Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే.. | Prince William named sexiest bald man of 2023 | Sakshi
Sakshi News home page

Sexiest Bald Man of 2023: ఈ యేడు బట్టతల అందగాడు ఇతడే..

Published Sun, Nov 19 2023 7:20 PM | Last Updated on Sun, Nov 19 2023 7:27 PM

Prince William named sexiest bald man of 2023 - Sakshi

బట్టతల వచ్చినందుకు చాలా మంది మగవారు బాధపడుతూ ఉంటారు. తలపై వెంట్రుకలు లేని తమను ఎవరు చూస్తారని చింతిస్తూ ఉంటారు. కానీ బట్టతల ఉన్నవారికీ ఫ్యాన్స్‌ ఉన్నారు. గూగుల్‌లో బట్టతల అందగాళ్ల కోసం ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేస్తున్నారు. 

గూగుల్ సెర్చ్ ట్రాఫిక్, శారీరక లక్షణాల ఆధారంగా ఒక కొత్త అధ్యయనం ప్రకారం బ్రిటిష్‌ ప్రిన్స్ విలియం (Prince William) "2023లో సెక్సీయెస్ట్ బాల్డ్‌ మ్యాన్‌"గా ఎంపికయ్యాడు. అమెరికన్‌ యాక్టర్‌ విన్ డీజిల్, హాలీవుడ్ నటుడు జాసన్ స్టాథమ్‌లను అధిగమించి టాప్‌లో నిలిచాడు. బట్టతల సెలబ్రిటీలను షర్టు లేకుండా చూడటానికి ఇంటర్నెట్‌లో ఎంతమంది సెర్చ్‌ చేస్తున్నారన్న దానిపై రీబూట్  అనే సంస్థ అధ్యయనం చేసి ర్యాంకులు రూపొందించింది.

బట్టతల సెలబ్రిటీల ఎత్తు, నెట్‌వర్త్‌, ముఖ నిష్పత్తి, బట్టతల మెరుపు తదితర అంశాలను కూడా ఈ అధ్యయనం పరిగణనలోకి తీసుకుంది. ఈ "సెక్సీ" స్కోర్‌లో 10కి 9.88 స్కోర్‌తో ప్రిన్స్‌ విలియం అగ్రస్థానంలో నిలిచాడు.

 

మిర్రర్ కథనం ప్రకారం.. సెలబ్రిటీల వాయిస్‌ ఫ్రీక్వెన్సీని కూడా ఈ అధ్యయనం పరిశీలించింది. అధ్యయనం మేరకు ప్రిన్స్ విలియం నెట్‌వర్త్‌ దాదాపు 100 మిలియన్ డాలర్లు (రూ.832 కోట్లు), ఎత్తు 1.91 మీటర్లు. ఇక వాయిస్‌ వియషంలో 10కి 9.91 స్కోర్, బట్టతల మెరుపులో 8.90 స్కోర్‌ సాధించాడు.

మరోవైపు అమెరిన్‌ యాక్టర్‌ విన్ డీజిల్ 8.81 టోటల్‌ స్కోరుతో రెండవ స్థానంలో, జాసన్ స్టాథమ్ 8.51 స్కోరుతో మూడో స్థానంలో నిలిచారు. అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ 7.12 స్కోర్‌తో ఐదో స్థానంలో ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement