, కేట్ మిడిల్టన్ల తొలి సంతానం జార్జ్. నాలుగేళ్ల వయసున్న యువరాజును హతమారుస్తామని సోషల్‌మీడియా వేదికగా ఐసిస్ ప్రకటించడంతో బ్రిటన్‌లో కలకలం రేగింది. గత నెలలోనే జార్జ్ పాఠశాలకు వెళ్లడం ప్రారంభించాడు. జార్జ్ స్కూల్‌కు వెళ్లేప్పుడు దాడి చేసి హతమార్చాలని ఐసిస్ యోచిస్తున్నట్లు తెలిసింది. యువరాజు వెళ్తున్న స్కూల్ వద్ద భద్రత అంత కట్టుదిట్టంగా లేదని నిఘా వర్గాలు గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. -
బడికెళ్లిన బుల్లి యువరాజు
లండన్: బ్రిటన్ బుల్లి యువరాజు ప్రిన్స్ విలియం తనయుడు జార్జి బుల్లి స్వెట్టర్ వేసుకుని తొలిరోజు ఎంతో బుద్ధిగా బడికి కెళ్లారు. తొలిసారి స్కూల్‌కు వెళుతున్నజార్జిని ప్రిన్స్ విలియం ప్రత్యేకంగా స్కూల్‌కు తీసుకువెళ్లారు. ప్రిన్స్ జార్జి స్కూల్ యూనిఫాం ధరించి.. చక్కటి క్రాఫ్ తీసిన జుట్టుతో, చిన్న బ్యాగ్ పట్టుకునిబుడిబుడి అడుగులు వేసుకుంట బడికెళ్లారు. తొలిరోజు బడిలో సహ విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపాడని.. స్కూల్ అధ్యాపకులు చెప్పారు. తొలిరోజు తరగతిగదిలో గంట 40 నిమిషాల సేపు జూనియర్ ప్రిన్స్ గడిపాడు. 35 ఏళ్ల కిందట ఇదే పాఠశాలకు నన్ను మా అమ్మ ప్రిన్సెస్డయానా తొలిరోజు తీసుకు వచ్చిందని,ఇప్పుడు నేను నా కుమారుడిని అదే స్కూల్‌కు తీసుకువెళుతున్నాని ప్రిన్స్ విలియం అన్నారు. ఈ రెండు ఫొటోలను ప్రిన్స్ విలిమం సోషల్ మీడియాలో షేర్చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. -
మళ్లీ తండ్రి కాబోతున్న ప్రిన్స్
లండన్: బ్రిటన్ యువరాజు విలియం మూడోసారి తండ్రి కాబోతున్నారు. విలియం, క్యాథరిన్ మిడిల్టన్ దంపతులకు ఇప్పటికే ప్రిన్స్ జార్జి(4), ప్రిన్సెస్ చార్లెట్(2) లనే ఇద్దరు సంతానం ఉన్నారు. డచెస్ ఆఫ్ కేంబ్రిడ్జి మూడో సారి తల్లి కాబోతున్నారని కెన్సింగ్టన్ ప్యాలెస్ వర్గాలు తెలిపాయి. రాజకుటుంబమంతా ఈ వార్తతో చాలా ఆనందంతో ఉందని తెలిపింది. ప్రస్తుతం మార్నింగ్ సిక్నెస్తో బాధపడుతున్న కేట్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నట్లు ప్యాలెస్ వర్గాలు వివరించాయి. కాగా కేట్ 2013 జూలైలో తొలి బిడ్డ ప్రిన్స్ జార్జికి జన్మనిచ్చారు. 2015 మే లో రెండవ సంతానంగా ప్రిన్సెస్ చార్లెట్ ఎలిజబెత్ డయానా పుట్టింది.